ఓటీటీకి బోల్డ్ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్ | Sudharsan Govind Romantic Entertainer Nee Forever ott Streaming date | Sakshi
Sakshi News home page

Nee Forever Ott date: ఓటీటీకి యూత్‌ఫుల్‌ బోల్డ్‌ ఎంటర్‌టైనర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్

Apr 21 2026 4:32 PM | Updated on Apr 21 2026 4:48 PM

Sudharsan Govind Romantic Entertainer Nee Forever ott Streaming date

సందడి చేసేందుకు మరో సినిమా వచ్చేస్తోంది. తమిళంలో రిలీజైన ప్రేక్షకులను మెప్పించిన రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్ స్ట్రీమింగ్‌కు రెడీ అయిపోయింది. సుదర్శన్ గోవింద్, అర్చన రవి జంటగా నటించిన నీ ఫరెవర్‌ ఓటీటీలో సందడి చేయనుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ అఫీషియల్‌గా ప్రకటించింది. ఈ మూవీ ఏప్రిల్ 24 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. 

గత నెలలో థియేటర్లలో కేవలం తమిళంలో మాత్రమే రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఓటీటీలో తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉండనుంది. కాగా.. ఈ సినిమాకు అశోక్‌కుమార్ కలైవాణి దర్శకత్వం వహించారు. అశ్విన్ హేమంత్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రంలో వై జీ మహేంద్రన్, రవి, ఎం.జె.శ్రీరామ్, రేతిక శ్రీనివాస్, శ్రీజ రవి, చెల్లా, డాక్టర్ విద్య, వీజే ప్రతు, నోబుల్ కె జేమ్స్, స్నేహ శక్తి కీలక పాత్రల్లో మెప్పించారు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement