అడివి శేష్ హీరోగా షానిల్ డియో తెరకెక్కించిన యాక్షన్ మూవీ ‘డెకాయిట్’. సుప్రియ యార్లగడ్డ నిర్మించిన ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించింది. ఇక ఈ మూవీని ఏప్రిల్ 10న రిలీజ్ చేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ పరంగా అదరగొట్టింది. తొలిరోజే రూ. 15 కోట్లతో రికార్డ్ క్రియేట్ చేసింది. అంతేకాకుండా కేవలం మూడు రోజుల్లోనే రూ.34.77 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ చిత్రాన్ని మే 8వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు. అమెజాన్ ప్రైమ్ వేదికగా ఈ సినిమా అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించారు. ఈ మూవీ తెలుగుతో పాటు కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. కాగా.. ఈ చిత్రంలో అనురాగ్ కశ్యప్, ప్రకాశ్ రాజ్, కామాక్షి భాస్కర్ల కీలక పాత్రల్లో నటించారు.
డకాయిట్ కథేంటంటే..
తక్కువ కులానికి చెందిన హరి అలియాస్ హరిదాస్ (అడివి శేష్)ని అగ్ర కులానికి చెందిన సరస్వతి అలియాస్ జూలియట్ (మృణాళ్ ఠాకూర్) ప్రేమిస్తుంది. అయితే ఈ కులం కారణంగా ఇద్దరూ విడిపోవాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే హరిని ఓ కేసులో అబద్దపు సాక్ష్యం చెప్పి జైలుకు పంపిస్తుంది సరస్వతి. పదమూడేళ్లు జైల్లో గడిపిన తరువాత హరి అక్కడి నుంచి పారిపోయి బయటకు వస్తాడు. తనను తప్పుడు సాక్ష్యంతో జైలుకు పంపించిన సరస్వతి మీద పగ తీర్చుకోవాలని హరి అనుకుంటాడు. కానీ అప్పటికే సరస్వతి కుటుంబ కష్టాలతో సతమతం అవుతుంది. అటు సరస్వతికి, ఇటు హరికి ఇద్దరికీ డబ్బు సమస్య వస్తుంది. ఇక ఆ డబ్బు కోసం ఈ ఇద్దరూ కలిసి ఏం చేశారు? ఆ తరువాత ఏం జరిగింది? అసలు హరిని సరస్వతి జైలుకి ఎందుకు పంపించింది? చివరకు తన జూలియట్ కోసం హరి ఏం చేస్తాడు? అన్నదే కథ.


