దురంధర్-2 ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? | Dhurandhar 2 Ott Release Date Offcially announced | Sakshi
Sakshi News home page

Dhurandhar 2 Ott Release: దురంధర్-2 ఓటీటీ డేట్ ఫిక్స్.. కానీ చిన్న ట్విస్ట్

May 8 2026 12:38 PM | Updated on May 8 2026 12:58 PM

Dhurandhar 2 Ott Release Date Offcially announced

సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న దురంధర్‌-2 ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ అఫీషియల్‌గా ప్రకటించింది. ఈ సినిమా విడుదలై 50 రోజులు పూర్తి కావడంతో డేట్ రివీల్ చేసింది. మే 14వ తేదీ నుంచి ఓవర్సీస్‌లో మాత్రమే స్ట్రీమింగ్‌ కానున్నట్లు తెలిపింది. అయితే ఓటీటీలో అన్‌కట్ వర్షన్ ఉంటుందని నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది. దాదాపు 3 గంటల 52 నిమిషాల నిడివితో దురంధర్‌-2 ఉండనుందని పేర్కొంది.

అయితే ఇండియాలోని ప్రేక్షకులకు స్ట్రీమింగ్ తేదీ ఇంకా రాలేదు. మనదేశంలో జియో హాట్‌స్టార్ ఈ మూవీ రైట్స్ దక్కించుకుంది. త్వరలోనే స్ట్రీమింగ్ తేదీని ఓటీటీ సంస్థ ప్రకటించనుంది. తాజా సమాచారం ప్రకారం మే 15 నుంచే ఇండియాలో దురంధర్‌-2 స్ట్రీమింగ్ అయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన కోసం దురంధర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

దురంధర్-2 కథేంటంటే?

రెహమాన్ డెకాయిట్ (అక్షయ్ ఖన్నా) మరణంతో ధురంధర్‌ పార్ట్‌ 1 ముగుస్తుంది. ఆ తర్వాత ల్యారీకి తానే నాయకుడినని అర్షద్‌ పప్పు (అశ్విన్‌ ధర్‌)ప్రకటించుకుంటాడు. అన్నచావుకు కారణమైన అర్షద్‌ పప్పుపై రెహమాన్‌ సోదరుడు ఉజెయిర్‌ బలోచ్‌(డానిష్‌) కోపంతో రగిలిపోతుంటాడు. వీరిద్దరిని కాదని, ల్యారీని  భారత సీక్రెట్‌ ఏజెంట్‌ హమ్జా(రణ్‌వీర్‌ సింగ్‌) తన గుప్పింట్లోకి తెచ్చుకొని, భారత ఇంటెలిజెన్స్‌ బ్యూరో చీఫ్‌ అజయ్‌ సన్యాల్‌(మాధవన్‌) అప్పజెప్పిన పనులన్నీ పూర్తి చేసుకొస్తుంటాడు. పాకిస్తాన్ మేజర్ ఇక్బాల్ (అర్జున్ రాంపాల్), ఎంపీ జమీల్ (రాకేష్ బేడీ) కూడా హమ్జాని గుడ్డిగా నమ్ముతారు. ఇలా పాక్ ఉగ్రవాద నాయకులందరిని నమ్మించి.. ఇండియాపై వాళ్లు చేసే కుట్రలన్నింటిని హమ్జా తిప్పికొడతాడు. అసలు భారత్‌పై పాన్‌ ఉగ్రవాద సంస్థలు చేసిన కుట్రలు ఏంటి? వాటిని తిప్పికొట్టే క్రమంలో హమ్జాకు ఎదురైన సమస్యలు ఏంటి? హమ్జా ఇండియన్‌ ఏజెంట్‌ అనే విషయం ఎలా బయటకు వచ్చింది? ఆ విషయం తెలిసిన తర్వాత మేజర్ ఇక్బాల్ (అర్జున్ రాంపాల్) ఏం చేశాడు?. పాకిస్తాన్‌లోని ఉగ్రవాద ముఠాలందరికి మార్గనిర్దేశం చేస్తున్న ‘బడే సాహెబ్‌ ’ ఎవరు? ఆపరేషన్‌ ధురంధర్‌ కోసం ఇంటెలిజెన్స్‌ బ్యూరో చీఫ్‌ అజయ్‌ సన్యాల్‌.. పంజాబ్‌లో జైలు జీవితం గడుపుతున్న  జస్కరిత్ సింగ్ రంగీ(రణ్‌వీర్‌)నే ఎందుకు ఎంచుకున్నాడు? అతని నేపథ్యం ఏంటి? ఇతని కుటుంబానికి ఎమ్మెల్యే సుఖ్వెంధర్‌ చేసిన అన్యాయం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement