రణ్‌వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ దురంధర్-2. మార్చి 19న థియేటర్లలోకి వచ్చిన సరికొత్త రికార్డ్స్ సృష్టించింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.1700 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ క్రమంలోనే టాలీవుడ్ మూవీ పుష్ప-2 కలెక్షన్స్‌ను దాటేసింది. ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో మూడోస్థానంలో నిలిచింది. ఈ సినిమాకు ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. గతేడాది డిసెంబర్‌లో రిలీజైన దురంధర్‌కు సీక్వెల్‌గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ మూవీ కోసం ఓటీటీ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఓటీటీ డేట్‌పై సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. మే 14 వ తేదీ నుంచి ఓటీటీకి రానుందన్న వార్త వైరల్‌గా మారింది. ఇప్పటికే ఈ మూవీ రిలీజై నెల పైగా కావడంతో ఓటీటీ విడుదలపై త్వరలోనే ప్రకటన వచ్చే ఛాన్సుంది. ఈ మూవీని జియో హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఈ చిత్రంలో రణ్‌వీర్ సరసన సారా అర్జున్ హీరోయిన్‌గా మెప్పించింది. ఈ మూవీలో సంజయ్‌దత్, అర్జున్ రాంపాల్, మాధవన్ కీలక పాత్రల్లో నటించారు.
#Dhurandhar2TheRevenge — MAY 14th On Jio HOTSTAR 🧨💥 pic.twitter.com/RIe0vDQ190
— OTT STREAM UPDATES (@newottupdates) April 26, 2026


