ఓటీటీలు వచ్చాక భాషతో సంబంధం లేకుండా సినిమాలకు డిమాండ్ పెరిగిపోయింది. ముఖ్యంగా మలయాళ చిత్రాలకు ఓటీటీల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఇటీవల స్ట్రీమింగ్‌కు వచ్చిన చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కించుకున్నాయి. తాజాగా మరో మలయాళ సినిమా ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది.
గత నెల 23న థియేటర్లలో విడుదలైన మలయాళ రొమాంటిక్ కామెడీ మూవీ మధువిదు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ ఖరారైంది. ఈ నెల 22 నుంచే సోనిలివ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. మధువిధు అంటే హనీమూన్ అని అర్థం కాగా.. ఈ సినిమాకు విష్ణు అరవింద్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో షరఫ్, కల్యాణీ పాణిక్కర్ జంటగా నటించారు.
The wedding is locked.
So is the chaos.
Be there to witness it all unfold on May 22nd. 💥💍#Madhuvidhu streaming from May 22 only on Sony LIV#SonyLIV #SonyLIVSouth #SonyLIVMalayalam#Sharafudheen #KalyaniPanicker pic.twitter.com/p3XaU1QHPN— Sony LIV Malayalam (@SonylivMal) May 11, 2026


