ఓటీటీల్లో క్రైమ్ థ్రిల్లర్స్, మర్డర్ మిస్టరీ చిత్రాలకు ఫుల్ డిమాంట్ ఉంటోంది. ఆడియన్స్ అభిరుచులకు తగ్గట్టుగానే ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలే ఎక్కువగా వస్తున్నాయి. తాజాగా మరో మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ ఓటీటీ ప్రియులను అలరించేందుకు వచ్చేస్తోంది. గతంలో 2023లో మామి ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ మూవీని ప్రదర్శించారు.
తాజాగా ఎవరీబడీ లవ్స్ సోహ్రబ్ హండా అనే మర్డర్ మిస్టరీ మూవీ ఓటీటీలో సందడి చేయనుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటింంచింది. ఈనెల 10 నుంచి జీ5 వేదికగా అందుబాటులోకి రానుంది. '15 మంది స్నేహితులు.. ఒక పార్టీ.. ఒకరి మిస్టరీ హత్య' అంటూ పోస్టర్‌ను పంచుకున్నారు.
ఈ చిత్రంలో వినయ్ పాఠక్, నీల్ భూపాలం ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు రజత్ కపూర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సమీర్ నాయర్, దీపక్ సెగల్ నిర్మించారు. ఈ సినిమాలో రణవీర్ షోరే, సౌరభ్ శుక్లా, కోయెల్ పూరీ, ఎంకే రైనా, పలోమి ఘోష్, చంద్రచూర్ రాయ్, సాదియా సిద్దిఖీ కీలక పాత్రల్లో నటించారు.ఈ చిత్రానికి సాగర్ దేశాయ్ సంగీతం సమకూర్చారు. కాగా.. రజత్‌కపూర్ అంతకుముందు క్రౌడ్‌ఫండింగ్ ద్వారా ఆర్‌కే అనే మూవీని తెరకెక్కించారు.
15 Friends. 1 Party. 1 Mysterious Murder.
But the real question is - who wanted him dead?
Watch #EverybodyLovesSohrabHanda premieres 10th April, on #ZEE5#EverybodyLovesSohrabHandaonZEE5@ApplauseSocial @nairsameer @deepaksegal #MithyaTalkies #RajatKapoor @pathakvinay… pic.twitter.com/CUha1btJlU— ZEE5Official (@ZEE5India) April 6, 2026


