మైండ్‌ బ్లాక్‌ అయ్యే సిరీస్‌.. ఓటీటీలో ఎప్పుడంటే? | OTT: Amazon Prime Video Announced From New Series Release Date | Sakshi
Sakshi News home page

OTT: సూపర్‌ హిట్‌ హారర్‌ సిరీస్‌.. నాలుగో సీజన్‌ ఎప్పుడంటే?

Apr 11 2026 10:43 AM | Updated on Apr 11 2026 1:27 PM

OTT: Amazon Prime Video Announced From New Series Release Date

కొన్ని వెబ్‌ సిరీస్‌లు చూడటం మొదలుపెడితే మధ్యలో ఆపేయడం చాలా కష్టం. గంటల తరబడి స్క్రీన్‌కు అతుక్కుపోయి మరీ ఆ సిరీస్‌ను పూర్తి చేయాలనిపిస్తుంది. ఉత్కంఠ రేపే సన్నివేశాలు, ఊహించని ట్విస్టులతో మైండ్‌ బ్లాక్‌ చేస్తూ ప్రేక్షకుల్ని తన వశం చేసుకుంటాయి. అలాంటి సిరీసే "ఫ్రమ్‌". ఇదొక అమెరికన్‌ సైన్స్‌ ఫిక్షన్‌, హారర్‌ సిరీస్‌. జాన్‌ గ్రిఫిన్‌ సృష్టించిన ఈ సిరీస్‌ 2022లో ఓటీటీలో విడుదలైంది. 

నాలుగో సీజన్‌
కథ, డైరెక్షన్‌ అద్భుతంగా ఉండటంతో సూపర్‌ హిట్‌ సిరీస్‌గా నిలిచింది. దీంతో 2023లో రెండో సీజన్‌, 2024లో మూడో సీజన్‌ విడుదలయ్యాయి. కానీ నాలుగో సీజన్‌ మాత్రం వెంటనే రిలీజవ్వలేదు. దీంతో నాలుగో సీజన్‌ ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఫ్రమ్‌ సిరీస్‌ ఫ్యాన్స్‌ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఆ ఎదురుచూపులకు తెరపడింది. ఏప్రిల్‌ 20న ఫ్రమ్‌ నాలుగో సీజన్‌ విడుదలవుతోంది. ఈ విషయాన్ని అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో అధికారికంగా వెల్లడించింది. దీంతో ఫ్రమ్‌ ఫ్యాన్స్‌ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సిరీస్‌లో అసలేముంది?
రోడ్డుపై జాలీగా వెళ్తుంటే సడన్‌గా ఓ భారీ చెట్టు పడిపోతుంది. దాంతో వాహనదారులు పక్కనే ఉన్న ఇంకో దారి గుండా వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. ఆ దారి ఒక నిర్మానుష్యమైన టౌన్‌కు దారి తీస్తుంది. ఎంతసేపు ప్రయాణించినా చివరకు ఎక్కడ మొదలయ్యారో అక్కడికే వస్తారు తప్ప గమ్యాన్ని చేరుకోలేరు. దాంతో రాత్రి ఆ టౌన్‌లో సేద తీరేందుకు వెళ్తారు. అయితే అక్కడ రాత్రి అయిందంటే చాలు దెయ్యాలు మనుషుల్ని చంపేందుకు బయటకు వస్తాయి. 

అవి ఇంట్లోకి రాకుండా తలుపుకు ఒక లాకెట్‌ పెడతారు. కానీ కిటికీ తెరిస్తే మాత్రం అవి లోపలకు వచ్చి రక్తపాతం సృష్టిస్తాయి. రోడ్డు మీద వెళ్లే ఒక్కొక్కరూ నెమ్మదిగా ఈ టౌన్‌లో స్థిరపడుతూ ఉంటారు. రాత్రవగానే బిక్కుబిక్కుమంటూ గడుపుతారు. ఎప్పటికైనా తిరిగి ఇంటికి చేరుకోవాలన్న ఆశతో బతుకుతుంటారు. మరి వారు ఇంటికెళ్లే మార్గాన్ని కనుగొన్నారా? అసలు ఈ భయంకర ప్రదేశాన్ని ఎవరు సృష్టించారు? అందుకు గల కారణాలేంటి? అన్నది నాలుగో సీజన్‌లో అయినా బయటపెడతారేమో చూడాలి!

 

 

చదవండి: రూ.10 కోట్ల మోసం.. మంగ్లీపై కేసు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement