ఓటీటీలో నంబర్‌ వన్‌ సినిమా.. తండ్రి-కొడుకుల బంధానికి ఫిదా | GV Prakash Kumar Happy Raj Movie Trending In Amazon Prime Video, Check Interesting Deets About Story | Sakshi
Sakshi News home page

ఓటీటీలో నంబర్‌ వన్‌ సినిమా.. తండ్రి-కొడుకుల బంధానికి ఫిదా

Apr 27 2026 10:43 AM | Updated on Apr 27 2026 11:15 AM

GV Prakash Kumar Happy Raj movie Trending In Amazon Prime video

జీవీ ప్రకాశ్‌కుమార్, శ్రీ గౌరిప్రియ జోడీగా నటించిన చిత్రం హ్యాపీ రాజ్‌.. విజయవంతంగా థియేటర్‌ రన్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తాజాగా  ఓటీటీలోకి వచ్చేసింది. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకులముందుకు వచ్చిన ఈ మూవీపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మస్ట్‌ వాచ్‌ అంటూ  పోస్టులు పెడుతున్నారు. దర్శకులు మారియా ఎలాంచెజియన్‌ తెరకెక్కించిన ఈ మూవీని జైవర్దన్‌ నిర్మించారు. ఈ మూవీతో సుమారు 11ఏళ్ల తర్వాత నటుడు అబ్బాస్‌ వెండితెరపై కనిపించాడు. అయితే, ఓటీటీలో హ్యాపీ రాజ్‌ దూసుకుపోతున్నాడు.

ట్రెండింగ్‌లో హ్యాపీ రాజ్‌
తమిళ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఆకట్టుకుంటున్న 'హ్యాపీ రాజ్' అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళ్‌, కన్నడ,మలయాళంలో స్ట్రీమింగ్‌ అవుతుంది. ఈ చిత్రం దేశవ్యాప్తంగా విభిన్న వర్గాల ప్రేక్షకులలో వేగంగా ఆదరణ పొందింది. ప్రస్తుతం ఈ చిత్రం భారతదేశంలోని ప్రైమ్ వీడియోలో నంబర్ వన్ సినిమాగా చార్టులలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ విజయంపై చిత్ర యూనిట్‌ కూడా సంతోషాన్ని వ్యక్తపరిచింది.

ప్రతి కుమారుడు తన తండ్రితో చూడాల్సిన సినిమా అంటూ చాలామంది నెటిజన్లు హ్యాపీ రాజ్‌ మూవీ గురించి పోస్టులు పెడుతున్నారు. సినిమా చూస్తున్నంత సేపు ఔట్ అండ్ ఔట్ కామెడీతో పాటు హృద‌యాన్ని హత్తుకునే ఎమోష‌న‌ల్ స‌న్నివేశాల‌తో కన్నీళ్లు తెప్పిస్తుందని తెలుపుతున్నారు. ఓటీటీలో కుటుంబం మొత్తం చూడాల్సిన సినిమా అంటూ తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement