ఓటీటీల్లో సినిమాలతో పాటే అప్పుడప్పుడు ఒరిజినల్ వెబ్ సిరీస్‌లు కూడా వస్తుంటాయి. ఇప్పుడు అలా మిస్టిక్ థ్రిల్లర్ స్టోరీతో తీసిన సిరీస్ 'పోచమ్మ'. ఆహా ఓటీటీలో ఈ శుక్రవారం(ఏప్రిల్ 17) నుంచి తెలుగు, తమిళంలో స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇది ఆకట్టుకునేలా ఉండటం విశేషం.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)
ఓ గ్రామంలోనే భవంతిలో అడ్డుగా ఉందని పోచమ్మ విగ్రహాన్ని తొలగిస్తారు. తర్వాత ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి. ఆ ఊరిలోని వ్యక్తులపై పోచమ్మ ఎలాంటి ఆగ్రహం వ్యక్తం చేసింది అనే బ్యాక్ డ్రాప్ స్టోరీతో సిరీస్ తీసినట్లు తెలుస్తోంది. బిగ్‌బాస్ ఫేమ్ అర్జున్ అంబటి, కన్నడ ప్రముఖ నటుడు అచ్యుత్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మరి ఈ సిరీస్ ఏ మేరకు ప్రేక్షకుల్ని మెప్పిస్తుందో చూడాలి?
(ఇదీ చదవండి: ఓటీటీలో రాధిక సూపర్ హిట్ సినిమా.. తెలుగు రివ్యూ)


