
ఓటీటీల్లో థ్రిల్లర్ సినిమాలు, సిరీసులతో పాటు బోల్డ్, రొమాంటిక్ కంటెంట్ కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఆడియెన్స్ వీటిని కూడా చూస్తుంటారు. అందుకు తగ్గట్లు అప్పుడప్పుడు ఈ తరహా కంటెంట్ వస్తూనే ఉంటుంది. ఇప్పుడు కూడా అలానే ఓ సిరీస్‌కి రెండో సీజన్ తీసుకొచ్చేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. స్ట్రీమింగ్ తేదీని ప్రకటించడంతో పాటు ఓ పోస్టర్ కూడా వదిలారు. ఇంతకీ ఈ సిరీస్ సంగతేంటి?
(ఇదీ చదవండి: మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా)
నాలుగు వేర్వేరు కథలతో 'ష్' అనే సిరీస్‌ని తమిళంలో తీశారు. గతేడాది దీన్ని ఆహా ఓటీటీలో రిలీజ్ చేయగా రెస్పాన్స్ బాగానే వచ్చింది. దీంతో కొన్ని నెలల క్రితం ఈ ఏడాదిలోనే తెలుగు డబ్బింగ్‌ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ ఆంథాలజీకి రెండో సీజన్ కూడా రెడీ చేశారు. సెప్టెంబరు 19 నుంచి తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.
తొలి సీజన్‌లానే ఈసారి కూడా నాలుగైదు వేర్వేరు కథలు ఉండబోతున్నాయి. పోస్టర్ చూస్తుంటే ఈ విషయం అర్థమవుతోంది. తొలి భాగంలోని వాళ్లు కాకుండా ఈసారి జినాల్, ఉమ, ఐశ్వర్య దత్తా, వేదిక తదితరులు లీడ్ రోల్స్ చేశారు. తొలి సీజన్ విషయానికొస్తే ఇందులో లస్ట్, రొమాన్స్ తదితర అంశాలని చూపించారు. స్కూల్ ఏజ్‌లో సె*క్స్ ఎడ్యుకేషన్, ఇద్దరు మాజీ ప్రేమికులు మళ్లీ కలిస్తే, మిడిల్ ఏజ్ రొమాన్స్, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ఓ కుర్రాడు అమ్మాయికి ఆకర్షితుడై ఏం చేశాడు తదితర స్టోరీలతో ఈ సిరీస్ తీశారు.
(ఇదీ చదవండి: ఓటీటీ ట్రెండింగ్‌లో తెలుగు హారర్ కామెడీ సినిమా)
