ఓటీటీలోకి ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే? | Ustaad Bhagat Singh OTT Release Date Out | Sakshi
Sakshi News home page

Ustaad Bhagat Singh OTT Release: నెలలోపే ఓటీటీలోకి పవన్‌ సినిమా.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..?

Apr 11 2026 11:45 AM | Updated on Apr 11 2026 11:56 AM

Ustaad Bhagat Singh OTT Release Date Out

సాధారణంగా స్టార్‌ హీరోల సినిమాలు కాస్త లేటుగా ఓటీటీలోకి వస్తాయి. ఫ్లాప్‌ సినిమా అయినా సరే థియేటర్స్‌లో రిలీజ్‌ అయిన తర్వాత కనీసం నాలుగు వారాల గ్యాప్‌లో ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతుంటాయి. కానీ పవన్‌ కల్యాణ్‌ తాజాగా చిత్రం ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ నెలలోపే ఓటీటీలోకి వచ్చింది. ఏప్రిల్‌ 16 నుంచి ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ మేరకు నెటిఫ్లిక్స్‌ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

థియేటర్స్‌లో ఫ్లాప్‌ టాక్‌.. 
గబ్బర్‌ సింగ్‌ లాంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత హరీష్‌ శంకర్‌- పవన్‌ కల్యాణ్‌ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’. శ్రీలీల, రాఖీ ఖన్నా హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య ఈ ఏడాది మార్చి 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచి ఈ సినిమాకు నెగెటివ్‌ టాక్‌ వచ్చింది. మరోవైపు అదే రోజు వచ్చిన దురంధర్‌ 2 చిత్రానికి సూపర్‌ హిట్‌ టాక్‌ రావడంతో ఉస్తాద్‌ కలెక్షన్స్‌ దారుణంగా పడిపోయాయి. ఎంతలా అంటే నిర్మాణ సంస్థ కనీసం కలెక్షన్స్‌ పోస్టర్‌ కూడా వేసుకోలేకపోయింది.

నెలలోపే.. 
వాస్తవానికి ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ చిత్రాన్ని కనీసం 5-6 వారాల గ్యాప్‌తో ఓటీటీలోకి తీసుకురావాలనుకున్నారట. కానీ సినిమాకు డిజాస్టర్‌ టాక్‌ రావడంతో ముందే స్ట్రీమింగ్‌ చేస్తున్నట్లు సమాచారం. ఈ నెల 16 నుంచి నెట్‌ఫ్లిక్‌లో అందుబాటులోకి వస్తుంది. తెలుగులో పాటు హిందీ, మలయాళ, తమిళ, కన్నడ భాషల్లోనూ ఈ చిత్రం స్ట్రీమింగ్‌ కానున్నట్లు నెట్‌ఫ్లిక్స్‌ ట్వీట్‌ చేసింది. మరి ఓటీటీలో అయినా పాజిటివ్‌ టాక్‌ సంపాదించుకుంటుందో లేదో తెలియాలంటే ఏప్రిల్‌ 16 వరకు ఆగాల్సిందే. 

Advertisement
 
Advertisement
Advertisement