ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పవన్ కల్యాణ్ ఒక డైలాగ్ చెప్తారు. 'నా అభిమానుల్ని లెక్కపెట్టడానికి నీ జీవితం మొత్తం సరిపోదు' అంటూ విలన్‌కు కౌంటర్ ఇస్తారు. అయితే, రియాలిటీ మరోలా ఉంది. అందుకు ఉదాహరణలు చాలానే ఉన్నాయి. భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారని చెప్పిన పవన్‌కు ఈ చిత్ర ఫలితం పునరాలోచనలో పడేసింది. కెరీర్‌లోనే ఎక్కువ నష్టాలను మిగిల్చిన చిత్రంగా ఉస్తాద్ భగత్ సింగ్ నిలిచింది. భారీ సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారనుకుంటే వాళ్లు కూడా ఈ చిత్రాన్ని కాపాడలేకపోయారు. చివరకు ఓటీటీలో కూడా ఒక చిన్న సినిమా ఉస్తాద్‌ను దాటి ట్రెండింగ్‌లో నిలిచింది.

ఈ వారం ఓటీటీలో చాలా సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. ఉస్తాద్ భగత్ సింగ్ వంటి పాపులర్ సినిమాతో యూత్ అనే చిన్న సినిమా ఢీ కొట్టి ట్రెండింగ్‌లో నిలిచింది. ఈ రెండు సినిమాలు నెట్‌ఫ్లిక్స్‌లోనే స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఆశ్చర్యకరంగా యూత్ సినిమా ట్రెండింగ్ చార్టులో 2వ స్థానంలో ఉంటే.. ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రం 3వ స్థానంతో సరిపెట్టుకుంది. పవన్ మూవీకి స్టార్‌డమ్, క్రేజీ కాంబినేషన్ ఉన్నప్పటికీ, తక్కువ బడ్జెట్‌తో వచ్చిన హిట్ తమిళ సినిమాతో పోలిస్తే ఉస్తాద్ సినిమా ఓటీటీలో కూడా పెద్దగా ఆదరణ పొందలేకపోయింది.


