రూ.10 కోట్ల మోసం.. సింగర్‌ మంగ్లీపై కేసు నమోదు | Police Registered Case On Singer Mangli Over Fraud Case | Sakshi
Sakshi News home page

Singer Mangli: సింగర్‌ మంగ్లీపై కేసు నమోదు

Apr 11 2026 8:44 AM | Updated on Apr 11 2026 11:17 AM

Police Registered Case On Singer Mangli Over Fraud Case

సాక్షి, హైదరాబాద్‌: ప్రముఖ గాయని మంగ్లీపై పోలీసు కేసు నమోదైంది. మంగ్లీ తనను రూ.10 కోట్ల మేర మోసం చేసిందంటూ ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. ఆమె వల్ల తనకు ప్రాణహాని ఉందని తెలిపాడు. అతడి ఫిర్యాదు మేరకు పోలీసులు.. మంగ్లీ, ఆమె సోదరుడితో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేశారు. బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 351 (2), 352 కింద వీరిపై కేసు నమోదైంది.

మంగ్లీ నేపథ్యం
మంగ్లీ అసలు పేరు సత్యవతి చౌహాన్‌. తీన్మార్‌ వార్తలు ప్రోగ్రామ్‌లో తెలంగాణ యాసలో మాట్లాడుతూ పాపులర్‌ అయింది. ఆ తర్వాత బతుకమ్మ, బోనాలు, భక్తి పాటలు పాడుతూ జనానికి మరింత దగ్గరైంది. పుట్టింది ఆంధ్రప్రదేశ్‌లో అయినా తెలంగాణ జానపదంపై తనకు మంచి పట్టుంది. తను పాడిన ఎన్నో పాటలు లక్షలాది వ్యూస్‌ను రాబడుతూ సోషల్‌ మీడియాను షేక్‌ చేశాయి.

సినిమాల్లో సాంగ్స్‌
ఇదే స్పీడుతో తర్వాత సినిమాల్లోనూ ఎంటర్‌ అయింది మంగ్లీ. శైలజా రెడ్డి అల్లుడు మూవీలో 'శైలజా రెడ్డి అల్లుడు చూడే' సాంగ్‌ పాడింది. జార్జ్‌ రెడ్డిలో 'వాడు నడిపే బండి', అల వైకుంఠపురములోలో 'రాములో రాములా', సీటీమార్‌లో 'జ్వాలారెడ్డి', లవ్‌స్టోరీలో 'సారంగదరియా', రౌడీ బాయ్స్‌లో 'బృందావనం నుంచి', విక్రాంత్‌ రోనాలో 'రారా రక్కమ్మా', ధమాకాలో 'దండకడియాల్‌', 'జింతాక్‌' , బలగంలో 'ఊరు పల్లెటూరు..' ఇలా ఎన్నో హిట్‌ సాంగ్స్‌ ఆలపించింది.

 

 

చదవండి: ఓటీటీలో సూపర్‌ హిట్‌ మూవీ.. తాయ్‌ కిళవి రివ్యూ

Advertisement
 
Advertisement
Advertisement