వీకెండ్ సినిమాల సందడి.. ఓటీటీల్లో ఒక్కరోజే 14 చిత్రాలు స్ట్రీమింగ్..! | This Friday Ott Release Movies List On May 8th | Sakshi
Sakshi News home page

Friday Ott Releases: ఓటీటీల్లో ఒక్క రోజే 14 సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్..!

May 7 2026 7:50 PM | Updated on May 7 2026 8:14 PM

This Friday Ott Release Movies List On May 8th

చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. శుక్రవారం వచ్చిందంటే చాలు బాక్సాఫీస్ వద్ద కొత్త సినిమాల హడావుడి మామూలే. ఈ వారంలో గోదారి గట్టుపైన, సతీ లీలావతి, రేజర్, స్పిరిట్ లాంటి సినిమాలు థియేటర్లలో విడుదలవుతున్నాయి. వీటిలో మెగా కోడలు లావణ్య త్రిపాఠి నటించిన సతీ లీలావతి, రవిబాబు 'రేజర్' మూవీస్‌పై ప్రేక్షకుల్లో కాస్తా ఆసక్తి నెలకొంది. తెలుగు చిత్రాలతో పాటు రిషభ్ శెట్టి హీరోగా చేసిన 'ఏ ఫిల్మ్ బై గిరి' అనే డబ్బింగ్ మూవీ రిలీజ్ కానుంది.

ఇక ఓటీటీల విషయానికొస్తే ఈ ఫ్రైడే పలు సినిమాలు స్ట్రీమింగ్‌కు రెడీ అయిపోయాయి. తెలుగు హిట్ మూవీ డెకాయిట్‌తో పాటు మలయాళ బ్లాక్‌బస్టర్స్ వాలా-2, భరతనాట్యం 2 ఓటీటీలో సందడి చేయనున్నాయి. వీటితో పాటు పలు డబ్బింగ్, బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాలు ఈ శుక్రవారం స్ట్రీమింగ్‌కు వచ్చేస్తున్నాయి. ఏయే మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేయండి.


నెట్‌ఫ్లిక్స్

  • భరతనాట్యం 2 (తెలుగు డబ్బింగ్ సినిమా) - మే 08

  • మై రాయల్ నెమిసిస్(కొరియన్ మూవీ)- మే 08

  • రిమార్కబుల్లీ బ్రైట్ క్రియేచర్స్(హాలీవుడ్ సినిమా)- మే 08


అమెజాన్ ప్రైమ్

  •   డెకాయిట్ (తెలుగు మూవీ) - మే 08

  •   లుక్కే (తెలుగు డబ్బింగ్ సిరీస్) - మే 08

  • సతన్‌ ది డార్క్(తమిళ సినిమా)- మే 08

  • నో ప్లేస్ టు బీ సింగిల్(హాలీవుడ్ సినిమా)- మే 08

జియో హాట్‌స్టార్

  • వాలా 2 (తెలుగు డబ్బింగ్ సినిమా) - మే 08

  •  సాంగ్ సంగ్ బ్లూ (ఇంగ్లీష్ మూవీ) - మే 08

  • ఎమ్‌ఐఏ(హాలీవుడ్ సినిమా)- మే 08

జీ5

  •  లవ్ మాక్‌టైల్ 3 (కన్నడ సినిమా) - మే 08

సన్ నెక్స్ట్

  •  ఓ బటర్ ఫ్లై (తమిళ మూవీ) - మే 08

  •  సూపర్ హిట్ (కన్నడ సినిమా) - మే 08

ఆపిల్ టీవీ

  • అన్‌కండీషనల్(హాలీవుడ్ మూవీ- మే 08

Advertisement
 
Advertisement
Advertisement