
కొందరు నటీమణులను చూస్తే వీరికి వయసు పెరగదా? అనిపిస్తుంది. అలాంటి వారిలో వేదిక (Actress Vedhika) ఒకరు. ఈ మహారాష్ట్ర బ్యూటీ వయసు ఇప్పుడు 37 ఏళ్లు. అయినప్పటికీ ఇప్పటికీ పదహారేళ్ల పడుచుపిల్లలాగే కనిపిస్తుంది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో హీరోయిన్‌గా నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఇప్పటికీ స్టార్ హీరోయిన్ స్టేటస్ కోసం కష్టపడుతూనే ఉంది.

హీరోయిన్స్ అంటే చాలు..
తమిళంలో ముని, సక్కరకట్టి, కాళై, పరదేశీ, కావియ తలైవన్, కాంచన–3 వంటి చిత్రాల్లో నటించిన వేదిక ఇప్పటికీ తన సొగసులతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. తాజాగా కొన్ని విమర్శలు ఈ బ్యూటీకి కోపం తెప్పించాయి. గ్లామరస్‌గా కనిపిస్తే చాలు వేలెత్తి చూపడానికి రెడీ ఉంటారని ఆగ్రహించింది. సాధారణంగానే హీరోయిన్లు అంటే విమర్శలు గుప్పించడానికి ఒక వర్గం రెడీగా ఉంటుందని, అందులోనూ కాస్త గ్లామరస్ దుస్తులు ధరిస్తే ఏకంగా వారి క్యారెక్టర్‌నే తప్పుపడుతున్నారని మండిపడింది.
నేను లెక్క చేయను
దుస్తుల గురించి విమర్శించే దుస్థితి మారాలంది. తానూ బికినీ ధరించి కూడా నటిస్తానని, ఇలాంటి విమర్శలను అస్సలు పట్టించుకోనని చెప్పింది. తానేమిటో తనకు బాగా తెలుసని, తప్పుడు బుద్ధి కలవారు మారితే మంచిదని వేదిక పేర్కొంది. ప్రస్తుతం ఈ హీరోయిన్ తెలుగు, తమిళం, కన్నడం భాషల్లో ఒక్కో చిత్రం చేస్తోంది.
చదవండి: ఒక్క మూవీతో ప్రేమలో పడ్డారా?.. సూపర్ హిట్ జంటపై డేటింగ్ రూమర్స్