ఓటీటీకి వంద కోట్ల సూపర్ హిట్ సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ | Aadu 3 OTT Streaming date of Malayalam blockbuster fantasy comedy film | Sakshi
Sakshi News home page

Aadu 3 OTT Release: ఓటీటీకి మలయాళ బ్లాక్‌బస్టర్‌ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Apr 23 2026 6:55 PM | Updated on Apr 23 2026 7:21 PM

Aadu 3 OTT Streaming date of Malayalam blockbuster fantasy comedy film

మలయాళ సినిమాలు ఓటీటీలో తెగ చూసేస్తున్నారు. దీంతో అక్కడి హిట్ ‍అయిన చిత్రాలు తెలుగు డబ్బింగ్ వర్షన్‌లో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. కంటెంట్‌ నచ్చడంతో ఓటీటీల్లో ఎక్కువగా మలయాళ చిత్రాలకే డిమాండ్ ఉంటోంది. ఇటీవలే స్ట్రీమింగ్‌ వచ్చేసిన సంభవం అధ్యాయం ఒన్ను సినీ ప్రియులను ఆకట్టుకుంది. అంతలోనే మరో మలయాళ సినిమా ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది.

మిధున్ మాన్యువల్ థామస్ డైరెక్షన్‌లో వచ్చిన ఆడు 3: వన్ లాస్ట్ రైడ్: పార్ట్ 1 ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. ఈ చిత్రం జీ5 వేదికగా మే 1వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతో పాటు తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. అక్కడ హిట్ కొట్టిన ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌ ఓటీటీ ప్రియులను ఎంతవరకు మెప్పిస్తుందో వేచి చూడాల్సిందే. ఈ మూవీలో జయసూర్య, వినాయకన్, ఇంద్రన్స్, ధర్మజన్, సైజు కురుప్, అల్లేయ బోర్న్ కీలక పాత్రల్లో నటించారు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement