SPSR Nellore
-
ప్రతి అర్జీని నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలి
నెల్లూరు రూరల్: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజలు ఇచ్చే అర్జీలను నిర్దిష్ట వ్యవధిలో పరిష్కరించాలని కలెక్టర్ ఓ ఆనంద్ సంబంఽధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ హాల్ నుంచి సబ్కలెక్టర్లు, ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, తహసీ ల్దార్లతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్లో పరిష్కరించిన అర్జీలపై అర్జీదారుల నుంచి సంబంఽధిత సచివాలయాల సిబ్బంది అభిప్రాయాలు తెలుసుకుని రిపోర్టు అందించాలని, ఈ విషయమై ఎంపీడీఓలు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. ప్రతి వారం వచ్చే అర్జీల్లో 60 శాతం రెవెన్యూ సమస్యలపైనే వస్తున్నాయన్నారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరిస్తూ ఎండార్సుమెంట్తోపాటు తగిన ఆధార పత్రాలను అప్లోడ్ చేయాలన్నారు. ఉపాధి హామీ పనుల వేగం పెంచాలని, ప్రతి వారం కనీసం 70 శాతం తగ్గకుండా పనులు జరిగేలా ఎంపీడీఓలు, ఏపీఓలు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఉపాధి పనుల్లో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. పేదల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసేందుకు ప్రభుత్వం అదనపు ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారుల ఖాతాలకు జమ చేస్తుందని, దశల వారీగా నిర్మాణాల్లో వేగం పెంచి పూర్తి చేయాలన్నారు. పీఎం సూర్యఘర్ యోజన పథకం ఏర్పాటుపై పూర్తిస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ ఉదయభాస్కర్, జెడ్పీ సీఈఓ విద్యారమ, హౌసింగ్, డ్వామా పీడీలు వేణుగోపాల్, గంగాభవాని, విద్యుత్‌శాఖ ఎస్ఈ విజయన్, సమగ్ర శిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య, ఐటీడీఏ పీఓ మల్లికార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు. గృహ నిర్మాణాల్లో వేగం పెంచాలి ఉపాధి హామీ పనులు ముమ్మరం చేయండి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ ఆనంద్ -
పది అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షకు 454 మంది గైర్హాజరు
నెల్లూరు(టౌన్): పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం తొలిరోజు ప్రశాంతంగా జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 38 సెంటర్లలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్ష జరిగింది. 1,343 మంది విద్యార్థులకు గానూ 889 మంది హాజరయ్యారు. 454 మంది గైర్హాజరయ్యారు. 23 కేంద్రాల్లో డీఈఓ బాలాజీరావు, ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. 22న పెంచలకోనలో హనుమజ్జయంతి రాపూరు: పెంచలకోనలో ఈనెల 22వ తేదీన హనుమజ్జయంతిని నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు సోమవారం తెలిపారు. ఉదయం 5 గంటలకు క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామికి అభిషేకం, పూలంగి సేవ, 10.30 గంటలకు ఆకుపూజ, సాయంత్రం తిరుచ్చిపై ఆంజనేయస్వామి ఊరేగింపు ఉంటుందని వెల్లడించారు. -
జాతీయ రహదారిపై వాహనాల బీభత్సం
దగదర్తి : మండలంలోని అల్లూరు రోడ్డు రైల్వే వంతెన వద్ద సోమవారం తెల్లవారుజామున మూడు వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో బీభత్సంగా మారింది. అయితే ఆయా వాహనాల డ్రైవర్లు, ప్రయాణికులు స్వల్పగాయాలతో బయటపడడంతో పెను ప్రమాదం తప్పినట్లు అయింది. వివరాల్లోకి వెళ్తే.. అల్లూరు రోడ్డు వద్ద రైల్వే వంతెన ప్రాంతంలో గతం నుంచి రెండు లేన్ల జాతీయ రహదారి ఉంది. అయితే రహదారి విస్తరణలో కొత్తగా మరో రెండు లేన్లను కొత్తగా నిర్మించారు. ప్రస్తుతం అక్కడ నాలుగులేన్ల జాతీయ రహదారి ఉంది. అయితే పాత రెండు లేన్ల రహదారి (నెల్లూరు నుంచి కావలి వైపు వెళ్లే దారి)లో వంతెన బలహీనంగా ఉందని 12 ఏళ్ల క్రితమే ఆ మార్గాన్ని మూసివేశారు. కొత్తగా నిర్మించిన రెండు లేన్ల రహదారినే ఇరువైపుల వాహనాల రాకపోకలను కొనసాగిస్తున్నారు. ఈ వంతెనకు అటు, ఇటు నుంచి ఆరు లేన్ల రహదారి ఉంది. ఈ మార్గంలో ప్రయాణించే వాహనచోదకులకు అక్కడికి వచ్చే వరకు రహదారి సింగిల్ లేన్ ఉన్న విషయం తెలియదు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారు జామున అతివేగంగా వచ్చిన ఓ లారీ అదుపు తప్పి బోల్తా పడింది. అదే సమయంలో వెనుకనే వేగంగా వస్తున్న ఓ కారు, దాని వెనుకనే వస్తున్న భారీ ట్రాలీ ఢీకొనడంతో బీభత్సంగా మారింది. అయితే ఈ ప్రమాదంలో ఆయా వాహనాల్లోని డ్రైవర్లు, ప్రయాణికులకు స్వల్పగాయాలు కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదాల కారణంగా ఈ మార్గంలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. హైవే సిబ్బందితోపాటు పోలీసులు అక్కడికి చేరుకుని క్రేన్ల సహాయంలో బోల్తాపడిన వాహనాన్ని పక్కకి తప్పించి వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు. అదుపు తప్పి బోల్తాపడిన లారీ వెనుకనే వస్తూ ఢీకొన్న కారు, భారీ ట్రాలీ స్వల్పగాయాలతో బయటపడిన డ్రైవర్లు, ప్రయాణికులు -
దళిత విద్యార్థి జేమ్స్‌కు ఎమ్మెల్సీ పరామర్శ
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): నెల్లూరులోని షైన్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న దళిత విద్యార్థి జేమ్స్‌ను వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఆదివారం రాత్రి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ జేమ్స్‌పై దాడి ఘటన విషయాన్ని తెలుసుకున్న జగన్మోహన్రెడ్డి వెంటనే పరామర్శించి మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశించడంతో వైద్యులతో మాట్లాడినట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇలాంటి దాడులు విచ్చలవిడిగా జరుగుతున్నాయన్నారు. ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కూటమి ప్రభుత్వానికి ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు. -
లీజు గడువు తీరిన మైన్లు స్వాధీనం చేసుకోవాలి
● రాష్ట్ర సంగీత అకాడమీ మాజీ చైర్పర్సన్ పొట్టేళ్ల శీరిషా నెల్లూరు రూరల్: సైదాపురం మండలంలో 50 ఏళ్ల లీజు గడువు ముగిసిన మైకా గనులు 8 ఉన్నాయని, వాటిని వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని జెడ్పీ మాజీ వైస్ చైర్పర్సన్, రాష్ట్ర సంగీత అకాడమీ మాజీ చైర్పర్సన్ పొట్టేళ్ల శీరిషా డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారత ప్రభుత్వ గనుల శాఖ ఈ కార్ట్ ్జను మేజర్ మినరల్స్ కింద కేటాయించిందన్నారు. ఎంఎండీఆర్ చట్టం 1957 ప్రకారం అక్రమ మైనింగ్ చేయకూడదన్నారు. అయితే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అతని అనుచరుడు యథేచ్ఛగా అక్రమ మైనింగ్ చేస్తున్నారన్నారు. పర్యావరణ క్లియరెన్స్ లేకుండా ఎటువంటి మైనింగ్ చేపట్టకూడదని సుప్రీంకోర్టు 2017లో 114 పేజీలతో జస్టిస్ దీపక్ గుప్తా ధర్మాసనం జడ్జిమెంట్ ఇచ్చిందని గుర్తు చేశారు. బాధ్యత గల ఎంపీ స్థానంలో ఉండి సుప్రీం ఆదేశాలను ధిక్కరిస్తూ అక్రమ మైనింగ్ చేస్తుంటే ఇంతకన్నా దారుణం ఎక్కడ ఉండదన్నారు. ఈ అక్రమ మైనింగ్‌పై జిల్లా మైనింగ్ డీడీ బాలాజీనాయక్‌కు ఫిర్యాదు చేసినా, బ్లాస్టింగ్ చేసి అక్రమ మైనింగ్ చేస్తుంటే సంబంధం లేనట్లు డీడీ వ్యవహరించడం తగదన్నారు. ఐబీఎం రూల్స్‌ను అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును లెక్క చేయకుండా ఈ మాఫియా బరి తెగించి యథేచ్ఛగా అక్రమ మైనింగ్ చేస్తుందన్నారు. తక్షణమే లీజు గడువు ముగిసిన ఈ గనులను స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్‌ను కోరామన్నారు. ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఎంఎండీఆర్ చట్టం 1957 ప్రకారం సిద్ధి వినాయక, కేఎస్ఆర్ అండ్ కంపెనీ, శోభరాణి, భరత్‌బాబు, వీకేడీఎం కనకదుర్గ, జయలక్ష్మి మీనాక్షి సుందరం, రుస్తుం, మైకా మైన్స్‌లను వెంటనే స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
దగదర్తి వైస్ ఎంపీపీ ఎన్నిక ఏకగ్రీవం
● స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన వైఎస్సార్సీపీ ఎంపీటీసీ కుడుముల చిన్నమ్మ దగదర్తి: వైస్ ఎంపీపీకి సోమవారం జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నుంచి ఉలవపాళ్ల ఎంపీటీసీగా ఉన్న కుడుముల చిన్నమ్మ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఏకగ్రీవంగా గెలుపొందారు. సోమవారం ఎంపీడీఓ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి సుబ్బరాజు వైస్ ఎంపీపీ ఎన్నిక నిర్వహించారు. మండలంలో మొత్తం 11 మంది ఎంపీటీసీ సభ్యులు ఉండగా అందరూ వైఎస్సార్సీపీ తరఫున గెలుపొందిన వారే. టీడీపీకి ఒక్క ఎంపీటీసీ కూడా లేరు. ప్రస్తుతం ఎంపీపీగా తాళ్లూరు ప్రసాద్‌నాయుడు ఉన్నారు. వైఎస్సార్సీపీకి చెందిన 11 మంది ఎంపీటీసీ సభ్యుల్లో ఇద్దరు వైస్ ఎంపీపీలుగా ఎన్నికయ్యారు. వీరిలో పీతల కామేశ్వరికి ప్రభుత్వ ఉద్యోగం రావడంతో ఆ పదవికి రాజీనామా చేయడంతో ఉపాధ్యక్ష ఎన్నిక అనివార్యమైంది. గతంలో నిర్వహించ తలపెట్టిన ఎన్నిక రెండు సార్లు వాయిదా పడింది. ఈ క్రమంలో చెన్నూరు ఎంపీటీసీ చలంచర్ల సుశీల ఇటీవల టీడీపీ కండువా కప్పుకున్నారు. అయితే తాజాగా వైస్ ఎంపీపీ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేయడంతో సోమవారం ఎన్నిక ప్రక్రియ నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న 10 మంది ఎంపీటీసీ సభ్యుల్లో ఎనిమిది మంది సభ్యులు హాజరయ్యారు. వీరిలో ఉలవపాళ్ల ఎంపీటీసీ సభ్యురాలు కుడుముల చిన్నమ్మ వైస్ ఎంపీపీ పదవికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. పోటీకి ఎవరు ముందుకు రాకపోవడంతో చిన్నమ్మ ఏకగ్రీవంగా గెలుపొందినట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. అనంతరం ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. -
బోలెడు
సమస్యలువినతులు● నెల్లూరులో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక ● 385 వినతుల అందజేత ● హామీలు నెరవేర్చాలంటూ సీపీఐ ధర్నా ● ఆదుకోవాలని కేబుల్ ఆపరేటర్ల వినతి నెల్లూరు రూరల్: నెల్లూరులోని కలెక్టరేట్లో జరుగుతున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వినతులు వెల్లువలా వస్తున్నాయి. సోమవారం తిక్కన ప్రాంగణంలో కలెక్టర్ ఆనంద్, జేసీ కె.కార్తీక్, జిల్లా రెవెన్యూ అధికారి ఉదయభాస్కర్‌రావు, డీపీఓ శ్రీధర్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ విద్యారమ సమస్యలు తెలుసుకున్నారు. వారికి 385 వినతులందాయి. వాటిలో రెవెన్యూ శాఖవి 170, మున్సిపల్ శాఖవి 30, సర్వేవి 32, పంచాయతీరాజ్‌వి 23, పోలీస్ శాఖవి 49, సివిల్ సప్లయ్స్‌వి 17 తదితర శాఖలవి ఉన్నాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ సమస్యలపై ప్రజలందించిన అర్జీల విషయంలో జాప్యం లేకుండా వెంటనే పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. భూ ఆక్రమణపై.. సీతారామపురం మండలం దేవిశెట్టిపల్లి గ్రామ సర్వే నంబర్ 86–3లో 2.86 ఎకరాలను నాగరాజుపల్లి, దేవిశెట్టిపల్లి గ్రామాలకు సంబంఽధించి పశువులు, గొర్రెలు మేపుకొనేందుకు వినియోగిస్తారని, అయితే మారంపల్లి గ్రామానికి చెందిన ఇర్ల నాగయ్య అనే వ్యక్తి ఆ భూమిని ఆక్రమించాడని దేవిశెట్టిపల్లి గ్రామ సర్పంచ్ రేనాటి మహేశ్వరి వినతిపత్రం సమర్పించారు. ఆమె మాట్లాడుతూ మండల అఽధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదని, అతను నకిలీ పాస్ పుస్తకాలు, ధ్రువీకరణపత్రాలతో అక్రమంగా కరెంట్ సర్వీస్ కూడా పొందినట్లు తెలిపారు. తాము హైకోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు. ఉన్నతాధికారులు స్పందించాలని కోరారు. పంచాయతీ కార్యదర్శిపై ఫిర్యాదు గ్రామ కార్యదర్శి మల్లికార్జున అగౌరవపరుస్తున్నాడని సంగం మండలం అన్నారెడ్డిపాళెం సర్పంచ్ మోడేగుంట శేషమ్మ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఆమె మాట్లాడుతూ తాను ఎస్సీనని, 8 నెలలుగా ఏ తీర్మానం చేయకుండా అడ్డుకుంటున్నాడని తెలిపారు. చేసిన పనులకు ఎం బుక్లిచ్చినా బిల్లుల చెల్లింపులు చేయడం లేదన్నారు. ఇంటి పన్ను వసూళ్లను తనకు తెలియకుండా చేస్తున్నాడన్నారు. పంచాయతీలో అక్రమాలకు పాల్పడుతున్నాడని అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హామీలు నెరవేర్చాలని డిమాండ్ కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట సీపీఐ నాయకులు ధర్నా నిర్వహించారు. ఆ పార్టీ నగర సహాయ కార్యదర్శి సయ్యద్ సిరాజ్, జిల్లా కార్యవర్గ సభ్యుడు షాన్వాజ్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు, పట్టణ, నగరవాసులకు రెండు సెంట్లు ఇస్తామని, అదే విధంగా ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలిస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు అర్హులకు ఎక్కడా భూములిచ్చిన దాఖలాల్లేవన్నారు. నిబంధనలు పెట్టకుండా గత ప్రభుత్వం ఎలాగైతే రేషన్‌కార్డులు మంజూరు చేసిందో అదే విధంగా ఇప్పుడు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు ముక్తియార్, వి.రామరాజు, యామాల మధు, సుబ్బరాయుడు, శీరిష, లత పాల్గొన్నారు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. ఉద్యోగులపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలన్నారు. డీఏ బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. నాయకులు పఠాన్ బాజీ, కరిమి రాజేశ్వరరావు, చీర్ల కిరణ్‌కుమార్, హుస్సేన్, ధనరాజ్, పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. కేబుల్ ఆపరేటర్లను ఆదుకోవాలంటూ.. ఫైబర్ నెట్ సంస్థ నిర్వహణ లోపం కారణంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని ఆంధ్రప్రదేశ్ స్టేట్ మల్టీ సర్వీసెస్ కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ సంఘం నేతలు చెప్పారు. కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్రాధ్యక్షుడు వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ ఏడునెలల నుంచి సిగ్నల్స్ అంతరాయంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామన్నారు. వినియోగదారులు తగ్గడంతో ఆర్థికంగా నష్టపోయి తీవ్ర ఒత్తిడికి గురవుతున్నామని తెలిపారు. టెక్నికల్ సిబ్బందిని తొలగించడం, ఇతరులను నియమించకపోవడం కేబుల్ ఆపరేటర్ల మెడపై కత్తిని వేలాడదీసినట్లే భావించాల్సి ఉంటుందన్నారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారానికి చొరవ చూపలేదన్నారు. -
కాలువలో పడి వృద్ధుడి మృతి
సంగం: ఓ వృద్ధుడు కనిగిరి రిజర్వాయర్ ప్రధాన కాలువ వద్దకు బహిర్బూమికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని అన్నారెడ్డిపాళేనికి చెందిన కిలారి రామానాయుడు (80) కొన్నేళ్లపాటు ఆత్మకూరు మండలం అప్పారావుపాళెంలో నివాసం ఉన్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. మూడు నెలలుగా మండల కేంద్రమైన సంగం పంచాయతీ మజరా అమరపునాయుడు కండ్రికలోని ల్యాంకో ఫౌండేషన్ ఆశ్రమంలో ఉంటున్నాడు. సోమవారం ఆశ్రమం బయటకు వచ్చిన రామానాయుడు సమీపంలో ఉన్న కనిగిరి రిజర్వాయర్ ప్రధాన కాలువ వద్దకు బహిర్బూమికి వెళ్లాడు. ఈ క్రమంలో నీటిలో మునిగిపోయాడు. ఆశ్రమానికి వృద్ధుడు తిరిగి రాకపోవడంతో నిర్వాహకులు కాలువ వద్ద చూశారు. రామానాయుడు చేతి కర్ర కనిపించింది. దీంతో సంగం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్సై రాజేష్ కాలువలో గాలింపు చర్యలు చేపట్టగా కాలువలో రామానాయుడు మృతదేహం కనిపించింది. దానిని బయటకు తీయించి పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరుకు తరలించారు. ఆగని కోళ్ల వ్యర్థాల తరలింపు● నాలుగు మినీ లారీల పట్టివేత సంగం: మండలంలో పలుచోట్ల సోమవారం నాలుగు మినీలారీల్లో తరలిస్తున్న 45 డ్రమ్ముల కోళ్ల వ్యర్థాలను గ్రామీణుల సహాయంతో పోలీసులు పట్టుకున్నారు. వారి కథనం మేరకు.. కర్ణాటక రాష్ట్రం నుంచి సంగంకు మినీలారీలు వచ్చాయి. దువ్వూరులో రెండు, సంగం కావలి కాలువ వద్ద ఒకటి, బ్యారేజ్ వద్ద మరొకటి చికెన్ వ్యర్థాలను తరలించేందుకు వెళ్తుండగా ఆయా గ్రామాల్లోని యువకులు అడ్డగించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు కొండమలుపు సమీపంలోని పంపింగ్ స్కీం వద్ద భారీ గోతిని తీసి కోళ్ల వ్యర్థాలను పూడ్చివేశారు. లారీ డ్రైవర్, యజమాని, అక్రమంగా వ్యర్థాలను తరలిస్తున్న వ్యాపారస్తులపై కేసు నమోదు చేశారు. -
వైభవంగా శేషవాహన సేవ
బుచ్చిరెడ్డిపాళెం రూరల్: మండలంలోని జొన్నవాడలో కొలువైన మల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం స్వామి, అమ్మవారు శేష వాహనంలో భక్తులకు దర్శనమిచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు దేవదేవేరులను దర్శించుకుని, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఏర్పాట్లను ఈఓ శ్రీనివాసులురెడ్డి పర్యవేక్షించారు. మెప్మా పీడీగా లీలారాణి నెల్లూరు (బారకాసు): పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) నెల్లూరు జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా డిప్యూటీ కలెక్టర్ బి.లీలారాణి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో లీలారాణి సోమవారం మెప్మా పీడీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు పీడీగా ఉన్న రాధమ్మ తిరిగి చిత్తూరు జిల్లా మెప్మా పీడీగా బదిలీ అయ్యారు. లీలారాణి గతంలో జిల్లాలో డిప్యూటీ తహసీల్దార్‌గా, గూడూరు, కోట, బోగోలు, సైదాపురం తహసీల్దార్‌గా పనిచేశారు. ప్రస్తుతం రాజంపేట భూసేకరణ విభాగంలో డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తూ బదిలీపై నెల్లూరు మెప్మాగా పీడీగా నియమితులయ్యారు. నెల్లూరు బార్ అసోసియేషన్ ఎన్నికలు షురూ ● నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం నెల్లూరు (లీగల్): నెల్లూరు బార్ అసోసియేషన్ కార్యవర్గ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. సోమవారం ఎన్నికల అధికారి బి.శ్రీనివాసన్ నోటిఫికేషన్ జారీ చేశారు. మంగళవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమై 26వ తేదీతో ముగుస్తుంది. 27న నామినేషన్ల పరిశీలన, 30న ఉపసంహరణ అనంతరం అర్హులైన అభ్యర్థుల జాబితాను అదే రోజు ప్రకటిస్తారు. జూన్ 20వ తేదీ ఉదయం నుంచి ఓటింగ్ ప్రక్రియ జరుగుతుంది. అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఎటువంటి ఘర్షణలకు తావివ్వకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి ఎన్నికలు సక్రమంగా నిర్వహించే విధంగా ప్రణాళిక రూపొందించినట్లు ఎన్నికల అధికారి తెలిపారు. బండలాగుడు పోటీల్లో బల్లికురవ ఎడ్లు విజేత సీతారామపురం: మండలంలోని సంగసానిపల్లిలో కొలువైన కోదండరామస్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఎడ్లతో బండలాగుడు పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో బాపట్ల జిల్లా బల్లికురవకు చెందిన పావులూరి వీరాస్వామి ఎడ్లు 19 నిమిషాల్లో 1,600 మీటర్లు బండను లాగి ప్రథమ స్థానంలో నిలిచాయి. అతనికే చెందిన మరో జత ఎడ్లు 16.6 నిమిషాల వ్యవధిలో 1,200 మీటర్లు బండలాగి ద్వితీయ స్థానంలో నిలువగా, ప్రకాశం జిల్లా బేస్తవారిపేట జేసీ అగ్రహారానికి చెందిన లక్కునాగ శివశంకర్ ఎడ్లు 20 నిమిషాల వ్యవధిలో 1,016.7 మీటర్లు బండ లాగి తృతీయ స్థానంలో నిలిచాయి. కోదండరామస్వామి భక్త బృందం ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన ఎడ్ల యజమానులకు రూ.50,000, రూ.30,000, రూ.20,000 చొప్పున నగదు బహుమతులను అందజేశారు. సెలవులో జేసీ నెల్లూరు రూరల్: జిల్లా జాయింట్ కలెక్టర్ కె.కార్తీక్ సెలవుపై వెళ్లనున్నారు. వ్యక్తిగత పనుల నిమిత్తం ఆయన మంగళవారం నుంచి వారం రోజులపాటు సెలవులో ఉంటారు. అనంతరం తిరిగి విధుల్లో చేరన్నారని కలెక్టరేట్ అధికారులు తెలిపారు. -
స్కూల్ కాంప్లెక్స్‌కు సర్దుబాటు
మిగులు స్కూల్ అసిస్టెంట్లను జిల్లాలోని ఆయా స్కూల్ కాంప్లెక్స్‌లకు ముగ్గురు నుంచి నలుగురును సర్దుబాటు చేసే ప్రతిపాదన ఉంది. స్కూల్ కాంప్లెక్స్ పరిధిలోని పాఠశాలల్లో ఉపాధ్యాయులు సెలవు పెట్టినప్పుడు వీరిని అక్కడకు పంపిస్తారు. డీఎస్సీలో ఉద్యోగాలు సాధించిన కొంత మందిని కూడా స్కూల్ కాంప్లెక్స్‌లకు పంపించే అవకాశం ఉంది. దీనిపై ఇప్పటి వరకు రాష్ట్ర విద్యాశాఖ అధికారుల నుంచి ఎలాంటి మార్గదర్శకాలు అయితే రాలేదు. – బాలాజీరావు, డీఈఓ -
మినీ మహానాడుకు వెళ్తుండగా..
● విద్యుదాఘాతానికి గురై యువకుడి మృతి ● తండ్రి కళ్లెదుటే ఘటన వింజమూరు(ఉదయగిరి): ఆ యువకుడు ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. ఈ క్రమంలో సెలవులని ఇంటికొచ్చాడు. వింజమూరులో జరుగుతున్న టీడీపీ మినీ మహానాడుకు తండ్రితో కలిసి బయలుదేరాడు. మార్గమధ్యలో సరుకుల కొనుగోలుకు ఓ దుకాణం వద్దకు వెళ్లి విద్యుత్ షాక్‌కు గురై మృతిచెందాడు. కుటుంబ సభ్యులు, స్థానికుల కథనం మేరకు.. దుత్తలూరు మండలం భైరవరం గ్రామానికి చెందిన భోగిరెడ్డి ఓబులరెడ్డి, రమణమ్మ రెండో కుమారుడు చిన ఓబులరెడ్డి (23) తిరుపతిలోని ఓ కాలేజీలో డిగ్రీ ఫైనలియర్ చదువుతున్నాడు. నేవీ ఉద్యోగం కోసం ఇటీవల జరిగిన ఫిజికల్ టెస్ట్‌లో పాస్ అయ్యాడు. బుధవారం పరీక్ష రాయాల్సి ఉంది. ఆదివారం సెలవు కావడంతో స్వగ్రామానికి వచ్చాడు. ఈ క్రమంలో సోమవారం వింజమూరులో టీడీపీ మినీ మహానాడుకు తండ్రితోపాటు బయలుదేరాడు. దారిలో సరుకుల కొనుగోలు కోసం వింజమూరు బస్టాండ్ సెంటర్లో ఉన్న ఓ దుకాణం వద్ద ఆగారు. దుకాణం రేకులకు ఆధారంగా వేసి ఉన్న ఇనుప స్తంభానికి అప్పటికే విద్యుత్ సరఫరా అవుతోంది. ఇది తెలియక చిన ఓబులరెడ్డి సంభాన్ని పట్టుకోగా షాక్‌కు గురై స్పృహ కోల్పోయాడు. వెంటనే అక్కడ ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్ ధ్రువీకరించారు. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వైద్యశాలకు వెళ్లి మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ట్రాన్స్‌కో ఏఈ నాగూర్‌వలీ మాట్లాడుతూ షాపు ఓనర్ నిర్లక్ష్యం కారణంగా ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యజమాని నిర్లక్ష్యమే కారణమా? నాలుగు నెలల నుంచి వర్షం వచ్చిన ప్రతిసారి దుకాణం వద్ద ఉన్న రేకులకు సపోర్టుగా ఉన్న ఇనుప స్తంభానికి విద్యుత్ సరఫరా అవుతోంది. ఈ విషయం అక్కడ పనిచేసే కూలీలు యజమానికి పలుమార్లు తెలిపినా పట్టించుకోలేదని చెబుతున్నారు. -
గ్రహణం పట్టిస్తారా? పోస్టింగ్ ఇస్తారా?
మెగా డీఎస్సీ పోస్టింగ్‌లపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. తొలి సంతకంతో ఔత్సాహిక ఉపాధ్యాయుల్లో ఆశలు రేకెత్తించిన టీడీపీ ప్రభుత్వం ఏడాది కాలంగా కాలయాపన చేస్తూ వచ్చింది. ఎట్టకేలకు డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటించాక అర్హతలపై అనేక కొర్రీలు పెట్టారు. తాజాగా పాఠశాలల పునర్ వ్యవస్థీకరణ చేపట్టి మిగులు ఉపాధ్యాయుల లెక్కలు తేల్చారు. వీరినే కూర్చోబెట్టి జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో డీఎస్సీలో కొత్తగా వచ్చే ఉపాధ్యాయులకు ఎక్కడ పోస్టింగ్‌లు ఇస్తారనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. 2025 డీఎస్సీ.. 1998 నాటి డీఎస్సీ మాదిరిగా గ్రహణం పట్టే పరిస్థితులు ఉంటాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.●● ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 673 పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ ● తాజాగా పాఠశాలల పునర్వ్యవస్థీకరణలో 700కు పైగా మిగులు ఉపాధ్యాయులు ● 673 పోస్టులకు 28,772 దరఖాస్తులు ● ఒక్కో పోస్టుకు 43 మంది అభ్యర్థులు పోటీ ● వచ్చే నెల 6వ తేదీ నుంచి డీఎస్సీ పరీక్షలు నెల్లూరు (టౌన్): ఉపాధ్యాయ వృత్తిలో రాణించాలనుకునే నిరుద్యోగుల ఆశలు.. అడియాశలుగానే మిగిలిపోయే పరిణామాలు కనిపిస్తున్నాయి. కుటుంబ ఆర్థిక పరిస్థితులు సహకరించకపోయినా అప్పులు చేసి కోచింగ్‌లు తీసుకుని, ఏళ్ల తరబడి ఎదురు చూసిన ఔత్సాహిక ఉపాధ్యాయుల కలలు కల్లలు అవుతాయనే ఆందోళన డీఎస్సీకి సిద్ధమవుతున్న వారిలో కనిపిస్తోంది. ప్రభుత్వ తీరు, పరిస్థితులు చూస్తుంటే అసలు పోస్టింగ్‌లు వస్తాయా? వచ్చినా ఎప్పుడొస్తాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ ప్రభుత్వ వ్యవహార శైలి చూస్తుంటే.. పోస్టింగ్‌లపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. మెగా కాదు.. మినీ డీఎస్సీ మెగా డీఎస్సీ అంటే ఎక్కువ పోస్టులు ఉంటాయని ఎదురు చూసిన నిరుద్యోగుల ఆశలపై ఆదిలో కూటమి ప్రభుత్వం నీళ్లు కొట్టింది. ఉమ్మడి నెల్లూరు జిల్లాకు కేవలం 673 పోస్టులను మాత్రమే కేటాయించింది. అందులోనూ ఎస్జీటీ పోస్టులు కేవలం 117 మాత్రమే ఉన్నాయి. సాధారణంగా ఎస్జీటీ పోస్టులకు ఎక్కువ మంది పోటీ పడతారు. ఈ పోస్టుల సంఖ్య రాష్ట్రంలో ఇతర జిల్లాలతో పోలిస్తే నెల్లూరు జిల్లాకు బాగా తక్కువనే చెప్పాలి. దీన్ని బట్టి చూస్తే ఇది మెగా డీఎస్సీ కాదు..మినీ డీఎస్సీ అని సష్టమవుతోంది. 673 పోస్టులకు 28,772 దరఖాస్తులు -
ఆస్తి కోసం వేధిస్తున్నారయ్యా..
● ఫిర్యాదు చేసిన పలువురు వృద్ధులు ● ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ ● 97 వినతుల అందజేతనెల్లూరు(క్రైమ్): తల్లిదండ్రులను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన పిల్లలు ఆస్తి కోసం వేధిస్తున్నారు. మరికొందరు ఏకంగా ఇంట్లో నుంచి గెంటేస్తున్నారు. వృద్ధులు తమ బాధలను పోలీసుల దృష్టికి తీసుకొస్తున్నారు. సోమవారం నెల్లూరులోని ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్హాల్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి 97 మంది విచ్చేసి వివిధ సమస్యలపై జి.కృష్ణకాంత్‌కు వినతిపత్రాలు సమర్పించారు. వాటిని పరిశీలించిన ఆయన సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో మహిళా పోలీస్‌స్టేషన్ డీఎస్పీ చెంచురామారావు, లీగల్ అడ్వైజర్ శ్రీనివాసులురెడ్డి, ఎస్బీ – 2 ఇన్స్పెక్టర్ బి.శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పాపం వృద్ధులు ● నా ఆస్తులను కుమారుడు లాక్కొని ఇంట్లో నుంచి గెంటేశాడు. తెలిసిన వారింట్లో తలదాచుకుంటున్నాను. విచారించి న్యాయం చేయాలని కొండాపురం ప్రాంతానికి చెందిన ఓ వృద్ధురాలు కోరారు. ● నా కుమారుడు ఐదేళ్ల క్రితం చనిపోయాడు. మనవడు, కోడలు ఆస్తి కోసం తీవ్రంగా కొడుతున్నారు. వారి బారి నుంచి రక్షణ కల్పించాలని బుచ్చిరెడ్డిపాళెం ప్రాంతానికి చెందిన ఓ వృద్ధురాలు ఫిర్యాదు చేశారు. ● నా కుమారులకు ఆస్తిని సమంగా పంచాను. పెద్ద కుమారుడు నా పేరుపై ఉన్న ఇంటిని కూడా తనకు ఇవ్వాలని వేధిస్తున్నాడని నెల్లూరు రూరల్ మండలానికి చెందిన ఓ వృద్ధుడు వినతిపత్రం ఇచ్చాడు. ఫిర్యాదుల్లో మరికొన్ని.. ● ఫ్రెండ్ యాప్‌లో ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. ప్లాట్ల వ్యాపారం చేద్దామని నమ్మించి రూ.6,27,900లు తీసుకుని మోసగించాడని సైదాపురానికి చెందిన ఓ మహిళ కోరారు. ● హైదరాబాద్‌కు చెందిన కుమార్, చంద్రమోహన్లు ఆన్లైన్లో పరిచయమయ్యారు. హాంకాంగ్‌కు చెందిన ట్రేడింగ్ కంపెనీలో రూ.కోటి పెట్టుబడి పెడితే 500 మిలియన్ డాలర్లు వస్తాయని నమ్మించి నగదు తీసుకుని మోసగించారు. నగదు అడిగితే రౌడీలతో చంపిస్తామని బెదిరిస్తున్నారని బాలాజీనగర్‌కు చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ● నెల్లూరు బాలాజీనగర్‌కు చెందిన సన్నీ ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి లోబర్చుకున్నాడు. పెళ్లి చేసుకోవాలని అడిగితే ముఖం చాటేస్తున్నాడు. తగిన చర్యలు తీసుకోవాలని బుచ్చిరెడ్డిపాళేనికి చెందిన ఓ యువతి కోరింది. ● ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని బాపట్లకు చెందిన మహేష్ నా వద్ద రూ.13 లక్షల నగదు తీసుకున్నాడు. ఉద్యోగం ఇప్పించకపోగా నగదు అడిగితే చంపుతామని బెదిరిస్తున్నాడంటూ కోవూరు చెందిన వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ● సౌత్‌మోపూరుకు చెందిన కృష్ణారెడ్డి నకిలీ కన్సల్టెన్సీ పెట్టి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి నా వద్ద, స్నేహితుడి వద్ద రూ.5 లక్షల నగదు తీసుకున్నాడు. ఉద్యోగం ఇప్పించలేదు. నగదు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాడని వేదాయపాళేనికి చెందిన ఓ వ్యక్తి వినతిపత్రం ఇచ్చాడు. -
రెడ్‌బుక్ రాజ్యాంగంతో అరాచకం
నెల్లూరు(బారకాసు): ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం అరాచకాలకు తెగబడిందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ (పీఏసీ) మెంబర్ పి.అనిల్‌కుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం నెల్లూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంక్షేమం, అభివృద్ధి ఊసే లేకుండా పోయిందని మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం లేని స్కామ్‌లు సృష్టించి కక్ష సాధింపులకు దిగుతోందని ధ్వజమెత్తారు. మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి అక్రమ అరెస్ట్‌ను ఖండించారు. ఏపీలో పనిచేయాలంటేనే బ్యూరోక్రాట్స్ భయపడుతున్నారని విమర్శించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. మైనింగ్ మాఫియాను పోషిస్తున్న చంద్రబాబు నెల్లూరు జిల్లాలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని అడ్డం పెట్టుకుని చంద్రబాబు మైనింగ్ మాఫియాను బాబు పెంచి పోషిస్తున్నారు. జిల్లాలో దాదాపు 180 మైన్లు ఉంటే అందులో కేవలం 25 నుంచి 30 మాత్రమే నడుస్తున్నాయి. వేమిరెడ్డి వల్ల అనేక క్వారీలు ఇంకా మూతపడే ఉన్నాయి. వేమిరెడ్డి కంపెనీ పెట్టుకోవడం తప్పా అంటూ టీడీపీ నాయకుడు బీద రవిచంద్రయాదవ్ వత్తాసుగా మాట్లాడారు. తాను తప్ప ఇంకెవరూ మైనింగ్ వ్యాపారాలు చేసుకోకూడదన్న ఎంపీ దురాశ వల్ల నెల్లూరు జిల్లాలో దాదాపు 10 వేల మంది ఉపాధి కోల్పోతున్నారు.260 మందికిపైగా క్వార్ట్జ్æ ఎగుమతిదారులుంటే ఎంపీ వేమిరెడ్డికి చెందిన కంపెనీ ఒక్కటే వ్యాపారం చేయడం వెనుక మతలబు ఏంటి? ఎవరైనా ఎక్స్పోర్ట్ చేసుకుందామనిపోతే వారిని బెదిరిస్తున్నారు. ఎంపీ మైనింగ్ అక్రమాలపై నేను ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడిన తర్వాత కొంతమందిని పిలిపించుకుని మాట్లాడుకున్నారని తెలిసింది. లోకల్ మైన్లన్నీ ఎంపీ కంపెనీకి చేయాలట. ఎక్స్‌పోర్టర్ చైనా కంపెనీకి అమ్ముకుంటామని వాళ్లతో చెప్పారు. ఇదే జరిగితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎంటర్ కావడం తథ్యం. లీజు గడువు ముగిసిన వాటిలో అక్రమ మైనింగ్ ఎంపీ ప్రభాకర్‌రెడ్డి ఫ్యాక్టరీ పెడతానని ఇంకా శంకుస్థాపన చేయకుండానే వేల టన్నులు చైనాకి ఎక్స్‌పోర్టు చేస్తున్నాడు. 50 ఏళ్ల పరి్మషన్ గడువు ముగిసిపోయిన ఏడెనిమిది మైన్స్, పట్టా భూములను తన గుప్పెట్లో పెట్టుకుని అక్రమంగా మైనింగ్ చేస్తూ ఏడాదికి రూ.250 కోట్లు చొప్పున నాలుగేళ్లలో రూ.వెయ్యి కోట్లకు పైనే దోపిడీకి స్కెచ్ వేశాడు. ఇవి నిజంకాదని నిరూపిస్తే ఎంపీకి క్షమాపణలు చెప్పడానికీ సిద్ధం. మా హయాంలో పారదర్శకంగా మైనింగ్ గత ప్రభుత్వంలో ఎవరి మీద ఎలాంటి ఆంక్షలు విధించకుండా స్వేచ్ఛగా మైనింగ్ చేసుకోనిచ్చాం. టాప్ టెన్ ఎక్స్‌పోర్టర్ల లిస్ట్ చూస్తే అందులో టీడీపీ వాళ్లే ఎక్కువ మంది ఉంటారు. మా ప్రభుత్వ పారదర్శక విధానాలకు ఇంతకన్నా వేరే రుజువులు అవసరం లేదు. -
దోపిడీ కేసులో నిందితుల అరెస్ట్
నెల్లూరు(క్రైమ్): రైలు దిగి నడుచుకొని వెళ్తున్న వ్యక్తిని చంపుతామని కత్తితో బెదిరించి నగదును దోచుకెళ్లిన ఘటనలో నిందితులను సంతపేట పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించిన సమావేశంలో నిందితుల వివరాలను ఇన్స్పెక్టర్ దశరథరామారావు వెల్లడించారు. సంగం మండలం మర్రిపాడుకు చెందిన వీరరాఘవయ్య హైదరాబాద్‌లో ఉన్న కుమార్తెల వద్దకు ఇటీవల వెళ్లారు. ఈ క్రమంలో ఈ నెల 14న తెల్లవారుజామున రైల్లో నెల్లూరు చేరుకున్నారు. ఆత్మకూరు బస్టాండ్‌లో బస్సెక్కేందుకు గానూ నడుచుకుంటూ వెళ్తున్న ఆయన్ను సింహపురి హోటల్ సమీపంలో గుర్తుతెలియని ఆరుగురు వ్యక్తులు రెండు బైకుల్లో వచ్చి అడ్డుకున్నారు. చంపుతామని కత్తితో బెదిరించి అతని వద్ద ఉన్న రూ వెయ్యి నగదును దోచుకెళ్లారు. ఈ మేరకు పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశారు. ఇన్స్పెక్టర్ పర్యవేక్షణలో ఎస్సై బాలకృష్ణ తన సిబ్బందితో కలిసి సాంకేతికత ఆధారంగా ఓల్డ్ చెక్‌పోస్ట్‌కు చెందిన నవాజ్, నెల్లూరు రూరల్ మండలం నవలాకులతోటకు చెందిన షాహుల్, జాకీర్‌హుస్సేన్‌నగర్‌కు చెందిన అబ్దుల్ అజీస్ అలియాస్ అబ్దుల్ అజీజ్, నవాబుపేటలోని ఎఫ్‌సీఐ కాలనీకి చెందిన భాస్కర్, మరో ఇద్దరు బాలలను నిందితులుగా గుర్తించారు. వీరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ తరుణంలో నిందితులను సింహపురి బార్ అండ్ రెస్టారెంట్ సమీపంలో అరెస్ట్ చేశారు. -
చేపల వేటగాళ్ల పట్టివేత
సోమశిల: సోమశిల జలాశయ వెనుక భాగంలో లైసెన్స్ లేకుండా చేపల వేట సాగిస్తున్న మత్స్యకారులను జిల్లా మత్స్యశాఖ అధికారులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. వివరాలు.. జలాశయంలో చేపల వేటపై నిషేధం ఉన్నా, గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు వేట సాగించి వస్తుండగా మత్స్యశాఖ సంచాలకుడు శ్రీనివాసులు, వారి సిబ్బంది అదుపులోకి తీసుకొని చేపలను స్వాధీనం చేసుకున్నారు. వీటిని అధికారుల సమక్షంలో వేలం వేయగా, రూ.5500కు స్థానిక వ్యాపారులు దక్కించుకున్నారు. జలాశయంలో అనుమతుల్లేకుండా వేట సాగిస్తే కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. సోమశిల మత్స్యశాఖ అధికారి సురేష్, సహాయకుడు గోపీచంద్ పాల్గొన్నారు. ముగిసిన ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నెల్లూరు (టౌన్): ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు శనివారంతో ముగిశాయి. ప్రథమ సంవత్సర పరీక్షలకు 8681 మందికి గానూ 7965 మంది హాజరయ్యారు. ద్వితీయ సంవత్సర పరీక్షలకు 1085 మందికి గానూ 63 మంది గైర్హాజరయ్యారు. రైలు కిందపడి బలవన్మరణం నెల్లూరు(క్రైమ్): దానాపూర్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ కిందపడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్యకు పా ల్పడిన ఘటన వేదాయపాళెం – నెల్లూరు రైల్వేస్టేషన్ల మధ్యలో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. మృతుడు సుమారు 35 నుంచి 40 ఏళ్లలోపు వయస్సు కలిగి.. స్కై బ్లూ రంగు వైట్ చెక్స్ గల ఫుల్ హ్యాండ్స్ చొక్కా, గ్రే రంగు ప్యాంట్‌ను ధరించి ఉన్నారు. సమాచారం అందుకున్న రైల్వే ఎస్సై హరిచందన ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వద్ద ఎలాంటి వివరాలు లభ్యం కాలేదు. దీంతో జీజీహెచ్ మార్చురీకి తరలించారు. ఎస్సై కేసు దర్యాప్తు చేస్తున్నారు. కండలేరులో నీటి నిల్వ రాపూరు: కండలేరు జలాశయంలో శనివారానికి 43.60 టీఎంసీల నీరు నిల్వ ఉందని ఈఈ విజయకుమార్‌రెడ్డి తెలిపారు. సత్యసాయిగంగకు 1490, పిన్నేరుకు 20, లోలెవల్‌కు 60, హైలెవల్ కు 110, మొదటి బ్రాంచ్ కాలువకు 75 క్యూసె క్కులను విడుదల చేస్తున్నామని వివరించారు. రేపటిలోపు దరఖాస్తు చేసుకోండి నెల్లూరు (టౌన్): సమగ్రశిక్ష కార్యాలయంలో ఖాళీగా ఉన్న పోస్టుల్లో డిప్యుటేషన్‌పై పనిచేసేందుకు అర్హులైన ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని ఏపీసీ వెంకటసుబ్బయ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ 26 నాటికి 55 ఏళ్ల వయస్సు గల వారు అర్హులని చెప్పారు. ఆసక్తి గల ఉపాధ్యాయులు తమ దరఖాస్తులను సోమవారంలోపు అందజేయాలని కోరారు. -
రాబోయేది జగనన్న ప్రభుత్వమే
● మాజీ మంత్రి ప్రసన్నకుమార్‌రెడ్డి కోవూరు: రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో జగనన్న ప్రభుత్వం కొలువుదీరడం ఖాయమని మాజీ మంత్రి, పార్టీ పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలో పార్టీ కార్యాలయాన్ని శనివారం ప్రారంభించిన అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడారు. పహల్గామ్లో పర్యాటకులను పొట్టనబెట్టుకున్న పాకిస్థాన్ ఉగ్రవాదులపై మన దేశ ఆర్మీ దాడులు జరిపి వారిని మట్టుబెట్టిందని చెప్పారు. ఉగ్రదాడుల్లో మరణించిన సైనికుల కుటుంబాలకు ప్రభుత్వాలు రూ.ఐదు కోట్లనైనా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అసువులుబాసిన సత్యసాయి జిల్లాకు చెందిన జవాన్‌కు రూ.25 లక్షలను తమ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి ఇచ్చిన అంశాన్ని గుర్తుచేశారు. ప్రపంచంలో పాకిస్థాన్ అనేదే లేకుండా చేయగల సత్తా మనకు ఉందని చెప్పారు. దేశానికి ప్రధానిగా మోదీ.. రాష్ట్రానికి సీఎంగా జగన్మోహన్రెడ్డి 20 ఏళ్లు ఉండాలని కాంక్షించారు. డీసీఎమ్మెస్ చైర్మన్ వీరి చలపతి, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, ఏపీఎల్డీఏ చైర్మన్ గొల్లపల్లి విజయకుమార్, జొన్నవాడ దేవస్థాన చైర్మన్ మావులూరు శ్రీనివాసులురెడ్డి, మండల ఉపాధ్యక్షుడు నరసింహులురెడ్డి, మండల కన్వీనర్లు అనూప్‌రెడ్డి, సతీష్‌రెడ్డి, షాహుల్, నవీన్‌కుమార్‌రెడ్డి, శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు . -
నాణ్యమైన వైద్యమందేలా కృషి
నెల్లూరు(అర్బన్): నగరంలోని ప్రభుత్వ పెద్దాస్పత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్యాన్ని అందించేందుకు డాక్టర్లు, సిబ్బంది కృషి చేయాలని, దీనికి తన వంతు సహాయ, సహకారాలను అందిస్తానని కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. ఆస్పత్రి నిధులతో పాటు దాతల సహకారంతో పెద్దాస్పత్రిలో ఆధునికీకరించిన ఫిజియోథెరపీ విభాగాన్ని శనివారం ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. దాతల సహకారం మరువలేనిదన్నారు. ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సభ్యులను కలుపుకొని రోగులకు మంచి వసతులను కల్పించాలని సూచించారు. రోగుల కోసం దాత లు దువ్వూరి సాయికృష్ణ, గైనకాలజీ హెచ్ఓడీ గీతాదేవి, డాక్టర్ హాజిలియాన్, జేవీఆర్ షాపింగ్ మా ల్ నుంచి మురళి, డాక్టర్ అశోక్, ల్యాబ్ టెక్నీషియన్ సాయితేజ, నోవా బ్లడ్‌బ్యాంక్ నుంచి అనిల్‌కుమార్, బయోమెడికల్ ఇంజినీర్ సునీల్‌కుమార్‌రెడ్డి, డాక్టర్ దువ్వూరు నారాయణరెడ్డి తదితరులు తమ వంతుగా ఫిజియోథెరపీ యంత్రాలను అందజేశారు. వార్డుల్లో తనిఖీ ఆస్పత్రిలోని ప్రసూతి వార్డు, చిన్నపిల్లల విభాగం, ఏఆర్టీ సెంటర్ తదితర వార్డులను కలెక్టర్ తనిఖీ చేశారు. వైద్యసేవలపై రోగులతో మాట్లాడారు. ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం పొందిన రోగులతో పాటు, ఓపీ వివరాలను పరిశీలించారు. పేయింగ్ రూమ్స్‌ను వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. గైనకాలజీ విభాగం వద్ద మొక్కలు నాటారు. డిప్యూటీ కలెక్టర్ మహేశ్వరరెడ్డి, పెద్దాస్పత్రి సూపరింటెండెంట్ నరేంద్ర, డిప్యూటీ సూపరింటెండెంట్ మస్తాన్‌బాషా, ఏఓ కళారాణి, హెచ్‌డీఎస్ కమిటీ కో ఆర్డినేటర్ మడపర్తి శ్రీనివాసులు, సభ్యులు బ్రహ్మానందరెడ్డి, మొగరాల సురేష్, మల్లికార్జున, అబీదా సుల్తానా తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ఆనంద్ పెద్దాస్పత్రిలో ఫిజియోథెరపీ విభాగ ప్రారంభం -
ప్రతిష్టాత్మకంగా ‘స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర’
● కలెక్టర్ ఆనంద్ నెల్లూరు (బారకాసు): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి నెల మూడో శనివారం చేపడుతున్న స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, పర్యావరణ సంరక్షణ కోసం మొక్కల పెంపకం ఆవశ్యకతను గుర్తించాలని కలెక్టర్ ఆనంద్ పిలుపునిచ్చారు. నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో అన్ని డివిజన్ల పరిధిలో శనివారం ‘బీట్ ది హీట్’ అంశంపై పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేలా మొక్కలను నాటి సంరక్షించే చర్యలను చేపట్టారు. స్థానిక 27వ డివిజన్ రిత్విక్ ఎన్ క్లేవ్ పార్కులో కలెక్టర్ ఆనంద్, కమిషనర్ నందన్, టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి తమ మాతృమూర్తుల పేరిట మొక్కలను నాటారు. అనంతరం కలెక్టర్ అందరితో స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు. వారు మాట్లాడుతూ ప్రతి ఒక్క రూ మొక్కలను విరివిగా నాటి సంరక్షించాలని సూచించారు. స్వయం సహాయక బృందాలు పర్యావరణ పరిరక్షణ, పర్యావరణ హితమైన వస్తువుల ఉత్పత్తి, వినియోగంపై మహిళలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. మహిళలందరూ గృహాలపైన చిన్నచిన్న మొక్కలతో రూఫ్ టాప్ గార్డెన్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. నగర వ్యాప్తంగా పచ్చదనాన్ని పరిరక్షించేందుకు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలోని 64 పార్కుల్లో వాకర్స్ అసోసియేషన్ భాగస్వామ్యంలో స్వచ్ఛ సర్వేక్షణ్ చేపడుతున్నామని కమిషనర్ నందన్ తెలిపారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మురహరి, నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం ఎస్ఈ రామ్మోహన్రావు, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ చైతన్య, టౌన్ ప్లానింగ్ సీపీ హిమబిందు, ఉద్యాన శాఖ ఏడీ ప్రదీప్‌కుమార్, స్థానిక పర్యావరణవేత్త షేక్ ఖాసిం తదితరులు పాల్గొన్నారు. -
పరాకాష్టకు చేరిన కూటమి దుర్మార్గం
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): కూటమి ప్రభుత్వ దుర్మార్గాలు పరాకాష్టకు చేరాయని, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి అక్రమ అరెస్ట్‌లతో ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోయిందని ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి దుయ్యబట్టారు. నెల్లూరులో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజాపాలన, అభివృద్ధి పనులను గాలికి వదిలేసి, వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందన్నారు. దాదాపు 11 నెలల పాలనలో ప్రజలు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఎవరు కూడా కూటమి ప్రభుత్వ విధానాలపై సంతృప్తిగా లేరన్నారు. ఎక్కడా అభివృద్ధి పనులు జరగడం లేదన్నారు. ఒక్క ఏడాదిలోనే రూ.1.10 లక్షల కోట్ల అప్పులు చేశారని, ఇలా అప్పు చేసిన సొమ్మునంతా కాంట్రాక్టర్లతో దొంగ బిల్లులు పెట్టించి కమీషన్లు దండుకుంటుందని ఆరోపించారు. రాష్ట్రం అప్పుల ఊబిలోకి కూరుకుపోతుందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని ప్రశ్నించిన వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించడం, వారిపై దౌర్జన్యాలకు దిగడం పరిపాటిగా మారిందన్నారు. పారదర్శక పాలనపై ఆరోపణలు గత ప్రభుత్వంలో అత్యంత పారదర్శకంగా జరిగిన లిక్కర్ అమ్మకాలను తప్పు పడుతూ స్కామ్ అంటూ ఎవరో ఒకరితో అబద్ధపు స్టేట్మెంట్ ఇప్పించి వాటి ఆధారంగా సీనియర్ ఐఏఎస్ అధికారిగా వ్యవహరించిన ధనుంజయరెడ్డి, గత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఓఎస్డీగా వ్యవహరించిన కృష్ణమోహన్‌రెడ్డిలను అక్రమంగా అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపడం అత్యంత దారుణమన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో లిక్కర్ అమ్మకాల విషయంలో ప్రతి బాటిల్ స్కాన్ చేసి అత్యంత పారదర్శకంగా ప్రతి రూపాయి ప్రభుత్వ ఖజానాకు చేరేలా అమ్మకాలు జరిగాయన్నారు. అంతకు ముందుకు, ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో వీధికో బెల్టు షాపు, మద్యం షాపులు వద్ద పర్మిట్ రూంలు ఏర్పాటు చేసి 24 గంటలు మద్యం అమ్మకాలు సాగించారని తెలిపారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత బెల్ట్ షాపులను పూర్తిగా రద్దు చేసి ప్రభుత్వ మద్యం దుకాణాలను తీసుకొచ్చి నిర్దిష్ట సమయం ప్రకారమే మద్యం అమ్మకాలు సాగించామని గుర్తు చేశారు. ఇలా అత్యంత పారదర్శకంగా మద్యం అమ్మకాలను గత ప్రభుత్వం సాగిస్తే ఈ రోజు దానికి మద్యం స్కాం అని పేరు పెట్టడం దుర్మార్గమన్నారు. రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి అక్రమ అరెస్ట్‌లతో ప్రజాస్వామ్యం ఖూనీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి -
నాసిరకం.. రంగుల మయం
● మిరప కాయల్లో ఎరుపు రంగు రావడానికి సూడాన్ రంగులు వాడుతుంటారు. పసుపులో మెటానిల్ ఎల్లో అనే పదార్థాన్ని కలుపుతారు. వీటిని వంటలో వినియోగిస్తే క్యాన్సర్ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ఆహారాన్ని వండే సమయంలో వాడిన నూనెనే మళ్లీ మళ్లీ కాచి వినియోగిస్తున్నారు. దీని వల్ల క్యాన్సర్, అల్సర్లు వచ్చే ప్రమాద మున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. హోటళ్లల్లో తయారయ్యే ఆహార పదార్థాలు నాసిరకం.. రంగుల మయంగా ఉంటాయి. ● పశువుల ఎముకలను సేకరించి వాటిని బట్టీలో అత్యధిక ఉష్ణోగ్రతపై మరిగించి ద్రావణాన్ని తీస్తున్నారు. ఆ ద్రావణాన్ని సాధారణ నూనెల్లో కలిపి విక్రయిస్తున్నారు. దీని వల్ల జీర్ణకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. -
పెద్దాస్పత్రిపై విజిలెన్స్
నెల్లూరు(అర్బన్): నగరంలోని సర్వజన ఆస్పత్రిలో పారిశుధ్య విభాగంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, కార్మికులను దోచుకుంటున్న తీరుపై విజిలెన్స్ అధికారులు శనివారం ఆరాతీశారని విశ్వసనీయ సమాచారం. ఆస్పత్రిలో పారిశుధ్య కార్మికులు, సెక్యూర్టీ సిబ్బందికి కార్మిక చట్టాన్ని వర్తింపజేయకపోవడం, జీతాల్లో కోత విధించడం, డబ్బులు తీసుకొని ఉద్యోగాలివ్వడం, కొన్ని నెలల పాటు జీతాలు చెల్లించని అంశాలపై సాక్షిలో కథనాలు ప్రచురితం కావడంతో ఇంటెలిజెన్స్ అధికారులు రహస్యంగా సమాచారం సేకరిస్తున్నారు. నివేదికలనూ సిద్ధం చేస్తున్నారు. బాధను వెళ్లగక్కి.. తమను ఎలా ఇబ్బంది పెడుతున్నారనే అంశాలను వివరించేందుకు ఒక్కొక్కరూ ముందుకొచ్చారు. యు నైటెడ్ మెడికల్, హెల్త్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు నరమాల సతీష్‌ను కలిసి తమ బాధల ను చెప్పుకొన్నారు. తమను ఉద్యోగం నుంచి తీసేస్తార నే భయంతో ఇంతకాలం నోరు విప్పలేదని తెలిపారు. రూ.35 వేల లంచమిచ్చి పనిలో చేరా.. రెండేళ్ల క్రితం రూ.35 వేల లంచమిస్తే పనిలో పెట్టుకున్నారని పారిశుధ్య కార్మికురాలు రత్నకుమారి చెప్పారు. మేనేజర్ ముందు ఓ మహిళా సూపర్వైజర్ చేతికిచ్చానని, ఆపై నాలుగు నెలల పాటు ఉచితంగా పనిచేయించుకున్నారని తెలిపారు. జీతంపై ప్రశ్నిస్తే మెడికల్ కళాశాల నుంచి కష్టంగా ఉండే వార్డుకు మార్చారని వివరించారు. తర్వాత ఇస్తున్నా, అప్పుడప్పుడూ కొంత మినహాయిస్తున్నారని ఆరోపించారు. తాజాగా మార్చి, ఏప్రిల్‌కు కలిపి రూ.26 వేల వరకు జీతం రావాల్సి ఉండగా, రూ.19,800నే ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. అల్లూరు రోడ్డుకు చెందిన తన స్నేహితురాలు శైలను పనిలో తొమ్మిది నెలల క్రితం చేర్పించానని, ఆమె నుంచి సైతం రూ.35 వేల లంచాన్ని వసూలు చేశారని తెలిపారు. ఆమెకూ మొదటి మూడు నెలలు జీతమివ్వలేదన్నారు. యూనిఫారాన్ని ఏజెన్సీ ఇవ్వాల్సి ఉండగా, తమ వద్ద నుంచి రూ.రెండు వేల చొప్పున వసూలు చేశారని తెలిపారు. కొద్ది రోజులకే జీతాన్ని తగ్గించారు బిడ్డకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో నారాయణ ఆస్పత్రిలో ఐసీయూలో వైద్యం చేయించుకుంటూ మార్చిలో ఆరు రోజులే పనిచేశా. ఆ నెల్లో చేసిన పనిదినాలకు గానూ రూ.1350 రావాల్సి ఉండగా, రూ.800నే ఖాతాలో జమ చేశారు. ఏప్రిల్‌లో 13 రోజులు పనిచేస్తే, రూ.5850 జీతానికి గానూ రూ.రెండు వేలనే ఇచ్చి నా కష్టాన్ని దోచుకున్నారు. – కామేశ్వరమ్మ, పారిశుధ్య కార్మికురాలు సెలవు పెట్టకపోయినా.. కోత విధించారు ఏడాదికి ఒకటో.. రెండో సెలవులే పెడతా. పూర్తిగా పని చేసినా, మార్చిలో రూ.తొమ్మిది వేలు, ఏప్రిల్‌లో రూ.పది వేలనే జమ చేశారు. మిగిలిన మొత్తాన్ని ఏజెన్సీ మేనేజర్ మింగేశారు. ఇంత జరుగుతున్నా, పెద్దాస్పత్రి సూపరింటెండెంట్ పట్టించుకోవడంలేదు. – లతమ్మ, కార్మికురాలు ఏజెన్సీ మోసాలపై ఆరా జీతాల్లో కోత విధిస్తున్నారంటూ ఫిర్యాదులు -
కనుల పండువగా శ్రీవారి కల్యాణం
● భక్తులతో కిక్కిరిసిన పెంచలకోన రాపూరు: మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పెంచలకోన శనివారం భక్తులతో కిక్కిరిసింది, బ్రహ్మోత్సవాల అనంతరం వచ్చే మొదటి శనివారం కావడంతో రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు పెనుశిల లక్ష్మీనరసింహాస్వామి, ఆదిలక్ష్మీదేవి, ఆంజనేయస్వామిని దర్శించుకుని మొక్కలు తీర్చుకున్నారు. ఉదయం 4 గంటలకు అభిషేకం, 5 గంటలకు సుప్రభాతం, 6 గంటల పూలంగి సేవ నిర్వహించారు. 10 గంటలకు స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను నిత్యకల్యాణ మండపంలో కొలువు దీర్చి వివిధ రకాల ఆభరణాలు, పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి వేద పండితుల మంత్రోచ్ఛరణలతో కల్యాణం శాస్త్రోక్తంగా చేపట్టారు. రాత్రి 7 గంటలకు ఊంజల్ సేవ నిర్వహించారు. స్వామి అమ్మవార్లను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మైనింగ్ కేసులో విచారణకు హాజరు నెల్లూరు (క్రైమ్): రుస్తుం మైనింగ్ కేసులో విచారణ నిమిత్తం వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మందల వెంకటశేషయ్య, విరువూరు నేత బచ్చల సురేష్‌కుమార్‌రెడ్డి శనివారం నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో హాజరయ్యారు. డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు అందుబాటులో లేకపోవడంతో ఆయన వచ్చిన తర్వాత మరోమారు పిలుస్తామని కార్యాలయ సిబ్బంది వెంకట శేషయ్య, సురేష్కుమార్రెడ్డిలకు తెలియజేయడంతో వారు వెనుదిరిగారు. ఉరుములు మెరుపులతో వర్షం ఉదయగిరి రూరల్: ఉదయగిరితోపాటు మండలంలోని పలు గ్రామాల్లో శనివారం సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రతకు ప్రజలు తల్లడిల్లిపోయారు. ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులు గాలులతో కూడిన వర్షం పడింది. దీంతో వాతావరణం చల్లబడింది. మేఘాలు ఉదయగిరి దుర్గాన్ని కమ్మేశాయి. ఆ దృశ్యాన్ని పలువు రు ఆస్వాదించారు. రోడ్లపై వర్షపు నీరు మురుగునీరు ఏకమై ప్రవహించడంతో వాహన చోదకులు, పాదచారులు ఇబ్బందులు పడ్డారు. కూటమి ప్రభుత్వానికి మా బాధలు పట్టవా? నెల్లూరు (అర్బన్): ఇరవై రోజులుగా సమ్మె చేస్తూ తమ సమస్యలు తీర్చాలని వేడుకుంటున్నా.. కూటమి ప్రభుత్వం తమ బాధలు పట్టించుకోకపోవడం దారుణమని సీహెచ్‌ఓల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు భానుమహేష్ ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక డీఎంహెచ్ఓ కార్యాలయం వద్ద నిరసన దీక్షల్లో శనివారం ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఉద్యోగులను నెత్తిన పెట్టుకుంటామని మాట్లాడిన అధికార పార్టీ నాయకులు అధికారంలోకి వచ్చాక కనీసం తమ బాధలు చెప్పుకునేందుకు కూడా అవకాశం ఇవ్వడం లేదని ఆవేదన చెందారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి తమ న్యాయమైన డిమాండ్లు తీర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం కో ఆర్డినేటర్ ఆదిల్, కార్యదర్శి రుబికా, చంద్రకళ, స్వాతి, అనుపమ తదితరులు పాల్గొన్నారు. -
‘పాలనా వైఫల్యాన్ని ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెడుతున్నారు’
నెల్లూరు: పాలనా వైఫల్యాన్ని ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెడుతున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. హామీల అమలును గాలికొదిలేసిన సీఎం చంద్రబాబు నాయుడు.. మద్యాన్ని మాత్రాన్ని ఏరులై పారిస్తున్నారని మండిపడ్డారు. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన చంద్రశేఖర్ రెడ్డి.. ‘పాలనా వైఫల్యాన్ని ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెడుతున్నారు. ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిల అరెస్ట్ దుర్మార్గం. గత ప్రభుత్వంలో పారదర్శకంగా జరిగిన మద్యం విషయాన్ని లిక్కర్ స్కాంగా మార్చారు. జరగని లిక్కర్ స్కామ్‌ని జరిగినట్లు దుష్ప్రచారం చేస్తున్నారు. వైఎస్సార్ సీపీ నేతలని ఇబ్బంది పెట్టాలనే లక్ష్యంతో ఈ కేసులో నేతలతో పాటు సీనియర్ అధికారులకు ఇరికించారు.చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు’ అని ధ్వజమెత్తారు చంద్రశేఖర్ రెడ్డి. -
అదుపులో ఉంచాలంటే..
● ఒత్తిడితో కూడిన జీవనం, విశ్రాంతి లేమి కారణాలు ● జిల్లాలో 5 లక్షల మంది వరకు రోగులు ● అవగాహన, మంచి ఆహార అలవాట్లతో చెక్ నేడు వరల్డ్ హైపర్‌టెన్షన్ డే నెల్లూరు(అర్బన్): బీపీ (అధిక రక్తపోటు).. తీవ్ర ఒత్తిడితో కూడిన జీవన విధానం, నిద్రలేమి, జంక్ ఫుడ్, జన్యుపరమైన కారణాలతో ఇది వస్తుంది. ప్రస్తుతం అనేకమంది దీని వల్ల బాధపడుతున్నారు. వైద్యపరిభాషలో హైపర్‌టెన్షన్‌గా పిలిచే ఈ జబ్బును నిర్లక్ష్యం చేస్తే రక్తనాళాలు చిట్లిపోయే ప్రమాదం ఉంది. గుండెపోటు రావొచ్చు. బీపీని నియంత్రణలో ఉంచుకోకుంటే ప్రాణాంతకంగా మారుతుంది. అనేకమందికి బీపీ ఉన్న విషయం కూడా తెలియదు. ఈలోపు ఎక్కువై ఒక్కో దఫా ప్రాణాల మీదకు వస్తుంది. అందుకే దీనిని సైలెంట్ కిల్లర్ అని కూడా పిలుస్తుంటారు. ఈ పరిస్థితిని గమనించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి సంవత్సరం మేనెల 17వ తేదీని వరల్డ్ హైపర్‌టెన్షన్ డేగా ప్రకటించింది. అందులో భాగంగా శనివారం జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో బీపీపై అవగాహన సదస్సులు, ర్యాలీలు నిర్వహించనున్నారు. సంఖ్య పెరుగుతూ.. జిల్లాలో బీపీ రోగుల సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతోంది. ఒకప్పుడు 5 శాతంగా ఉంటే నేడు సుమారు 20 శాతానికి చేరింది. వైద్యారోగ్య శాఖ 2023లో పీహెచ్‌సీల పరిధిలో సర్వే చేపట్టి స్క్రీనింగ్ చేయగా 1,01,172 మంది బీపీ బారిన పడినట్టు తేలింది. 2024లో స్క్రీనింగ్ చేయగా 80 వేల మంది ఉన్నట్లు వైద్యశాఖ లెక్క చెప్పింది. సాధారణంగా రోగులు ప్రతి సంవత్సరం పెరుగుతున్నారు. అయితే అధికారులు తగ్గినట్టు చూపడంపై విస్మయం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే జిల్లాలోని ప్రైవేట్, కార్పొరేట్, కందుకూరు, కావలి ఏరియా హాస్పిటళ్లు, ఆత్మకూరు జిల్లా ఆస్పత్రితోపాటు 10 సీహెచ్‌సీల పరిధిలో మరో 4 లక్షల మందిపై వరకు బీపీ రోగులు వస్తున్నారు. అంటే జిల్లా జనాభాలో సుమారు 20 శాతం రక్తపోటుతో బాధపడుతున్నారు. కారణాలెన్నో.. ప్రస్తుతం అనేకమందిది ఉరుకులు, పరుగుల జీవితం. వ్యాపారస్తులు, ఉద్యోగులు, మార్కెటింగ్ చేసే వారు, ప్రైవేట్ ఉద్యోగులు టార్గెట్లు చేరుకోవడానికి పనిఒత్తిడితోనే విధులు నిర్వర్తించాల్సి ఉంది. సరైన నిద్ర లేకపోయినా కూడా ఆ ప్రభావం శరీరంపై పడుతోంది. అధిక ఉప్పు, తగిన శారీరక శ్రమ లేకపోవడం, ఊబకాయం వంటి సమస్యలు బీపీకి కారణంగా ఉన్నాయి. అధిక ఉప్పుతో కూడిన ఆహారం వల్ల కూడా రక్తపోటు బారిన పడుతున్నారు. లక్షణాలను గుర్తించాలి అధికంగా బీపీ ఉన్నవారికి తలతిరిగినట్టు ఉంటుంది. తీవ్రమైన తలనొప్పి వస్తుంది. ఒక్కోదఫా వాంతులు, తల తిరిగిపోవడం, అలసట, వికారం లాంటి లక్షణాలుంటాయి. బీపీ ఎక్కువైతే కంటిలోని రెటీనాకు రక్త సరఫరా తగ్గి చూపు కోల్పోయే ప్రమాదం ఉంది. ఛాతిలో నొప్పి వచ్చి గుండెపోటుకు గురయ్యే అవకాశాలు ఎక్కువ. రక్తపోటు ఎక్కువగా ఉండేవారికి గురక అధికంగా ఉంటుంది. రాత్రి వేళ తరచూ తలనొప్పి వస్తుంది. కొంతమందిలో ముక్కు నుంచి రక్తం కారుతుంది. అధిక బరువు లేకుండా చూసుకోవాలి. ఆహారంలో రోజుకు 5 గ్రాముల ఉప్పు కన్నా ఎక్కువ తీసుకోరాదు. గుట్కా, మద్యం, సిగరెట్, బీడీ, చుట్ట అలవాట్లు మానుకోవాలి. రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. 30 ఏళ్ల వయసు నిండిన వారు క్రమం తప్పకుండా బీపీని చెక్ చేయించుకోవాలి. రక్తపోటును నియంత్రణలో ఉంచుకోని వారిలో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. మెదడులో రక్తనాళాలు చిట్లుతాయి. పక్షవాతం బారిన పడొచ్చు. కిడ్నీలు దెబ్బతింటాయి. లివర్ పాడవుతుంది. మెదడుపై బీపీ ప్రభావం వల్ల జ్ఞాపకశక్తి తగ్గిపోయే ప్రమాదం ఉంది.అవగాహన పెంచుకోవాలి అధిక రక్తపోటు గురించి ప్రజలు అవగాహన పెంచుకుని తగిన జాగ్రత్తలు పాటించాలి. బీపీని నియంత్రణలో ఉంచుకుంటే ఆరోగ్యపరంగా ఇబ్బందులుండవు. సక్రమంగా మందులు వాడకపోయినా ప్రమాదమే. యోగా, వ్యాయామం లాంటివి చేయాలి. ఒత్తిడిని తగ్గించుకోవడం ద్వారా పలు రకాల అనారోగ్య సమస్యల నుంచి కాపాడుకోవచ్చు. బీపీ ఉన్న వారు ప్రతినెలా చెక్ చేయించుకోవాలి. – డాక్టర్ ఎంవీ రమణయ్య, రామచంద్రారెడ్డి ప్రజా వైద్యశాల -
పక్కాగా భూముల రీసర్వే
● సైదాపురం మండలంలో కలెక్టర్ పర్యటన ● వైద్య సిబ్బంది పనితీరుపై అసహనం సైదాపురం: జిల్లాలో భూముల రీసర్వేను పక్కాగా నిర్వహిస్తున్నామని కలెక్టర్ ఆనంద్ తెలిపారు. సైదాపురం మండలంలోని తిప్పిరెడ్డిపల్లి గ్రామంలో జరుగుతున్న రీసర్వే తీరును శుక్రవారం ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. ముందుగా రికార్డులను చూశారు. రైతులతో మాట్లాడారు. సర్వే చేసే గ్రామాల్లో రెగ్యులర్ వీఆర్వోలను నియమించాలని తహసీల్దార్ రమాదేవిని ఆదేశించారు. సర్వేపై పలు ప్రశ్నలు వేశారు. గ్రామంలో మిగులు భూములున్నాయా?, వాటి స్థితిగతులు ఏంటని సర్వేయర్ వెంకటేశ్వర్లును ప్రశ్నించారు. 255 ఎకరాల మేత పోరంబోకు భూమి ఉందని చెప్పగా కలెక్టర్ స్పందించారు. భూమి లేని నిరుపేదలకు రెండెకరాల చొప్పున పంపిణీకి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. అసైన్మెంట్ కమిటీ ద్వారా పేదలకు ఆ భూములను కేటాయించడం జరుగుతుందన్నారు. సదరు భూములను కొందరు ఆక్రమించారని కొందరు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వివిధ శాఖలకు చెందిన మండల స్థాయి అధికారులతో ఆనంద్ సమీక్షించారు. ● కలెక్టర్ సైదాపురంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా పరిశీలించారు. మందుల స్టాక్ రిజిస్టర్‌ను పరిశీలించారు. మందులు పంపిణీ చేయని వైనం వెలుగులోకి రావడంతో అసహనం వ్యక్తం చేశారు. అలాగే రోగుల గదిలో నీళ్లు రాకపోవడం ఏమిటని ప్రశ్నించారు. -
పాఠశాల స్థాయి, క్యాడర్ స్ట్రెంథ్‌ను బహిర్గతం చేయాలి
సురేంద్రరెడ్డి, జిల్లా అధ్యక్షుడు, ఏపీటీఎఫ్ ●పాఠశాలల పునర్ వ్యవస్థీకరణ వివరాలు బహిర్గతం చేయాలి. క్యాడర్ స్ట్రెంథ్, పాఠశాలకు ఎన్ని పోస్టులు కేటాయించారో చెప్పాలి. వివరాలను గోప్యంగా ఉంచడం తగదు. అప్పీల్ చేసుకునేందుకు సమయం కూడా ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే కుదరదు. ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులు కూడా ఇష్టారాజ్యంగా కేటాయించారు. ఏమైనా అడిగితే యాప్ నిలిపివేశారని చెబుతున్నారు. ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి పోస్టులను కేటాయించాలి. -
ఫేక్ విద్యార్హత సర్టిఫికెట్లతో మోసం
పెద్దాస్పత్రి, మెడికల్ కళాశాలలో 223 మంది పారిశుద్ధ్య కార్మికులు, 137 మంది సెక్యూరిటీ సిబ్బంది పని చేస్తున్నారు. వీరిలో పలువురికి పీఎఫ్ తమ ఖాతాల్లో జమ కావడం లేదు. ఎందుకు జమ కావడం లేదని ప్రశ్నిస్తే మీకు పుట్టిన తేదీ లేదు. ఏదైనా చదువుకున్న సర్టిఫికెట్, పాస్‌పోర్టు లాంటివి ఇస్తే.. అప్పుడు పీఎఫ్ జమ చేస్తామని ఏజెన్సీ మేనేజర్ స్పష్టం చేశాడు. అవి సరి చేసేందుకు అంటూ కొంత మంది దగ్గర రూ.13 వేలు, మరి కొంత మంది దగ్గర రూ.15.వేలు వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. సర్టిఫికెట్ అవసరమైన వారికి ప్రకాశం జిల్లా దొనకొండ జెడ్పీ హైస్కూల్లో చదివినట్లు అక్కడి హెడ్మాస్టర్ సంతకాలను ఫోర్జరీ చేసి ఫేక్ సర్టిఫికెట్లు సృష్టించి కార్మికులకు ఇచ్చారు. ఇది జరిగి ఏడాదైనాప్పటికీ ఇప్పటికీ కార్మికుల ఖాతాల్లో పీఎఫ్ నగదు జమ లేదు. ఇలా తమ వద్ద డబ్బులు వసూలు చేసి మోసం చేశారంటూ ఆస్పత్రి అడ్మినిస్ట్రేషన్ అధికారి, డిప్యూటీ కలెక్టర్ మహేశ్వరరెడ్డికి సురేఖ, కృష్ణవేణి, అమల అనే మహిళలు ఫిర్యాదు చేశారు. కార్మికులకు ఇచ్చిన ఫేక్ విద్యా సర్టిఫికెట్లు -
అక్రమ ఇసుక, మైనింగ్‌ను అరికట్టాలి
నెల్లూరు (అర్బన్): కూటమి ప్రభుత్వంలో జిల్లాలో అక్రమంగా సాగుతున్న మైనింగ్, ఇసుక తవ్వకాలను అరికట్టి ప్రజాధనాన్ని కాపాడాలని ఎమ్మెల్సీలు పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, మేరిగ మురళిధర్, వెంకటగిరి సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టర్ ఆనంద్‌ను కలెక్టరేట్లో కలిసి వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ సైదాపురం మండలంలో అక్రమ మైనింగ్ విచ్చలవిడిగా సాగుతుందన్నారు. ప్రభుత్వ ఆస్తిని దౌర్జన్యంగా కొల్లగొట్టుతున్నారన్నారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదన్నారు. బినామి పేర్లతో అవినీతికి పాల్పడుతున్నారన్నారు. అలాంటి వారు ఎంత పెద్ద వారైనా వదిలి పెట్టే ప్రసక్తే లేదన్నారు. కలెక్టర్‌గా జోక్యం చేసుకుని సమగ్ర విచారణ జరిపించి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అక్రమాలు ఇలాగే కొనసాగితే కేంద్ర ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం గద్దెనెక్కిన రోజు నుంచే జిల్లాలోని ఇసుక, క్వార్ట్ ్జ, సిలికాలను టీడీపీ నేతలు యథేచ్ఛగా దోచుకుంటున్నారన్నారు. ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ సోమశిల దిగువ నుంచి ఇందుకూరుపేట వరకు పెన్నానదిలో అడుగడుగునా ఇసుక రీచ్‌ల నుంచి అక్రమంగా అర్ధరాత్రి తరలిస్తున్నారన్నారు. వీటిని నియంత్రించేందుకు ఎవరైనా ప్రయత్నం చేస్తే గంజాయి బ్యాచ్‌లు, రౌడీలు, గూండాలతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. నగరంలో కూడా టీడీపీ నాయకులు అసాంఘిక శక్తులను విచ్చల విడిగా పెంచి పోషిస్తున్నారన్నారు. రెండు నెలల్లోనే జరిగిన 20 హత్యలే ఇందుకు నిదర్శనమని విమర్శించారు. గంజాయి, మద్యం మత్తులో ఈ దారుణాలు జరుగుతున్నాయన్నారు. హంతకులకు అండగా అధికార పార్టీ నాయకులు నిలబడడం సిగ్గు చేటన్నారు. పోలీసు శాఖ సైతం ఏమి చేయలేక చేతులెత్తేసిందని విమర్శించారు. జిల్లాలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆరోపించారు. రాబోయే రోజుల్లో టీడీపీ చేసే అక్రమాలపై పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు బనాయించినా భయపడేది లేదని, సామాన్యుల పక్షాన వైఎస్సార్సీపీ నిలబడి పోరాటం చేస్తోందని స్పష్టం చేశారు. కేసులకు భయపడేది లేదు రౌడీలను, గూండాలను పెంచి పోషిస్తున్న అధికార పార్టీ నేతలు జిల్లాలో శాంతిభద్రతలు క్షీణించాయి సరిదిద్దకపోతే ఉద్యమిస్తాం ఎమ్మెల్సీలు పర్వతరెడ్డి, మేరిగ, వెంకటగిరి ఇన్చార్జి నేదురుమల్లి -
వృద్ధుడి అనుమానాస్పద మృతి
సీతారామపురం: స్థానిక ఆరు లేన్ల జాతీయ రహదారి సమీపాన నల్లమేకల వెంగయ్య (63) అనే వృద్ధుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. శుక్రవారం పోలీసుల వివరాలు వెల్లడించారు. మండలంలోని గుండుపల్లి గ్రామానికి చెందిన వెంగయ్యకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. రెండు రోజుల క్రితం ఆయన కట్టెల కోసం అడవికి వెళ్లి తిరిగొస్తుండగా మార్గమధ్యలో దారి తప్పి జాతీయ రహదారి వద్ద నుంచి వస్తూ చనిపోయాడు. మృతదేహానికి కూత వేటు దూరంలో కట్టెలమోపు, గొడ్డలి, ఇనుపరాడ్ ఉన్నాయి. మృతుడి తల, శరీరంపై గాయాలు ఉన్నాయి. దీంతో వెంగయ్య మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమో దు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉదయగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కంట్లో కారం చల్లి.. ● మహిళ మెడలో బంగారు గొలుసు చోరీ వెంకటాచలం: ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళ కంట్లో కారం చల్లి ఆమె మెడలోని బంగారు గొలుసును గుర్తుతెలియని వ్యక్తి చోరీ చేసిన ఘటన వెంకటాచలం పంచాయతీ పరిధిలోని వడ్డీపాళెంలో శుక్రవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. వడ్డీపాళేనికి చెందిన ఉప్పు రత్నమ్మ తన నివాసంలో ఉండగా గుర్తుతెలియని వ్యక్తి వచ్చి ఆమె కంట్లో కారం చల్లాడు. మెడలో ఉన్న మూడు సవర్ల బంగారు గొలుసును లాక్కొని పరారయ్యాడు. బాధితురాలు వెంకటాచలం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్య కేసులో విచారణ వేగవంతం బుచ్చిరెడ్డిపాళెం రూరల్: మండలంలోని గోపాలపురంలో జరిగిన రైతు మల్లికార్జునరెడ్డి హత్య కేసులో విచారణను పోలీసులు వేగవంతం చేశారు. ఘటనా స్థలాన్ని శుక్రవారం నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబ సభ్యులతో మాట్లాడి హత్యకు గల కారణాలను తెలుసుకున్నామన్నారు. గ్రామస్తులతో కూడా మాట్లాడినట్లు చెప్పారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని వెల్లడించారు. ఆయన వెంట బుచ్చిరెడ్డిపాళెం ఎస్సై సంతోష్‌రెడ్డి, సిబ్బంది ఉన్నారు. కోన అడవుల్లో అస్తిపంజరం రాపూరు: మండలంలోని పెంచలకోనలో వాటర్ ఫాల్స్ వద్ద వ్యక్తి అస్తిపంజరాన్ని శుక్రవారం స్థానికులు గుర్తించారు. ఈ విషయం పంచాయతీ కార్యదర్శి దృష్టికి వెళ్లడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించి అస్తిపంజరాన్ని నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని ఏఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. ఇంటర్ పరీక్షలకు 535 మంది గైర్హాజరు నెల్లూరు(టౌన్): ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షకు శుక్రవారం జిల్లా వ్యాప్తంగా 535 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఉదయం జరిగిన పరీక్షకు 7,803 మందికి గానూ 7,323 మంది హాజరై 480 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 1,058 మందికి గానూ 1,003 మంది హాజరై 55 మంది గైర్హాజరయ్యారు. కండలేరులో 43.792 టీఎంసీలు రాపూరు: కండలేరు జలాశయంలో శుక్రవారం నాటికి 43.792 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ విజయకుమార్‌రెడ్డి తెలిపారు. సత్యసాయి గంగ కాలువకు 1,300, పిన్నేరు కాలువకు 100, లోలెవల్ కాలువకు 60, హైలెవల్ కాలువకు 110, మొదటి బ్రాంచ్ కాలువకు 75 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. -
70 డ్రమ్ముల కోళ్ల వ్యర్థాల పట్టివేత
సంగం: మండల కేంద్రమైన సంగంలోని కావలి కాలువ సమీపంలోని ధాబా వద్ద చికెన్ వ్యర్థాల వాహనాన్ని శుక్రవారం సాయంత్రం పోలీసులు పట్టుకున్నారు. కర్ణాటక నుంచి నిత్యం ఐదు నుంచి పది వాహనాల్లో సంగం మండలంలోని పడమటిపాళెం, వంగల్లు, కోలగట్ల, వెంగారెడ్డిపాళెం, సిద్దీపురం, జెండాదిబ్బ, దువ్వూరు తదితర ప్రాంతాలకు చికెన్ వ్యర్థాలను తరలిస్తున్నారు. వేల ఎకరాల్లో సాగవుతున్న చేపలకు వాటిని వేస్తున్నారు. గురువారం రెండు లారీలను పట్టుకోగా శుక్రవారం సాయంత్రం మరో పెద్ద వాహనంలో 70 డ్రమ్ముల్లో ఉన్న వ్యర్థాలను పట్టుకున్నారు. వాటిని సంగం కొండమలుపులో భారీ గుంత తీసి పూడ్చివేసినట్లు ఎస్సై రాజేష్ తెలిపారు. లారీ యజమాని, డ్రైవర్, కోళ్ల వ్యర్థాలను తరలిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
పునర్ వ్యవస్థీకరణ అంతా గందరగోళం
వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఇలా.. జిల్లాలో పాఠశాలల పునర్ వ్యవస్థీకరణ ప్రక్రియతో ఉపాధ్యాయ పోస్టులకు ఎసరు పెడుతున్నట్లు కనిపిస్తోంది. గతంలో ఉన్న పాఠశాలలు, విద్యార్థుల సంఖ్య ఆధారంగా జిల్లాలో 673 మంది ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేస్తున్నట్లు డీఎస్సీలో ఖాళీలు చూపించారు. తాజాగా పునర్ వ్యవస్థీకరణ ప్రక్రియ తర్వాత డీఎస్సీలో చూపించిన పోస్టులకు దాదాపు సమాన స్థాయిలో స్కూల్ అసిస్టెంట్ల సర్ ప్లస్ తేల్చారు. దీన్ని బట్టి ఎస్జీటీలకు పదోన్నతులు కల్పించే అవకాశం కూడా లేదని స్పష్టమవుతోంది. ఆత్మకూరులోని వెస్ట్ ఎంపీపీఎస్‌లో 150 మంది విద్యార్థులు ఉన్నారు. హెడ్మాస్టర్తోపాటు ఐదుగురు ఎస్జీటీలు ఉండేవారు. ప్రస్తుతం ఆ స్కూల్‌ను మోడల్ ప్రైమరీ స్కూల్‌గా మార్పు చేయడంతో అక్కడ హెడ్మాస్టర్తోపాటు నలుగురు ఎస్జీటీలు, ఒక ఉర్దూ ఎస్జీటీని ఏర్పాటు చేశారు. అయితే ఆ నలుగురులో ఒకరిని సర్‌ప్లస్‌గా చూపించారు. ఈ స్కూల్లో ఉర్దూ మీడియం కానీ, సెక్షన్ కానీ, పోస్టు కానీ లేదు. ముత్తుకూరులోని మెయిన్ ఎంపీపీ ఎస్‌లో 64 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యార్థుల సంఖ్య ప్రకారం హెడ్మాస్టరుతోపాటు నలుగురు ఎస్జీటీలను నియమించాలి. అయితే పాఠశాలల పునర్ వ్యవస్థీకరణలో హెడ్మాస్టరు, ముగ్గురు ఎస్జీటీ పోస్టులు మిగిలాయి. వీరిలో తెలుగు ఇద్దరు, ఉర్దూ ఒకరు ఉన్నారు. ● 8 రకాలుగా పాఠశాలల విభజన.. వివరాలు గోప్యత ● ఏ స్కూల్లో ఏ పోస్టు ఉందో తెలియని వైనం ● 600కు పైగా స్కూల్ అసిస్టెంట్లు సర్ప్లస్ ● ఇక ఎస్జీటీలకు పదోన్నతులు హుళక్కే.. సబ్జెక్ట్ టీచర్ల కొరత ● డీఎస్సీలో 673 పోస్టులు ఖాళీ చూపిన అధికారులు నెల్లూరు (టౌన్): జిల్లాలో ఉండే పాఠశాలలను 8 రకాలు కూటమి ప్రభుత్వం విభజించింది. మొత్తం 3,221 పాఠశాలలుగా లెక్కలు తేల్చారు. శాటిలైట్ స్కూల్లో ఎల్కేజీ, యూకేజీ, 1, 2 తరగతులు, ఫౌండేషన్ స్కూల్లో 1, 2 తరగతులు, ఎన్రోల్మెంట్ 45 కంటే ఎక్కువ విద్యార్థులు ఉన్న పాఠశాలను బేసిక్ ప్రైమరీ స్కూల్‌గా మార్చి 1 నుంచి 5 తరగతులను ఏర్పాటు చేశారు. అప్పర్ ప్రైమరీలో 1–8 తరగతులు, హైస్కూల్స్‌ల్లో 1–10 వరకు, 6–10 తరగతులు, 1–5వ తరగతికి 45 లోపు పిల్లలు ఉన్న స్కూల్స్‌ను హైస్కూల్స్ బీపీఎస్‌లో 1–10 తరగతులు, 45 మంది పిల్లలు ఎక్కువగా ఉన్న హైస్కూల్ ఎంపీఎస్‌లో 1–10 తరగతులకు విద్యను అందించనున్నారు. ప్రస్తుతం హైస్కూల్ ప్లస్‌లను యథావిధిగా ఉంచారు. తగ్గనున్న పోస్టులు కూటమి ప్రభుత్వం చేపట్టిన పాఠశాలల పునర్ వ్యవస్థీకరణ వల్ల జిల్లాలో ఉపాధ్యాయ పోస్టులకు గండి పడనుంది. మోడల్ ప్రైమరీ స్కూల్స్‌ల్లో విద్యా చట్టం ప్రకారం 1ః20 నిష్పత్తిలో ఉపాధ్యాయులు ఉండాలి. అయితే కూటమి ప్రభుత్వం ఈ నిబంధనలను పక్కన పెట్టి ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తోంది. అయితే 30 మంది పిల్లలకు ఒక టీచరు పోస్టును కూడా కేటాయించడం లేదని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రక్రియతో ఎస్జీటీ పోస్టులు కూడా భారీగా తగ్గే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. సర్‌ప్లస్‌గా ఎస్ఏలు జిల్లాలో 600కు పైగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు సర్‌ప్లస్‌గా ఉన్నట్లు జిల్లా విద్యాశాఖాధికారులు లెక్కలు తేల్చారు. కూటమి ప్రభుత్వం 117 జీఓను రద్దు చేస్తున్నామని చెప్పి 3 నుంచి 5 తరగతలు విద్యార్థులను మళ్లీ ప్రాథమిక పాఠశాలల్లోకి విలీనం చేయడం ద్వారా భారీగా స్కూల్ అసిస్టెంట్లు మిగులు తేలారు. దీంతో ఎస్జీటీ పోస్టులు కూడా భారీగా తగ్గనున్నట్లు తెలుస్తోంది. అయితే కూటమి ప్రభుత్వం డీఎస్సీలో జిల్లాలో 673 పోస్టులు ఖాళీలు ఉన్నట్లు లెక్కలు తేల్చారు. పాఠశాలల పునర్ వ్యవస్ధీకరణలో ఉపాధ్యాయులు మిగులు తేలడంతో డీఎస్సీల్లో అన్ని ఖాళీ పోస్టులు ఏ విధంగా ఉంటాయని పలువురు ప్రశ్నిస్తున్నారు. కేఎన్నార్ మున్సిపల్ పాఠశాల కూటమి ప్రభుత్వంలో ఇలా.. పాఠశాలల పునర్ వ్యవస్థీకరణ ప్రక్రియ ఉపాధ్యాయులను ఆందోళనకు గురి చేస్తోంది. ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులతో సంబంధం లేకుండా విద్యాశాఖ ఇష్టారాజ్యంగా ఈ ప్రక్రియ చేపట్టడంతో అంతా గందరగోళంగా తయారైంది. ఏ పాఠశాలను ఏ విధంగా విభజించారో, ఆ పాఠశాలలో క్యాడర్, పోస్టుల వివరాలను విద్యాశాఖ గోప్యంగా ఉంచింది. పోస్టులను భారీగా తగ్గించే ప్రక్రియలో భాగంగానే పాఠశాలల పునర్ వ్యవస్ధీకరణ ప్రక్రియ చేపట్టారనే ఆందోళన ఉపాధ్యాయుల్లో నెలకొంది.జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం జీఓ 117 పేరిట పాఠశాలల విలీన ప్రక్రియ చేపట్టింది. ప్రాథమిక పాఠశాలలో 3 నుంచి 5వ తరగతి వరకు ఉన్న విద్యార్థులను సమీపంలోని హైస్కూల్లోకి విలీనం చేశారు. 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచరు బోధించే విధంగా చర్యలు చేపట్టారు. విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలు పెంచేందుకు ఈ విలీన ప్రక్రియ ఎంతో మేలు చేస్తుందని మేధావులు అభినందించారు. అయితే పాఠశాలల విలీన ప్రక్రియపై అప్పట్లో కూటమి నేతలు ఉపాధ్యాయులను రెచ్చగొట్టి, వారిలో భయాందోళనలు రేకెత్తించి ఈ విధానంపై తీవ్ర వ్యతిరేకతను సృష్టించారు. ఇప్పుడు అదే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పునర్ వ్యవస్థీకరణ పేరుతో పాఠశాలల విలీన ప్రక్రియను చేపడుతోంది. -
స్పందించకుంటే ఉద్యమం తీవ్రతరం
నెల్లూరు (అర్బన్): తమ సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని సీహెచ్‌ఓల అసోసియేషన్ జిల్లా నాయకురాలు చంద్రకళ అన్నారు. విలేజ్ హెల్త్ క్లినిక్‌లను మూసేసి డీఎంహెచ్ఓ కార్యాలయం వద్ద సీహెచ్‌ఓలు 19 రోజులుగా నిరహారదీక్షలు చేస్తున్నారు. ఈ సందర్భంగా చంద్రకళ మాట్లాడుతూ మహిళలుగా తాము ఇన్ని రోజులుగా ఎర్రటి ఎండలో కూర్చుని నిరసన తెలుపుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. తమ సమస్యలను తీర్చాలని ఎన్నో దఫాలుగా అధికారులకు, ప్రజాప్రతినిధులకు అర్జీలిచ్చామన్నారు. ప్రభుత్వం స్పందించకపోవడం వల్లనే తాము రోడ్డెక్కామన్నారు. ఇప్పటి వరకు తాము శాంతియుతంగా నిరసన తెలిపామన్నారు. అయినా తమ బాధలు ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రశాంతి, రుబికా, ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు భానుమహేష్, జిల్లా కో ఆర్డినేటర్ ఆదిల్ పాల్గొన్నారు. పిల్లల దత్తతకు దరఖాస్తు చేసుకోండి నెల్లూరు(పొగతోట): పిల్లల్ని దత్తత తీసుకునేందుకు ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోవాలని ఐసీడీఎస్ పీడీ సువర్ణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూట్ 6 నుంచి 18 ఏళ్లలోపు పిల్లలను దత్తత ఇస్తామన్నారు. అయితే పూర్తి వివరాలతో ఐసీడీఎస్ కార్యాల యంలోని బాలల సంరక్షణాధికారిని సంప్రదించాలన్నారు. పూర్తి వివరాలకు 79015 97318, 94408 14522 నంబర్లను ఫోన్ చేయాలని తెలియజేశారు. -
ఏజెన్సీ మోసాలు మరిన్ని వెలుగులోకి
పారిశుద్ధ్య పనులు చేయించుకుని జీతాలివ్వని కాంట్రాక్టర్ నెల్లూరు నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (పెద్దాస్పత్రి), ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పారిశుద్ధ్య విభాగం.. అవినీతి మురికి మయంగా మారింది. పారిశుద్ధ్య నిర్వహణ కాంట్రాక్ట్ పొందిన అవుట్ సోర్సింగ్ ఎజైల్ ఏజెన్సీ ‘మోనార్క్’లా వ్యవహరిస్తోంది. పెద్దాస్పత్రి సూపర్ బాస్ అండతో పాకీ ఏజెన్సీ దోపిడీ అంతా ఇంతా కాదు. వారాంతపు సెలవులు ఇవ్వకుండా పని చేయించుకోవడం, రాకపోతే జీతాలు కోత విధించడం, పీఎఫ్ చెల్లించకుండా ఆ డబ్బులు జేబులో వేసుకుంటూ కార్మికుల కడుపులు కొడుతున్నారు. ఈయన పేరు ఎస్కే షబ్బీర్. 2014 నుంచి పెద్దాస్పత్రిలో కాంట్రాక్ట్ సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. ఏజెన్సీ మేనేజర్‌కు అనుకూలంగా ఉన్న ఒకరిద్దరు ఆయన్ను తొలగించాలనే ఉద్దేశంతో సంబంధం లేని ఒక కేసులో ఇరికించారు. అయితే ఆ కేసులో ఆ సూపర్వైజర్కు క్లీన్చిట్ రావడంతో మళ్లీ డ్యూటీలో జాయిన్ అయ్యాడు. 2024 జూన్, జూలై నెలల్లో విధులు నిర్వర్తించినప్పటికీ ప్రభుత్వ సూపర్వైజర్ల రిజిస్టర్లో సంతకాలు చేసి ఉన్నప్పటికీ ఆయా నెలల జీతాలు ఇవ్వకుండా వేధింపులకు గురి చేస్తున్నారు. ఈ పారిశుద్ధ్య కార్మికురాలి పేరు లలితమ్మ. ఈమె 8 ఏళ్లుగా పెద్దాస్పత్రిలో పని చేస్తోంది. అనారోగ్యంతో గతేడాది కొన్ని నెలలు విధులకు రాలేదు. తిరిగి ఈ ఏడాది మార్చి 7న విధుల్లో చేరింది. అయితే ఆ కార్మికురాలికి మార్చి, ఏప్రిల్ జీతాలు ఇవ్వలేదు. ఆస్పత్రిలో ప్రభుత్వం తరఫున పనిచేసే సూపర్వైజర్ వేసిన హాజరు రిజిస్టర్లో ఆమె సంతకాలు కూడా ఉన్నాయి. అయితే ఏజెన్సీ మేనేజర్ మాత్రం విధులకు హాజరు కాలేదంటూ జీతాలు ఎగ్గొట్టాడని ఆమె వాపోతోంది. నెల్లూరు (అర్బన్): జీజీహెచ్, ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణ కాంట్రాక్ట్ పొందిన అవుట్ సోర్సింగ్ ఎజైల్ ఏజెన్సీ అవినీతి, అక్రమాల్లో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. శుక్రవారం సాక్షిలో ‘కార్మికుల పొట్ట గొడుతున్నారు’ శీర్షికన కథనం ప్రచురితం కావడంతో బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి తమకు జరిగిన అన్యాయాలను చెప్పుకుంటున్నారు. చాకిరి చేయించుకుని జీతాలు ఎగ్గొట్టిన వైనం నుంచి ఫేక్ విద్యా సర్టిఫికెట్లు సృష్టించిన వరకు అవినీతి, అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా పెద్దాస్పత్రి అడ్మినిస్ట్రేషన్ అధికారి అయిన డిప్యూటీ కలెక్టర్ మహేశ్వరరెడ్డికి ఫిర్యాదు వెల్లువెత్తుతున్నాయి. పారిశుద్ధ్యం, సెక్యూరిటీ నిర్వహణకు ప్రభుత్వం ఏడాదికి సుమారు రూ.10 కోట్ల వరకు నిధులు కేటాయిస్తోంది. ఈ మేరకు తగినంత పారిశుధ్య కార్మికులు, సెక్యూరిటీ సిబ్బందిని నియమించాల్సి ఉండగా సదరు పెద్దాస్పత్రి సూపర్ బాస్ అరకొరగా సిబ్బందిని నియమించి నిధులు కాజేస్తున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. ఇక ఆస్పత్రిలో విధుల్లో సెక్యూరిటీ స్థానంలో పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తుండడం విశేషం. గత నాలుగేళ్లలో పారిశుధ్య విభాగంలో జరిగిన కోట్లాది రూపాయిల కుంభకోణం వెలుగు చూడాలంటే ప్రభుత్వం తక్షణమే విజిలెన్స్ విచారణ జరిపించాలని ప్రజలు, ఉద్యోగులు, కార్మికులు కోరుతున్నారు. వేతనాల్లో కోతలు కార్మిక చట్ట ప్రకారం విధుల్లో వారికి వారాంత సెలవులు, పండగ సెలవులు తప్పనిసరిగా కేటాయించాలి. కానీ ఆ రోజుల్లో కూడా వారితో పనులు చేయించుకుంటున్న పరిస్థితి ఇక్కడ ఉంది. ఒక వేళ ఆరోగ్యం బాగోలేకపోయినా, అత్యవసరమై సెలవు పెట్టినా ఆ రోజు జీతం కోత విధిస్తున్నారు. దీనికంటే ఇంకా ఘోరమైన విషయం ఏమిటంటే.. కార్మికులకు మధ్య, మధ్యలో కొన్ని నెలలు జీతాలు ఎగ్గొట్టేస్తున్నారు. ఇదంతా పెద్దాస్పత్రి సూపర్ బాస్‌తో కలిసి సదరు పారిశుద్ధ్య ఏజెన్సీ నిర్వాహకుల నిర్వాకం. రికార్డులు మాయం కార్మికులు ఎదురు తిరిగి ప్రశ్నించడంతో కాంట్రాక్ట్‌కు సంబంధించిన హాజరు, ఇతర రికార్డులు హాస్పిటల్లో లేకుండా మాయం చేశారు. రికార్డులను తారు మారు చేస్తున్నారని తెలుస్తోంది. ఇంత పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నప్పటికీ పెద్దాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సిద్ధానాయక్ మౌనంగా ఉండడంతో ఏజెన్సీ నిర్వాహకుల అవినీతి, అక్రమాలు మితిమీరాయనే ఆరోపణలు ఉన్నాయి. ప్రజాప్రతినిధులకు విలువేది కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి తన నియోజకవర్గం నుంచి ఎస్.సునీతను పెద్దాస్పత్రిలో పారిశుద్ధ్య కార్మికురాలిగా కాంట్రాక్ట్ ఉద్యోగం ఇచ్చేలా సదరు ఏజెన్సీకి సిఫార్సు చేశారు. వారు ఎమ్మెల్యే సూచన మేరకు విధుల్లోకి తీసుకున్నారు. డిసెంబర్ 2024 నుంచి పనిచేస్తున్నా 5 నెలలుగా ఏదో కారణం చెబుతూ జీతం ఇవ్వలేదు. మరి ఆ కార్మికురాలు ఎలా బతకాలో సంస్థకే తెలియాలి. ఇలా పనిచేస్తూ కొన్ని నెలలుగా జీతాలు పొందలేని వారిలో సూపర్వైజర్ సాయి నిఖిల్‌తోపాటు మాజీ మేయర్ భానుశ్రీ చేర్పించిన సుప్రజ, సెక్యూరిటీలో సుధాకర్, భరత్ దాదాపు 14 మంది వరకు ఉన్నారు. కార్మిక చట్టానికి వ్యతిరేకంగా వేతనాల్లో కోతలు పీఎఫ్ చెల్లించకుండా మరో దగా పుట్టిన తేదీల కోసం వేల రూపాయలు గుంజి ఫేక్ సర్టిఫికెట్లు డిప్యూటీ కలెక్టర్, పెద్దాస్పత్రి అడ్మినిస్ట్రేషన్ అధికారికి ఫిర్యాదులు సాక్షి కథనంతో ఒక్కొక్కరుగా ముందుకొస్తున్న బాధితులు విచారణ జరిపిస్తాం పీఎఫ్ జమ చేయించేందుకు స్టడీ సర్టిఫికెట్లు ఇప్పిస్తామంటూ కొంత మంది కార్మికుల దగ్గర లంచాలు వసూలు చేసినట్లు నాకు ఫిర్యాదులు వచ్చాయి. పీఎఫ్ జమ కాలేదంటూ తెలిపారు. దీనిపై లోతుగా విచారిస్తాం. జీతాలు ఇవ్వని వారి గురించి విచారిస్తాం. తప్పు చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. – మహేశ్వరరెడ్డి, డిప్యూటీ కలెక్టర్, పెద్దాస్పత్రి అడ్మినిస్ట్రేషన్ అధికారి -
స్నేహితుడే హంతకుడు
నెల్లూరు(క్రైమ్): ఆర్థిక విభేదాలతో స్నేహితుడే రియల్టర్‌ను కడతేర్చాడు. తనపై అనుమానం రాకుండా ఉండేందుకు గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారంటూ తప్పుదోవ పట్టించాడు. విభిన్న కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టినా చిన్నపాటి క్లూ దొరకలేదు. దీంతో స్నేహితుడిని మరోమారు తమదైన శైలిలో విచారించగా తానే హత్య చేసినట్లు వెల్లడించడంతో అరెస్ట్ చేశారు. నెల్లూరులోని ఉమే ష్చంద్ర కాన్ఫరెన్స్హాల్లో శుక్రవారం ఎస్పీ జి.కృష్ణకాంత్ వివరాలను వెల్లడించారు. ఉదయగిరికి చెందిన గొల్లపల్లి చిన్నయ్య అలియాస్ చిన్నా అలియాస్ ఇస్సాక్ (40) రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నాడు. నాలుగేళ్లుగా అయ్యప్పగుడి పరిధి వెంకటరెడ్డినగర్‌లో కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని రియల్ ఎస్టేట్‌తోపాటు ప్రభుత్వ ఉద్యోగులకు రుణాలు ఇప్పించేవాడు. ఈనెల 5వ తేదీ అర్ధరాత్రి చిన్నయ్య ఇంట్లో హత్యకు గురయ్యాడు. ఆ రోజు రాత్రి అతడితోపాటు అదే ఇంట్లో స్నేహితుడైన టీచర్ సరస్వతి వెంకటేశ్వర్లు ఉన్నాడు. 6వ తేదీ ఉదయం చిన్నయ్య హత్యకు గురయ్యాడంటూ మృతుడి కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలాన్ని నగర డీఎస్పీ పి.సింధుప్రియ, వేదాయపాళెం ఇన్చార్జి ఇన్స్పెక్టర్ జి.రోశయ్య పరిశీలించారు. మృతుడి తమ్ముడు రాజా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. వెంకటేశ్వర్లును పోలీసులు విచారించగా తాను పడక గదిలో నిద్రించగా, చిన్నయ్య హాల్లో పడుకున్నాడని చెప్పాడు. ఎవరు హత మార్చారో తనకు తెలియదని వెల్లడించారు. క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్‌లు పరిశీలించినా చిన్నపాటి ఆధారం దొరకలేదు. సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో కేసు ముందుకుసాగలేదు. అందరినీ విచారించి.. చిన్నయ్యకు పలువురితో భూ వివాదాలు, ఆర్థిక విభేదాలున్నాయి. దీంతో తెలిసిన వారే ఈ పని చేసి ఉంటారని భావించారు. మృతుడితో విభేదాలున్న వారిని పోలీసులు విచారించినా ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. కేసు సవాలుగా మారడంతో ఎస్పీ స్వయంగా రంగంలోకి దిగారు. ఇన్స్పెక్టర్లు రోశయ్య, సీహెచ్ సీతారామయ్య తదితరులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి పర్యవేక్షించారు. మరోమారు పోలీసులు విచారించినా క్లూ దొరకలేదు. వెంకటేశ్వర్లును విచారించగా పొంతనలేని సమాధానాలు చెప్పడం, అతడి తీరు అనుమానాస్పదంగా ఉండటంతో తమదైన శైలిలో విచారించగా హత్య జరిగిన తీరు వెలుగులోకి వచ్చింది. మోసాన్ని తట్టుకోలేక.. చిన్నయ్య పలువురికి ప్రైవేట్ ఫైనాన్స్‌లు, బ్యాంకుల్లో రుణాలిప్పించి అందుకు కమీషన్ తీసుకుంటుండేవాడు. వెంకటేశ్వర్లును పలువురికి ష్యూరిటీగా పెట్టాడు. ఈక్రమంలోనే వెంకటేశ్వర్లు పేరుపై రూ.లక్షల్లో రుణం తీసుకుని ఎగ్గొట్టారు. పలువురు రుణాలు కట్టకపోవడంతో అతడికి వివిధ బ్యాంక్‌లు, ఫైనాన్స్ కంపెనీల నుంచి నోటీసులు వచ్చాయి. దీంతో వెంకటేశ్వర్లు చిన్నయ్యను నిలదీయగా సరైన సమాధానం చెప్పేవాడు కాదు. వెంకటేశ్వర్లు అప్పుల ఊబిలో కూరుకుపోయి చిన్నయ్యపై కక్ష పెంచుకుని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. పక్కా పథకంతో తన సెల్‌ఫోన్‌ను పడారుపల్లిలోని తన ఇంట్లోనే ఉంచి చిన్నయ్య దగ్గరికొచ్చాడు. ఇద్దరూ కలిసి మెడికల్ షాపునకు వెళ్లి మందులు తీసుకొచ్చారు. తర్వాత చిన్నయ్య హాల్లో నిద్రపోగా, వెంకటేశ్వర్లు పడకగదిలోకి వెళ్లాడు. కొద్దిసేపటి అనంతరం వెంకటేశ్వర్లు ఇంట్లో ఉన్న డంబెల్‌తో చిన్నయ్య ముఖంపై పలుమార్లు కొట్టాడు. కొన ఊపిరి ఉండగా దిండుతో ముఖంపై బలంగా నొక్కి హత్య చేశాడు. ఆధారాలు దొరక్కుండా ఆ ప్రాంతంలో కారం చల్లాడు. శుక్రవారం పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. కేసును ఛేదించిన సిబ్బందిని ఎస్పీ అభినందించి నగదు వార్డులు అందజేశాడు. సమావేశంలో ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. రియల్టర్ హత్య కేసును ఛేదించిన పోలీసులు ఆర్థిక విభేదాలే కారణం వివరాలు వెల్లడించిన ఎస్పీ కృష్ణకాంత్ -
ఒకే ప్లాట్..
ఏం జరిగిందంటే..సాక్షి టాస్క్‌ఫోర్స్: రెవెన్యూ శాఖ అధికారుల అక్రమాలకు అంతేలేకుండా పోతోంది. ఒకే నంబరు గల ప్లాట్‌ను ఐదుగురికి పట్టాలుగా ఇచ్చిన వైనం తాజాగా వెలుగు చూసింది. లంచాలు వసూలు చేసి ఈ మేరకు అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు వస్తున్నాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఇళ్లు లేని పేద ప్రజల కోసం జగనన్న గృహ కాలనీ నిర్మాణం చేపట్టారు. అనంతసాగరంలోనూ లేఅవుట్ వేశారు. మండల కార్యాలయాల వెనుక ఉన్న కాలనీలో లబ్ధిదారులకు ప్లాట్లు ఇవ్వగా కొన్ని మిగిలిపోయాయి. వాటికి మంచి విలువ ఉండడంతో పలువురు ఆక్రమించి గృహనిర్మాణాలు చేపడుతున్నారు. ఇలా అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నా రెవెన్యూ అధికారులు పట్టనట్లుగా వ్యవహరించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకే లబ్ధిదారుకు రెండుసార్లు గ్రామానికి చెందిన ఓ గులాబ్ అనే మహిళకు ఇందిరమ్మ గృహ నిర్మాణాల కింద 2009–10లో గృహం మంజూరైంది. ఆ మేరకు నిర్మాణం చేపట్టగా అప్పటి ప్రభుత్వం రూ.34వేల వరకు బిల్లులు కూడా మంజూరు చేసింది. ఇప్పుడు అదే మహిళ జగనన్న లేఅవుట్లోని ఖాళీ ప్లాట్‌లో నిర్మాణం చేపట్టడం చూసి గ్రామస్తులు ఆశ్ఛర్యం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం రాగానే... కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎంపీడీఓ, వెలుగు కార్యాలయాల వెనుక భాగంలో లేఅవుట్లో మిగిలి ఉన్న ప్లాట్లను కాజేసేందుకు కొందరు రెవెన్యూ అధికారులతో కుమ్మక్కయ్యారు. ప్లాట్ నెంబరు 911కి నివేశ స్థల ఆధీన ధ్రువీకరణ పత్రం అధికారికంగా సృష్టించారు. ఆ ప్లాట్‌లో ఇటీవల లబ్ధిదారు గృహ నిర్మాణం చేపట్టారు. గ్రామస్తుల ఏమంటున్నారంటే..! పేద ప్రజలు నివాసముండేందుకు ప్రభుత్వం అందించే లేఅవుట్లో ఒకే నంబరు ప్లాట్‌ను పలువురు వ్యక్తుల పేరుతో పట్టా ఇచ్చిన రెవెన్యూ అధికారులు ఎవరు? అందుకు వారు లంచంగా ఎంత తీసుకున్నారు? వంటి విషయాలపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై తహసీల్దారు సుభాషిణిని వివరణ కోరగా ఈ ప్లాట్ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటానని అన్నారు.ఈ 911 నంబరు ప్లాట్‌ను 2024 మే నెలలో లింగంగుంట గ్రామానికి చెందిన కండ్లగుంట సుధా అనే మహిళకు రెవెన్యూ అధికారులు పట్టా ఇచ్చారు. మళ్లీ అదే ప్లాట్‌ను అదే ఏడాది జూన్ నెలలో అనంతసాగరం చెందిన షేక్ గులాబ్ అనే మహిళకు ఇంటి పట్టాగా ఇచ్చారు. ప్రస్తతం గులాబ్ కుటుంబానికి సన్నిహితుడిగా స్థానిక పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్సై మస్తాన్ ఆ స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టారు. అక్రమ నిర్మాణం చేపట్టింది పోలీసు అధికారి కావడంతో ప్రశ్నించేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఇందులో లోతుగా పరిశీలిస్తే మరికొన్ని విషయాలు బయటపడ్డాయి. సుధా అనే మహిళతో పాటు అదే ప్లాట్‌ను గౌరవరం గ్రామానికి చెందిన మరో ముగ్గురికి కూడా పట్టాలుగా ఇచ్చినట్లు తెలిసింది. వారు కూడా ఆ ప్లాట్లలో నిర్మాణం జరుగుతుందని తెలిసి స్థలం వద్దకు వచ్చి చూడగా అక్కడ పోలీసు అధికారి నిర్మాణం చేస్తున్నారని తెలిసి నోరు మెదపకుండా వెనుతిరిగి వెళ్లినట్లు గ్రామస్తులు తెలిపారు. ఐదుగురు లబ్ధిదారులు ఇవీ రెవెన్యూ అధికారుల లీలలు లేఅవుట్లో అక్రమంగా గృహ నిర్మాణం పోలీసు అధికారుల సహకారం విస్తుపోతున్న గ్రామస్తులు -
నేడు జాతీయ డెంగీ నివారణ దినోత్సవం
● నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాంతకం ● వేలల్లో కేసులు ● వైద్యశాఖ లెక్కల్లో నామమాత్రంనెల్లూరు(అర్బన్): డెంగీ.. ఇది చాలా ప్రమాదకరం. ఆడ ఏడిస్ ఈజిప్టై అనే జాతికి చెందిన దోమ కుడితే వచ్చే ప్రమాదకరమైన జ్వరాల్లో ఒకటి. దోమ కుట్టినప్పుడు దాని లాలాజలంలో ఉండే వైరస్ మనిషి శరీరంలోనికి ప్రవేశించి ఈ వ్యాధిని కలిగిస్తుంది. దీనిని ఎముకలు విరిచే జ్వరం అని కూడా అంటారు. డెంగీ బారిన పడిన అనేకమంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలున్నాయి. చికిత్స చేయించుకుని ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న బాధితులు ఎంతోమంది ఉన్నారు. అందువల్ల ప్రజలను అప్రమత్తం చేస్తూ ఆ జ్వరం రాకుండా ఉండేందుకు చేపట్టాల్సిన చర్యలు గురించి వివరిస్తూ కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం మే 16వ తేదీని జాతీయ డెంగీ నివారణ దినోత్సవంగా ప్రకటించింది. జిల్లాలోనూ మలేరియా నివారణ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఎన్నో కేసులు సీజనల్ వ్యాధిగా పిలిచే డెంగీ జ్వరం జిల్లాలో ప్రతి సంవత్సరం వేలాది మందికి సోకుతోంది. ఎన్ఎస్1 ర్యాపిడ్ పరీక్ష ద్వారా ఈ జబ్బును నిర్ధారిస్తున్నారు. నెల్లూరులోని వివిధ హాస్పిటళ్లలో ప్రతి సంవత్సరం వేలాది కేసులు నమోదవుతున్నాయి. రెండు, మూడు వందల కేసులకు చికిత్స చేసిన ఆస్పత్రులున్నాయి. అయితే వైద్యశాఖ మాత్రం కాకి లెక్కలు చెబుతోంది. దాని గణాంకాల ప్రకారం 2022లో 148, 2023లో 193, 2024లో 130, 2025లో (ఏప్రిల్ వరకు) 16 కేసులు మాత్రమే నమోదయ్యాయి. రాపూరు, సీతారామపురం, ఉదయగిరి, కలువాయి, దుత్తలూరు, బోగోలు, కలిగిరి, ఆత్మకూరు, నెల్లూరు, కావలి రూరల్ తదితర ప్రాంతాల్లో కేసులు ఎక్కువగా వచ్చినట్టు పేర్కొంటున్నారు. అన్ని పీహెచ్‌సీలతోపాటు ప్రైవేట్ ఆస్పత్రుల్లో డెంగీని నిర్ధారించే ర్యాపిడ్ పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. అయితే వైద్యశాఖాధికారులు మాత్రం ఆ పద్ధతిలో కాకుండా ఎలీసా పద్ధతిలో చేసే పరీక్షలను డెంగీగా నిర్ధారిస్తున్నారు. మిగతా వాటిని లెక్కల్లోకి తీసుకోవడం లేదు. లక్షణాలు ఏంటంటే? డెంగీ వ్యాధి సోకిన వారిలో కీళ్లు, కండరాల నొప్పులు, వికారం, వాంతులు, దద్దుర్లు, తలనొప్పి లక్షణాలుంటాయి. శరీరం విపరీతంగా నొప్పులకు గురవుతుంది. ఎక్కువ మందికి దానంతట అదే తగ్గిపోతుంది. అయి తే పలువురు ఆస్పత్రుల పాలవుతున్నారు. రక్తకణాలు తగ్గిపోతున్నాయి. దీంతో పెద్ద సంఖ్యలో వాటిని ఎక్కించాల్సి ఉంటుంది. కడుపునొప్పి రావొచ్చు. మరికొన్ని లక్షణాలున్నాయి. పలువురికి వైద్య చికిత్సకే రూ.లక్షలు ఖర్చవుతాయి. ఆర్థికంగా చితికిపోతారు. కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకమవుతుంది. సీజనల్ వ్యాధుల నివారణకు కృషి నెల్లూరు(అర్బన్): జిల్లాలో డెంగీ, మలేరియా తదితర సీజనల్ వ్యాధుల నివారణకు వైద్యశాఖ అధికారులు కృషి చేయాలని కలెక్టర్ ఆనంద్ సూచించారు. జాతీయ డెంగీ నివారణ దినోత్సవం సందర్భంగా గురువారం నెల్లూరులోని కలెక్టరేట్లో వైద్యశాఖ ఆధ్వర్యంలో బ్యానర్లు, వాల్‌పోస్టర్లను ఆనంద్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బంది డయేరియా, టైఫాయిడ్ లాంటి జ్వరాలు రాకుండా ఉండేందుకు ప్రజలను చైతన్యవంతుల్ని చేయాలన్నారు. డెంగీపై ప్రజలను అప్రమత్తం చేస్తూ తగిన సూచనలివ్వాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ సుజాత, జిల్లా మలేరియా నివారణ అధికారి హుస్సేనమ్మ, ఎన్ఆర్హెచ్ఎం పీఓ డాక్టర్ రమేష్, డాక్టర్ బ్రహ్మనాయుడు, సహాయ మలేరియా అధికారి వి.నాగార్జునరావు తదితరులు పాల్గొన్నారు.ప్రత్యేక చర్యలు జిల్లాలో డెంగీ కేసులు అదుపులో ఉన్నాయి. అక్కడక్కడా నమోదవుతున్నాయి. నివారణకు జిల్లా వైద్యశాఖ తరఫున ప్రత్యేక చర్యలు చేపట్టాం. ఎక్కడైనా డెంగీ, మలేరియా లాంటి కేసులు నమోదైతే ఫీవర్ సర్వే, దోమ లార్వా సర్వే చేస్తున్నాం. మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నాం. పరసరాల్లో దోమల నివారణకు మలాథియాన్ స్ప్రే చేయిస్తున్నాం. వారానికి ఒకరోజు నీటి పాత్రలను ఎండబెట్టాలంటూ ఫ్రైడే.. డ్రైడే కార్యక్రమం నిర్వహిస్తున్నాం. నీటి నిల్వ ఉన్న గుంతల్లో దోమల గుడ్లు తినే గంబూసియా చేపలు వదులుతున్నాం. ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం. వేసవిలో ప్రతి హాస్టళ్లలో దోమల నివారణకు మందును పిచికారీ చేయిస్తున్నాం. – హుస్సేనమ్మ, జిల్లా మలేరియా నివారణ అధికారి నివారణ ముఖ్యం డెంగీ వ్యాధిని నివారించాలంటే పరిసరాల పరిశుభ్రత ఎంతో అవసరం. కొంచెం నీరు కూడా నిల్వ చేరకుండా చూడాలి. దోమలు పుట్టకుండా, కుట్టకుండా చూసుకోవాలి. కిటికీలకు మెస్‌లు ఏర్పాటు చేసుకుని దోమలు ఇళ్లలోకి రాకుండా చర్యలు తీసుకోవాలి. దోమతెరలు ఉపయోగించాలి. జ్వరం ఎలాంటిదైనా సమీపంలోని ఆస్పత్రికి వెళ్లి వైద్యపరీక్షలు చేయించుకోవాలి. డాక్టర్ల సూచన మేరకు మందులు వాడాలి. -
ట్రూఅప్ చార్జీలు రద్దుచేయండి
నెల్లూరు(వీఆర్సీసెంటర్): రాష్ట్రంలో ట్రూఅప్ చార్జీల పేరుతో ప్రజలపై మోపిన అదనపు భారాన్ని రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్ల ఏర్పాటు విరమించాలంటూ సీపీఎం నెల్లూరు రూరల్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం విద్యుత్ భవన్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్, కార్యవర్గ సభ్యులు మాదాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో కూటమి నాయకులు తాము అధికారంలోకి వస్తే విద్యుత్ బిల్లులు 30 శాతం తగ్గిస్తామని చెప్పారని, అధికారంలోకి వచ్చాక ట్రూ అప్ చార్జీలు, సర్దుబాటు చార్జీల పేరుతో రూ.18 వేల కోట్ల భారాన్ని ప్రజలపై వేశారని విమర్శించారు. అదానీతో చేసుకున్న విద్యుత్ ఒప్పందాన్ని రద్దు చేస్తామని చెప్పినా.. నేడు కొనసాగిస్తోందని అన్నారు. స్మార్ట్ మీటర్ల కొనుగోళ్లకు అయిన రూ.96 వేల కోట్ల భారాన్ని ప్రజలపై మోపటాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఏపీఎస్పీడీసీఎల్ జిల్లా సర్కిల్ ఎస్ఈ విజయన్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు పెంచల నరసయ్య, అబ్దుల్ అజీజ్, సతీష్, రఫీఅహ్మద్, సంపత్, సుధాకర్, శ్రీనివాసులు, నాగేశ్వరరెడ్డి, శరత్‌బాబు తదితరులు పాల్గొన్నారు. స్మార్ట్ మీటర్లౄ ఏర్పాటును విరమించాలి విద్యుత్ భవన్ వద్ద సీపీఎం ధర్నా -
కూటమి సర్కారులో మహిళా ఉద్యోగులకు అన్యాయం
నెల్లూరు(అర్బన్): ప్రభుత్వ ఉద్యోగమంటే ఒక భద్రత ఉంటుందని... అయితే ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తూ కూటమి ప్రభుత్వం తమను ఇబ్బందికి గురిచేయడం దారుణమని సీహెచ్‌ఓల అసోసియేషన్ జిల్లా కోఆర్డినేటర్ ఆదిల్ అన్నారు. సీహెచ్‌ఓలు చేస్తున్న సమ్మె 18వ రోజుకు చేరింది. సమ్మె సందర్భంగా ప్రతి రోజూ డీఎంహెచ్ఓ కార్యాలయం వద్ద సీహెచ్‌ఓలు నిరసన చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 రోజులుగా తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని శాంతియుతంగా ఆందోళనలు చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు. ఏ అధికారి కూడా తమ సమస్యలపై విచారించకపోవడం, చర్చించకపోవడం బాధాకరమన్నారు. ఆడపిల్లలకు అన్యాయం చేయమని చెప్పిన కూటమి ప్రభుత్వంలో సీహెచ్‌ఓలుగా పనిచేసేది 90 శాతానికి పైగా ఆడపిల్లలే అనే సంగతి మరిచిపోయారని విమర్శించారు. తమకు వేతనాల్లో అన్యాయాన్ని సరిదిద్దాలని, పీఎఫ్‌ను పునరుద్ధరించాలని, వర్క్ చార్ట్ ప్రకటించాలని, పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు భానుమహేష్, నాయ కులు గాయత్రి, రుబికా పాల్గొన్నారు. 18 రోజులుగా సమ్మె చేస్తున్నా పట్టించుకోరా నిరసన కార్యక్రమంలో సీహెచ్‌ఓలు -
అయ్యా.. నా బిడ్డను కాపాడండి
కలువాయి(సైదాపురం): ‘పొట్టకూటి కోసం నా బిడ్డ సౌదీ అరేబియాకు వెళ్లాడు. అక్కడ యజమాని చిత్రహింసలకు గురిచేస్తూ నా బిడ్డను చంపే ప్రయత్నం చేస్తున్నాడయ్యా. కనికరించి మావాడిని మన దేశానికి రప్పించండి’ అంటూ షేక్ కాలేషా అనే వ్యక్తి కోరాడు. అతడి కథనం మేరకు.. కలువాయి మండలంలోని కుల్లూరు గ్రామానికి చెందిన షేక్ కాలేషా, బీబీ దంపతులకు షేక్ నజీర్ అనే కుమారుడున్నాడు. అతను 7వ తరగతి వరకు చదివి ఇక్కడే కూలీ పనులు చేస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉండేవాడు. 2024 డిసెంబర్ నెలలో ఓ ఏజెంట్ మాటలు విని రూ.2 లక్షలు పెట్టి నజీర్‌ను సౌదీకి పంపారు. అక్కడ యజమాని పెట్టే చిత్రహింసలు భరించలేక నజీర్ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు. ఓరోజు యజమాని చెట్టు కొమ్మలను నరికే పనిని అప్పగించాడు. నజీర్ చెట్టుపై నుంచి పడి గాయపడ్డాడు. కాగా మూడునెలలపాటు పని చేయించుకుని జీతం అడిగితే యజమాని చిత్రహింసలకు గురిచేయడంతోపాటు దాడి చేశాడు. తన బిడ్డను ఎలాగైనా ఇండియాకు రప్పించి ఆదుకోవాలంటూ గురువారం కాలేషా కలువాయి తహసీల్దార్ శ్యాంసుందర్‌కు విన్నవించాడు. తనను కలిస్తే ఏం జరుగుతుంది. ఎమ్మెల్యే లేదా, కలెక్టర్‌ను న్యాయం జరుగుతుందంటూ తహసీల్దార్ బాధితుడికి తెలియజేయడంతో వెనుదిరిగాడు. ఉన్నతాధికారులను కలుస్తానంటూ కాలేషా మీడియో ముందు కన్నీరుమున్నీరుగా విలపించాడు. సౌదీ అరేబియా నుంచి రప్పించండి తహసీల్దార్‌కు ఓ తండ్రి విన్నపం -
ఏపీ ఈసెట్‌లో బాలికల సత్తా
నెల్లూరు (టౌన్): పాలిటెక్నిక్ కోర్సు పూర్తి చేసి ఇంజినీరింగ్‌లో నేరుగా ద్వితీయ సంవత్సరంలో ప్రవేశం కోసం నిర్వహించిన ఏపీ ఈసెట్‌లో బాలికలు సత్తా చాటారు. గురువారం విజయవాడలో ఏపీఈసెట్ ఫలితాలను విడుదల చేశారు. చేజర్లకు చెందిన నాగపూజిత మ్యాథ్స్ విభాగంలో 62 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో 10వ ర్యాంకు సాధించింది. ఈ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా మొత్తం 996 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 761 మంది పరీక్షకు హాజరయ్యారు. ఈ ప్రవేశ పరీక్షలో 718 మంది అర్హత సాధించారు. బాలికల విభాగంలో 94.44 శాతం, బాలరు 92.86 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ అడ్వాన్స్డ్ పరీక్షలకు 478 మంది గైర్హాజరు నెల్లూరు (టౌన్): ఇంటర్ అడ్వాన్స్డ్ పరీక్షలకు గురువారం జిల్లా వ్యాప్తంగా 478 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఉదయం జరిగిన ప్రథమ సంవత్సర పరీక్షకు 12,240 మందికి గానూ 11,809 మంది హాజరయ్యారు. 431 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన ద్వితీయ సంవత్సర పరీక్షకు 1055 మందికి గానూ 1008 మంది హాజరయ్యారు. 47 మంది గైర్హాజరయ్యారు. ఏపీటీఎస్ ఇన్స్పెక్టర్ బాధ్యతల స్వీకరణ నెల్లూరు(వీఆర్సీసెంటర్): విద్యుత్‌శాఖ ఏపీటీఎస్ (యాంటీ పవర్ తెఫ్ట్ స్క్వాడ్) సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఆంజనేయరెడ్డి గురువారం విద్యుత్ భవన్‌లోని ఆయన చాంబర్లో పదవీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా సర్కిల్ ఎస్ఈ విజయన్ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఆంజనేయరెడ్డి ఇప్పటివరకు ఏసీబీ నెల్లూరు సర్కిల్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహించారు. పలువురు రైతులకు ఏసీబీ నోటీసులు పొదలకూరు: మండలంలోని కొందరు రైతులకు ఏసీబీ అధికారులు గురువారం నోటీసులు జారీ చేశారు. 2018లో పొదలకూరు తహసీల్దార్‌గా పనిచేసిన స్వాతి రైతులకు అందజేసిన పట్టాదార్ పాసుపుస్తకాలకు సంబంధించి విచారణలో భాగంగా ఏసీబీ సీఐ రైతులకు నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది. మండలంలోని మొగళ్లూరు, ఆల్తుర్తి, ఆర్‌వైపాళెం తదితర గ్రామాలకు చెందిన రైతులకు ఏసీబీ కార్యాలయం నుంచి వచ్చిన సిబ్బంది వీఆర్వోల ద్వారా నోటీసులు అందజేసినట్టు రైతులు వెల్లడించారు. రైతులు వీలుచూసుకుని ఏసీబీ కార్యాలయానికి హాజరై వారు పొందిన పట్టాలు, పాసుపుస్తకాలకు సంబధించిన వివరాలను వెల్లడించాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నట్టు తెలిసింది. సోమశిల క్రస్ట్‌గేట్ల నుంచి లీకవుతున్న నీరు సోమశిల: సోమశిల జలాశయం క్రస్ట్‌గేట్ల ద్వారా నీరు లీక యి వృథాగా పో తోంది. ముఖ్యంగా 3, 6, 11 క్రస్ట్‌గేట్లు, ఉత్తర, దక్షిణ కాలువ గేట్ల నుంచి కూడా ఇలా జరుగుతోంది. లీకేజీలను అరికట్టేందుకు ఏటా రూ.1.50 లక్షలు ఖర్చు చేస్తున్నారు. కాగితాల్లో ఈలెక్కలు కనిపిస్తున్నా వాస్తవ పరిస్థితిని పరిశీలిస్తే పనులు అన్నీ డొల్లేనన్న విషయం అర్థమవుతోంది. ఐఏబీ నిర్ణయం మేరకు రెండవకారుకు నీరు విడుదల చేస్తున్న ఈ సమయంలో జలాశయం అధికారులు నిమ్మకు నిరెత్తినట్లుగా వ్యవహరిస్తుండడంపై రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు. రెండు నెలల క్రితం రాష్ట్ర జలవనరుల సాంకేతిక సలహాదారుడు కన్నయ్యనాయుడు స్వయంగా జలాశయాన్ని పరిశీలించి క్రష్ట్‌గేట్లు, రోప్‌లు తుప్పు పట్టి దెబ్బతిన్న వాటిని గుర్తించారు. వెంటనే మరమ్మతు పనులు చేపట్టాలని హెచ్చరించారు. అయినా ఆ పనులపై అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. -
లోపాలు సరి చేస్తున్నాం
● ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి, మెడికల్ కళాశాలలో ఇదీ పరిస్థితి ● శానిటరీ వర్కర్స్ జీతాల్లో కోత ● కొత్తవారిని తీసుకోవాలంటే లంచాలు ● పక్కదారి పడుతున్న వేతనాల సొమ్ము ● పని మానేసిన వారి పేరుతోనూ జీతాలు ● అధికారులు, రాజకీయ నేతలకు వాటాలు ఆస్పత్రిలో రూ.30 వేల జీతంతో పని చేస్తున్నట్టు ఇచ్చిన ఫేక్ శాలరీ సర్టిఫికెట్ నెల్లూరు(అర్బన్): ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి, ఏసీఎస్ఆర్ మెడికల్ కళాశాలలో మెరుగైన పారిశుద్ధ్యం కోసం ఒక ఏజెన్సీతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. విజయవాడలో ఉండే ఆ ఏజెన్సీ యాజమాన్యం నెల్లూరులో ఒక మేనేజర్‌ను నియమించి ఆయన ద్వారా ఆస్పత్రిలో, మెడికల్ కళాశాలలో పారిశుద్ధ్య పనులను పర్యవేక్షిస్తోంది. అయితే పెద్దాస్పత్రిలో పారిశుద్ధ్యం అధ్వాన్నంగా మారింది. యాజమాన్యం కార్మికుల జీతాల్లో కోతలు పెడుతోంది. కొందరు కార్మికులు విధులకు హాజరు కాకపోయినా హాజరు వేసి జీతాలు డ్రా చేస్తున్నారు. ఇదే కాకుండా మూడు నెలల పాటు జీతాలు లేకుండా పని చేసేటట్టు ఒప్పందం కుదుర్చుకుని కొత్తగా కొంతమంది కార్మికులను మేనేజర్ చేర్చుకున్నట్టు విమర్శలు వస్తున్నాయి. కార్మికుల జీతాల్లో కోత పెట్టిన సొమ్మును రూరల్ నియోజకవర్గంలోని అధికార పార్టీకి చెందిన ఒక ప్రధానమైన వ్యక్తికి, పెద్దాస్పత్రిలోని అధికారులకు వాటా రూపంలో ఇస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జీతాల్లో కోత, ప్రశ్నించేవారిని ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో నాలుగు రోజుల క్రితం మేనేజర్‌కు వ్యతిరేకంగా కార్మికులు పోరాటానికి సిద్ధమయ్యారు. అయితే ఆస్పత్రి అభివృద్ధి కమిటీ జోక్యంతో ఘర్షణ వాతావరణం లేకుండా సర్దుబాటు జరిగింది. సిబ్బంది సంఖ్యలో తేడా..? ప్రభుత్వ పెద్దాస్పత్రిలో అగ్రిమెంట్ ప్రకారం 145 మంది పారిశుద్ధ్య కార్మికులు పని చేయాలి. అయితే సెలవులు, మెడికల్ లీవులు ఇవ్వాల్సి ఉన్నందున మరో 28 మందిని అదనంగా తీసుకుని మొత్తం 173 మంది పారిశుద్ధ్య కార్మికులతో పని చేయిస్తున్నారు. అలాగే మెడికల్ కళాశాలలో మరో 50 మంది కార్మికులు పని చేస్తున్నారు. రెండు చోట్ల కలుపుకుని మొత్తం 223 మంది కార్మికులు, సూపర్వైజర్లు పని చేస్తున్నారు. అలాగే పెద్దాస్పత్రిలో 110 మంది సెక్యూరిటీ సిబ్బంది, మెడికల్ కళాశాలలో 27 మంది సెక్యూరిటీ కలిపి మొత్తం 137 మంది పనిచేస్తున్నారు. ఇవన్నీ కాగితాల్లో లెక్కలు మాత్రమే. వాస్తవాన్ని పరిశీలిస్తే అంతమంది పని చేయడం లేదు. పెద్దాస్పత్రిలో 145 మందికి గానూ 120 మంది మాత్రమే పని చేస్తున్నారు. మెడికల్ కళాశాలలో కూడా అంతే. పెద్దాస్పత్రిలో పని చేసే కార్మికులనే మెడికల్ కళాశాలలో పని చేయిస్తుంటారు. ఇలా పలువురి జీతాలను మిగుల్చుకుంటారు. ఈ లెక్కలు బయట పడాలంటే బయోమెట్రిక్ హాజరు, ఎఫ్ఆర్ఎస్ హాజరు పోల్చి చూడాల్సిన అవసరం ఉంది. కొత్తగా చేర్చుకుంటే లంచాలు కొంతమంది చదువులేని కార్మికులకు పుట్టిన తేదీ లేదు. ఆధార్ ఉండటం లేదు. పీఎఫ్ ఖాతాలో నగదు జమ చేసేందుకు ఏదో ఒక గుర్తింపు ఉండాలి. అయితే 14 మంది కార్మికులకు పాస్‌పోర్టు తయారు చేయించి ఇస్తామని దానిలోని పుట్టిన తేదీ ఆధారంగా పీఎఫ్ నగదు జమ చేస్తామని మేనేజర్, ఒకరిద్దరు సూపర్ వైజర్లు నమ్మబలికారు. నెల్లూరులోనే పాస్ పోర్టు కార్యాలయం ఉంది. ఫీజు కేవలం రూ.1500 మాత్రమే. ఏజెంట్ ఫీజు మరో రూ.1000 కలుపుకుని మొత్తం రూ 2,500 మాత్రమే. 14 మంది కార్మికులకు పాస్‌పోర్టు చేయిస్తామని రూ.15 వేల వంతున వసూలు చేశారు. ఈ విషయాన్ని ఇటీవల జరిగిన సమావేశంలో నేరుగా ఒక కార్మికురాలు ధైర్యం చేసి హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ కో ఆర్డినేటర్ మడపర్తి శ్రీనివాసులుకు తెలిపింది. ఎవరు వసూలు చేశారని ఆయన అడగగా ఒక సూపర్వైజర్ను నేరుగా వేలుపెట్టి చూపింది. అయితే తమను ఉద్యోగంలో నుంచి తీసేస్తారనే భయంతో పలువురు ఫిర్యాదు చేయడం లేదు. నెలకు రూ.80 లక్షలు విడుదల పెద్దాస్పత్రి, మెడికల్ కళాశాలలో పని చేసే పారిశుద్ధ్య, సెక్యూరిటీ గార్డులకు నెలకు ప్రభుత్వం రూ.80 లక్షలు విడుదల చేస్తోంది. అగ్రిమెంట్ ప్రకారం పారిశుద్ధ్యం బాగుండాలి. డ్రైనేజీ అస్తవ్యస్తంగా ఉండకూడదు. మ్యాన్ హోల్స్ శుభ్రపరచాలి. పరిసరాల్లో గడ్డి లేకుండా చేయాలి. ఇలా పది రకాలుగా నిబంధనలు పాటించాలి. ఒక్కో నిబంధన సక్రమంగా పూర్తి చేస్తే అందుకు కొన్ని మార్కులుంటాయి. ఈ నిబంధనలు ఏమీ పాటించక పోయినా పెద్దాస్పత్రి సూపరింటెండెంట్‌గా సిద్ధానాయక్ శానిటేషన్‌కు 96 శాతం మార్కులు తగ్గకుండా వేస్తున్నారు. అంటే రూ.80 లక్షల్లో రూపాయి కూడా తగ్గకుండా ఏజెన్సీకి అందుతాయి. ఈ నిధుల్లో రాజకీయ నాయకుల దగ్గర నుంచి అధికారుల వరకు కమీషన్లు చేతులు మారుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. లంచాలు తీసుకుని కొత్తవారి నియామకం కొత్తగా సెక్యూరిటీ గార్డులను, శానిటరీ వర్కర్స్‌ను చేర్చుకుంటే వారి నుంచి రూ.35 వేలు నుంచి రూ.50 వేలు వరకు వసూలు చేస్తున్నారు. సూపర్వైజర్కు రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నారు. లేదంటే కొంతకాలం పాటు జీతాలు లేకుండా పని చేయాలని ఒప్పందాలు చేసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. గూడూరు పట్టణానికి చెందిన ఓ కార్మికురాలు మెడికల్ కళాశాలలో లంచాలు ముట్టచెప్పించి ముగ్గురు వ్యక్తులను చేర్పించినట్టు విశ్వసనీయ సమాచారం. లంచాలతో ఫేక్ సర్టిఫికెట్లు పారిశుద్ధ్య కార్మికురాలిగా పని చేస్తే గట్టిగా వచ్చేది రూ.10వేలు మాత్రమే. అయితే ఆస్పత్రిలో పనిచేసే ఒక కార్మికురాలు ఒకటిన్నర సంవత్సరం క్రితమే మానేసింది. ఆమె మూడు నెలల క్రితం పెద్దాస్పత్రిలో పని చేస్తున్నట్టు కటింగ్స్ పోను ఇంకా రూ.30వేలు జీతం వస్తున్నట్టు ఒక శాలరీ సర్టిఫికెట్‌ను ఏజెన్సీ సంస్థ పేరుతో ఇచ్చారు. దానిని బ్యాంకులో చూపెట్టి రూ.3లక్షలు రుణం కూడా ఆమె పొందింది. ఇందుకోసం ఆ మహిళ లంచం ముట్టచెప్పింది. మేనేజర్‌కు అనుకూలంగా ఉన్న ఓ సూపర్ వైజర్ లంచాలు తీసుకుని ఇలాంటి ఫేక్ సర్టిఫికెట్లను పలువురికి ఇచ్చింది. జీతాలు, పీఎఫ్‌లో కోతలు శానిటరీ, సెక్యూరిటీ విభాగాల్లో కొన్ని లోపాలున్నట్టు తెలిసింది. ఈ విషయాన్ని ఏజెన్సీ కాంట్రాక్టర్ దృష్టికి తీసుకెళ్లాం. ఆయన నాలుగు రోజుల్లో అన్నీ సరిచేస్తామన్నారు. తాము పరిశీలించి కార్మికులకు న్యాయం చేస్తాం. లోపాలు సరిచేస్తాం. – నరేంద్ర, సూపరింటెండెంట్, ఎఫ్ఏసీ, పెద్దాస్పత్రి ప్రభుత్వ అగ్రిమెంట్ ప్రకారం పారిశుద్ధ్య కార్మికులకు జీతంగా రూ.16 వేలు ఇవ్వాల్సి ఉండగా పీఎఫ్, ఈస్‌ఐ లాంటి కటింగ్స్ పోగా రూ.13,500 కార్మికుని ఖాతాలో జమ చేయాలి. అలాగే సెక్యూరిటీ సిబ్బందికి సంబంధించి ఇవ్వాల్సిన రూ.14,800 జీతంలో పీఎఫ్, ఈఎస్ఐ తదితరాలు పోగా రూ.10,500 జమ చేయాలి. అయితే వీరికి ఇవ్వాల్సిన జీతం పూర్తి స్థాయిలో అందడం లేదు. రెగ్యులర్‌గా డ్యూటీలకు వచ్చినప్పటికీ చదువురాని అనేక మందికి హాజరు తగ్గించి వేసి జీతాలు ఇస్తున్నారు. కొంతమందికి రూ.6 వేలు నుంచి రూ.7 వేలు మాత్రమే ఇస్తున్నారు. సెక్యూరిటీ సిబ్బందిదీ అదే పరిస్థితి. ఇక కార్మికుని ఖాతాలో జమ చేయాల్సిన పీఎఫ్‌లో ప్రతి నెలా కొంత మందికి కోత విధిస్తున్నారు. జీతం ఎందుకు తగ్గించారని ప్రశ్నిస్తే ఇక వేధింపులే. కార్మికుల నోట్లో మట్టి కొడుతున్నారు. -
ప్రజలకు ఇబ్బంది లేకుండా..
● పెనుశిల అభయారణ్య ఎకో సెన్సిటివ్ జోన్‌కు ప్రణాళిక ● కలెక్టర్ ఆనంద్ నెల్లూరు(అర్బన్): స్థానికంగా ఉండే ప్రజలకు ఇబ్బంది లేకుండా పెనుశిల నరసింహ అభయారణ్యం ఎకో సెన్సిటివ్ జోన్ మాస్టర్ ప్రణాళికను సిద్ధం చేయాలని కలెక్టర్ ఆనంద్ అటవీ శాఖ అధికారులు, సంబంధిత స్టేక్ హోల్డర్లకు సూచించారు. గురువారం సాయంత్రం నెల్లూరు కలెక్టరేట్లోని శంకరన్ హాల్లో ఎకో సెన్సిటివ్ జోన్, జిల్లాలోని చిత్తడినేలను నోటిఫై చేసే అంశాలపై సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అటవీ శాఖాధికారి మహబూబ్‌బాషా వాటికి సంబంధించిన మాస్టర్ ప్లాన్‌ను వివరించారు. కేరళలోని తిరువంతపురం నుంచి వచ్చిన సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ జోన్ రీజినల్ డైరెక్టర్ డాక్టర్ జయచంద్ర మాట్లాడుతూ అభయారణ్యంలో మాస్టర్ ప్లాన్‌కు సంబంధించిన నిబంధనలు, నిషేధించాల్సిన అంశాల గురించి వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్లాన్‌లోని అంశాలను ఎకో సెన్సిటివ్ జోన్లో నివసించే ప్రజలకు వివరించి వారి నుంచి అభిప్రాయాలు తీసుకోవాలన్నారు. నెల్లూరు, రాపూరు, ఆత్మకూరు, ఉదయగిరి పరిధిలో ఎన్నుకోబడిన చిత్తడి నేలలను నోటిఫై చేసి వాటిని పరిరక్షించేందుకు ఎలాంటి అభ్యంతరాలున్నా శుక్రవారం సాయంత్రంలోపు తనకు ఫిర్యాదు చేయాలన్నారు. ఫిర్యాదులు లేకపోతే 5 నోటిఫికేషన్లను రాష్ట్ర స్థాయి వెబ్‌ల్యాండ్ అథారిటికీ పంపుతామన్నారు. కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్ఈ శరత్‌కుమార్‌రెడ్డి, జిల్లా వ్యవసాయాధికారిణి సత్యవతి, ఆర్అండ్బీ డీఈఈ రంగయ్య, మత్స్యశాఖ జేడీ శాంతి, డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి, నెల్లూరు, రాపూరు, ఉదయగిరి, ఆత్మకూరు, కావలి రేంజ్ ఆఫీసర్లు మాల్యాద్రి, రవీంద్రబాబు, కుమార్‌రాజా, శేఖర్, రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆటోలో నుంచి జారిపడి..
● ఒకరి మృతి కావలి(జలదంకి): కావలి రూరల్ మండలం కొత్తసత్రం గ్రామానికి చెందిన డోకి రవికుమార్ (36) అనే వ్యక్తి ఆటోలో నుంచి జారిపడి మృతిచెందిన ఘటన గురువారం జరిగింది. కావలి రూరల్ పోలీసుల కథనం మేరకు.. కొత్తసత్రానికి చెందిన రవికుమార్ ఆకుకూరలు పండించి కావలిలో అమ్ముకుంటూ జీవనం సాగిస్తాడు. గురువారం అతను గ్రామానికి చెందిన అరగల పొట్టయ్య ఆటోలో కావలికి వస్తుండగా మార్గమధ్యలో జారి రోడ్డుపై పడ్డాడు. స్థానికులు చికిత్స నిమిత్తం కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. రవికుమార్‌కు భార్య చంద్రకళ, ఇద్దరు పిల్లలున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గిరిజన కాలనీలో అగ్నిప్రమాదం
● పూర్తిగా కాలిపోయిన నాలుగు పూరిళ్లు చేజర్ల(ఆత్మకూరు): మండలంలోని ఆదూరుపల్లి గిరిజన కాలనీలో గురువారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. నాలుగు పూరిళ్లు పూర్తిగా కాలిపోయాయి. ఇళ్లలో ఉన్న గృహోపకరణాలు, ఇతర సామ గ్రి పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. స్థానికులు స్పందించి మంటలు అదుపు చేసినా అప్పటికే భారీ నష్టం సంభవించిందని గిరిజన కుటుంబాల వారు కన్నీటి పర్యంతమయ్యారు. సర్వం కోల్పోయామని వాపోయారు. ప్రమాదం జరగడానికి గల కారణాలు తెలియరాలేదు. సమాచారం అందుకున్న చేజర్ల అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి వచ్చి మంటలను అదుపు చేసేందుకు చర్యలు తీసుకున్నారు. కాగా ఈ ప్రమాదానికి సమీపంలోనే విద్యుత్ తీగలు తెగి నేలపై పడ్డాయి. అయితే మధ్యా హ్నం నుంచి విద్యుత్ సరఫరా లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. -
‘పది’ సప్లిమెంటరీ పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు
నెల్లూరు రూరల్: జిల్లాలో ఈనెల 19 నుంచి 28వ తేదీ వరకు జరిగే పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లను పక్కాగా చేయాలని కలెక్టర్ ఒ.ఆనంద్ ఆదేశించారు. నెల్లూరు కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో గురువారం పరీక్షలపై సంబంధిత అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని కేంద్రాల్లో నిరంతర విద్యుత్ సరఫరా జరిగేలా చూడాలన్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా తాగునీటి వసతి సౌకర్యం కల్పించాలన్నారు. కేంద్రాల వద్ద తగిన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులు కేంద్రాలకు సకాలంలో చేరుకునేందుకు బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులు సూచించారు. హాల్‌టికెట్ చూపించిన వారికి ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. విద్యాశాఖ అధికారులు మాట్లాడుతూ పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల జరుగుతాయన్నారు. 38 సెంటర్లలో 5,422 మంది హాజరుకానున్నట్లు చెప్పారు. అలాగే ఈనెల 19 నుంచి 24వ తేదీ వరకు ఏపీ ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. టెన్త్‌లో 745 మంది అభ్యర్థుల కోసం 12 సెంటర్లు, ఇంటర్లో 949 మంది కోసం 6 సెంటర్లు ఎంపిక చేసినట్లు చెప్పారు. పరీక్షల నిర్వహణకు చీఫ్ సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లు, తనిఖీ బృందాలను నియమించినట్లు వెల్లడించారు. సమావేశంలో ఆర్ఐఓ వరప్రసాద్‌రావు, అధికారులు పాల్గొన్నారు. -
భక్తుల కొంగు బంగారం.. కామాక్షితాయి
బుచ్చిరెడ్డిపాళెం రూరల్: మండలంలోని జొన్నవాడలో ఉన్న మల్లికార్జున సమేత కామాక్షితాయి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 17 నుంచి 27వ తేదీ వరకు జరుగనున్నాయి. 17న శనివారం అంకురార్పణతో మొదలవుతాయి. 18న జరిగే ధ్వజారోహణ పూజల్లో సంతానప్రాప్తి కోసం మహిళలకు ప్రసాదం (కొడిముద్ద) అందజేస్తారు. సాయంత్రం వివిధ పూజలు, శేష వాహనసేవ, 20న పురుషామృగ వాహనసేవ, 21న సింహ వాహనసేవ, 22న హంస వాహనసేవ, 23న రావణసేవ, 24న వెండి నందిసేవ, 25న రథోత్సవం, సాయంత్రం పెనుబల్లి గ్రామంలో గజసింహవాహన సేవలు జరుగుతాయి. 26న ఉదయం కల్యాణోత్సవం, సాయంత్రం తెప్సోత్సవం, 27న ఉదయం ధ్వజావరోహణ, అలకలతోపు, రాత్రి 8 గంటలకు అశ్వవాహనసేవ, రాత్రి 10 గంటలకు ఏకాంతసేవ, పుష్పాలంకరణతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని ఈఓ అర్వభూమి వెంకట శ్రీనివాసులురెడ్డి తెలిపారు.రేపట్నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు -
30 మందిని తొలగిస్తున్నట్లు బెదిరించి..
ఐదు రోజుల క్రితం సంబంధిత ఏజెన్సీకి చెందిన మేనేజర్ ఆస్పత్రిలోని 10 మంది సూపర్ వైజర్లను, 20 మంది శానిటరీ సిబ్బందిని తొలగిస్తున్నట్టు ఆస్పత్రికి చెందిన గ్రూపులో మెసేజ్ పోస్టు చేశారు. వారికి హాజరు వేయవద్దని రాంబాబు అనే సూపర్ వైజర్‌కు సూచించారు. అలాగైనా బెదిరించి వీరి నుంచి డబ్బులు వసూలు చేయాలనే ఉద్దేశంతో ఇలా చేశారని ప్రచారం జరుగుతోంది. దీంతో శానిటరీ సిబ్బంది తిరగబడ్డారు. ఈ విషయమై ఏజెన్సీ కాంట్రాక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో సంబంధిత కాంట్రాక్టర్ ప్రస్తుతానికి ఆ మేనేజర్‌ను పక్కన బెట్టారు. గతంలోనూ ఇలాగే జరిగినా వారం తర్వాత అదే మేనేజర్‌ను కొనసాగించారు. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుందని కార్మికులంటున్నారు. -
18న పొట్టి శ్రీరాములు జయంతి ఉత్సవం
నెల్లూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం, అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 18వ తేదీన ఉదయం 10 గంటలకు నెల్లూరు స్టోన్‌హౌస్‌పేటలోని ఎస్బీఎస్ కల్యాణ మండపంలో పొట్టి శ్రీరాములు 125వ జయంతి ఉత్సవాలు జరుగుతాయని కలెక్టర్ ఆనంద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉత్సవాలు వచ్చే ఏడాది మార్చి 16వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతాయన్నారు. నెల్లూరులో జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకోండి ● జేసీ కార్తీక్ నెల్లూరు రూరల్: అందరికీ ఇళ్ల పథకంలో పేదలు ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకోవాలని జేసీ, నోడల్ అధికారి కార్తీక్ గురువారం ఒక ప్రకటనలో కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, నగర, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చిందన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు లేకపోతే సేకరించి పేదలకు ఇళ్ల స్థలాలుగా ఇవ్వడం జరుగుతుందన్నారు. జీవిత కాలంలో ఒక కుటుంబానికి ఒకసారి మాత్రమే ఇంటి స్థలం ఇవ్వడం జరుగుతుందన్నారు. ఒకసారి స్థలం పొందిన వారు మళ్లీ పొందకుండా ఆధార్, రేషన్‌కార్డులను లింక్ చేస్తారన్నారు. స్థలం మంజూరైన రెండు సంవత్సరాల్లో ఇంటిని నిర్మించుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ పథకం కింద ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో 1,221, పట్టణ ప్రాంతాల్లో 417 మంది దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. కండలేరులో 43.941 టీఎంసీలు రాపూరు: కండలేరు జలాశయంలో గురువారం నాటికి 43.941 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ విజయకుమార్‌రెడ్డి తెలిపారు. సత్యసాయిగంగ కాలువకు 1,010, పిన్నేరు కాలువకు 100, లోలెవల్ కాలువకు 60, హైలెవల్ కాలువకు 110, మొదటి బ్రాంచ్ కాలువకు 75 క్యూసెక్కుల వంతున నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. -
స్మార్ట్ మీటర్లు, విద్యుత్ కొనుగోళ్లపై టీడీపీ ద్వంద్వ వైఖరి
నెల్లూరు (వీఆర్సీసెంటర్): రాష్ట్రంలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు టీడీపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని, ఈ విషయంలో ద్వంద్వ వైఖరిని అవలబిస్తుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శించారు. బుధవారం నగరంలోని బాలాజీనగర్‌లో ఉన్న సీపీఎం జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటు చేయకుండా జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి హైకోర్టుకు వెళ్లారని, పయ్యావుల కేశవ్ కూడా విద్యుత్ కొననుగోళ్ల విషయంలో కోర్టుకు వెళ్లారని వీరు ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న విద్యుత్ కొనుగోళ్లు, స్మార్ట్ మీటర్ల ఏర్పాటు విషయాల్లో కేసులను కొనసాగిస్తారా?ఉపసంహరించుకుంటారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఒక విధంగా, అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగా టీడీపీ నాయకులు వ్యవహరిస్తున్నారన్నారు. విద్యుత్ కొనుగోలు విషయంలో కూటమి ప్రభుత్వం రూ.1.25 లక్షల కోట్లపైగా అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. అదే విధంగా టిడ్కో గృహాలు ఇప్పటికీ లబ్ధిదారులకు ఇవ్వలేదని, గత ఎన్నికల సమయంలో టీడీపీ చెప్పిన విధంగా పేదలకు నగరాల్లో నివసించే వారికి 2 సెంట్లు, గ్రామాల్లో నివసించేవారికి 3 సెంట్లు భూమి ఇచ్చి రూ.5 లక్షల ఇంటి నిర్మాణానికి అందజేయాలని డిమాండ్ చేశారు. అమెరికా ఒత్తిడికి తలొగ్గిన మోదీ అమెరికా ఆదేశాలతో కాల్పుల విరమణ జరిగిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా చెప్పడంతో మనదేశ ప్రతిష్ట పూర్తిగా దిగజారిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు దుయ్యబట్టారు. ఉగ్రవాదుల్ని తుదముట్టించే వరకు ఆపరేషన్ సిందూర్ ఆగదని దేశ ప్రజలను ప్రదాని మోదీ మభ్య పెడతున్నారని విమర్శించారు. తీవ్రవాదుల్ని మట్టుబెట్టడంలో పూర్తిగా వైఫల్యం చెందిన మోదీ దాన్ని కప్పిపుచ్చుకునేందుకు, ఆపరేషన్ సిందూర్ సక్సెస్ అంటూ తిరంగా ర్యాలీ చేపట్టాలని బీజేపీ నిర్ణయించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. దేశ ప్రజలను ఐక్యం చేసి, కశ్మీర్ ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకుని అన్ని పార్టీలను ఒక తాటి పైకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. కశ్మీర్ విషయంలో తాము మధ్యవర్తిత్వం నెరిపామని ట్రంప్ చెప్పడం మోదీ చేతకాని తనం బయట పడినట్లు అయిందన్నారు. దేశాన్ని, మోదీని ట్రంప్ ఆదేశిస్తున్నారని ఇది ఎంతో సిగ్గు చేటన్నారు. మతపరమైన ప్రనసంగాలు, రెచ్చగొట్టే ప్రసంగాలు చేసే పవన్‌కళ్యాణ్ కాల్పుల విరమణపై నోరువిప్పడం లేదన్నారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్, జిల్లా నాయకులు మాదాల వెంకటేశ్వర్లు, అజయ్‌కుమార్ పాల్గొన్నారు. గతంలో కోర్టుల్లో కేసులు వేసిన టీడీపీ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఇదే బాటలో పయనిస్తున్న కూటమి ప్రభుత్వం కేసులు కొనసాగిస్తారా? ఉపసంహరించుకుంటారా? విద్యుత్ కొనుగోళ్లలో రూ.1.25 లక్షల కోట్ల అక్రమాలు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు -
మహా ప్రళయంపై ఆందోళనలో దళితులు
అటవీశాఖ భూముల్లో క్వారీ నిర్వహణకు అనుమతులిచ్చేందుకు పలు శాఖల అధికారులు బరి తెగించారు. అధికార పార్టీలోని అనకొండలు విసిరిన నోట్ల కట్టలకు కొండలను కానుక ఇచ్చేందుకు ఆగమేఘాల మీద సిద్ధపడ్డారు. రాసివ్వడానికి ఇదేమైనా వీరికి అత్తగార్లు ఇచ్చిన జాగిర్లు కాదే. అటవీశాఖ భూములను ప్రజాప్రయోజనాలకు వినియోగించాలన్నా.. కేంద్ర అటవీశాఖతోపాటు పర్యావరణ శాఖ అనుమతులు తీసుకోవాల్సి ఉంది. ఇందుకు విరుద్ధంగా జిల్లాలోని అటవీ, పర్యావరణ, రెవెన్యూ శాఖలు కట్టకట్టుకుని వచ్చి ప్రజాభిప్రాయ సేకరణ చేయడం చూస్తే ఏ స్థాయిలో చట్టాన్ని ధిక్కరించి అధికార పార్టీకి ఊడిగం చేస్తున్నారో అర్థమవుతోంది. అటవీ భూముల్లో క్వారీకి ఆగమేఘాల మీద అనుమతులు సంగం కొండ మీద క్వారీ ఏర్పాటు చేస్తున్నారనే సమాచారం తెలియడంతో కొండ కింద ఉన్న అరుంధతీయులు ఆందోళన చెందుతున్నారు. కొండపై క్వారీకి అనుమతిస్తే.. భవిష్యత్‌లో భారీ వర్షాలు కురిస్తే కొండ చెరియలు కరిగి దిగువన ఉన్న నివాసాలను కప్పేసే ప్రమాదం ఉందని స్థానికులు భయకంపితులు అవుతున్నారు. గతేడాది కేరళలోని వాయనాడ్ ప్రాంతంలో భారీ వర్షాలకు ఊరుకు ఊరుకే సమాధి అయిన విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితి తమకు ఎదువుతుందంటున్నారు. గతంలో కొండ దిగువన ఉన్న క్వారీ కోసం జరిపిన పేలుళ్ల ధాటికి సంగం రాళ్లచెలిక ఎస్సీ కాలనీలో రాళ్లు పడి పలు ఇళ్లు ధ్వంసం కాగా పలువురు గాయపడిన సందర్భాలు ఉన్నాయి. ఆ క్వారీని మూసివేస్తే ఆనంద పడ్డామని, మళ్లీ కొత్త క్వారీ వస్తే ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయపడుతున్నామని దళితులు ఆవేదన చెందుతున్నారు. ● -
స్వయంశక్తితో పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి
● కలెక్టర్ ఆనంద్ ఇందుకూరుపేట: ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో స్వయంశక్తి సంఘాల మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని కలెక్టర్ ఆనంద్ పిలుపునిచ్చారు. డీఎర్డీఏ ఆధ్వర్యంలో స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న అరటినార ఉత్పత్తుల శిక్షణా కేంద్రాన్ని బుధవారం కలెక్టర్ పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు ఈ శిక్షణా కేంద్రాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఇంటి వద్ద నుంచే మెరుగైన ఆదాయం పొందాలని కోరారు. శిక్షణ పూర్తి చేసుకొన్న మహిళలకు అరటినార ద్వారా ఉత్పత్తులను తయారు చేసేందుకు అవసరమైన యంత్రాల కోసం రుణాలు మంజూరు చేస్తామన్నారు. లాభాలు గడించేందుకు మార్కెట్ సౌకర్యం కల్పిస్తామన్నారు. వ్యర్థాల నుంచి సంపద సృష్టించాలనే లక్ష్యంతో రీసైక్లింగ్ యాక్టివిటీస్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ఇండియా మిషన్ సహకారంతో అరటి నారతో వస్తువులు తయారు చేయడంపై శిక్షణ ఏర్పాటు చేశామన్నారు. ఇందుకూరుపేటలో 30 మంది మహిళలను ఒక బ్యాచ్‌గా ఏర్పాటు చేసి శ్రీకాకుళానికి చెందిన అప్పమ్మ ద్వారా నెల రోజుల పాటు శిక్షణ ఇస్తున్నామన్నారు. తొలుత అరటి నార ద్వారా ఏ వస్తువులు తయారు చేస్తున్నారు, శిక్షణ ఎలా ఉంది, శిక్షణ పూర్తయిన తర్వాత సొంతగా వస్తువులను తయారు చేయగలరా, ఎంత ఖర్చవుతోంది, ఆదాయం ఎంత ఉంటుందని తదితర అంశాలపై శిక్షణ పొందుతున్న మహిళతో ముచ్చటించి ఆరా తీశారు. జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్‌గా అరటినార ఉత్పత్తులపై శిక్షణ ఇస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి, తహసీల్దారు కృష్ణప్రసాద్, ఏపీఎం సరిత, ఏసీ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. -
అభిప్రాయ సేకరణలో భిన్నాభిప్రాయాలు
● అదే కొండ మధ్యలో జాతీయ రహదారి నిర్మాణానికి క్లియరెన్స్‌కు ఏళ్ల తరబడి పట్టిన కాలం ● తాజాగా ఎన్‌హెచ్ విస్తరణకు అనుమతి ప్రతిపాదనలు ఏళ్లుగా పెండింగ్ ● క్వారీకి అనుమతులిస్తే వన్యప్రాణులకు చేటు ● దళిత కాలనీకి పర్యావరణ పోటు సంగం : కోట్లకు అధిపతులు.. అయినా వారి ధనదాహం తీరడం లేదు. ప్రకృతి సృష్టించిన సహజ సౌందర్యాలను విధ్వంసం చేస్తూ.. పర్యావరణాన్ని దెబ్బతీస్తూ.. అక్కడి నివసించే ప్రజల ప్రాణాలకు, కొండనే ఆవాసంగా చేసుకుని బతుకుతున్న వన్య ప్రాణులకు ముప్పు తలపెడుతూ భవిష్యత్‌లో మహా ప్రళయానికి అధికార పార్టీ పెద్దలు బరితెగించారు. ఇప్పటికే సహజ వనరులను దోచేసిన ఈ ముఠా తాజాగా ప్రకృతి సోయగాలను సైతం కనుమరుగు చేస్తూ.. ఇనుప పెట్టెలను నింపుకునే పనిలో పడ్డారు. రామా.. ఇదేంటి సుమా..! ఎన్నికల సమయంలో సంగం కొండను చూస్తే బాధ వేస్తుందని నంగనాచి ప్రసంగాలు చేసిన ఆనం రామనారాయణరెడ్డి ప్రస్తుతం సంగం కొండపై క్వారీకి అనుమతులివ్వడానికి సిద్ధపడడంపై విమర్శలకు దారితీస్తోంది. తన మంత్రి పదవికి అడ్డుగా రాకుండా వేమిరెడ్డి దంపతులపై ప్రేమతో కోవూరుఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి బంధువుకు ఇక్కడ క్వారీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ‘రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా; అన్నట్లు క్వారీని కట్టబెట్టడానికి అధికారుల యంత్రాంగం ఆగమేఘాల మీద పరుగులు తీస్తోంది. హడావుడిగా మంగళవారం సంగంలో ప్రజాభిప్రాయ సేకరణ సైతం చేపట్టి, ఎటువంటి సమాచారం బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. అయితే ప్రజాభిప్రాయ సేకరణలో పలువురు క్వారీతో వచ్చే సమస్యలు తెలిపినప్పటికి అధికారులు మౌనం పాటిస్తూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామనడం చెప్పినట్లు తెలుస్తోంది. కేంద్ర అటవీశాఖ అనుమతి లేకుండానే.. సంగం కొండ మీద అటవీ భూముల్లో కేంద్ర అటవీశాఖ అనుమతి లేకుండానే క్వారీ ఏర్పాటుకు ఆగమేఘాల మీద అడుగులు పడుతున్నాయి. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి బంధువు నెల్లూరుకు చెందిన డీ మమతారాణి సంగం కొండపై క్వారీలో 26,350 ఘ.మీ. కంకర తవ్వుకునేందుకు అనుమతినివ్వాలని అటవీ శాఖ అధికారులకు అర్జీ పెట్టుకున్నారు. వీరితోపాటు రెవెన్యూ, పర్యావరణ శాఖలకు సైతం భారీ స్థాయిలోనే నజరానాలను ముందుగానే ముట్టజెప్పినట్లు సమాచారం. దీంతో నెల రోజుల వ్యవధిలో అటవీ, పర్యావరణ, రెవెన్యూ శాఖల వద్దకు అర్జీ పరుగులు తీసింది. సంగం కొండ అటవీశాఖ రక్షిత ప్రాంతంలోని సర్వే నంబరు 361లోని 376వ కంపార్టుమెంట్లో 1.85 హెక్టార్ల భూమిని డీ మమతారాణికి క్వారీ నిర్వహణకు కౌలుకు ఇస్తున్నట్లు అటవీశాఖ అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. జాతీయ రహదారికి అనుమతికి ఏళ్ల తరబడి.. సంగం కొండ మధ్య నుంచి నెల్లూరు– ముంబై రహదారిని నిర్మించడానికి అప్పట్లో అటవీశాఖ నుంచి అనుమతులు రావడానికి సంవత్సరాల తరబడి సమయం పట్టింది. రాష్ట్ర అటవీశాఖకు సంబంధించిన భూములైనప్పటికీ ప్రజాప్రయోజనాల కోసమైనా కేంద్ర అటవీశాఖ అనుమతి పొందాల్సి ఉంటుంది. ఈ కారణంగానే కొండ మధ్య భాగం తవ్వి జాతీయ రహదారిని నిర్మించడానికి చాలా కాలం జాప్యం జరిగింది. తాజాగా ఇదే రహదారిని విస్తరించేందుకు అనుమతుల కోసం ప్రతిపాదనలు చేసి ఏళ్లు గడుస్తోంది. అయినా ఎప్పటికి వస్తుందో.. అసలు రాదో తెలియని పరిస్థితి. అయితే క్వారీ నిర్వహణ ప్రజాప్రయోజనాల పరిధిలోకి రాకపోయినప్పటికీ, కేంద్ర అటవీశాఖ అనుమతి లేకపోయినప్పటికీ జిల్లా అటవీశాఖాధికారులు అనుమతులిచ్చేయడం వెనుక రూ.కోట్లల్లో చేతులు మారాయనే అరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగా చట్టాన్ని, అధికారాలను ధిక్కరించి అడ్డగోలుగా క్వారీకి అనుమతులిచ్చేందుకు ఆగమేఘాల మీద అధికారులు హడావుడి చేస్తున్నారు. వన్యప్రాణులకు చేటు సంగం కొండపై రకరకాల పాములు, కోతులు, జింకలు వంటి వన్యప్రాణులు ఉన్నాయి. ఇక్కడ క్వారీ ఏర్పాటు చేస్తే వీటి మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. అయితే ఇక్కడ వన్యప్రాణులు లేవని అటవీ శాఖ అధికారులు నిర్ధారించడం వారి అవివేకానికి నిదర్శనం. సంగం కొండ మీద నుంచి పలు సందర్భాల్లో జింకలు నీటి కోసం సంగం జనావాసాల్లోకి వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వన్యప్రాణులకు ఇబ్బందులు వచ్చే అటవీ అనుమతులు ఇవ్వొవద్దని దేశ అత్యున్నత న్యాయస్థానం సైతం పలు సందర్భాల్లో తీర్పులు ఇచ్చినా రాజకీయ నేతల ఒత్తిడితో అటవీశాఖ అధికారులు అనుమతులిచ్చినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో ఎవరైనా కోర్టుకు వెళితే తమ పీకల మీదకు వస్తుందని అటవీశాఖ అధికారులు సతమతమవుతున్నారు. సంగం కొండ దిగువ ప్రాంతంలో ఉన్న అరుంధతీయవాడవన్యప్రాణులకు ముప్పు సంగం కొండ మీద క్వారీ ఏర్పాటు చేస్తే వన్యప్రాణులకు ముప్పు ఏర్పడుతుంది. ప్రతి నిత్యం క్వారీలో జరిగే పేలుళ్ల వల్ల స్థానికంగా ఉండే నివాసాలకు ప్రమాదం పొంచి ఉంది. రెండేళ్ల క్రితం ఓ నాయకుడు క్వారీకి దరఖాస్తు చేసుకోగా అప్పట్లో జరిగిన ప్రజాభిప్రాయసేకరణలో నిరాకరించడం జరిగింది. – కాకు మధుసూదన్‌యాదవ్, టీడీపీ నేత, సంగం ప్రాణాలతో చెలగాటం సంగం కొండపై క్వారీ ఏర్పాటు చేసి దళితుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. క్వారీ పేలుళ్లు ధాటికి వారి ప్రాణాలతోపాటు ఆస్తులు పోయే ప్రమాదముంది. ఎట్టిపరిస్థితుల్లో క్వారీకి అనుమతుల ఇవ్వడానికి ఇక్కడి వారెవరూ సిద్ధంగా లేరు. అవసరమైతే న్యాయపోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అధికారులు పునరాలోచన చేయాలి. – తోకల మురళి, ఎస్ఎఫ్ఐ, జిల్లా మాజీ అధ్యక్షుడు క్వారీ ఏర్పాటుపై సంగం సచివాలయంలో మంగళవారం అధికారులు నిర్వహించిన అభిప్రాయ సేకరణలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ముందుగా క్వారీ అనుమతికి దరఖాస్తు చేసుకున్న వ్యక్తులు తమ మనుషులతో మాట్లాడించారు. దీంతో ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన అనేక మంది క్వారీ ఏర్పాటు చేస్తే సమస్య వస్తుందని తెలిసి కూడా రాజకీయ నాయకుల ముందు తమ అభిప్రాయాలు వెల్లడించలేదు. అయితే ప్రజలకు నష్టం వాటిల్లే క్వారీతో ఇబ్బందులు ఉన్నాయని పలువురు సంఘాల నేతలు, టీడీపీ నాయకులు సైతం పేర్కొన్నారు. -
చీకట్లోనే బ్రహ్మోత్సవాలు
● విద్యుత్ శాఖ నిర్లక్ష్యం ● 7 గంటల పాటు సరఫరాలో కోత ఉలవపాడు: రథోత్సవం కోసం అంటూ విధించిన విద్యుత్ కోత చివరకు బ్రహ్మోత్సవాలను కూడా చీకటి చేసింది. విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా మండల కేంద్రంలో 7 గంటలపాటు విద్యుత్ లేదు. సాధారణంగా ప్రతి ఏడాది సాయంత్రం 5 గంటలకు రథోత్సవం ప్రారంభమై 7 గంటల్లోపు ముగిసేది. ఆ తర్వాత విద్యుత్ వెంటనే ఇచ్చేవారు. అయితే ఈ ఏడాది రథం స్థానంలో పుష్పపల్లకి రథం ఏర్పాటు చేశారు. ఇంకా త్వరగా పూర్తి కావాల్సి ఉన్నా బాగా ఆలస్యంగా ప్రారంభించారు. దీంతో రథోత్సవం 6.30 గంటలకు ప్రారంభమై 8.45 గంటలకు తిరిగి గుడి వద్దకు వచ్చింది. అయితే విద్యుత్ శాఖ అధికారులు మాత్రం మధ్యాహ్నం 2.45 గంటలకే విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. పుష్పపల్లకి రథోత్సవం తిరిగొచ్చిన గంట తర్వాత కూడా 9.45 గంటల వరకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించలేదు. రథోత్సవానికి ముందు 3.45 గంటలు, తర్వాత గంట, మధ్యలో 2.15 గంటల లెక్కన 7 గంటల పాటు ఏకధాటిగా విద్యుత్‌కోత విధించడంలో అసలు ఎండాకాలంలో అల్లాడుతున్న జనానికి మరింత ఇబ్బంది కలిగించారు. స్థానికంగా ఏఈ లేకపోవడం, పైఅధికారులెవరూ రాకపోవడంతో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని స్థానికులు మండి పడ్డారు. బ్రహ్మోత్సవాల కోసమే విద్యుత్ సరఫరా నిలిపివేసినా.. చీకట్లోనే నిర్వహించాల్సిన దుస్థితి ఏర్పడింది. దుకాణాలు, విద్యుత్ కటౌట్లన్నీ రాత్రి వరకు చీకట్లోనే ఉన్నాయి. రథోత్సవం మండల కేంద్రంలోని కేవలం పాతూరులోని 4 బజార్లలో మాత్రమే వెళుతోంది. దీని కోసం జంపర్లు ఏర్పాటు చేసి ఆ కొంత ప్రాంతం తీసి గ్రామం అంతా ఇవ్వవచ్చు. కానీ అలా చేయకుండా ఊరు మొత్తం 7 గంటలు విద్యుత్ కోత విధించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
కళ్లకు గంతలు కట్టుకుని కార్మికుల నిరసన
ముత్తుకూరు (పొదలకూరు): మండలంలోని నేలటూరు జెన్కో అవుట్ సోర్సింగ్ కార్మికులు నెల రోజులకు పైగా కాంట్రాక్ట్ కార్మికులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం వినూత్నంగా కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలియజేశారు. జేఏసీ నాయకులు మాట్లాడుతూ 32 రోజులుగా వివిధ రకాలుగా నిరసన వ్యక్తం చేస్తున్నా.. యాజమాన్యం స్పందించకపోవడం సిగ్గు చేటైన విషయమని ధ్వజమెత్తారు. అవుట్ సోర్సింగ్ కార్మికులను కాంట్రాక్ట్ కార్మికులుగా పరిగణించాలన్నారు. ఈ ఆందోళనలో జేఏసీ కన్వీనర్ గోడ భాస్కర్, నాయకులు శేఖర్, ఆదిశేషయ్య, శ్యాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇంటర్ పరీక్షలకు 560 మంది గైర్హాజరు నెల్లూరు (టౌన్): ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా బుధవారం 560 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఉదయం జరిగిన ప్రథమ సంవత్సరం పరీక్షకు 14,130 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 13,626 మంది హాజరు కాగా, 504 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం నుంచి జరిగిన ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షకు 1,461 మందికి 1,405 మంది విద్యార్థులు హాజరయ్యారు. 56 మంది గైర్హాజరయ్యారు. ఆర్ఐఓ టి. వరప్రసాదరావు 17 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. విమానాశ్రయ భూములకు పరిహారంపై విచారణ దగదర్తి: దగదర్తి విమానాశ్రయ భూములకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న రైతులకు చెల్లించాల్సిన పరిహారంపై బుధవారం తహసీల్దార్ కృష్ణ అధ్యక్షతన కొత్తపల్లి కౌరుగుంట సచివాలయంలో విచారణ నిర్వహించారు. రెవెన్యూ రికార్డుల్లో తప్పులు, కుటుంబ వివాదాల కారణంగా కొంత మంది రైతులకు పరిహారం చెల్లించే ప్రక్రియ నిలిచిపోయిందన్నారు. గత ప్రభుత్వంలో పరిహారం చెల్లించేందుకు చర్యలు చేపట్టినా వివాదాలతో ముందుకు రాలేదు. ప్రస్తుతం విమానాశ్రయ పనులు వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో పెండింగ్‌లో ఉన్న రైతులకు పరిహారం చెల్లించేలా చర్యలు చేపడుతున్నామని తహసీల్దార్ కృష్ణ తెలిపారు. ఎటువంటి వివాదాలు లేని భూములకు పరిహారం చెల్లిస్తామని, రైతులు అందరూ ముందుకు రావాలని కోరారు. కొత్తపల్లి కౌరుగుంట రెవెన్యూ పరిధిలో 65 మంది రైతులకు సంబంధించి సుమారు 89 ఎకరాలకు పరిహారం చెల్లించాల్సి ఉందన్నారు. సీజేఎఫ్ఎస్ భూము లు, డీకేటీ భూములకు ఎకరాకు రూ.13 లక్షలు, పట్టా భూములకు రూ.26 లక్షల పరిహారం చెల్లిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కేకే గుంట సర్పంచ్ అశోక్, వీఆర్ఓ బాలనాగమ్మ, ఆర్ఐ శివ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ తహసీల్దార్ సస్పెన్షన్ నెల్లూరు (అర్బన్): నెల్లూరురూరల్ మండల తహసీల్దార్ లాజరస్ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ బుధవారం రాత్రి కలెక్టర్ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజాసమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీలను సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ పదే పదే ఆదేశిస్తున్నారు. ఒక వేళ పరిష్కరించలేకపోతే అందుకు గల కారణాలు స్పష్టంగా వివరించాలని సూచించారు. అయితే భూ సమస్యలు, ఇతర సమస్యలకు సంబంధించి 17 వినతులను పరిష్కరించకుండానే పరిష్కరించినట్టు ఆన్లైన్లో నమోదు చేశారు. విధుల్లోనూ నిర్లక్ష్యం వహించారు. దీంతో ఈ మేరకు తహసీల్దార్‌ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. కృష్ణపట్నం పోర్టులో కస్టమర్ల సమావేశం ముత్తుకూరు (పొదలకూరు) : అదానీ కృష్ణపట్నం పోర్టులో బుధవారం కస్టమర్ల సమావేశం నిర్వహించారు. పోర్టు, బీపీసీఎల్ గతి యూనిట్లో లోడింగ్ పెంపొందించేందుకు వివిధ మార్గాలపై చర్చించారు. ఇందుకోసం భద్రతా మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని, పోర్టు నిబంధనలను ఉల్లంగించకూడదన్నారు. అనంతరం ఓబులవారిపల్లె–కృష్ణపట్నం రైల్వేలైన్‌ను పరిశీలించారు. ఈ సమావేశంలో సీనియర్ డీసీఎం రాంబాబు వావిలపల్లి, సీనియర్ డీఓఎం డి.నరేంద్రవర్మ, సీనియర్ డీఎస్ఓ బి.ప్రశాంత్‌కుమార్, సీనియర్ డీఎంఈ సంజయ్ అంగోతు, పబ్లిక్ రిలేషన్ ఇన్స్పెక్టర్ జే దినేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
బకాయిల విడుదల అవాస్తవం
● మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపిన సీహెచ్‌ఓలు నెల్లూరు(అర్బన్): డిమాండ్లు తీర్చాలని తాము నిరసన తెలుపుతుంటే పెండింగ్ బకాయిలు విడుదల చేసినట్టు ప్రభుత్వం అబద్ధపు ప్రచారం చేస్తోందని సీహెచ్‌ఓల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు భాను మహేష్ తెలిపారు. జిల్లాలో సీహెచ్‌ఓలు చేస్తున్న సమ్మె బుధవారం నాటికి 16వ రోజుకు చేరింది. నెల్లూరులోని డీఎంహెచ్ఓ కార్యాలయం వద్ద మోకాళ్లపై నిలబడి నిరసన దీక్ష చేశారు. అనంతరం భాను మహేష్ మాట్లాడుతూ బకాయిలు రూ.77,33,81,250లు అందించినట్లు ప్రభుత్వం పత్రికా ప్రకటనలు ఇవ్వడం అన్యాయమన్నారు. తమ బ్యాంక్ ఖాతాల్లో ఒక్క రూపాయి కూడా జమ కాలేదన్నారు. బకాయిలు ఈరోజు కాకపోతే ఇంకో రోజైనా వస్తాయన్నారు. ప్రధానమైన డిమాండ్లు తీర్చాలని కోరారు. ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా 23 శాతం వేతనాలు పెంచాలని, వర్క్ చార్జ్ నిబంధనలు విడుదల చేయాలని, విలేజ్ హెల్త్ క్లినిక్‌ల అద్దెలు చెల్లించాలని, పీఎఫ్‌ను పునరుద్ధరించాలని కోరారు. అప్పటి వరకు ఆందోళనలు ఆపేది లేదన్నారు. కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా కో–ఆర్డినేటర్ ఆదిల్ తదితరులు పాల్గొన్నారు. -
అత్తారింటికి చేరిన నృసింహుడు
రాపూరు: పెంచలకోనలో ఆరురోజులపాటు బ్రహ్మోత్సవాలు జరుపుకొన్న అనంతరం పెనుశిల లక్ష్మీనరసింహస్వామి, చెంచులక్ష్మీని వివాహం చేసుకుని గోనుపల్లి గిరిజనవాడలోని అత్తారింటికి బుధవారం చేరుకున్నారు. మండలంలోని గోనుపల్లి గ్రామంలోని ఆలయంలో ఉన్న లక్ష్మీనరసింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి ఉత్సవ విగ్రహాలను బ్రహ్మోత్సవాల ముందురోజు పెంచలకోనకు పల్లకిలో తీసుకెళ్తారు. ఉత్సవాలు ముగిశాక తిరిగి ఆ గ్రామానికి తరలించడం ఆనవాయితీ. కోనలోని క్రేన్ మండపం వద్ద స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను పల్లకిలో కొలువుదీర్చి పుష్పాలు, ఆభరణాలతో శోభాయమానంగా అలంకరించారు. బోయలు కాలి నడకన గోనుపల్లికి బయలుదేరారు. దేవస్థాన అధికారులు, పోలీస్, అర్చకులు పెంచలకోన ఆర్చి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి వీడ్కోలు పలికారు. అనంతరం స్వామి, అమ్మవార్లను ఆ గ్రామంలోని గిరిజన కాలనీ వద్దనున్న చెంచురాజు ఇంటికి దొడ్డిదారిలో తీసుకొచ్చారు. కల్యాణం అనంతరం స్వామి దొంగదారిలో గ్రామానికి వచ్చారని నానుడి. పెంచలస్వామి గిరిజన వనిత అయిన చెంచులక్ష్మీని వివాహం చేసుకోవడంతో ఆయన్ను తమ అల్లుడిగా భావిస్తారు. గోనుపల్లి నుంచి ఉత్సవ విగ్రహాలను కోనకు తరలించే సమయంలో స్వామిని గిరిజనులు పెళ్లికొడుకుని చేసి అల్లుడికి ఇవ్వాల్సిన కట్నకానుకల కింద ఆరిమొలతాడు, ఇంజేటి గడ్డ, పుట్ట తేనె మొదలైనవి సమర్పి స్తారు. అలాగే స్వామి తిరిగొచ్చే సమయంలో అడవి ఫలాలను అందజేయం ఆనవాయితీ. శ్రీవారిని ఉదయం నుంచి సాయంత్రం వరకు గిరిజన కాలనీలోనే ఉంచడంతో గిరిజనులు తమ కొత్త అల్లుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి పండగ చేసుకున్నారు. అనంతరం గ్రామోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ఏసీ శ్రీనివాసులురెడ్డి, ఫెస్టివల్ కమిటీ సభ్యులు చెన్ను తిరుపాల్‌రెడ్డి, ెఉప ప్రధానార్చకులు సీతారామయ్య స్వామి, పెంచలయ్యస్వామి, భక్తులు పాల్గొన్నారు. -
తీర గ్రామాల్లో సోలార్ కాంతులు
చిల్లకూరు: అదానీ కృష్ణపట్నం పోర్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అదానీ ఫౌండేషన్ మండలంలోని తీర ప్రాంతాల్లో సోలార్ విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టింది. బుధవారం తమ్మినపట్నం పంచాయతీలో ఆ ఫౌండేషన్ హెడ్ రాజేష్రంజన్ మాట్లాడుతూ తమ్మినపట్నంలో సుమారు 150 సోలార్ విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశామన్నారు. ఇటీవల గ్రామాల్లోని మత్స్యకార యువత కోరిన మేరకు క్రికెట్ పోటీలు నిర్వహించామన్నారు. అలాగే విద్య, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఫౌండేషన్ కృషి చేస్తోందన్నారు. స్థానిక నాయకులు కోట సతీష్‌యాదవ్, మత్స్యకార నాయకులు బక్తాని రామయ్య, మేకల వెంకయ్య, నాగూరు, సుబ్బయ్య, మహేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యమం ఉధృతం చేస్తాం
నెల్లూరు సిటీ: ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను త్వరితంగా పరిష్కరించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనను ఉధృతం చేస్తామని ఎన్ఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై శ్రీనివాసరావు తెలిపారు. నెల్లూరు నగరంలోని ప్రధాన ఆర్టీసీ బస్టాండు వద్ద ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు ప్రజా రవాణా అధికారి కార్యాలయాన్ని మంగళవారం ముట్టడించారు. అనంతరం ఆర్టీసీ ప్రాంగణంలో కార్మికులు, ఉద్యోగులు నిరసన కార్యక్రమంలో భాగంగా ధర్నా చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వానికి ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపై అనేక సార్లు విన్నవించుకున్నామని, అయినప్పటికీ సమస్యలు పరిష్కరించకుండా పోరాటం చేస్తున్న కార్మికులు, నాయకులపై వేధిపులకు పాల్పడుతోందన్నారు. సర్క్యులర్ 1–2013 ఉద్యోగ భద్రతను వెంటనే అమలు చేయాలన్నారు. నాలుగు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్లు వెంటనే ఇవ్వాలని, అక్రమ సస్పెన్సన్‌లు, రీమూవల్స్ను నిలుపుచేయాలని కోరారు. ఈహెచ్ఎస్ కార్డు బదులుగా పాత వైద్య విధానాన్ని కొనసాగించాలన్నారు. మహిళలకు పిల్లల సంరక్షణ సెలవులు తప్పనిసరిగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మురళీమోహన్‌రెడ్డి, జిల్లా అధ్యక్షులు చెంచయ్య, జిల్లా అడ్వైజర్ జె వెంకటేశ్వర్లు, నాయకులు ఎల్లయ్య, మాధవరావు, పద్మారావు పాల్గొన్నారు. ఎన్ఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై శ్రీనివాసరావు ఆ సంఘం ఆధ్వర్యంలో పీటీఓ కార్యాలయం ముట్టడి -
వైభవం.. తెప్పోత్సవం
పుష్కరిణిలో తెప్పపై విహరిస్తున్న స్వామి అమ్మవార్లు ● పుష్కరిణిలో నరసింహుని విహారం ● ముగిసిన పెంచలకోన బ్రహ్మోత్సవాలు రాపూరు: పెంచలకోన బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన మంగళవారం రాత్రి శోభాయమానంగా అలంకరించిన తెప్పపై పెనుశిల నరసింహస్వామి ఉభయనాంచారులతో కలసి కొలువుతీరి పుష్కరిణిలో విహరిస్తూ భక్తులకు దర్శమిచ్చారు. నరసింహస్వామి వారి ఆలయంలో ఆరు రోజులుగా జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు పెనుశిల లక్ష్మీనరసింహస్వామికి తెప్పోత్సవం నిర్వహించారు. రాత్రి 10 గంటలకు స్వామి వారిని అశ్వవాహనంపై ఉంచి కోన మాడ వీధుల్లో క్షేత్రోత్సవం నిర్వహించారు. రాత్రి 11 గంటలకు ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ముగిశాయి. అంతకుముందు ఉదయం శ్రీవారి చక్రస్నానం కనులపండువగా జరిగింది. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులు, సుదర్శన చక్రం విగ్రహాలను పల్లకిలో కొలువుదీర్చి పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్ఛరణాల మధ్య పుష్కరిణిలో స్వామివారి చక్రతల్వార్ (సుదర్శన చక్రం)ను పుష్కరిణిలో చక్రస్నానం చేయించారు. వైభవంగా వసంతోత్సవాలు పెంచలకోనలో స్వామి వారికి వసంతోత్సవాలు నిర్వహించారు. కల్యాణం అనంతరం స్వామి అమ్మవార్లకు వసంతాలు చల్లి కార్యక్రమాన్ని ప్రారంభించారు. -
కనులపండువగా రథోత్సవం
నెల్లూరు(బృందావనం): ఉస్మాన్‌సాహెబ్‌పేటలోని అన్నపూర్ణ, విశాలాక్షి సమేత కాశీవిశ్వనాథస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని రథోత్సవాన్ని కనులపండువగా మంగళవారం నిర్వహించారు. నేత్రపర్వంగా తీర్చిదిద్దిన రథంపై స్వామివారు సర్వాలంకారశోభితంగా కొలువై భక్తులను కటాక్షించారు. విశేష పూజా కార్యక్రమాలను అర్చకులు వందవాసి విశ్వనాథ గురుకుల్, గణేష్ గురుకుల్ పర్యవేక్షణలో జరిపారు. కొబ్బరికాయలు, గుమ్మడికాయలను భక్తులు కొట్టి కర్పూర హారతులతో మొక్కులు చెల్లించుకున్నారు. వివిధ ప్రాంతాల మీదుగా రథోత్సవం దాదాపు నాలుగు గంటల పాటు సాగింది. భక్తులకు మజ్జిగ, పానకం, శీతల పానీయాలు, పులిహోర తదితరాలను అందజేశారు. ఉభయకర్తలుగా ముంగమూరు కృష్ణచైతన్యరెడ్డి, శ్వేత, పత్తి జయరామయ్యనాయుడు, పద్మావతి దంపతులు వ్యవహరించారు. బ్రహ్మోత్సవాల చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ రామకృష్ణ, ఈఓ దర్గయ్య పర్యవేక్షించారు. -
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అలా..
ఇలాంటి ఘటనలు ఎన్నో.. రెండు వేలకు పైగా బెల్టుషాపులు జిల్లాలో 200 మద్యం దుకాణాలు, 55 బార్లు ఉండగా వాటికి పదింతలుగా 2వేలకు పైగా బెల్టుషాపులు వెలిశాయి. బెల్టు వ్యాపారం మూడు క్వార్టర్లు, ఆరు బీర్లు అన్న చందంగా సాగుతోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బెల్టుషాపుల నిర్వహణ నేరం. అయితే మద్యం వ్యాపారం అధికారపార్టీకి చెందిన వారి చేతుల్లోకి వెళ్లడంతో పట్టణాలు, గ్రామాల్లో బెల్టు షాపులను ఏర్పాటు చేశారు. నేరుగా మద్యం దుకాణాల నుంచే వాటికి మద్యం సరఫరా అవుతోంది. గతంలో మద్యం షాపుల్లో కేవలం కొన్ని రకాలు మాత్రమే అందుబాటులో ఉండేవి. ప్రస్తుతం అన్ని రకాల బ్రాండ్లు, బీర్లూ అందుబాటులో ఉన్నాయి. క్వార్టర్, బీరుపై అదనంగా రూ.50 వరకు మందుబాబుల నుంచి వసూలు చేస్తున్నారు. కూటమి సర్కార్ మద్యాన్ని మందుబాబుల చెంతకు చేర్చి వారిని మద్యానికి బానిసలుగా మార్చి ఇళ్లు, ఒళ్లు గుల్లచేస్తోంది. నెల్లూరు వేదాయపాళెం ప్రాంతంలో బెల్టు దుకాణం వద్ద మంగళవారం మద్యం తాగుతూ.. ● నెల్లూరు ఎన్టీఆర్ నగర్‌కు చెందిన నాగరాజు, సురేఖలు దంపతులు కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవారు. ఈ క్రమంలో నాగరాజు మద్యానికి బానిసయ్యాడు. దీంతో దంపతుల నడుమ మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. పలుమార్లు సురేఖ భర్తను మద్యం మానివేయమని ప్రాధేయపడింది. ఆయన ససేమిరా అనడంతో ఆత్మహత్య చేసుకుంది. భార్య మృతిని జీర్ణించుకోలేని నాగరాజు కూడా అనంతరం ఆత్మహత్య చేసుకున్నాడు. పచ్చని సంసారంలో మద్యం రేపిన చిచ్చు వారి జీవితాలను అర్ధాంతరంగా ముగిసేలా చేసింది. పచ్చని కుటుంబాల్లో చిచ్చురేపుతున్న మద్యాన్ని ప్రజలకు దూరంగా ఉంచాలని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆలోచించింది. అందుకు తగ్గట్టుగానే జనావాసాలకు దూరంగా మద్యం దుకాణాలను ఏర్పాటు చేసి ప్రభుత్వమే వాటిని నిర్వహించింది. నిర్ణీత వేళల్లోనే మద్యం విక్రయాలు సాగించేలా చేయడంతో పాటు గ్రామాల్లో బెల్టుషాపుల ఊసేలేకుండా చేసింది. నాటుసారాపై ఉక్కుపాదం మోపింది. దీంతో మహిళల్లో ఆనందం వెల్లివిరిసింది. సాక్షిప్రతినిధి, నెల్లూరు: టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఊరూరా మద్యం ఏరులై ప్రవహిస్తుండటంతో పచ్చని సంసారాల్లో చిచ్చురేగుతోంది. మద్యం మత్తుకు బానిసై తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని కుటుంబ సభ్యులనే హతమారుస్తున్నారు. బెల్టుపై చర్యలు తీసుకోవాల్సిన ఎకై ్సజ్ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారు. తాజాగా మహిళల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. తమ ప్రాంతాల్లోని మద్యం దుకాణాలను తొలగించాలని ఆందోళనకు దిగుతున్నారు. బెల్టుషాపుల వల్ల తమ కుటుంబాలు వీధిన పడుతున్నాయని వాటిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రజాప్రతినిధులను నిలదీస్తున్నారు. అందులో భాగంగా ఉదయగిరి మండలం వెంకట్రావుపల్లిలో శాసనసభ్యుడు కాకర్ల సురేష్‌ను మహిళలు చుట్టుముట్టి బెల్టుషాపులను వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంపద సృష్టిస్తామని ఎన్నికల ముందు పదేపదే చెప్పిన కూటమి నేతలు ఈ తరహాలో జనం జేబుల్లో నుంచి సొమ్ము గుంజుకుంటూ ఖజానాను నింపుకుంటున్నారు. బార్ల వద్దే సిట్టింగ్ రూమ్‌లు మద్యం పాలసీ నిబంధనల మేరకు సిట్టింగ్ రూమ్‌లకు అనుమతులు లేవు. దుకాణంలో మద్యం కొనుగోలు చేసి తమవెంట తీసుకెళ్లాలే తప్ప అక్కడ తాగడానికి వీలులేదు. అలా చేస్తే వ్యాపారం సాగదని భావించిన వ్యాపారులు నిబంధనలను తోసేసి మినీబార్లను తలపించేలా సిట్టింగ్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. మందుబాబులు అక్కడే మద్యం సేవిస్తున్నారు. 4 నెలల్లో రూ.489 కోట్ల మద్యం తాగేశారు ఈఏడాది జనవరి మొదలు ఏప్రిల్ మాసాంతం వరకు జిల్లాలో మద్యం ప్రియులు అక్షరాలా రూ.489 కోట్ల మద్యం తాగేశారు. దీనిని బట్టి చూస్తే రోజుకు సగటున రూ.4 కోట్ల మేర మద్యం తాగేశారని అర్థమవుతోంది. ముఖ్యమంత్రి ఆదేశాలు బేఖాతర్ మద్యాన్ని ఒక్క రూపాయి ఎక్కువ ధరకు అమ్మినా ఉపేక్షించేది లేదు. అలాగే బెల్టుషాపులకు మద్యం విక్రయించే దుకాణాలకు మొదటి తప్పు కింద రూ.5 లక్షలు, అదే తప్పు పదేపదే చేస్తూ ఉంటే లైసెన్సు రద్దుచేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎకై ్సజ్ అధికారులను ఆదేశించారు. వాటిని అమలు చేయాల్సిన ప్రొహిబిషన్అండ్ ఎకై ్సజ్ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ మొక్కుబడి చర్యలకే పరిమితమయ్యారు. అడపాదడపా మాత్రమే దాడులు చేస్తున్నారు. బెల్టు షాపునకు సరఫరా చేసిన సీసాలపై లేబళ్లు లేవని, ఏ మద్యం దుకాణానికి సంబంధించినదో తెలియడం లేదని చెబుతూ అధికారులు కేవలం బెల్టు నిర్వాహకులపై కేసులు నమోదుతో సరిపెడుతున్నారు. వీధికో బెల్టు షాపు తాగుడుకు బానిసలవుతున్న ప్రజలు ఇల్లు, ఒళ్లు గుల్లచేసుకుంటున్న వైనం కుటుంబాల్లో తరచూ గొడవలు హత్యలకూ వెనుకాడని మద్యం ప్రియులు మహిళల్లో పెల్లుబుకుతున్న ఆగ్రహం తాజాగా ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్లపై మహిళల కన్నెర్ర మద్యంతో కుటుంబాలు నాశనం అవుతున్నాయని ఆవేదన ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఇలా.. గతేడాది జూన్‌లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రైవేటు మద్యం దుకాణాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో జిల్లాలో 200 మద్యం దుకాణాలు ఏర్పాటయ్యాయి. ఇందులో అగ్రభాగం దుకాణాలు కూటమి నేతలు, వారి అనుచరులే దక్కించుకున్నారు. ఇంకేముంది నిబంధనలకు నీళ్లొదిలారు. రెండువేలకుపైగా బెల్టు దుకాణాలను ఏర్పాటుచేసి 24గంటలూ అధిక ధరలకు మద్యం విక్రయాలు సాగిస్తూ జేబులు నింపుకుంటున్నారు. మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని తాతను మనుమడు హత్యచేసిన ఘటన బుజబుజనెల్లూరులో చోటుచేసుకుంది. సంతపేట పోలీసుస్టేషన్ పరిధిలో మద్యం తాగొద్దన్నందుకు ఓ వృద్ధుడిని ఇద్దరు యువకులు దారుణంగా హత్యచేశారు. బుజబుజనెల్లూరులో మద్యం మత్తులో విజయ్ అనే వ్యక్తి ఓ మహిళను హత్యచేశాడు. -
ఇద్దరు యువకుల అరెస్ట్
● 6 కేజీల గంజాయి స్వాధీనం నెల్లూరు (క్రైమ్): పూరి–తిరుపతి రైల్లో గంజాయి అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు యువకులను జీఆర్పీ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి వారి నుంచి 6 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు రైల్వే డీఎస్పీ జి.మురళీధర్ తన కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. గుంతకల్ రైల్వే ఎస్పీ రాహుల్‌మీనా ఆదేశాల మేరకు రైళ్లల్లో మత్తు, మాదకద్రవ్యాల అక్రమరవాణా కట్టడికి పటిష్ట చర్యలు తీసుకున్నామన్నారు. ఈ మేరకు రైల్వే సీఐ ఎ.సుధాకర్ తన సిబ్బందితో కలిసి సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు కావలి, నెల్లూరు, గూడూరుల్లో ఒడిశా నుంచి బెంగళూరు, చైన్నె వైపు వెళ్లే రైళ్లలో తనిఖీలు నిర్వహించారు. నెల్లూరు రైల్వేస్టేషన్లో పూరి–తిరుపతి వెళ్లే రైల్లో తనిఖీలు చేపట్టగా కేరళ రాష్ట్రం మలప్పురం జిల్లాకు చెందిన ముహమ్మద్ ఉబయ్ ఎస్పీపీ, కేరళ రాష్ట్రం ఎర్నాకులం పట్టణానికి చెందిన సాధిక్యూ పీఏ అనే ఇద్దరు గంజాయిని అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.60 వేలు విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విచారణలో నిందితులు ఒడిశా రాష్ట్రం నుంచి గంజాయిని కొనుగోలు చేసి తమ ప్రాంతంలో అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు వెల్లడించడంతో వారిని అరెస్ట్ చేశారు. నిందితులను అరెస్ట్ చేసిన నెల్లూరు రైల్వే సీఐ ఎ.సుధాకర్, ఎస్ఐ ఎన్.హరిచందన, సిబ్బంది రవి, వెంకటేశ్వర్లు, మణికంఠలను డీఎస్పీ అభినందించారు. -
కంటైనర్‌ను ఢీకొన్న బైక్
కోవూరు: ఫ్లై ఓవర్‌పై ఆగి ఉన్న కంటైనర్‌ను వెనుక నుంచి బైక్ ఢీకొన్న ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన కోవూరు బైపాస్‌రోడ్డులోని సాయిబాబా మందిరం సమీపంలో జాతీయ రహదారిపై మంగళవారం జరిగింది. పోలీసుల సమాచారం మేరకు కొడవలూరు మండలం నాయుడుపాళెంకు చెందిన మదన్, కిశోర్ బైక్‌పై నెల్లూరుకు వస్తున్నారు. అదే సమయంలో ఫ్లై ఓవర్‌పై ఆగి ఉన్న కంటైనర్‌ను అదుపు తప్పి వెనుక నుంచి ఢీకొన్నారు. సమాచారం అందుకున్న ఎస్సై రంగనాథ్గౌడ్, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108లో ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
కొడవలూరు: బైక్‌పై వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురై ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని నార్తురాజుపాళెం దిన్నె రోడ్డులో సోమ వారం అర్ధరాత్రి జరిగింది. పోలీసుల సమాచారం మేరకు.. నార్తురాజుపాళానికి చెందిన గుండపనేని వంశీకృష్ణ (27) రామాపురం ఎన్టీఆర్ కాలనీలోని స్నేహితుడి వద్దకు సోమవారం సాయంత్రం బైక్‌పై వెళ్లారు. అక్కడ స్నేహితుడి వద్ద బాగా పొద్దుపోయే వరకు ఉండి అర్ధరాత్రి దాటాక బైక్‌పై తిరిగి ఇంటికి బయలు దేరారు. నార్తురాజుపాళెం ఫ్లై ఓవర్ వంతెన దాటుకొని కొంత దూరం వచ్చాక బైక్‌తో సహా రోడ్డుపై పడి ఉండడా న్ని స్థానికులు గుర్తించి 108 సిబ్బందికి సమా చారం ఇచ్చారు. అందులో చికిత్స నిమి త్తం నెల్లూరుకు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందారు. వంశీకృష్ణ బైక్ ముందు భాగం బాగా దెబ్బతిని ఉండడంతో ముందు వెళ్తున్న ఏదైనా గుర్తు తెలియని వాహనాన్ని ఢీకొని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. వంశీకృష్ణ అవివాహితుడు. ఎస్సై సీహెచ్ కోటిరెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఉపాధిలో అవినీతి తోడేళ్లు
‘ఆకులు నాకే వాడి మూతులు నాకుతున్నట్లు’ సామెత చందాన కందుకూరులోని ఉపాధి హామీ పథకం వ్యవస్థ తయారైంది. ఉపాధి పనుల్లో రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడే కూలీలకు వచ్చే అరకొర వేతనంలో కింది స్థాయి నుంచి పైస్థాయి వరకు కమీషన్లు ఇవ్వాలంటూ ఫీల్డ్ అసిస్టెంట్లు (ఎఫ్‌ఏలు) వారి కడుపులు కొడుతున్నారు. ఎవరి స్థాయిలో వారు టార్గెట్లు పెట్టి వారం వారం వేతనాల్లో కమీషన్లు వసూళ్లు చేసుకుంటున్నారు. కందుకూరు రూరల్: ఉపాధి పథకం అవినీతి మయంగా మారింది. కింది స్థాయి నుంచి పైస్థాయి వరకు మామూళ్ల వసూళ్లు మామూలుగా లేదు. గతంలో నిరుద్యోగ యువతి, యువకులు మాత్రమే ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లుగా విధుల్లో ఉండేవారు. ప్రస్తుతం ఈ కూటమి ప్రభుత్వంలో ఆయా పార్టీ నాయకులే ఫీల్డ్ అసిస్టెట్లుగా మారారు. దొంగ మస్తర్లు వేసి సొమ్ము చేసుకుంటున్నారు. కందుకూరు నియోజకవర్గంలో గుడ్లూరు మండలం కూలీల సంఖ్యలో టాప్‌లో ఉంది. కందుకూరు డ్వామా ఏపీడీ బాబూరావు కందుకూరు ఇన్చార్జి ఏపీఓగా కూడా వ్యవహరిస్తున్నాడు. అయితే ఏపీఓగా పనిచేస్తున్న సమీర్‌బాషా సెలవుపై వెళ్లడంతో పక్క మండల ఏపీఓకు ఇన్చార్జి ఇవ్వాల్సి ఉండగా ఏపీడీనే ఇన్చార్జి బాధ్యతలు తీసుకోవడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే సదరు ఏపీడీ మండలంలో ఏ గ్రామానికి వెళ్లినా ఫీల్డ్ అసిస్టెంట్ రూ.2 వేలు చేతిలో పెట్టాల్సిందేనట. గుడ్లూరు మండలంలోని ఓ పంచాయతీలో రూ.2 వేలకు రూ.300 డబ్బులు తగ్గడంతో తీసుకోలేదట. క్యాష్ లేకపోతే ఫోన్‌పే చేయమని చెబుతున్నాడని ఆ శాఖలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫీల్డ్ అసిస్టెంట్లు, టీఏలు, ఈసీలు, కంప్యూటర్ ఆపరేటర్ల విధుల విషయంలో టార్గెట్లు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు సమాచారం. ఆయనపై వస్తున్న ఫిర్యాదులపై కందుకూరు ఎమ్మెల్యే పలుమార్లు పిలిపించి మందలించినట్లు సమాచారం. అంతా ప్రహసనం కందుకూరు నియోజకర్గంలో కందుకూరు, గుడ్లూరు, లింగసముద్రం, ఉలవపాడు, వలేటివారిపాళెం మండలాలు ఉన్నాయి. గుడ్లూరు మండలం ఉపాధి కూలీల హాజరులో జిల్లాలోనే టాప్‌లో ఉంది. ఈ నెల 10వ తేదీ మస్తర్లు పరిశీలిస్తే.. గుడ్లూరులో 6,962 మంది కూలీలు హాజరయ్యారు. కందుకూరులో 5,610, వలేటివారిపాళెంలో 5,740, లింగసముద్రంలో 4,342, ఉలవపాడులో 3,920 మంది కూలీలు హాజరైనట్లు మస్తర్లు ఉన్నాయి. అయితే క్షేత్రస్థాయిలో తరచూ ఏపీడీ, ఏపీఓలు పనుల పరిశీలకు వెళ్లినప్పుడు కూలీల సంఖ్య, ఆన్లైన్లో కూలీల సంఖ్యను పరిశీలించి సంతకాలు చేసి రావాల్సి ఉంది. కానీ ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. కందుకూరు ఎల్‌ఆర్‌సీ కోర్సు డైరెక్టర్‌గా ఉన్నాడు. ఆయనకే ఇన్చార్జి ఏపీడీగా బాధ్యతలు ఇచ్చారు. ఆ ఇన్చార్జికే తిగిరి కందుకూరు ఏపీఓగా ఇన్చార్జి బాధ్యతలు. ఇలా ఈసీలు, టీఏలను ఆయనకు నచ్చిన వారినే తెచ్చుకుంటున్నాడు. కింది స్థాయి నుంచి పైస్థాయి వరకు మామూళ్లు విజిట్‌కు వెళ్తే ఆ అధికారికి రూ.2 వేలు చేతిలో పెట్టాల్సిందే కూలీల కడుపులు కొట్టి కమీషన్లు కొట్టేస్తున్న ఎఫ్‌ఏలు ఎడాపెడా మామూళ్లు ఆ అధికారికి మామూళ్లు సమర్పించుకునే పేరుతో టీఏలు, ఈసీలు సైతం తమ జేబులు నింపుకునేందుకు ప్రతి కూలీ వద్ద వారానికి రూ.100 నుంచి రూ.200 వసూళ్లు చేస్తున్నారని సమాచారం. అయితే పంచాయతీని బట్టి మామూళ్ల రేటు పెరుగుతుందనే ప్రచారం ఉంది. కూలీ పనులకు రాని వారికి సైతం మస్తర్లు వేసి ఆ డబ్బులు ఫీల్డ్ అసిస్టెంట్ వసూలు జేబులో వేసుకుంటున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ తంతు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో జరుగుతోందని ఉపాధి కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక పంచాయతీలో కనీసం వందకు తగ్గకుండా దొంగ మస్తర్లు ఉంటున్నాయి. -
పెద్దాస్పత్రిలో అరుదైన ఆపరేషన్
నెల్లూరు(అర్బన్): నగరంలోని ప్రభుత్వ పెద్దాస్పత్రి (జీజీహెచ్)లో ఒక మహిళకు అరుదైన ఆపరేషన్ చేసి ఆమె కడుపులో నుంచి 9 కిలోల గడ్డను తొలగించారు. ఇందుకు సంబంధించిన వివరాలను గైనకాలజి విభాగాధిపతి డాక్టర్ గీతాలక్ష్మి మంగళవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. స్థానిక పద్మావతి సెంటర్లో నివాసం ఉండే 46 ఏళ్ల విజయలక్ష్మికి కడుపులో గడ్డపెరుగుతూ వచ్చింది. కడుపు నొప్పిగా భావించి స్థానికంగా ఉండే నొప్పుల మాత్రలు మింగుతూ గడ్డను పెంచుకుంది. నొప్పి ఎక్కువ కావడంతో వారం క్రితం ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది. తాము అన్ని పరీక్షలతో పాటు ఎంఆర్ఐ చేశామన్నారు. కడుపులో గర్భసంచి వద్ద పెద్ద సైజులో గడ్డ ఉండటంతో ఆమెకు విషయం చెప్పామని, ఆలస్యం చేసి ఉంటే కేన్సర్‌గా మారే ప్రమాదం ఉందని తెలియజేశామన్నారు. ఆపరేషన్ చేసి 9 కిలోల గడ్డతో పాటు గర్భసంచిని తొలగించామని, బాధితురాలు కోలుకోవడంతో డిశ్చార్జి చేస్తున్నామని తెలిపారు. పెద్దాస్పత్రిలో ఆధునిక ఆపరేషన్ థియేటర్లతో పాటు అన్ని రకాల పరీక్షలున్నాయని, రూపాయి ఖర్చులేకుండా పెద్ద ఆపరేషన్లు చేస్తున్నామన్నారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆపరేషన్‌లో భాగస్వామ్యం అయిన అసోసియేట్ ప్రొఫెసర్ డా.సుజాత, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ హిమబిందు, అనస్థీషియన్ హెచ్ఓడీ డాక్టర్ శాంతిశ్రీ, పలువురు నర్సింగ్ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.క్వారీ అనుమతులకు ప్రజాభిప్రాయ సేకరణసంగం: సంగం అరుంధతీయవాడ సమీపంలో కొండ ప్రాంతంలో క్వారీ అనుమతికి స్థానిక సచివాలయంలో మంగళవారం ఆర్డీఓ పావని, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. ముందుగా అధికారులు క్వారీ అనుమతులకు సంబంధించిన విధివిధానాలను ప్రజలకు వివరించారు. కొంత మంది క్వారీ కావాలని, పనులు దొరుకుతాయని తెలిపారు. మరికొందరు క్వారీ వల్ల పర్యావరణం దెబ్బతింటుందని, ప్రాణనష్టం జరుగుతుందని తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. అందరి నుంచి అభిప్రాయాలు సేకరించారు. ఆర్డీఓ పావని మాట్లాడుతూ ప్రజల అభిప్రాయాలన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. గ్రామానికి ఎటువంటి నష్టం జరగకుండా బాధ్యత తీసుకుంటామన్నారు. అనంతరం ఆర్డీఓ క్వారీ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దారు సోమ్లానాయక్, సర్పంచ్ రమణమ్మ, సీఐ వేమారెడ్డి, ఎస్సై రాజేష్, టీడీపీ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. -
ధరల్లేక పొగాకు రైతు దిగాలు
మర్రిపాడు: ఆరుగాలం శ్రమించి, రూ. లక్షలు వెచ్చించి పండించిన పొగాకుకు గిట్టుబాటు ధరల్లేక రైతులు దిగాలు పడుతున్నారు. ధరలు ఇలాగే కొనసాగితే వారంతా తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందని సీపీఎం, రైతు సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. డీసీపల్లిలోని పొగాకు బోర్డు వేలం కేంద్రంలో జరుగుతున్న వేలం ప్రక్రియను మంగళవారం పరిశీలించారు. వేలంలో ప్రస్తుతం రైతులకు లభిస్తున్న ధరలపై వేలం కేంద్రం నిర్వహణాధికారి రాజశేఖర్, రైతులతో మాట్లాడారు. అనంతరం వేలం కేంద్రం ఎదుట రైతులతో కలిసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత రెండేళ్లుగా ఉన్న ధరలు ఈ సంవత్సరం కూడా లభిస్తాయనే ఉద్దేశంతో రైతులు పొగాకు పంటను బాగా పండించారని తెలిపారు. వేలంలో ఒక్క కంపెనీ మాత్రమే కొనుగోలు చేస్తుందని, పూర్తి స్థాయిలో బయ్యర్లు రాకుంటే పొగాకుకు గిట్టుబాటు ధర లభించే అవకాశం లేదన్నారు. కిలోకు గరిష్టంగా రూ.280, కనిష్టంగా రూ.210 వస్తుందన్నారు. ఇలా అయితే పొగాకు సాగు చేసిన ప్రతి రైతు రూ.లక్షల్లో నష్టపోయే ప్రమాదముందన్నారు. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పొగాకు రేట్లు గణనీయంగా ఉన్నాయని, ధరలు లేని సమయంలో మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోళ్లు చేయించి రైతులను ఆదుకున్నారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. డీీసీపల్లి పొగాకు బోర్డు వేలం కేంద్రానికి బయ్యర్లు వచ్చి కొనుగోలు చేస్తే గిట్టుబాటు ధర తప్పక లభిస్తుందని, కనీసం మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోళ్లు చేయిస్తే రైతులకు ఆదరవుగా ఉంటుందన్నారు. ఆ దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుని పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నేతలు మూలి వెంగయ్య, రైతు సంఘం నాయకులు లక్కు కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని రైతు సంఘాల నేతల డిమాండ్ డీసీపల్లి కేంద్రంలో వేలం ప్రక్రియ పరిశీలన -
● గల్లంతైన అన్నదమ్ముల మృతదేహాలు లభ్యం ● సంగం, కోవూరులో విషాదఛాయలు
కనిగిరి రిజర్వాయర్ పెద్దకాలువలో గాలిస్తున్న గజఈతగాళ్లు సంగం: ఆ ఇద్దరే ఆ తల్లిదండ్రులకు బిడ్డలు. ఒక తల్లి కడుపున పుట్టారు. కలిసి పెరిగారు. కలిసి తిరిగారు. చివరికి కలిసి మరణించారు. ఒకరిని పిలిస్తే మరొకరు పలికే విధంగా ఆ ఇంట ఆనందాన్ని పంచిన ఆ ఇరువురు అన్నదమ్ములు కాలువలో పడి మృతి చెందిన హృదయవిదారక ఘటన కన్నీరు తెప్పిస్తోంది. సంగంలోని కనిగిరి రిజర్వాయర్ పెద్ద కాలువలో సోమవారం పడి గల్లంతైన ఇద్దరు అన్నదమ్ముల మృతదేహాలు మంగళవారం బయటపడ్డాయి. సంగం, కోవూరులో విషాదాన్ని నింపిన ఘటన వివరాల్లోకి వెళ్తే.. సంగంకు చెందిన దండె వెంకటరమణమ్మ చిన్న కుమార్తె శేషమ్మ, గోవిందయ్య దంపతుల ఇద్దరు కుమారులు బందా వెంకట చందు (15), వెంకట నందకిశోర్ (13) వేసవి సెలవుల కోసం అమ్మమ్మ ఇంటికి వచ్చారు. సోమవారం రోజులాగే కనిగిరి రిజర్వాయర్ పెద్దకాలువలో నీటి ప్రవాహ ఉధృతిని గమనించక దిగి గల్లంతైన విషయం తెలిసిందే. రాత్రి వరకు పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. మంగళవారం ఉదయం నుంచి మళ్లీ గాలింపు చర్యలను ప్రారంభించారు. మృతదేహాలను వెలికి తీసేందుకు గజ ఈతగాడు వెంకటేశ్వర్లుతోపాటు మరికొందరు మత్స్యకారులు గాలించగా తొలుత వెంకటచందు మృతదేహం బయటపడగా, కొన్ని గంటల అనంతరం వెంకట నందకిషోర్ మృతదేహం బయట పడింది. గజ ఈతగాళ్లు చేతుల మీదుగా మృతదేహాలను తీసుకు వస్తుండగా ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా రోదనలతో నిండిపోయింది. ఆ ఇద్దరు చిన్నారులతో ఆనందంగా గడిపిన అమ్మమ్మ వెంకటరమణమ్మతోపాటు అపురూపంగా చూసుకుంటున్న తల్లిదండ్రులు శేషమ్మ, గోవిందయ్యలను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. పోస్టుమార్టం అనంతరం చిన్నారుల మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఎస్సై రాజేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఈతకెళ్లి అన్నదమ్ములు గల్లంతు
సంగం: వేసవి సెలవులను అమ్మమ్మ ఇంట్లో ఆనందంగా గడుపుదామని వచ్చిన ఆ చిన్నారులు కనిగిరి రిజర్వాయర్ పెద్ద కాలువలో సోమవారం గల్లంతయ్యా రు. కాలువలో మూడు రోజులుగా కొద్దిపాటి నీళ్లు ఉండడంతో చిన్నారులు అందులో ఈతాడుతున్నారు. సోమవారం ఇరిగేషన్ అధికారులు ఆ కాలువకు నీటి ప్రవాహం పెంచడంతో ఆ చిన్నారులు రోజులాగే ఉంటుందని భావించి ఈతాడేందుకు వెళ్లి ఆ ఉధృతికి గల్లంతయ్యారు. రాత్రి వరకు పోలీసులు, స్థానికులు, కుటుంబ సభ్యులు గాలించినా జాడ కనిపించలేదు. సంగంకు చెందిన దండె వెంకటరమణమ్మకు ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె శేషమ్మ, బందా గోవిందయ్య దంపతులు కోవూరు మండలం చిన్నపడుగుపాడు స్టౌబీడీ కాలనీలో నివాసముంటున్నారు. ఆ దంపతులకు వెంకట చందు (15), వెంకట నందకిశోర్ (13) సంతానం. తల్లిదండ్రులిద్దరూ బేల్దారి పనులకు వెళ్లి కుమారులను చదివించుకుంటున్నారు. పెద్ద కుమారుడు 9వ తరగతి పూర్తి చేసుకుని 10వ తరగతికి, వెంకట నందకిశోర్ 7వ తరగతి పూర్తి చేసుకుని 8వ తరగతికి వచ్చారు. వేసవి సెలవులు కావడంతో 10 రోజుల క్రితం సంగంలోని అమ్మమ్మ వెంకటరమణమ్మ ఇంటికి వచ్చారు. మూడు రోజులుగా స్థానిక చిన్నారులతో కలిసి గ్రామానికి కొద్ది దూరంలో ఉన్న కనిగిరి రిజర్వాయర్ పెద్ద కాలువ వద్దకు వెళ్లి కొద్దిపాటి నీళ్లలో ఈతాడుతున్నారు. అయితే ఇరిగేషన్ అధికారులు సోమవారం కనిగిరి రిజర్వాయర్‌కు సాగునీటిని ఉదయం నుంచి సాయంత్రం వరకు 500 నుంచి 1500 క్యూసెక్కులకు పెంచారు. ఈ విషయం తెలియని చిన్నారులు రోజు మాదిరిగానే కాలువలోకి దిగి ఈతాడేందుకు వెళ్లారు. సాయంత్రం 3 గంటల సమయంలో ఈతకు దిగిన చిన్నారులు గల్లంతయ్యారు. 5 గంటల వరకు కూడా వారి ఆచూకీ తెలియకపోవడంతో కాలువ గట్టు న దుస్తులు ఉండడంతో స్థానికులు పోలీసులకు, కుటుంబ సభ్యులకు తెలిపారు. ఎస్సై రాజేష్, పోలీసు సిబ్బంది స్థానికులతో కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి ఇరిగేషన్ అధికారులు సాగునీటి విడుదలను నిలిపివేయడంతో సీఐ వేమారెడ్డి, ఎస్సై రాజేష్ గజ ఈతగాడు వెంకటేశ్వర్లు, స్థానిక యువకులతో కలిసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. రాత్రి పొద్దుపోయే వరకు కూడా ఆ చిన్నారుల ఆచూకీ లభ్యం కాలేదు. చిన్నారులు ఈతకు వెళ్లి గల్లంతు కావడంతో వెంకటరమణమ్మతోపాటు, తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఇద్దరు బిడ్డల ఆచూకీ తెలియకపోవడంతో వారిని ఓదార్చడం ఎవరికి సాధ్యపడడం లేదు. దీంతో సంగం, కోవూరు స్టౌబీడీ కాలనీల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. వేసవి సెలవులకు అమ్మమ్మ ఊరు వచ్చిన చిన్నారులు పెద్దకాలువ వద్ద ఘటన గాలిస్తున్న పోలీసులు, స్థానికులు రాత్రి వరకు జాడ తెలియని పరిస్థితి -
ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు
నెల్లూరు (టౌన్): ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా జరిగాయి. ఉదయం జరిగిన ప్రథమ సంవత్సర పరీక్షకు 6,407 మంది విద్యార్థులకు గాను, 6,129 మంది హాజరయ్యారు. 278 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన ద్వితీయ సంవత్సర పరీక్షకు 615 మంది విద్యార్థులకు 572 మంది హాజరు కాగా, 43 మంది గైర్హాజరయ్యారు. ఆర్ఐఓ వరప్రసాద్‌రావు, ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్ అధికారులు మొత్తం 27 కేంద్రాల్లో తనిఖీ చేశారు. ఎండ తీవ్రతతో విద్యార్థులతో వచ్చిన తల్లిదండ్రులు బయట పడిగాపులు కాశారు. ఎండ తీవ్రతకు ఇబ్బందులు పడ్డారు. అనారోగ్యంతో ఖైదీ మృతి వెంకటాచలం: చెముడుగుంట సమీపంలో ఉన్న జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న షేక్ అబ్దుల్లా (41) సోమవారం అనారోగ్యంతో మృతి చెందాడు. పోలీసుల సమాచారం మేరకు ఎన్టీఆర్ జిల్లా మాచవరం ప్రాంతానికి చెందిన షేక్ అబ్దుల్లా సూర్యాపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన ఓ కేసులో 2024 ఏప్రిల్ 28 తేదీ నుంచి జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. సోమవారం ఉదయం 5.55 గంటల సమయంలో స్పృహ కోల్పోయి పడిపోవడంతో వెంటనే జైలు సిబ్బంది చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. జైలు సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సముద్రంలోకి తాబేళ్ల విడుదల నెల్లూరు(అర్బన్): జిల్లా అటవీ శాఖాధికారి కె.మహబూబ్‌బాషా సారథ్యంలో సోమవారం పలుచోట్ల పెద్ద సంఖ్యలో ఆలివ్‌రిడ్లీ తాబేళ్ల పిల్లలను సముద్రంలోకి విడుదల చేశారు. డీఎఫ్ఓ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో తాబేళ్లు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. మత్స్య సంపద పెరగడంలో వాటి పాత్ర ఎంతో ఉందన్నారు. మైపాడు, ఎర్రన్నదిబ్బ, ఊటుకూరు, రామచంద్రాపురం, కొత్తూరు, పాతపాళెం, లక్ష్మీపురం, ఒట్టూరు, కర్లపాళెం, తాటిచెట్లపాళెం తదితర 10 ప్రాంతాల్లో హేచరీల నుంచి సముద్రంలోకి తాబేళ్లను విడుదల చేశామన్నారు. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు మొత్తం 24,481 తాబేళ్ల పిల్లలను వదిలినట్లు తెలిపారు. తాబేళ్లకు హాని కలుగకుండా జాలర్లు సముద్రంలో వేట సాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో కావలి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్, సముద్ర తాబేళ్ల పరిరక్షణ కమిటీ మెంబర్లు పాల్గొన్నారు. వీఆర్‌కు కొండాపురం ఎస్సై కొండాపురం: కొండాపురం ఎస్సై వెంకట్రావును వీఆర్‌కు బదిలీ చేస్తూ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. కావలికి చెందిన ఓ మహిళతో ఎస్సై అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఆమె కావలి ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో ఆదివారం రాత్రి ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో ఎస్సైను వీఆర్‌కు బదిలీ చేసినట్లు సమాచారం. ఈ విషయంపై కలిగిరి సీఐ వెంకటనారాయణను సంప్రదించేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. జెన్కో కార్మికుల అర్ధనగ్న ప్రదర్శన ముత్తుకూరు (పొదలకూరు): ముత్తుకూరు మండలంలోని నేలటూరు జెన్కోలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ కార్మికులు తమను కాంట్రాక్ట్ కార్మికులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ సోమవారం అర్ధనగ్న ప్రదర్శన చేశారు. జాయింట్ యాక్షన్ కమిటీ నేతలు మాట్లాడుతూ నెల రోజులుగా నిరసనలు చేపట్టుతున్నా.. యాజమాన్యంలో చలనం లేదన్నారు. జెన్కోలో 1,500 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారని, మరో 500 మంది అవుట్ సోర్సింగ్ కార్మికులు ఉన్నారని తెలిపారు. అవుట్ సోర్సింగ్ కార్మికులు ఏహెచ్‌పీ (యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్), సీహెచ్‌పీ (కోల్ హ్యాడ్లింగ్ ప్లాంట్), ఈఓసీఎస్ (కన్వేయర్ బెల్ట్)ల్లో అతిప్రమాదకరమైన ప్రాంతంలో పనిచేస్తున్నారన్నారు. కాంట్రాక్టర్లుగా ఉన్న వారు అవుట్ సోర్సింగ్ కార్మికుల వద్ద పది మంది పనిని ఒకరితో చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ భద్రత, ప్రాణాలకు భద్రత లేనందున తమను కాంట్రాక్ట్ కార్మికులుగా గుర్తిస్తే చట్టపరమైన హక్కులు లభిస్తాయని చెప్పారు. ఈ ఆందోళనలో జేఏసీ కన్వీనర్ గోడ భాస్కర్, నాయకులు శేఖర్, ఆదిశేషయ్య, శ్యాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
మాస్టారు.. ఇది సాధ్యమేనా?
●పెన్నా పరీవాహక ప్రాంతంలో ఇళ్ల పట్టాలంటూ మంత్రి నారాయణ ప్రకటన అధికారమే పరమావధిగా కూటమి నేతలు సాగించిన మోసపూరిత ప్రచారాలతో పేద ప్రజల జీవితాలు ఇప్పటికే తలకిందులయ్యాయి. తాజాగా పెన్నా పరీవాహక ప్రాంతంలోని నివాసితులకు శాశ్వత ఇళ్ల పట్టాలిస్తామంటూ ఆశలు రేకెత్తిస్తూ మంత్రి నారాయణ ప్రకటన చేసి మరో మోసానికి తెర తీశారు. గత ప్రభుత్వ హయాంలోనే అప్పటి మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్ వారికి నివేశన పట్టాలు పంపిణీ చేశారు. మంత్రి నారాయణ ఇస్తామన్న పట్టాలు సదరు పేదలకు ఎందుకూ ఉపయోగపడవని, చెల్లుబాటు కావనే విషయాన్ని సుప్రీం కోర్టు ఆదేశాలు స్పష్టం చేస్తున్నాయి. అయినా పేదల జీవితాలతో మంత్రి నారాయణ డ్రామాలు ఆడుతూ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడుతున్నారని అర్థమవుతోంది. నెల్లూరు వెంకటేశ్వరపురం వద్ద పెన్నానదిలో నిర్మిస్తున్న రక్షణ గోడ ● గత ప్రభుత్వ హయాంలోనే నివేశన పట్టాలు పంపిణీ ● స్వార్థ రాజకీయాల కోసం పేదలతో డ్రామాలు ● భగత్‌సింగ్ కాలనీలో 1,400 కుటుంబాలకు శాశ్వత అన్యాయం సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ‘చెరువులు, నీటి కుంటలు, నదులను పరిరక్షించుకోవడం మన అందరి బాధ్యత. పరీవాహక ప్రాంతాల్లో శాశ్వత నిర్మాణాలు చేపట్టరాదు. నీటి వనరులను సంరక్షించుకుంటే అవి మన భవిష్యత్ తరాలను కాపాడుతాయి’ ఇది గతంలో సుప్రీంకోర్టు అభిప్రాయం వ్యక్తపరుస్తూ కొన్ని ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వాలకు జారీ చేసింది. ఈ ఆదేశాల ప్రకారమే పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా ఏర్పాటు చేసి చెరువుల్లో నిర్మాణాలను తొలగింపునకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో నెల్లూరులో కూడా హైడ్రా ఏర్పాటు చేసి నదీ తీరాలు, చెరువుల్లో ఆక్రమణలు తొలగిస్తామని గతంలో మంత్రి నారాయణ చెప్పారు. అయితే ఇప్పుడు అందుకు విరుద్ధంగా నగర పరిధిలో పెన్నానది అంతర్భాగమైన భగత్‌సింగ్ కాలనీలో నివాసాలు ఏర్పాటు చేసుకున్న పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తామని, మంత్రి వర్గం ఆమోదం తెలిపిందని చెప్పడం చూస్తుంటే నిజంగా ఆ పేద వర్గాలకు శాశ్వత అన్యాయం చేస్తున్నారని స్పష్టమవుతోంది. శాశ్వత పట్టాలిస్తే.. భగత్‌సింగ్ కాలనీలో సుమారు 1400 పేద కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఇప్పటికే ఆయా స్థలాల్లో శాశ్వత నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు మంత్రి నారాయణ చెప్పినట్లు పట్టాలిస్తే.. ఆ స్థలాలపై శాశ్వత హక్కుగా భావించి ఆ పేదలు తమ జీవిత కాలం కష్టపడి సంపాదించుకున్న రూ.లక్షల ఖర్చు పెట్టుకుని పక్కా భవనాలు నిర్మించుకునే అవకాశం ఉంది. ఇతరులకు క్రయవిక్రయాలు చేసుకునే పరిస్థితులు ఉంటాయి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు భవిష్యత్‌లో ఈ స్థలాల్లోని నిర్మాణాలను తొలగించాల్సి వస్తే.. ఆ పేదలు శాశ్వతంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. పెన్నానది పరీవాహక అంతర్భాగంగా ఉన్న ఆ ప్రాంతంలో ప్రభుత్వం ఇచ్చే ఇళ్ల పట్టాలు చెల్లుబాటు అవుతాయా? అనేది అందరిలో అనేక అనుమానాలు ఉన్నాయి. ఈ అనుమానాలు నిజమే. ఈ పట్టాలు ఎందుకు ఉపయోగపడే అవకాశమే లేదని పర్యావరణవేత్తలు స్పష్టం చేస్తున్నారు. ఈ విధంగా ఆ పేదలకు అన్యాయం చేసినట్లే అవుతుంది. మాజీ మంత్రి అనిల్ హయాంలో నివాస ధ్రువీకరణ పత్రాలు భగత్‌సింగ్ కాలనీలో అన్ని వర్గాల ప్రజలు నివాసముంటున్నారు. దాదాపు 14 వందల కుటుంబాలు అక్కడ ఏళ్ల కాలంగా నివాసముంటున్నాయి. పెన్నానది అంతర్భాగంలోనే వారు నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారు. గత ప్రభుత్వాలు వారికి మౌలిక సదుపాయాలైన విద్యుత్, నీరు వసతి ఏర్పాటు చేశారు. ప్రతి ఎన్నికల సమయంలో ఇళ్ల పట్టాలిస్తామని హామీ ఇచ్చారు. కానీ గతంలో ఎవరూ పట్టించుకోలేదు. గత ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్న పొలుబోయిన అనిల్‌కుమార్‌యాదవ్ ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించారు. ఉన్నత స్థాయిలో కూడా చర్చలు జరిపినా సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ ప్రకారం ఇవ్వకూడదని తేల్చి చెప్పారు. కానీ ఆయన పట్టువదలని విక్రమార్కుడులా గత ఎన్నికలకు ముందే వారిని శాశ్వత నివాస పత్రాలు కాకుండా నివాస ధ్రువీకరణ పత్రాలు ఇప్పించారు. ఆయనే భగత్‌సింగ్ కాలనీ వాసులకు తన చేతుల మీదుగా పంపిణీ చేశారు. గతంలో ఎవరూ చేయని పని అనిల్‌కుమార్‌యాదవ్ చేయడంతో ఆ పేదల్లో ఆనందం వెల్లివిరిసింది. వరదల సమయంలో నీటిలో మునిగిపోయే ఆ భగత్‌సింగ్‌కాలనీకి ఆ ముంపు రాకూడదనే ఉద్దేశంతో పెన్నానదికి రూ.100 కోట్ల వ్యయంతో రక్షణ గోడ నిర్మాణం చేయించారు. వరదల సమయంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆ కాలనీలో పర్యటించేలా చేసి వాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారు. ప్రస్తుతం ఆ గోడ నిర్మాణం కూడా పూర్తయ్యే దశలో ఉంది. ఆగిన శిల్పారామం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బుజబుజ నెల్లూరు సమీపంలో ఉన్న చెరువులో శిల్పారామం ఏర్పాటు చేసేందుకు టెండర్లు పిలిచి పనులు కూడా చేపట్టారు. కానీ స్థానిక పర్యావరణ వేత్తలు చెరువులో నిర్మాణాలు ఎలా చేపడుతారని న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఆ నిర్మాణం నిలిచిపోయింది. నదులు, నీటికుంటల పరిధిలోని వంద మీటర్లు వరకు ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టకూడదనే జీఓ నంబర్119/2017లో స్పష్టం చేస్తోంది. ప్రభుత్వ జీఓలకు విరుద్ధంగా మంత్రి నారాయణ ఇళ్ల పట్టాలు ఇప్పిస్తానంటూ ప్రచారం చేసుకోవడం వెనుక తన స్వార్థ రాజకీయ ప్రయోజనాలు కోసమేనన్న ప్రచారం ఉంది. నగర నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి నారాయణ భగత్‌సింగ్ కాలనీవాసులకు శాశ్వత ఇళ్ల పట్టాలు ఇస్తానంటూ నమ్మబలికాడు. మంత్రి వర్గం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెబుతున్నాడు. ఆ పేదల ఆశలు నెరవేరుతాయని పెద్దగా పబ్లిసిటీ చేస్తున్నారు. వాస్తవంగా పెన్నానది అంతర్భాగంలో ఉండే ఆ కాలనీలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసినా అవి ఉపయోగపడవనే భావన ప్రజల్లో ఉంది. సుప్రీం కోర్టు గైడ్ లైన్స్‌ను కాదని పత్రాలు పంపిణీ చేసినా అవి ఎందుకూ ఉపయోడపడవని పర్యావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఉన్నతాధికారులు సైతం మంత్రి నారాయణ నిర్ణయాలను చూసి నివ్వెరపోతున్నారు. పేద వర్గాలకు అన్యాయం చేసేందుకే అని అంటున్నారు. -
డీఎస్సీ గడువు పొడిగించాలి
● నెల్లూరులో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ ● 387 వినతుల అందజేత ● ప్రత్యేక దృష్టి పెట్టాలన్న కలెక్టర్ ఆనంద్ నెల్లూరు రూరల్: ‘సమస్యల పరిష్కారం కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నాం. కనికరించండి సారూ’ అంటూ అధికారులను మండలాల నుంచి వచ్చిన జనం వేడుకున్నారు. సోమవారం నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిషార వేదిక కార్యక్రమం జరిగింది. కలెక్టర్ ఆనంద్, జేసీ కె.కార్తీక్, డీపీఓ శ్రీధర్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ విద్యారమ, డ్వామా పీడీ గంగాభవాని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 387 మంది వినతులను అందజేశారు. అధికంగా రెవెన్యూ శాఖకు సంబంధించి 131, మున్సిపల్ శాఖవి 42, సర్వేవి 35, పంచాయతీరాజ్ శాఖవి 29, పోలీస్ శాఖవి 62, సివిల్ సప్లయ్స్‌వి 7 తదితరాలు అందాయి. కలెక్టర్ మాట్లాడుతూ అర్జీల విషయంలో జాప్యం లేకుండా వెంటనే పరిష్కరించేందుకు ఆయా శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధానంగా రెవెన్యూ అంశాలపై వినతులు ఎక్కువగా వస్తున్నాయని, వాటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. కార్యక్రమంలో పలువురు జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. పింఛన్ కోసం.. దివ్యాంగుల పింఛన్ ఇప్పించాలని కోవూరు మండలం పడుగుపాడు పంచాయతీకి చెందిన చెముడుగుంట వెంకటసుబ్బయ్య కోరారు. 2024లో ఆరోగ్య సమస్య రావడంతో కాలు తీసేశారన్నారు. 70 శాతం డిజేబులిటీ సర్టిఫికెట్ ఉందని, ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా పింఛన్ ఇవ్వలేదన్నారు. ప్రస్తుతం కుటుంబ పరిస్థితి దారుణంగా ఉందని ఆవేదన చెందారు. చర్యలు తీసుకోవాలంటూ.. ఉపాధి పనుల్లో అవకతవకలపై విచారణ జరిపాలని జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మాజీ సభ్యుడు రఘు వినతిపత్రం సమర్పించారు. ఆయన మాట్లాడుతూ గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.5 కోట్లకు పైగా అవినీతి జరిగిందన్నారు. 14 మండలాల్లో జరిగిన అవకతవకలపై ఇప్పటి వరకు సిబ్బంది దగ్గర రికవరీ చేయడం గానీ, కేసులు నమోదు చేయడం గాని జరగలేదన్నారు. సెలవుల్లో ప్రత్యేక తరగతులు నెల్లూరు నగరంలో పలు ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా అడ్మిషన్లు చేస్తున్నాయని, దీనిపై చర్యలు తీసుకోవాలని పీడీఎస్‌యూ నెల్లూరు జిల్లా సెక్రటరీ షేక్ షారూక్ వినతిపత్రం ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ సెలవు రోజుల్లో కాలేజీల్లో తరగతులు నిర్వహిస్తూ విద్యార్థులను ఒత్తిడికి గురి చేస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు మస్తాన్, ననీన్, హర్ష తదితరులు పాల్గొన్నారు. దారి మూసేశారు తన మామిడితోటకు దారి ఇవ్వకుండా మూసేశారని బోగోలు మండలం ఎస్వీపాళెం గ్రామస్తుడు ద్వారం వెంకటేశ్వర్లు వినతిపత్రం సమర్పించారు. ఆయన మాట్లాడుతూ 30 సంవత్సరాల క్రితం సర్వే నంబర్ 88లో 62 సెంట్ల భూమిని ప్రభుత్వం ఇచ్చిందన్నారు. అందులో మామిడి సాగు చేపట్టానన్నారు. ద్వారం శ్రీనివాసులు, నాగరాజమ్మ తోటలోకి దారి ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని వాపోయాడు.డీఎస్సీ అభ్యర్థుల వయోపరిమితిని 47 సంవత్సరాలకు పెంచాలని, ప్రిపరేషన్ సమయం 45 రోజుల నుంచి 90 రోజులకు పెంచాలని సిటీ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆనంద్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా సిటీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కె.సంజయ్‌కుమార్ మాట్లాడుతూ బీఈడీ, డీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులు టెట్, డీఎస్సీ రాయడానికి అవకాశం ఇవ్వాలని మొరపెట్టుకున్నా పట్టించుకోకుండా ప్రభుత్వం మొండి వైఖరితో 45 రోజుల్లో పరీక్ష నిర్వహిస్తామని చెప్పడం దారుణమన్నారు. ఈ పరీక్ష కోసం లక్షలాది మంది ఎదురు చూస్తున్నారని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులన్నీ భర్తీ చేయాలన్నారు. ప్రతి సంవత్సరం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు. కార్యక్రమంలో నేతలు సుధీర్, మల్లికార్జునరెడ్డి, ఇర్ఫాన్, రెహమాన్, డేవిడ్ తదితరులు పాల్గొన్నారు.అవినీతిపై విచారణ జరపాలిమహిళలకు కుట్టు శిక్షణ పేరుతో తెరతీసిన అవినీతిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఉమ్మడి నెల్లూరు జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు డేగా వంశీకృష్ణ వినతిపత్రం సమర్పించారు. ఆయన మాట్లాడుతూ ట్రైనింగ్ కోసం ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.23 వేలు కేటాయించిందన్నారు. వాస్తవానికి ఒక మెషీన్‌కు రూ.4,300 మాత్రమే ఖర్చవుతుందన్నారు. శిక్షణలో మహిళలకు మంచినీరు తప్ప ఇంకేమీ ఇవ్వరన్నారు. ఇదంతా టెండర్ దక్కించుకున్న కంపెనీకి దోచిపెట్టేందుకే అని తెలిపారు. కార్యక్రమంలో నేతలు కోవూరు బీసీ సెల్ అధ్యక్షుడు శ్రీకాంత్, ఎంపీటీసీ సభ్యుడు వెంకటేష్, అరవ సుబ్బయ్య, డేగ శ్రీనివాసులు పాల్గొన్నారు. -
కన్నీళ్లతో సమస్యల్ని విన్నవించి..
నెల్లూరు(క్రైమ్): ‘న్యాయం కోసం పోలీస్స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నా కనికరించడం లేదు. మీరైనా విచారించి న్యాయం చేయండి’ అంటూ పలువురు బాధితులు ఏఎస్పీ సీహెచ్ సౌజన్యను కోరారు. సోమవారం నెల్లూరు నగరంలోని ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి 79 మంది విచ్చేసి ఏఎస్పీ, డీఎస్పీ చెంచురామారావును కలిసి వినతులు అందజేశారు. చట్టపరిధిలో విచారణ జరిపి న్యాయం చేస్తామని సౌజన్య హామీ ఇచ్చారు. కార్యక్రమంలో లీగల్ అడ్వైజర్ శ్రీనివాసులురెడ్డి, ఎస్బీ–2 ఇన్స్పెక్టర్ బి.శ్రీనివాసరెడ్డి, ఫిర్యాదుల విభాగం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.ఫిర్యాదు చేసినా.. నా ఇంటి పక్కనున్న ఖాళీ స్థలంలో చెత్త వేశానన్న కోపంతో మహిళా కానిస్టేబుల్ స్వప్న, ఆమె భర్త నాపై దాడి చేయడంతో ఎడమ చేయి, కాలు విరిగింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. గత నెల 21వ తేదీన సమస్యను ఎస్పీ దృష్టికి తీసుకెళ్లగా తగిన చర్యలు తీసుకోవాలని కలువాయి పోలీసులను ఆదేశించారు. అయినా వారు పట్టించుకోలేదు. న్యాయం చేయాలని కలువాయి మండలానికి చెందిన వృద్ధురాలు రాజమ్మ కోరారు. ట్రేడింగ్ పేరిట రూ.10.30 లక్షలు దోచేశారు నాకు ఫేస్బుక్లో లిఖిత అనే మహిళ పరిచయమైంది. ఫోరెక్స్ ట్రేడింగ్ కంపెనీలో డబ్బులు పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించింది. రూ.10.30 లక్షలు పెట్టించింది. నా ఖాతాలో పెద్ద మొత్తంలో డబ్బులు చూపించింది. వాటిని విత్‌డ్రా చేసేందుకు యత్నించగా కాలేదు. కస్టమర్ కేర్ సిబ్బందిని సంప్రదించగా కొంత మొత్తంలో పన్ను కడితే మొత్తం డబ్బులు విత్‌డ్రా చేయొచ్చని చెప్పారు. సదరు మహిళక పథకం ప్రకారమే నన్ను మోసగించిందని నెల్లూరుకు చెందిన ఓ యువకుడు అర్జీ ఇచ్చాడు. ఉద్యోగం పేరిట మోసం బుచ్చిరెడ్డిపాళెం ప్రాంతానికి చెందిన రఫీ అతడి కుటుంబ సభ్యులు ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి పలు దఫాలుగా నా వద్ద రూ.6 లక్షలు తీసుకున్నారు. నెలలు గడుస్తున్నా ఉద్యోగం ఇప్పించలేదు. దీంతో వారిని నా డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరగా దౌర్జన్యం చేస్తున్నారు. చర్యలు తీసుకోవాలని సంగంకు చెందిన ఓ వ్యక్తి కోరాడు. చంపుతామని బెదిరిస్తున్నారు నా భర్త మరణించాడు. ఆయన అన్న కుమారుడు రఫీ నేను ఉంటున్న ఇంటిని ఖాళీ చేసి వెళ్లిపోవాలని లేనిపక్షంలో చంపుతామని బెదిరిస్తున్నాడు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశా. వారు పట్టించుకోలేదని ఆత్మకూరుకు చెందిన ఓ మహిళ అర్జీ ఇచ్చారు. వేధిస్తున్నాడు మనవడైన రమేష్ నా ఆస్తిని తీసుకున్నాడు. ఇప్పుడు నా బాగోగులు పట్టించుకోవడం లేదు. వివిధ రకాలుగా ఇబ్బంది పెడుతున్నాడు. విచారించి చర్యలు తీసుకోవాలని బుచ్చికి చెందిన ఓ వృద్ధురాలు కోరారు. మేనమామపై చర్యలు తీసుకోవాలి ఆస్తి విషయంలో నా మేనమామ శివకుమార్ ఇబ్బంది పెడుతున్నాడు. అసభ్యంగా, దురుసుగా ప్రవర్తిస్తున్నాడని నెల్లూరు రూరల్ పరిధికి చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేశారు. ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ అర్జీలిచ్చిన 79 మంది -
కార్మికులకు శిక్షణ
నెల్లూరు(బృందావనం): అమ్మోనియా గ్యాస్ లీకైతే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లాలోని బుంగే ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఫ్యాక్టరీలో ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో సోమవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ సీహెచ్ శైలేంద్ర కుమార్ నెల్లూరలో మాట్లాడుతూ బీఎంఆర్, వాటర్‌బేస్, సాయి మైరెన్, బుంగే, ఇమామీ, జెమినీ, సౌత్ ఇండియా, త్రీఎఫ్, ఆంజనేయ, గ్రీన్హౌస్, అల్ఫా మైరెన్, శరత్ తదితర కర్మాగారాల నుంచి 42 మంది పాల్గొన్నారని, సేఫ్టీ ఆఫీసర్లు విన్సెంట్‌పాల్, మహేంద్ర, పి.శ్రీను శిక్షణ ఇచ్చారన్నారు. -
నర్సింగ్ వృత్తి ఎంతో పవిత్రం
నర్సింగ్ వృత్తి అంటే ఎంతో పవిత్రమైంది. జీతం కోసం కాకుండా సేవా స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ పని చేయాలి. రోగులను తమ మంచి మాటలతో ధైర్యం చెబుతూ వైద్య సేవలందించాలి. 34 ఏళ్ల క్రితం నర్సింగ్ ఉద్యోగంలో చేరాను. నాటి నుంచి నేటి వరకు రోగులకు నాణ్యమైన వైద్యసేవలందిస్తున్నాను. వైద్యశాఖలో ఖాళీగా ఉన్న నర్సింగ్ పోస్టులను భర్తీ చేయాలి. కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేసి రెగ్యులర్ విధానంలోనే పోస్టులు భర్తీ చేయాలి. – వరలక్ష్మి, హెడ్‌నర్సు, జీజీహెచ్, నర్సింగ్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు -
బంగారు గరుడపై శ్రీవారి చిద్విలాసం
● రారాజుపై యోగనరసింహుని వైభోగం ●● భక్తులతో కిక్కిరిసిన పెంచలకోన రాపూరు: ప్రముఖ పుణ్యక్షేత్రం పెంచలకోనలో పెనుశిల లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పెనుశిల లక్ష్మీనరసింహస్వామికి రాత్రి బంగారు గరుడవాహనసేవ అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామివారికి అత్యంత ప్రీతికరమైన గరుడ వాహనంపై శ్రీవారిని శంఖు, చక్ర, అభయహస్తాలతోపాటు వివిధ రకాల ఆభరణాలు, పుష్పాలతో శోభాయమానంగా ఆలకరించి కొలువు తీర్చినంతరం భక్తులు దర్శించుకున్నారు. రాత్రి 11 గంటలకు శ్రీవారు బంగారు గరుడ వాహనంపై కోన తిరుమాడవీధుల్లో ఊరేగారు. భక్తులు గోవింద నామస్మరణలతో పెంచలకోనలోని వెలుగొండలు మార్మోగాయి. శ్రీవారి గరుడ వాహనం మోసేందుకు భక్కులు పోటీ పడ్డారు. గరుడ వాహన సేవలో ఎలాంటి అపశృతులు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. రారాజుపై కొలువు దీరి.. యోగ నరసింహుడు రారాజుపై కొలువు దీరి వైభవంగా ఊరేగారు. ఆదివారం శ్రీలక్ష్మీనరసింహస్వామి జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక అలంకరణ, పూజలు నిర్వహించారు. ఉదయం 6 గంటలకు స్వామి, ఆదిలక్ష్మీదేవి, ఆంజనేయస్వామికి పూలంగి సేవ నిర్వహించారు. ఉదయం 8 గంటలకు సింహ వాహనంపై శ్రీవారి ఉత్సవ విగ్రహాన్ని కొలువుదీర్చి శాంత రూపంలో ఉన్న యోగనరసింహస్వామిగా అలంకరించారు. వివిధ రకాల పుష్పాలు, ఆభరణాలతో శోభాయమానంగా అలంకరించి మేళతాళాలు, వేదమంత్రాలతో స్వామికి కోన మాడవీధుల్లో క్షేత్రోత్సవం నిర్వహించారు. రాత్రి జరిగే గరుడ సేవను తిలకించేందుకు తరలివచ్చిన భక్తజన సందోహంతో పెనుశిల క్షేత్రం కిక్కిరిసింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా ప్రత్యేక ఏర్పాట్లను ఆలయ అధికారులు చేపట్టారు. తిరుపతి, నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాల నుంచే కాక తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు. పలువురు భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి పుష్కరిణిలో స్నానాలు ఆచరించారు. స్వామి, అమ్మవార్లను, ఆంజనేయస్వాములను దర్శించుకున్నారు. యాగశాలలో చతుష్టానార్చన హోమం పెనుశిల లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న యాగశాలలో ఉదయం చతుష్టానార్చన హోమాన్ని టీటీడీ ఆగమ పండితులు రామానుజచార్యులు ఆధ్వర్యంలో పండితులబందం నిర్వహించారు. అగ్నిప్రతిష్ట, విశేష హోమాలు నిర్వహించారు. స్వామి తేజస్సు పెంచేందుకు భక్తుల క్షేమ, ఆయురారోగ్యాల కోసం నిర్వహించినట్లు పండితులు చెప్పారు. కోనలో నవకలిశ స్నపన తిరుమంజనం బ్రహ్మోత్సవాల్లో భాగంగా పెంచలకోనలో శ్రీవారు, ఆదిలక్ష్మీదేవి, చెంచులక్ష్మీ దేవేరులకు ఉదయం 11.30 గంటలకు నవకలిశ స్నపన తిరుమంజనాన్ని అర్చకుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, పంచామృతం, పసుపు, కొబ్బరి నీళ్లతో ఉత్సవమూర్తులకు అభిషేకాలు నిర్వహించారు. మొక్కులు తీర్చుకున్న భక్తులు బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు రాష్ట్రం నలుమూల నుంచి భక్తులు కోనకు చేరుకుని స్వామి అమ్మవార్లను దర్శించి మొక్కులు తీర్చుకు న్నారు. రోగగ్రస్తులు స్వామి వారి కోనేరులో స్నామాచరించారు. పిల్లలు లేనివారు అదిలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద ఉన్న వటవృక్షానికి ఊయలు కట్టి మొక్కుకున్నారు. శాస్త్రోక్తంగా ఊంజల్ సేవ రాత్రి 7 గంటలకు పెనుశిల లక్ష్మీనరసింహస్వామి, ఆదిలక్ష్మీదేవి, చెంచులక్ష్మీ దేవేరులను తిరుచ్చిలో ఉంచి శోభాయమానంగా అలంకరించి మేళతాళాలు, మంగళవాయిద్యాలతో సహస్రదీపాలంకరణ మండపంలోకి తీసుకొచ్చారు. అక్కడ 1008 దీపాలు వెలిగించి స్వామి అమ్మవార్లకు వేదపండితులు మంత్రోచ్ఛరణలు నిర్వహిస్తూ ఊంజల్ సేవ అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏసీ శ్రీనివాసులురెడ్డి, ఫెస్టివల్ కమిటీ సభ్యులు చెన్ను తిరుపాల్‌రెడ్డి, సోమయ్య, ఉప ప్రధానార్చకులు పెంచలయ్యస్వామి, సీతా రామయ్యస్వామి, టీటీడీ పాంచరాత్ర ఆగమపండితులు రామానుజాచార్యులు పాల్గొన్నారు. నేడు శ్రీవారి తిరుకల్యాణం పెంచలకోన బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం 6 గంటలకు శ్రీవార్లకు పూలంగి సేవ, 9.50 గంటలకు శ్రీవారి కల్యాణం, సాయంత్రం 6 గంటలకు రథోత్సవం, రాత్రి 9 గంటలకు గజవాహన సేవ, రాత్రి 12 గంటలకు ఏకాంతసేవ జరుగుతుందని అధికారులు తెలిపారు. -
మామిడి.. పండితే ఒట్టు
ఉలవపాడు: వేసవిలో మామిడి పండును ఇష్టపడని వారుండరు. ఫలరాజుగా పిలవబడే మామిడి రుచే వేరు. కాని ఇక్కడే మనం పొరబడుతున్నాం. పసుపు రంగులో ఉన్న మామిడి కాయలన్నీ సహజంగా పండినవి కావు. రసాయనాలతో పక్వానికి వచ్చేలా చేసి బయట విక్రయిస్తున్నారు. ముందుగా వచ్చిన పూతలో 5 శాతం పంటకురావడం, ఆ వచ్చిన కాయలను కోసి వ్యాపారం ప్రారంభించారు. ఉలవపాడు మామిడికి ఉన్న బ్రాండ్ కారణంగా జాతీయ రహదారి వెంబడి ఏర్పాటు చేసిన దుకాణాలలో కాయలను కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడ కాయలను పండించడానికి ఇథిలీన్ ద్రావణాన్ని కాయల మీద స్ప్రే చేస్తున్నారు. అలా చేసిన కాయలు పండినట్లుగా రంగు మారుతున్నాయి. లోపల మాత్రం రుచి ఉండడం లేదు. ముందు వచ్చిన కొన్ని కాయలు కోసిన తరువాత ఇక ఉలవపాడు తోటల్లో కాయలు లేవు. ఇలాంటి పరిస్థితులలో దుకాణాలు ఏర్పాటు చేశారు. కాయలు కావాలి కాబట్టి కాస్త సైజులు ఉన్న లేత కాయలను కోసి అమ్మకానికి పెట్టారు. వాటికి ఇక్కడ స్ప్రే చేయడం వలన అవి పండి పసుపు రంగులో ఉండడం వలన కాయలను వాహనదారులు కొనుక్కుని వెళుతున్నారు. ఇథిలీన్ స్ప్రే చేస్తేనే.. మామిడి కాయలకు ఇఽఽథిలీన్ స్ప్రే చేస్తేనే కాయలు పండుతున్నాయి. ఉలవపాడు హైవేపై ఏర్పాటు చేసిన అన్ని దుకాణాలలో కాయలు పండాలంటే ఇథిలీన్‌ను కొడుతున్నారు. ప్రభుత్వం ఇథిలీన్ ద్వారా పండించవచ్చని అనుమతులు ఇచ్చినా ఈ దుకాణాల్లో నిజంగా ఇథిలీన్నే స్ప్రే చేస్తున్నారా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. కాయలు మాత్రం పండినా రుచి ఉండడం లేదు. కాయలు ఎలాంటి స్ప్రేలు లేకుండా పండాలంటే కాయలు పూర్తిగా పక్వానికి వచ్చిన తరువాత కోయాలి. ఈ విషయమై ఉలవపాడు ఉద్యానశాఖ అధికారి జ్యోతి మాట్లాడుతూ ఇంకో 15 రోజుల్లో కాయలు పూర్తిగా పంటకు వస్తాయి. అప్పుడు మాత్రమే ఇక్కడి కాయలను తీసుకుంటే నాణ్యత రుచి ఉంటుంది. పక్వానికి రాకుండా లేత కాయల కోత ఇథిలీన్ కొడితేనే రంగు కాయలు కొని మోసపోతున్న మామిడి ప్రియులు పూర్తిస్థాయిలో రాని మామిడి -
రోగులను కాపాడడంలోనే సంతృప్తి
రోగులకు వైద్య సేవలందించి వారి ఆరోగ్యాన్ని కాపాడడంలోనే సంతృప్తి ఉంటుంది. ఒక రోగి తీవ్రమైన అనారోగ్యంతో వచ్చి వైద్య సేవలు పొంది పూర్తి ఆరోగ్యంతో తిరిగి వెళ్లేటప్పుడు ఎంతో అభిమానంగా తమతో మాట్లాడే రెండు మాటలు ఎంతో సంతోషాన్నిస్తాయి. నర్సు అంటేనే సేవకు ప్రతి రూపం. నర్సింగ్ వృత్తిలోకి వచ్చేవారందరూ తమకు మదర్ ఆఫ్ నర్సింగ్ అయిన ఫ్లోరెన్స్ నైటింగేల్‌ను ఆదర్శంగా తీసుకోవాలి. – సత్యవతి, సీనియర్ హెడ్ నర్సు, నర్సింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు -
కళ్లకు గంతలతో నిరసన
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): కూటమి ప్రభుత్వం మహిళల మీద చేసిన దాడులకు నిరసనగా వైఎస్సార్సీపీ మహిళా నేతలు కళ్లకు రిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నెల్లూరు వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో నగర వైఎస్సార్సీపీ ఇన్చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో మహిళా నేతలు మాట్లాడారు. వైఎస్సార్సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు లక్ష్మీ సునంద మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. మాజీ మంత్రి విడదల రజనిపై పోలీసులు దౌర్జన్యం, అలాగే కంతేరు ఎంపీటీసీ కల్పనను పోలీసులు అరెస్ట్ చేసిన విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారని అన్నారు. ఈ రెండు ఘటనల్లో పోలీసులు వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్యంలో కీచకపర్వంగా ఆమె అభివర్ణించారు. అందుకు నిరసనగా వైఎస్సార్సీపీ కార్యాలయంలో కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకొని మహిళలందరూ నిరసన తెలియచేస్తున్నామన్నారు. చంద్రబాబునాయుడుకి ప్రజలు అధికారం ఇచ్చింది ఇందుకేనా అని ప్రశ్నించారు. కార్పొరేటర్ కామాక్షిదేవి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నీచ రాజకీయాలకు పాల్పడుతోందన్నారు. -
కారు బోల్తా పడి వ్యక్తి మృతి
వలేటివారిపాళెం: కారు అదుపు తప్పి బోల్తా పడి ఒక వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని చుండి సమీపంలోని కరెంటాఫీస్ దగ్గర శనివారం అర్ధరాత్రి 2.30 గంటలకు జరిగింది. స్థానికుల సమాచారం మేరకు.. అనంతపురానికి చెందిన షేక్ నిషార్ (60) కారులో విజయవాడకు వెళ్తున్నాడు. చుండి సమీపంలోని కరెంటాఫీస్ వద్దకు వచ్చే సరికి కారు అదుపు తప్పి బోల్తా పడడంతో నిషార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. కారులో ఉన్న మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు 108కు సమాచారం అందించడంతో సిబ్బంది ఘటన స్థలాన్ని చేరుకుని క్షతగాత్రులను కందుకూరు ఏరియా వైద్యశాలకు తరలించారు. అస్పత్రిలో నిషార్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు సమాచారం అందుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారు ఢీకొని ఒకరి దుర్మరణం కందుకూరు రూరల్: కారు ఢీకొనడంతో ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన కందుకూరు సమీపంలోని మహదేవపురం అడ్డరోడ్డు వద్ద ఆదివారం జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. కందుకూరు పట్టణం బృందావనానికి చెందిన బీ శ్రీనివాసులు (41) బైక్‌పై మహదేవపురం వెళ్లి తిరిగి వస్తున్నాడు. అడ్డురోడ్డు వద్దకు రాగానే సింగరాయకొండ నుంచి వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో శ్రీనివాసులు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు కందుకూరులోని కోటారెడ్డి ఆస్పత్రిలో ఆరోగ్యమిత్రగా పని చేస్తున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేంద్రనాయక్ తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రైల్వేస్టేషన్లు, బస్టాండ్‌ల్లో విస్తృత తనిఖీలు ● అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా నెల్లూరు(క్రైమ్): ప్రజల భదత్ర, నేర నియంత్రణకు జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్ట చర్యలు చేపడుతోంది. ఆదివారం జిల్లాలోని రైల్వేస్టేషన్లు, ఆర్టీసీ బస్టాండ్లు, బస్సులు, జన రద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లో పోలీసు అధికారులు బాంబ్, డాగ్‌స్వ్కాడ్‌లతో జల్లెడ పట్టారు. చొరబాటు దారులను నిరోధించడం, మత్తు మాదకద్రవ్యాల అక్రమ రవాణాను నియంత్రించడం, పేలుడు పదార్థాల అక్రమ రవాణాను అడ్డుకోవడం, శాంతిభద్రతలకు ముప్పుగా మారే అసాంఘిక శక్తులను గుర్తించడమే లక్ష్యంగా తనిఖీలు కొనసాగాయి. రైల్వేస్టేషన్లు, బస్టాండ్‌ల్లోని ప్రతి ప్రయాణికుడిని వారి వ్యక్తిగత వివరాలతోపాటు ప్రయాణ ఉద్దేశాన్ని అడిగి తెలుసుకున్నారు. గుర్తింపు కార్డులను పరిశీలించారు. వారి బ్యాగ్‌లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎస్పీ కృష్ణకాంత్ మాట్లాడుతూ ప్రజల భద్రత, నేరనియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. అనుమానాస్పదంగా ఉన్న బ్యాగ్‌లు, ప్యాకెట్లు, పరికరాలను తాకవద్దని, వెంటనే పోలీసులకు లేదా బాంబ్ స్క్వాడ్‌కు సమాచారం ఇవ్వాలన్నారు. జిల్లాలోని ముఖ్యమైన ప్రదేశాల్లో డ్రోన్స్‌తో నిఘా పెట్టామన్నారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, నేర నియంత్రణకు తాము తీసుకుంటున్న చర్యలకు సహకరించాలని కోరారు. అనుమానితులను గుర్తిస్తే డయల్ 112 లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని ఎస్పీ కోరారు. ఈ తనిఖీల్లో జిల్లాలోని పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు. కండలేరులో 44.425 టీఎంసీల నీరు రాపూరు: కండలేరు జలాశయంలో ఆదివారం నాటికి 44.425 టీఎంసీ నీరు నిల్వ ఉన్నట్లు జలాశయం ఈఈ విజయకుమార్‌రెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 850, పిన్నేరు కాలువకు 20, లోలెవల్ కాలువకు 60, హైలెవల్ కాలువకు 110, మొదటి బ్రాంచ్ కాలువకు 70 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. -
నేటి నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
నెల్లూరు (టౌన్): ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు జిల్లా ఇంటర్ బోర్డు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఆదివారం స్థానిక స్టోన్‌హోస్‌పేటలోని కార్యాలయంలో ఆర్ఐఓ వరప్రసాదరావు జిల్లా పరీక్షల కమిటీ సభ్యులు దీనదయాళ్, వేణుగోపాల్, కొండయ్యలతో సమావేశం నిర్వహించారు. ఈ పరీక్షలు ఈనెల 12వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 65 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 24,211 మంది జనరల్, 624 మంది ఒకేషనల్ కలిపి మొత్తం 24,835 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరిలో ప్రథమ సంవత్సరానికి సంబంధించి 21,068 మంది, ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 3,767 మంది హాజరుకానున్నారు. ప్రథమ సంవత్సర విద్యార్థులకు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, ద్వితీయ సంవత్సర విద్యార్థులకు మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు పరీక్ష జరగనుంది. ఇంటర్ పరీక్షల కోసం కంట్రోలు రూం నంబరు 0861–2320312 ఏర్పాటు చేశారు. విద్యార్థులకు ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే ఈ నంబరుకు ఫిర్యాదు చేస్తే వెంటనే పరిష్కరిస్తామని ఇంటర్‌బోర్డు అధికారులు చెబుతున్నారు. ఇంటర్ పరీక్షలు జరుగుతున్న కేంద్రాల్లో సీసీ కెమెరాలను బిగించనున్నారు. పరీక్షలు జరిగే ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేయనున్నారు.రెండోకారుకు రికార్డ్ స్థాయిలో నీరుఆత్మకూరు: ఈ ఏడాది 5.24 లక్షల ఎకరాలకు రెండోకారుకు సాగునీరు అందిస్తున్నట్లు దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. నెల్లూరులోని ఆయన నివాసంలో ఆదివారం ఆత్మకూరు నాయకులతో సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ గతంలో అత్యధికంగా 1.80 లక్షల ఎకరాలకు మాత్రమే రెండోకారుకు సాగునీరు అందించినట్లు, దానికి మూడు రెట్లుగా ఈ ఏడాది రైతుల సంక్షేమం దృష్టిలో ఉంచుకొని సాగునీరు విడుదల చేశామన్నారు. నాన్ డెల్టాకు నాలుగు కాలువల ద్వారా 1.64 లక్షల ఎకరాలకు 16 టీఎంసీల నీటిని కేటాయించి విడుదల చేశామన్నారు. పెన్నాడెల్టాకు 2 లక్షల ఎకరాలకు 22 టీఎంసీల నీటిని కేటాయించినట్లు వివరించారు. పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన మురళీ అనే సైనిక వీరుడికి నివాళులు అర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో సోమశిల ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ కేశవ చౌదరి, ఆత్మకూరు నియోజకవర్గానికి చెందిన పలు మండలాల నాయకులు పాల్గొన్నారు.ములుమూడిలో రెండువర్గాల కొట్లాటనెల్లూరు సిటీ: నెల్లూరు రూరల్ మండలంలో ఓ వివాహ వేడుక సమయంలో చెలరేగిన గొడవ మరుసటిరోజు రెండువర్గాల మధ్య కొట్లాటకు దారితీసింది. వివరాల్లోకి వెళితే.. రూరల్‌లోని ములుమూడి గ్రామంలో శనివారం వివాహ వేడుక జరిగింది. ఈ క్రమంలో టీడీపీ, వైఎస్సార్సీపీకి చెందిన యువకులు గొడవకు దిగారు. పెద్దలు జోక్యం చేసుకుని వారికి సర్దిచెప్పి పంపించేశారు. అయితే ఆదివారం టీడీపీ వర్గానికి చెందిన యువకులు కొందరు వైఎస్సార్సీపీకి చెందిన యువకులను దుర్భాషలాడి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో యువకులు ఒకరిపై ఒకరు దాడికి దిగడంతో గ్రామస్తులు వారిని సముదాయించారు. ఈ విషయంపై రెండు వర్గాలు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నాయి. పోలీసులు విచారణ చేస్తున్నారు.మితిమీరిన వేగంతో కారు బీభత్సంనెల్లూరు(క్రైమ్): ఓ ఇన్నోవా కారు నడిపే వ్యక్తి ఆదివారం రాత్రి నగరంలో బీభత్సం సృష్టించారు. మితిమీరిన వేగంతో ఆత్మకూరు బస్టాండు నుంచి ఓల్డ్ చెక్‌పోస్టు వైపు వాహనాన్ని పోనిచ్చారు. కారును ఆపేందుకు యత్నించినా వినకుండా అందులోని వ్యక్తి ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను కారుతో ఢీకొనే ప్రయత్నం చేయడంతో ఆయన త్రుటిలో తప్పించుకున్నారు. ఎట్టకేలకు ట్రాఫిక్ పోలీసులు కారును వెంబడించి ప్రశాంతినగర్ జాతీయ రహదారి సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఎక్కడెక్కడ ఏం జరుగుతోందంటే..
రొయ్యల ప్రాసెస్ ఫ్యాక్టరీ ● సాగునీటి కాలువల్లోకి రొయ్యల కంపెనీల వ్యర్థాలు ● మృత్యువాత పడుతున్న మత్స్యసంపద ● చౌడు బారుతున్న 20 వేల ఎకరాల సాగు భూములు ● కలుషిత నీటితో పశువులూ మృతి ● లబోదిబోమంటున్న రైతులు సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఇందుకూరుపేట మండలం డేవిస్‌పేట, జగదేవిపేట గ్రామాల పరిధిలో ఉన్న స్టార్ ఆగ్రో మైరెన్ ఎక్స్‌పోర్ట్స్, సాయి మైరెన్ ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీల నుంచి వచ్చే రసాయన వ్యర్థ జలాలను గంగపట్నం – మైపాడుకు వెళ్లే పంట కాలువల్లోకి వదిలేస్తున్నారు. ఆ ఫ్యాక్టరీలలో రొయ్యల ప్రాసెసింగ్ జరుగుతుంది. ఈ క్రమంలో వాటిలో రసాయనాలు ఉపయోగిస్తారు. ప్రక్రియ పూర్తయిన తరువాత బయటకు వచ్చే రసాయన వ్యర్థాలతో కూడిన నీటిని పంట కాలువల్లోకి వదలడంతో అవి నేరుగా చెరువుల్లోకి చేరుతోంది. దాంతో చెరువుల్లో నీరు విషతుల్యమై మత్స్యసంపద చనిపోతోంది. ఇటీవల గంగపట్నం, కొమరిక, నరసాపురం గ్రామాల చెరువులలో చేపలు మృత్యువాతపడి రైతులు ఆర్థికంగా నష్టపోయారు. నిబంధనల ఉల్లంఘన జిల్లాలో 33,128 ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతోంది. ఆ రంగానికి అనుబంధంగా పది వరకు రొయ్యల ప్రాసెస్ యూనిట్లు, 61 సీడ్ ప్లాంట్లు, 22 సీడ్ హేచరీలు ఉన్నాయి. ఆయా ప్రాసెస్ యూనిట్లు, హేచరీల్లో అడుగడుగునా నిబంధనల ఉల్లంఘనలు జరుగుతున్నాయి. చాలా వరకు పీసీబీ ప్రమాణాలు పాటించడం లేదు. యూనిట్ల నుంచి వచ్చే రసాయనాలు కలిసిన వ్యర్థాలు పంట కాలువల్లోకి వదిలేస్తున్నారు. దీనివల్ల భూములు చౌడు బారి బీళ్లుగా మారిపోతున్నాయి. పంట ఎదుగుదల క్షీణించిపోతోంది. రసాయన వ్యర్థాలు భూగర్భంలోకి ఇంకి తాగునీరు కూడా కలుషితమతుతోంది. పశువుల ప్రాణాలు హరీ రొయ్యల శుద్ధికి సోడియం క్లోరైడ్, అమోనియా లాంటి ప్రమాదకర రసాయనాలు వాడతారు. రొయ్యల నుంచి వచ్చే వ్యర్థాలు మగ్గుతాయి. కుళ్లిన వ్యర్థాలు కలిసిన నీటిని పంట కాలువల్లోకి వదిలేస్తున్నారు. ఆ నీటిని తాగడం వల్ల పశువులకు స్థానిక ప్రజలకు ప్రాణసంకటంలా మారుతోంది. గత పదేళ్లలో వివిధ రకాల వ్యాధులతో రెండు వేల వరకు పశువులు మృతి చెందినట్లు తెలుస్తోంది. వెటర్నరీ వైద్యుల శాంపిల్స్ ల్యాబ్‌లో పరీక్షించగా కలుషిత నీటితో వచ్చే వ్యాధులు సోకినట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. టీపీగూడూరు మండల పరిధిలో ఉన్న శరత్ రొయ్యల ప్రాసెస్ యూనిట్ నుంచి రసాయనాలతో శుద్ధి చేసిన వ్యర్థ జలాలను ఈదూరు, కోడూరు జాయింట్ చెరువు నుంచి వెళ్లే పంట కాలువలోక్లి వదిలేస్తున్నారు. ఆ కాలువ కింద దాదాపు 5 వేల ఎకరాలు సాగవుతోంది. రసాయనాలు కలిసిన నీరు పంటపొలాల్లోకి వెళ్తున్నాయి. వెంకన్నపాళెంలో ఉన్న శరత్ సీడ్ ప్లాంట్ నుంచి వచ్చే రసాయనాల నీరు బకింగ్‌హాం కెనాల్లోకి వదిలేస్తున్నారు. కోడూరు బీచ్ సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన జేజే మైరెన్, సాయి ఆక్వా, ఇండో మైరెన్, భవాని హేచరీ, ఆదిత్య హేచరీల నుంచి వ్యర్థ జలాలు బకింగ్‌హోం కెనాల్లోకి వదిలేస్తున్నారు. రసాయనాల కలిసిన వ్యర్థ జలాలు కాలువలో కలిసిపోవడంతో మత్స్య సంపదకు ముప్పు వాటిల్లుతోంది. కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలంలో ఏర్పాటైన హేచరీలు ఆంజనేయ, గ్రీన్ హౌస్, పెడోరాల నుంచి విడుదల చేసే వ్యర్థజలాలు కూడా మలిదేవి డ్రెయిన్‌లో వదిలేస్తున్నారు. ఆ డ్రెయిన్ పరిధిలో ఆలూరుపాడు, మోదేగుంట, మానేగుంటపాడు గ్రామాల పరిధిలోని దాదాపు 300 ఎకరాల ఆయకట్టులో పంటలు సాగువుతున్నాయి. రసాయనాలు కలిసిన జలాలు డ్రెయిన్‌లో కలవడం వల్ల ఆ నీరు పారే భూములు చౌడుతేలి పంటల ఎదుగుదల క్షీణించి రైతులకు తీవ్ర నష్టం జరుగుతోంది. గండవరం వద్ద ఏర్పాటు చేసిన ఆల్ఫా మైరెన్ ప్రాసెస్ యూనిట్ నుంచి వచ్చే రసాయన వ్యర్థ జలాలు పైడేరు కాలువలోకి వదిలేస్తున్నారు. దాని పరిధిలో అల్లూరు మండలంలోని నార్తుమోపూరు, ఆములూరు గ్రామాలకు చెందిన 800 ఎకరాల ఆయకట్టు సాగవుతోంది. ఇలా అధిక శాతం ప్రాసెస్ యూనిట్లు, సీడ్ హేచరీస్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయి. ఇలా చేయాలి.. రొయ్యల శుద్ధి కేంద్రాల్లో రియల్ టైం పొల్యూషన్ తెలిపే ఆర్టీపీఎస్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. తూము ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేసి శుద్ధి చేసిన వ్యర్థ జలాలను అందులోకి పంపించాలి. కానీ ఆ ప్లాంట్ ఏర్పాటు ఖర్చుతో కూడుకుంది కావడంతో ప్లాంట్ యజమానులు నేరుగా బయట పంట కాలువలలోకి వదిలేస్తున్నారు. వాస్తవంగా రొయ్యల శుద్ధిలో ఏడు రకాల రసాయనాలు వాడతారు. పీసీబీ ప్రమాణాలకు లోబడి శుద్ధి చేయాలి. శుద్ధి చేసిన వ్యర్థాలను డిస్పోజ్ కంపెనీకి అప్పగించాలి. కానీ వాటిని అనధికారికంగా బయటకు పంపుతున్నారు. -
జర్నలిస్టుల అరెస్ట్ ప్రజాస్వామ్యానికి విఘాతం
● అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆర్పీఐ నల్ల రిబ్బన్లతో నిరసన నెల్లూరు రూరల్/ నెల్లూరు సిటీ: జర్నలిస్టులను అన్యాయంగా అరెస్ట్ చేసి జైలుకు పంపడం ప్రజాస్వామ్యానికి విఘాతమని రిపబ్లిక్ పార్టీ ఇండియా (ఆర్పీఐ) నాయకులు ఖండించారు. జర్నలిస్టుల అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ వీఆర్సీ సెంటర్లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆర్పీఐ నాయకులు చేతులకు నల్ల రిబ్బన్లు కట్టుకొని ఆదివారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆర్పీఐ జిల్లా అధ్యక్షుడు ఎస్కే మాబు మాట్లాడుతూ కావలికి చెందిన నలుగురు విలేకరులను అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం అంటే ప్రజల గొంతును నొక్కేయడమేనన్నారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆ పార్టీ ప్రజాప్రతినిధులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని జర్నలిస్టుల మీద దాడులు చేయడం, అక్రమ కేసులు పెట్టడం ఆనవాయితీగా మారిందన్నారు. ఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నా ఆ పార్టీ ప్రజాప్రతినిధులు అధికారాన్ని అడ్డు పెట్టుకొని ప్రజా, ప్రభుత్వ ధనాన్ని, సహజ వనరులను దోచుకోవడాన్ని జర్నలిస్టులు ఎక్కడికక్కడ ఎండ కడుతూ అటు ప్రజలకు, ఇటు ప్రభుత్వ అధికారులకు వారధిగా ఉంటారన్నారు. జర్నలిస్టులు ఎక్కడ ఏ ఘటనలు జరిగిన వాళ్ల ప్రాణాలకు సైతం లెక్కచేయకుండా ఆ ప్రాంతానికి చేరుకుని అక్కడ వాస్తవాలు తెలుసుకుంటారే తప్ప ఆయా ఘటనలకు వారికి ఏ సంబంధం ఉంటుందని ప్రశ్నించారు. కావలికి చెందిన విలేకరుల అరెస్ట్ ముమ్మాటికి రాజకీయ కక్షేనని అన్నారు. ప్రజాప్రతినిధులు అధికారాన్ని అడ్డు పెట్టుకుని కక్ష సాధింపులకు పాల్పడితే ఆర్పీఐ జర్నలిస్టుల పక్షాన పోరాడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆరికొండ సురేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి పట్టపు రంగారావు, జిల్లా ఉపాధ్యక్షుడు దుంపల సుబ్బారావు, బత్తల మధుసూదన్, జిల్లా కార్యదర్శి వజ్జా సుధాకర్, దాసరి దుర్గాప్రసాద్, హరి, నిమ్మల సుబ్బయ్య, కంచి అశోక్, అచిత్, రాజా, యూత్ జిల్లా అధ్యక్షుడు ముసలి జయరాజ్, ప్రశాంత్, మీడియా ఇన్చార్జి బెల్లంకొండ ధనుంజయ తదితరులు పాల్గొన్నారు. -
52 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత
వెంకటాచలం: పాల వ్యాన్‌లో అక్రమంగా తరలిస్తున్న 52 బస్తాల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. వెంకటాచలం టోల్గేట్ సమీపంలో వాహనాల తనిఖీలను విజిలెన్స్ సీఐ శ్రీహరి ఆధ్వర్యంలో శనివారం చేపట్టారు. ఈ క్రమంలో తిరుపతి నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న పాల వ్యాన్‌ను తనిఖీ చేయగా, 52 బస్తాల రేషన్ బియ్యాన్ని గుర్తించారు. డ్రైవర్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారణ జరుపుతున్నారు. హత్య కేసులో నిందితుడి అరెస్ట్ వెంకటాచలం: కత్తితో భార్య గొంతు కోసి హత్య చేసిన కేసులో నిందితుడు పచ్చిపాల బాబును పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. మండలంలోని చవటపాళెం పంచాయతీ అబ్బిసాహెబ్కండ్రిగలో పచ్చిపాల భారతి గొంతును కత్తితో ఆమె భర్త ఈ నెల ఏడో తేదీ రాత్రి కోసి దారుణంగా హత్య చేసిన విషయం విదితమే. ఈ క్రమంలో నిందితుడ్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చగా, 14 రోజుల రిమాండ్ విధించారు. గడ్డివామి దగ్ధం తోటపల్లిగూడూరు: మండలంలోని పేడూరు కొలిదిబ్బ గిరిజన కాలనీకి చెందిన గిరిజన దంపతులకు సంబంధించిన పదెకరాల గడ్డివామి శుక్రవారం అర్ధరాత్రి దగ్ధమైంది. బాధితులు ఎంబేటి రవి, సుమతి దంపతుల వివరాల మేరకు.. పాడి గేదెల కోసం గడ్డిని కొనుగోలు చేసి వామిని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో ఆర్పేందుకు కాలనీ వాసులు యత్నించారు. ఘటనలో సుమారు రూ.50 వేల వరకు నష్టం వాటిల్లింది. బాధితులను సీపీఎం నేతలు లక్ష్మయ్య, రాధయ్య, శేఖర్ తదితరులు పరామర్శించారు. విద్యుదాఘాతంతో యువకుడి దుర్మరణం బుచ్చిరెడ్డిపాళెం రూరల్: విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందిన ఘటన బుచ్చిరెడ్డిపాళెంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. పట్టణంలోని ఓ షోరూమ్‌లో బైక్ వాటర్ సర్వీస్ పాయింట్లో సాయితేజ (19) పనిచేస్తున్నారు. ఈ క్రమంలో షోరూమ్‌లో విద్యుదాఘాతానికి గురయ్యారు. వెంటనే పట్టణంలోని సీహెచ్‌సీకి సహచరులు తరలించారు. పరిశీలించిన డాక్టర్లు అప్పటికే మృతి చెందారని నిర్ధారించారు. కుమారుడు మృత్యువాత పడటంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. కండలేరులో నీటి నిల్వ రాపూరు: కండలేరు జలాశయంలో శనివారం నాటికి 44.57 టీఎంసీల నీరు నిల్వ ఉందని ఈఈ విజయకుమార్‌రెడ్డి తెలిపారు. సత్యసాయి గంగకు 850, పిన్నేరుకు 20, లోలెవల్‌కు 60, హైలెవల్‌కు 70, మొదటి బ్రాంచ్ కాలువకు 70 క్యూసెక్కులను విడుదల చేస్తున్నామని వివరించారు. పొదలకూరు నిమ్మ ధరలు పెద్దవి: రూ.80 సన్నవి: రూ.40 పండ్లు: రూ.25 పౌల్ట్రీ అసోసియేషన్ ధరలు బ్రాయిలర్ (లైవ్) : 130 లేయర్ (లైవ్) : 110 బ్రాయిలర్ చికెన్ : 234 బ్రాయిలర్ స్కిన్లెస్ : 260 లేయర్ చికెన్ : 187 -
ప్రచారార్భాటాలే తప్ప చేస్తోందేమీలేదు
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): ప్రచారార్భాటాలే తప్ప నగరానికి మంత్రి నారాయణ చేస్తోందేమీలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ జిల్లా అధ్యక్షుడు, కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున ధ్వజమెత్తారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో శనివారం ఆయన మాట్లాడారు. మంత్రికి పబ్లిసిటీ పిచ్చి పట్టుకుందని, ఇందులో భాగంగానే భగత్‌సింగ్ కాలనీలో 1400 మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేస్తున్నామంటూ డప్పు కొట్టుకుంటున్నారని విమర్శించారు. గతంలో వరద ముంపునకు గురైన సమయంలో అప్పటి సీఎం జగన్మోహన్రెడ్డి వచ్చి కాలనీవాసుల పరిస్థితిని చూసి శాశ్వత రక్షణ కల్పించేలా రిటైనింగ్ వాల్ నిర్మాణానికి రూ.100 కోట్లను మంజూరు చేసిన అంశాన్ని గుర్తుచేశారు. అక్కడి 3500 కుటుంబాలకు పొజిషన్ సర్టిఫికెట్లను మంజూరు చేయాలని ఆదేశించడంతో అదే రోజున జారీ అయ్యాయని వివరించారు. గత ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరొస్తుందనే ఉద్దేశంతో ఆగమేఘాలపై ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని తెరపైకి మంత్రి తెచ్చారని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలోనే నగరం అభివృద్ధి చెందిందని, ఈ విషయమై చర్చకు టీడీపీ నేతలు సిద్ధమానని సవాల్ విసిరారు. 13వ డివిజన్లో నిర్మించిన మూడు పార్కులను తాను అభివృద్ధి చేశానంటూ ఆయన గొప్పలు చెప్పుకొంటున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల అనంతరం ఆ పార్కుల్లో పనిచేస్తున్న సిబ్బందిని మంత్రి నారాయణ తొలగించారని ఆరోపించారు. అదే డివిజన్లోని టీడీపీ నేతలకు రూ.50 లక్షల కాంట్రాక్ట్ పనులను అప్పగించి వారి అనుచరులకు లబ్ధి చేకూర్చేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పార్కుల అభివృద్ధి పనుల పేరుతో ఎంత అవినీతి జరుగుతోందో అర్థం చేసుకోవాలని కోరారు. తాము శంకుస్థాపన చేసి పూర్తయిన పనులను టీడీపీ నేతలు ప్రస్తుతం ప్రారంభిస్తున్నారే తప్ప, వారు చేసిందేమీలేదన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని హితవు పలికారు. మంత్రి నారాయణకు పబ్లిసిటీ పిచ్చి విమర్శించిన ఊటుకూరు నాగార్జున -
కండలేరులో పడి పాడి రైతు మృతి
మనుబోలు: కాలు జారి కండలేరు వాగులో పడి పాడి రైతు మృతి చెందిన ఘటన మండల పరిధిలోని యాచవరంలో చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన రాపూరు వీరాస్వామి (65) పశువులను మేపుకొంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో మేతకెళ్లిన పశువులు శుక్రవారం రాత్రయినా ఇంటికి రాకపోవడంతో వెతికేందుకు వెళ్లారు. ఈ సమయంలో ప్రమాదవశాత్తూ కాలు జారి కండలేరు వాగులో పడి మృతి చెందారు. గేదెల కోసమని వెళ్లిన వీరాస్వామి ఎంతకీ రాకపోవడంతో చుట్టుపక్కల బంధువులు వెతకగా, కండలేరులో శవమై కనిపించారు. మృతుడికి భార్య లక్ష్మమ్మ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
చైన్ స్నాచర్ల అరెస్ట్
14 సవర్ల ఆభరణాల స్వాధీనం నిందితులను తమదైన శైలిలో పోలీసులు విచారించగా, గూడూరు – 2 టౌన్లో నమోదైన ఓ కేసులో బంగారు చైన్, డాలర్.. మరో కేసులో బంగారు చైన్.. గూడూరు రూరల్‌లో నమోదైన కేసులో బంగారు చైన్, తాళిబొట్టు, ఒక కాసు, రెండు గుండ్లను చోరీ చేశారనే విషయం తేలింది. మొత్తం నాలుగు చోరీల్లో 14 సవర్ల బంగారు ఆభరణాలను వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించడంలో చొరవ చూపిన సీఐ, ఎస్సైతో పాటు ఏఎస్సై వెంకటేష్, సిబ్బంది మణి, ఖాజాహుస్సేన్, సురేష్, ముకేష్, మాధవరావు, రమేష్, శివకు రివార్డులను ప్రకటించారు. మనుబోలు: చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన కేసులో నలుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో శనివారం నిర్వహించిన సమావేశంలో నిందితుల వివరాలను ఎస్సై శివరాకేష్ వెల్లడించారు. గూడూరులోని నర్సింగరావుపేటకు చెందిన మంగాపురం హేమంత్, మాళవ్యనగర్కు చెందిన కంకి శ్రీహరి, జానకిరామ్పేటకు చెందిన దువ్వూరు మహేష్, సైదాపురం మండలం చాగణానికి చెందిన రాగిపాటి శివమణి చెడు వ్యసనాలకు బానిసలయ్యారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో దొంగతనాలకు తెరలేపారు. ఈ క్రమంలో బైక్‌పై ఈ నెల ఐదున వెళ్తూ, పిడూరు రోడ్డులో అంగడి నిర్వహిస్తున్న చెన్ను రమణమ్మ ఒంటరిగా ఉండటాన్ని గమనించారు. దగ్గరికి వెళ్లి థమ్సప్ కావాలని అడిగారు. దీన్ని ఇచ్చేందుకు ఫ్రిజ్‌ను ఆమె ఓపెన్ చేస్తుండగా మెడలోని బంగారు గొలుసు, పగడాల దండను లాక్కొని పరారయ్యారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం వెతకసాగారు. ఈ క్రమంలో వీరంపల్లి క్రాస్‌రోడ్డు వద్ద వీరిని చూసి నిందితులు పరారయ్యేందుకు యత్నిస్తుండగా, పొదలకూరు సీఐ శివరామకృష్ణారెడ్డి, ఎస్సై, సిబ్బందితో కలిసి పట్టుకొని అరెస్ట్ చేశారు. -
‘వెరిటాస్’కు ప్రభుత్వ అనుమతి
తిరుపతి కల్చరల్: తిరుపతిలో 22 ఏళ్లుగా బీఎస్సార్ విద్యాసంస్థల ద్వారా విద్యార్థులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తూ.. వారి ఉన్నతి, దేశ రక్షణకు అందిస్తున్న సేవలను గుర్తించి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సైనిక్ స్కూల్ అనుమతి పొందామని వెరిటాస్ సైనిక్ స్కూల్ చైర్మన్ డాక్టర్ శేషారెడ్డి తెలిపారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో శనివారం ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ గుర్తింపుతో దేశ భద్రత కోసం వెరిటాస్ సైనిక్ స్కూల్ ముందడుగేస్తోందని చెప్పారు. రానున్న రోజుల్లో ప్రభుత్వ సైనిక్ స్కూల్ అనుసంధానంతో కరికులమ్, యాక్టివిటీస్, కాంపిటీషన్స్ తదితరాలను నిబంధనలకు అనుగుణంగా నిర్వహించనున్నామని వివరించారు. ఆలిండియా సైనిక్ స్కూల్ ఎంట్రెన్స్ పరీక్షల ద్వారా కౌన్సెలింగ్‌ను నిర్వహించి సీట్లను కేటాయించనున్నామని వెల్లడించారు. స్కూల్ డైరెక్టర్లు శ్రీకర్‌రెడ్డి, సందీప్‌రెడ్డి పాల్గొన్నారు. -
బాబుది జేబులు నింపుకొనే స్కీం
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ స్కీం ప్లాన్ చేసినా దానివెనుక స్కాం తప్పకుండా ఉంటుందని వైఎస్సార్సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు సునంద ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బలహీనవర్గాల మహిళలను ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేస్తామని చెప్పుకొంటూ కూటమి ప్రభుత్వం భారీ అవినీతికి తెరదీసిందన్నారు. చంద్రబాబు ఐటీ తెచ్చానని చెప్పుకొంటారు. ఏఐ టెక్నాలజీ గురించి మాట్లాడతారు. డ్రోన్లు వాడాలంటారు. ప్రతి ఇంట్లో ఒక ఐటీ ఉద్యోగి ఉండాలంటారు. చివరికి మహిళలకు కుట్టుమెషీన్లు పంపిణీ చేస్తాడు. కుట్టుమెషీన్ల పంపిణీ ద్వారా వారిని ఏ విధంగా ఐటీ ఉద్యోగులను చేస్తాడో అర్థంకాదని సునంద అన్నారు. కుట్టుమెషీన్ల పంపిణీ పేరుతో తన అనుచరుల జేబులు మాత్రం బాగానే నింపుతున్నారన్నారు. ఒక్కో లబ్ధిదారు పేరుతో రూ.16 వేలు దోపిడీ రూ.221 కోట్లతో కూటమి ప్రభుత్వం కుట్టుమెషీన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టిందన్నారు. 1,02,832 మంది మహిళలకు టైలరింగ్‌లో శిక్షణ ఇచ్చి కుట్టుమెషీన్లు అందించే పేరుతో చేపట్టిన స్కీమ్‌లో దాదాపు రూ.154 కోట్లకు పైగా దండుకోవడానికి కూటమి ప్రభుత్వం సిద్ధమైందన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మహిళలకు శిక్షణ ఇస్తామని చెప్పిన చంద్రబాబు, ఆ పనులు ప్రారంభించకుండా దోపి డీకి మాత్రం డోర్లు బార్లా తీశారన్నా రు. ఈ పథకానికి రూ.221 కోట్లు అంచనా వేస్తే రూ. 75.06 కోట్లకే లెక్క లున్నాయన్నారు. మిగిలిన రూ.154 కోట్లకు లె క్కలే లేవన్నారు. ఈ దామాషాలో ఒక్కో లబ్ధిదారుని పేరుమీద రూ.16వేల వరకు దోపిడీ జరుగుతుందని స్పష్టమవుతోందని తెలిపారు. మొబిలైజేషన్ అడ్వాన్సు పేరుతో బీసీ, ఈడబ్ల్యుఎస్, కాపు మహిళలకు టైలరింగ్ శిక్షణ పేరుతో నిబంధనలకు విరుద్ధంగా మొబిలైజేషన్ అడ్వాన్సుగా రూ.25 కోట్లు కాంట్రాక్టర్లకు దోచి పెట్టేందుకు రంగం సిద్ధమైందని తెలిపారు. అలాగే కేంద్ర, రాష్ట్రాల్లో పేరున్న శిక్షణా సంస్థలు ఉన్నప్పటికి వాటిని కాదని ఆంధ్రప్రదేశ్ బీసీ సహకార సంస్థ ద్వారా ఈ పథకాన్ని చేపట్టి భారీ స్కాంకు తెరతీశారన్నారు. టెండర్లలోనూ మాయా జాలంతో ఈ పథకాన్ని తమవారికే చెందేలా పావులు కదుపుతున్నారన్నారు. శిక్షణ పేరుతో 50 రోజుల్లోనే మొత్తం బిల్లులు కింద లాగేసేందుకు పథకం రూపొందించారని ఆరోపించారు. వైఎస్ జగన్ హయాంలో మహిళలు తలెత్తుకుని జీవించేలా పథకాలను రూపొందించారన్నారు. ఈబీసీ నేస్తం, జగనన్న చేయూత, ఆసరా, అమ్మ ఒడి పథకాల ద్వారా మహిళలకు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచారన్నారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం బీసీలను అడ్డం పెట్టుకుని భారీ దోపిడీకి పాల్పడుతోందన్నారు. ఈ సమావేశంలో జిల్లా అంగన్వాడీ వింగ్ అధ్యక్షురాలు పాల లావణ్య, నెల్లూరు రూరల్ మహిళా విభాగం అధ్యక్షురాలు పి.రమాదేవి, మహిళా నాయకులు బషీర, హైమావతి, నర్మద తదితరులు పాల్గొన్నారు. మహిళలకు కుట్టుమెషీన్ల పంపిణీ పేరుతో మోసం రూ.154 కోట్లు దండుకోవడానికి కుట్ర వైఎస్సార్సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు సునంద ధ్వజం -
13వ రోజుకు చేరిన సీహెచ్‌ఓల నిరసన
నెల్లూరు(అర్బన్): న్యాయమైన తమ సమస్యలు పరిష్కరించేంత వరకు సమ్మెను ఆపే ప్రసక్తేలేదని సీహెచ్‌ఓల అసోసియేషన్ జిల్లా కోఆర్డినేటర్ ఆదిల్ అన్నారు. తమ డిమాండ్లు తీర్చాలంటూ గ్రామ స్థాయిలో విలేజ్ హెల్త్ క్లినిక్‌లను మూసేసి నెల్లూరులోని జిల్లా వైద్యశాఖ కార్యా లయం వద్ద సీహెచ్‌ఓలు (కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు) చేస్తున్న నిరసన దీక్షలు శనివారం నాటికి 13వ రోజుకి చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఆదిల్ మాట్లాడుతూ తమ ఆందోళనలకు ప్రభుత్వం స్పందించకపోవడంతో నల్లమాస్క్లతో కళ్లకు గంతలు కట్టుకుని న్యాయం చేయాల ని న్యాయదేవతను వేడుకున్నామన్నారు. ఇప్పటికై నా తమకు రావాల్సిన పెండింగ్ బకాయిలు చెల్లించాలని, జాతీయ ఆరోగ్యమిషన్ ఉద్యోగులతో సమానంగా 23 శాతం వేతనం పెంచాలని, విలేజ్ హెల్త్ క్లినిక్‌ల అద్దెలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీహెచ్‌ఓల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు భానుమహేష్, నాయకులు సురేష్, కృష్ణవేణి, గాయత్రి తదితరులు పాల్గొన్నారు. -
సరుకులు బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తే కేసులు
నెల్లూరు (పొగతోట): నిత్యావసర సరుకులను బ్లాక్ మార్కెట్‌కు తరలించి అధిక ధరలకు విక్రయించేవారిపై కేసులు నమోదు చేస్తామని డీఎస్ఓ విజయ్‌కుమార్ హెచ్చరించారు. అధికారులు, వ్యాపార సంస్థల ప్రతినిధులతో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యాపార సంస్థల్లో అందుబాటులోఉన్న నిల్వలు ధరల వివరాలను ప్రతిరోజూ బోర్డులో నమోదు చేయాలని సూచించారు. నిత్యావసర సరుకులు అధిక మొత్తంలో నిల్వ చేస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. ఈ సమావేశంలో ఏఎస్ఓ అంకయ్య, వ్యాపార సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
పశువుల అక్రమ రవాణా
సంతలో పశువులు సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఎలాంటి అనుమతులు లేకుండా గతంలో నెల్లూరు నగరం, కోవూరు నియోజకవర్గాల్లో కొంతకాలం ఇటువంటి పశువుల సంతలు నిర్వహించారు. తర్వాత అక్కడి నుంచి వారిని తరిమేయడంతో ఇపుడు సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలం గొలగమూడి క్రాస్‌రోడ్డు వద్దకు చేరారు. ఇక్కడ ప్రతి శుక్రవారం సంతను నిర్వహిస్తున్నారు. ఇక్కడ పశువుల అమ్మకందారులు, కొనుగోలుదారుల నుంచి కమీషన్ల రూపంలో పెద్దమొత్తంలో వసూలు చేస్తున్నారు. అనారోగ్యానికి గురయ్యే పశువులను వదిలించుకునేందుకు పాడిరైతులు సంతలో అమ్ముకునేందుకు వస్తుంటారు. వాటిని కొనుగోలు చేసిన వారు ఇక్కడి నుంచి చైన్నె, కేరళ రాష్ట్రాలలో కబేళాలకు తరలిస్తున్నారు. అక్కడ పశు మాంసానికి డిమాండ్ ఉండడంతో ప్రతి శుక్రవారం పెద్ద ఎత్తున ఆవులు, గేదెలు, దూడలను లారీల్లో తరలిస్తున్నారు. ఇందుకోసం నిర్వాహకులు అధికారులతో పాటు, రాజకీయ నాయకులు, ముఖ్యనేతలను ప్రసన్నం చేసుకుని నిరాటంకంగా తమ పని పూర్తి చేసుకుంటున్నారు. అనుమతులు లేకుండానే.. గొలగమూడి క్రాస్ రోడ్డు వద్ద సంతను నిర్వహిస్తున్న నెల్లూరు నగరానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఎలాంటి అనుమతులు పొందలేదు. గతంలో కోవూరు నియోజకవర్గం పడుగుపాడు, రేగడిచెలిక గ్రామాల వద్ద సంతను నిర్వహించేవారు. సంతను అక్రమంగా నిర్వహిస్తున్న తీరుపై సాక్షిలో కథనాలు రావడంతో నియోజకవర్గ ముఖ్యనేత సంత నిర్వాహకులను తరిమేశారు. దీంతో నిర్వాహకులు సర్వేపల్లి నియోజకవర్గంలో ఏర్పాటు చేసేందుకు ముఖ్యనేతను ప్రసన్నం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఫలితంగా ఎలాంటి అనుమతులు లేకుండా ప్రతి శుక్రవారం సంతను నిర్వహిస్తున్నారు. ఇక్కడ మూగజీవాలను కొనుగోలు చేసేవారు వాటిని కోతకు తరలిస్తున్నారు. సాధారణంగా ఎవరైనా పశువుల సంత ఏర్పాటు చేయాలంటే సంబంధిత పంచాయతీ తీర్మానం చేసి అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇలాంటివేమీ లేకుండానే సంత నిర్వాహకులు ఇష్టానుసారం తమపని కానిస్తున్నారు. సంత నిర్వహణతో వచ్చే లాభంలో కొంత మొత్తం అధికారులు, రాజకీయ నాయకులకు మామూళ్లు ఇస్తున్నట్లు తెలుస్తోంది. హిందుత్వ వాదులు ఎక్కడ..? జాతీయ రహదారులపై పశువుల లోడుతో (అవి కనిపించకుండా టార్పాలిన్లు కప్పుతారు) వాహనాలు తమిళనాడు, కేరళకు వెళుతూనే ఉన్నాయి. వాటిని కోతకు తరలిస్తున్నారు. ఇందులో గోమాతగా కొలిచే ఆవులు కూడా ఉంటున్నాయి. అయినా హిందుత్వవాదులు అటుకేసి చూడకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎటువంటి అనుమతులు లేకుండానే.. గొలగమూడి వద్ద పశువుల సంత అది ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిర్వహిస్తున్న పశువుల సంత. రైతులు తమ పశువులను ఇక్కడ అమ్మకానికి తీసుకురాగా వాటిని కొనుగోలు చేసిన వారు నిర్ధాక్షిణ్యంగా వాటిని కబేళాలకు తరలిస్తున్నారు. సంత నిర్వహణలో టీడీపీ నేతలకు భాగస్వామ్యం ఉండడంతో అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదనే విమర్శలు ఉన్నాయి. నిర్వాహకులకు టీడీపీ నేతల అండ క్రయవిక్రయదార్ల నుంచి భారీగా కమీషన్లు కొనుగోలు చేసిన మూగజీవాలు చైన్నె, కేరళలోని కబేళాలకు తరలింపు సంతలో కొనుగోలు చేసే పశువులను కబేళాలకు తరలించాలంటే పసుసంవర్ధకశాఖ అనుమతులు తప్పనిసరిగా ఉండాలి. ఒట్టిపోయిన పశువులనే కబేళాలకు తరలించాలి. కానీ సాధారణ పశువులను, అనారోగ్యానికి గురైన వాటిని కూడా సంతలో విక్రయిస్తున్నారు. వాటిని తక్కువ ధరకు కొనుగోలు చేసిన వారు చైన్నె, కేరళ రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ఇందుకు ఎలాంటి అనుమతులు లేకున్నా సజావుగా వాటిని తరలించడం చూస్తే నిర్వాహకుల పలుకుబడి అర్థం అవుతుంది. హైవేపై పశువుల లారీలు వెళుతున్నా పట్టించుకునే వారు లేరు. -
సీ వాటర్ పైప్‌లైన్ లీకేజీ
● వృథాగా పోతున్న నీరు ముత్తుకూరు (పొదలకూరు): నేలటూరులోని దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రం సీ వాటర్ పైప్‌లైన్ లీకయి నీరు వృథాగా పోతోంది. గత కొద్దిరోజులుగా ఇలా జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. పైల్‌లైన్ లీకేజీని అరికట్టకుండా కాలయాపన చేస్తుండడంతో భారీగా నీరు పోతోంది. ఈ సందర్భంగా జెన్కో ఎస్ఈ మాట్లాడుతూ బకింగ్‌హామ్ కాలువ దిగువున ఉన్న ప్రవాహం వేగానికి పైల్‌లైన్‌లో చిన్నపాటి రంథ్రాలు పడి నీరు లీకవుతోందని, సంబంధిత కాంట్రాక్టర్‌ను మరమ్మతులు చేయాల్సిందిగా ఆదేశించామన్నారు. నాలుగురోజుల్లో లీకేజీని అరికడతామన్నారు. యూటీఎఫ్ ధర్నా రేపు నెల్లూరు (టౌన్): పాఠశాలల పునఃవ్యవస్థీకరణలో లోపాలు, పదోన్నతుల్లో సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈనెల 12న జిల్లా విద్యా శాఖ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చలపతిశర్మ తెలిపారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో డీఈఓ బాలాజీరావును కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డైట్లో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న ఉపాధ్యాయులను మిగులు లేని పాఠశాలలకు కేటాయించమని రాష్ట్ర విద్యాశాఖాధికారు లు సూచించినా డీఈఓ అమలు పరచలేదన్నారు. దాంతో ధర్నా చేయబోతున్నట్లు తెలిపారు. ఆర్టీసీ డిపోలో సమస్యల పరిష్కారానికి కృషి కందుకూరు: ఆర్టీసీ డిపోలో సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఏపీఎస్ఆర్టీసీ నెల్లూరు జోన్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్‌రెడ్డి అన్నారు. శనివారం స్థానిక ఆర్టీసీ డిపోను ఆయన సందర్శించారు. గ్యారేజ్ ప్రస్తుత పరిస్థితి, డిపో ఆవరణ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వల్ల వర్షాకాలంలో నీరు నిలబడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఇన్చార్జి డిపో మేనేజర్ ఆర్ శ్రీనివాసరావు, ఎంఎఫ్ రాజ్యలక్ష్మి, అసిస్టెంట్ డిపో మేనేజర్ ప్రసాద్ పాల్గొన్నారు. -
బావతో సహజీవనం చేస్తోందంటూ..
నెల్లూరు సిటీ: మహిళపై కొడవలితో దాడి చేసిన ఘటన నెల్లూరు రూరల్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. తోటపల్లిగూడూరు మండలానికి చెందిన శేషమ్మ అనే మహిళను 20 ఏళ్ల క్రితం భర్త వదిలేశాడు. ప్రస్తుతం ధనలక్ష్మీపురంలో నివాసం ఉంటూ కేజీకే కల్యాణ మండపం వద్ద పండ్ల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తోంది. తోటపల్లిగూడూరు మండలానికి చెందిన కరుణాకరన్‌తో ఆమె సహజీవనం చేస్తోంది. అతను ఇంటికి వెళ్లకుండా ఎక్కువ సమయం శేషమ్మ వద్ద ఉండటం అతడి బావమరిది శ్రీనివాసులుకు తెలిసింది. తన సోదరికి అన్యాయం జరుగుతోందని అతను శేషమ్మపై కోపం పెంచుకున్నాడు. శుక్రవారం పండ్ల దుకాణం వద్ద శ్రీనివాసులు కొడవలితో శేషమ్మ మెడపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానికులు హాస్పిటల్‌కు తరలించారు. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లు
● డీఆర్వో ఉదయభాస్కర్‌రావు నెల్లూరు రూరల్: జిల్లాలో ఈనెల 12 నుంచి 20వ తేదీ వరకు జరిగే ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని డీఆర్వో జె.ఉదయభాస్కర్‌రావు ఆదేశించారు. నెల్లూరు కలెక్టరేట్లోని తన కార్యాలయంలో శుక్రవారం సంబంధిత అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ మొదటి సంవత్సరం పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సంవత్సరం పరీక్షలు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతాయన్నారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలిపి 24,835 మంది విద్యార్థులు హాజరవుతున్నారని, అందుకోసం 65 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. అలాగే ప్రాక్టికల్ పరీక్షలను ఈనెల 28 నుంచి జూన్ ఒకటో తేదీ వరకు నిర్వహిస్తామన్నారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో నిరంతర విద్యుత్ సరఫరా జరిగేలా చూడాలన్నారు. ప్రథమ చికిత్స కిట్లను అందుబాటులో ఉంచాలన్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా తాగునీటి వసతి సౌకర్యం కల్పించాలన్నారు. పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులు సకాలంలో కేంద్రాలకు చేరుకునేలా ఆర్టీసీ అధికారులు బస్సులను నడపాలని సూచించారు. ప్రత్యేక కంట్రోల్ రూమ్ (0861 – 2320312) పెట్టామన్నారు. సమావేశంలో ఆర్ఐఓ వరప్రసాద్‌రావు, జిల్లా వృత్తి విద్యాశాఖాధికారి మధుబాబు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
టీ అంగడిపై ఎన్ఫోర్స్మెంట్ దాడులు
● 640 భంగ్ గోలీలు స్వాధీనం నెల్లూరు(క్రైమ్): మత్తు ఇచ్చే భంగ్ గోలీలను విక్రయిస్తున్న ఓ టీ షాపుపై ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేశారు. గంజాయితో మిళితమైన 640 భంగ్ గోలీలను స్వాధీనం చేసుకుని నిందితుడిపై కేసు నమోదు చేశారు. ఎక్సైజ్ అధికారుల సమాచారం మేరకు.. హోలీ వేడుకల్లో కొందరు జోష్ కోసం గంజాయితో మిళితమైన భంగ్ను సేవిస్తూ లోకాన్ని మరిచిపోతారు. ఇలా అధికంగా ఉత్తరాది రాష్ట్రాల్లో జరుగుతుంది. క్రమేపీ మన జిల్లాలోనూ విస్తరిస్తోంది. కొందరు భంగ్ను సేవిస్తున్నారు. నెల్లూరు ఇందిరాభవన్ రోడ్డులో టీ దుకాణం నిర్వహిస్తున్న రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన జయకిషన్ భంగ్ విక్రయాలకు తెరలేపాడు. ఆ రాష్ట్రంలో భంగ్ గోలీలను కొనుగోలు చేసి జిల్లాలోని కొందరు రాజస్థానీలకు అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకోసాగాడు. దీనిపై ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్ పి.దయాసాగర్‌కు సమాచారం అందింది. ఆయన ఆదేశాల మేరకు శుక్రవారం ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్లు వై.వెంకటేశ్వర్లు, పి.అనితలు తమ సిబ్బందితో కలిసి టీ దుకాణంపై దాడులు చేశారు. 640 భంగ్ గోలీలను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి దర్యాప్తు నిమిత్తం స్వాధీనం చేసుకున్న గోలీలు, నిందితుడిని ఎకై ్సజ్ నెల్లూరు – 1 స్టేషన్లో అప్పగించారు. ఎకై ్సజ్ అఽధికారులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. దాడిలో ఎస్సై సీహెచ్ పూర్ణకుమార్, హెచ్‌సీలు రమేష్‌కుమార్, కిరణ్‌సింగ్, కానిస్టేబుల్స్ మునిరాజ్కుమార్, రమణయ్య పాల్గొన్నారు. -
ఎస్పీ ఆదేశాలతో ముమ్మర తనిఖీలు
● 26మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నెల్లూరు(క్రైమ్): ఎస్పీ జి.కృష్ణకాంత్ ఆదేశాల మేరకు జిల్లా పోలీసు యంత్రాగం నేర నియంత్రణకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు జిల్లా వ్యాప్తంగా 2,463 వాహనాలను తనిఖీ చేశారు. లాడ్జీలు, ఆర్టీిసీ బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో సోదాలు చేశారు. అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మద్యం మత్తులో వాహనాలు నడుపుతున్న 26 మందిపై, బహిరంగంగా మద్యం తాగుతున్న 24 మందిపై కేసులు నమోదు చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన 102 మందికి రూ.53,485ల జరిమానా విధించారు. ఆరు వాహనాలను సీజ్ చేశారు. ఈ తనిఖీల్లో పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
గుర్తింపును రద్దు చేయాలి
ప్రభుత్వ నిబంధనలు అతిక్రమిస్తున్న ఇంటర్ కళాశాలల యాజమాన్యాల గుర్తింపును రద్దు చేయాలి. ఎన్నడూ లేని విధంగా వేసవి సెలవులివ్వకుండా విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు వారిపై బలవంతంగా చదువులను రద్దుతున్నారు. కలెక్టర్ దృష్టి సారించాలి. – ఆదిత్యసాయి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ విద్యార్థి జేఏసీ పట్టించుకోవడం లేదు ర్యాంక్‌లు, మార్కుల పేరుతో విద్యార్థులను తీవ్ర ఒత్తిడులకు గురిచేస్తున్న కార్పొరేట్ యాజమాన్యాలపై కేసులు నమోదు చేయాలి. తరగతుల నిర్వహణపై ఇంటర్ బోర్డు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. ఇంటర్ విద్యార్థులకు సెలవులిచ్చేలా జిల్లా అధికారులు చర్యలు చేపట్టాలి. – లీలామోహన్, రాష్ట్ర కార్యదర్శి, నవ్యాంధ్ర విద్యార్థి జేఏసీ తనిఖీలు నిర్వహిస్తాం ఇంటర్ తరగతుల నిర్వహణపై రోజూ తనిఖీలు నిర్వహిస్తాం. తరగతులు నిర్వహిస్తున్న కళాశాలను గుర్తించి ఆయా యాజమాన్యాలపై ఇంటర్ బోర్టు చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే కాలేజీల ప్రిన్సిపల్స్‌తో కాన్ఫరెన్స్ నిర్వహించి ఆదేశాలు జారీ చేశాం. వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహించరాదు. ఇందులో ఎవరికీ మినహాయింపు లేదు. – వరప్రసాద్‌రావు, ఆర్ఐఓ ● -
తీర ప్రాంతంలో అప్రమత్తంగా ఉండాలి
● ఎస్పీ కృష్ణకాంత్ ముత్తుకూరు(పొదలకూరు): జిల్లాలోని తీర ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ జి.కృష్ణకాంత్ పేర్కొన్నారు. శుక్రవారం అదానీ కృష్ణపట్నం పోర్టు, ఏపీ జెన్కో అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం భద్రతా వ్యవహారం, భవిష్యత్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమగ్రంగా చర్చించారు. యుద్ధ ప్రభావం తీరప్రాంతాలపై అధికంగా ఉండే అవకాశం ఉందని, పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. మైరెన్ పోలీసుల సహకారంతో పటిష్ట భద్రతతోపాటు నిఘా విభాగం చురుగ్గా పనిచేయాలన్నారు. పోర్టు యాజమాన్యంతో సమన్వయం చేసుకుంటూ భద్రతను కట్టుదిట్టం చేయాల్సిందిగా సూచించారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలన్నారు. సీసీ కెమెరాలు, డ్రోన్లు, బాంబ్, డాగ్ స్క్వాడ్లతో ముమ్మర తనిఖీలను నిర్వహించాల్సిందిగా ఆదేశించారు. క్రమం తప్పకుండా పోర్టు ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహించాలని, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు. సముద్రంలో వేటపై నిషేధం ఉందన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని, తీర ప్రాంతాల్లో అనుమానాస్పదంగా వచ్చే షిప్‌లు, వ్యక్తుల వివరాలను పోలీసుల దృష్టికి తీసుకోవాల్సిందిగా సూచించారు. సమన్వయ సమావేశంలో పోర్టు, జెన్కో అధికారులు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. -
ఘనంగా మెడికల్ కళాశాల ఫ్రెషర్స్ డే
నెల్లూరు(అర్బన్): దర్గామిట్టలోని ఏసీఎస్ఆర్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో మొదటి సంవత్సరం వైద్య విద్యనభ్యసిస్తున్న వారికి మూడో సంవత్సరం విద్యార్థులు శుక్రవారం ఫ్రెషర్స్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ డాక్టర్ గోవిందు మాట్లాడుతూ డాక్టర్ వృత్తి పవిత్రమైనదన్నారు. కళాశాల మంచి ఫలితాలతో గుర్తింపు తెచ్చుకుందన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో, బాధ్యతాయుతంగా చదివి మంచి డాక్టర్లుగా మారి ప్రజలకు సేవలందించాలన్నారు. సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నరేంద్ర మాట్లాడుతూ విలువలతో కూడిన విద్యను నేర్చుకుని సమాజానికి ఉపయోగపడాలన్నారు. ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ మస్తాన్‌బాషా మాట్లాడుతూ ఎంతో కష్టపడి ర్యాంక్ సాధించి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో చదవడం అంటే చాలా గొప్ప విషయమన్నారు. క్రీడా పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ● ఉగ్రదాడిలో మృతిచెందిన పర్యాటకులు, దేశ సరిహద్దుల్లో వీరమరణం పొందిన తెలుగు జవాన్ మురళీనాయక్, ఇంకా పౌరులకు మెడికల్ విద్యార్థులు, డాక్టర్లు ఘనంగా నివాళులర్పించారు. దేశానికి అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో డాక్టర్ కాలేషాబాషా, పలువురు డాక్టర్లు పాల్గొన్నారు. -
మధుసూదన్ కుటుంబసభ్యులకు కేంద్ర మంత్రి పరామర్శ
కావలి (జలదంకి): పహల్గాం ఉగ్ర దాడిలో మృతి చెందిన కావలికి చెందిన మధుసూదన్‌రావు కుటుంబసభ్యులను కేంద్ర భారీ ఉక్కు పరిశ్రమల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్‌వర్మ శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మధుసూదన్‌రావు భార్య కామాక్షి ప్రసన్న, పిల్లలతో మాట్లాడి వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రభుత్వం వారి కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కావలి బీజేపీ నేతలు పాల్గొన్నారు. రుణాల రికవరీలు వందశాతం సాధించాలి ● డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి నెల్లూరు (పొగతోట): బ్యాంకు లింకేజీ రుణాలు, సీ్త్ర నిధి రుణాలకు సంబంధించి వంద శాతం రికవరీలు సాధించాలని డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి డీపీఎం, ఏసీలు, ఏపీఎంలను ఆదేశించారు. డీఆర్డీఏ సమావేశ మందిరంలో డీపీఎంలు, ఏసీలు, ఏపీఎంలతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి యాన్యువల్ క్రెడిట్ లైవ్లీహుడ్ ప్లాన్ నుంచి మైక్రో క్రెడిట్ ప్లాన్‌ను సిద్ధం చేయాలని సూచించారు. దీనికి సంబంధించి బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి, ఉన్నతి, సీఐఎఫ్ తదితర విభాగాల నుంచి స్వయం సహాయక మహిళలకు ఆర్థిక సహకారం అందించి వారిని వ్యాపారవేత్తలుగా తయారు చేయాలన్నారు. జూన్ 8వ తేదీ లోపు వెయ్యి మంది మహిళలను గుర్తించి వారికి ఉపాధి కల్పించాలన్నారు. వందశాతం మొబైల్ బుక్ కీపింగ్ చేయాలన్నారు. సీఐఎఫ్ నిధులను సక్రమంగా ఉపయోగపడేలా చర్యలు చేపట్టాలన్నారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.177 కోట్లు సీ్త్ర నిధి రుణాలు మంజూరుచేసి వంద శాతం లక్ష్యాన్ని సాధించడం జరిగిందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.300 కోట్ల రుణాలు అందించేలా చర్యలు చేపట్టాలన్నారు. పీఎం సూర్యఘర్ పథకానికి సంబంధించి సోలార్ పలకలను మండలాలకు కేటాయించి ఏపీఎంలు లక్ష్యాలను చేరుకోవాలన్నారు. ఈ సమావేశంలో డీపీఎంలు, ఏసీలు, ఏపీఎంలు, ఐటీడీఏ ఏపీఓ, బ్యాంకు అధికారులు సీ్త్ర నిధి ఏజీఎం కామాక్షయ్య పాల్గొన్నారు. -
మీడియా స్వేచ్ఛను హరించడమే
● సాక్షి ఎడిటర్ ఇంట్లో పోలీసుల తనిఖీలపై జర్నలిస్టుల నిరసన మనుబోలు: మీడియా స్వేచ్ఛను ప్రభుత్వం హరించడం దుర్మార్గమని జాప్ రాష్ట్ర కోశాధికారి పాశం ఏడుకొండులు, గూడూరు ప్రింట్ మీడియా డివిజన్ గౌరవాధ్యక్షుడు బాబు మోహన్‌దాస్ అన్నారు. సాక్షి పత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డిని పోలీసులు వేధింపులకు గురిచేస్తున్న తీరుకు నిరసనగా మనుబోలు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం డిప్యూటీ తహసీల్దార్ బషీర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి ఇంటిలోకి పోలీసులు అనుమతి లేకుండా ప్రవేశించడమే కాకుండా తనిఖీల పేరుతో హంగామా సృష్టించారని విమర్శించారు. ఇటీవల కావలిలో జర్నలిస్టులను అక్రమంగా అరెస్ట్ చేసి వేధించడాన్ని కూడా తీవ్రంగా ఖండించారు. తమకు నచ్చిన విధంగా వార్తలు రాయలేదనే కారణంతో జర్నలిస్టులు, మీడియా కార్యాలయాలపై ప్రభుత్వం పోలీసుల చేత దాడులు చేయించడం హేయమైన చర్య అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు జగదీష్ బాబు, సుధాకర్, జయకర్, శివాబి శ్రీను, ఒలిపి శ్రీనివాసులు, రవీంద్ర, బాషా, శంకర్, సాయి, సునీల్, శ్రీధర్ తదితరులతో పాటు పలువురు యూట్యూబ్ చానళ్ల విలేకరులు పాల్గొన్నారు. రాజ్యాంగ హక్కులను కాలరాయడమే నెల్లూరు(వీఆర్సీసెంటర్): ప్రజాస్వామ్య హక్కులను కాలరాసే విధంగా నేడు రాష్ట్రంలో కూటమి సర్కార్ వ్యవహరిస్తోంది. ప్రభుత్వ వైపల్యాలను ప్రజలకు తెలియచేస్తూ, ప్రజలను చైతన్యవంతం చేస్తున్న సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డి ఇంట్లో సోదాలు జరపటం, సాక్షి విలేకర్లపై అక్రమ కేసులు బనాయించటం సరైన పద్ధతి కాదు. మీడియాపై ఆంక్షలు పెట్టటం ఫాసిజమే అవుతుంది. ఇది ముమ్మాటికీ రాజ్యాంగం కల్పించిన పత్రికా స్వాతంత్య్రపు హక్కును హరించటమే. – మస్తాన్‌బీ, ఐద్వా జిల్లా కార్యదర్శి అది హేయమైన చర్య నెల్లూరు(వీఆర్సీసెంటర్): సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డి నివాసంలోఎలాంటి అనుమతులు లేకుండా పోలీసులు సోదాలు చేసి కుటుంబసభ్యులను భయబ్రాంతులకు గురి చేయటం హేయమైన చర్య. పత్రికాస్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ప్రభుత్వం నడుచుకుంటోంది. ప్రభుత్వంలో మహిళలు, చిన్నారులతోపాటు జర్నలిస్టులకు కూడా రక్షణ లేకుండా పోయింది. జర్నలిస్టులపై అక్రమ కేసులు పెట్టటం ప్రశ్నించే గొంతును నొక్కేయడమే. – డి.అన్నపూర్ణమ్మ, శ్రామిక మహిళా సంఘం జిల్లా కార్యదర్శి నాజీల పాలనను తలపిస్తోంది నెల్లూరు (బృందావనం): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ వైఫల్యాలను తూర్పారబడుతూ ప్రజల పక్షాన నిలిచిన ‘సాక్షి’ దినపత్రిక, ఆ పత్రిక ఎడిటర్‌ను ధనంజయరెడ్డిని వేధింపులకు గురిచేయడం నిరంకుశ నాజీల పాలనకు అద్దం పడుతోంది. ప్రచార మాధ్యమాల పట్ల కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం ప్రజాప్రభుత్వ మనుగడకు ప్రమాదకరం. పత్రికలలో ప్రచురితమయ్యే కథనాలలో ఉన్న వాస్తవాలను విచారించుకుని వాటిని సరిదిద్దుకుంటే పాలకుల తీరును ప్రజల హర్షిస్తారు. – ఎల్లంకి వెంకటేశ్వర్లు, కార్యదర్శి, జిల్లా పౌరహక్కుల సంఘం పత్రికా స్వేచ్ఛపై నిబంధనలా? నెల్లూరు (టౌన్): పత్రికా స్వేచ్ఛను కాలరాయడం కూటమి ప్రభుత్వానికి మంచిది కాదు. జర్నలిస్టులు రాసే వార్తలపై నిబంధనలు విధించకకూడదు. వాస్తవాలను ప్రచురించే స్వేచ్ఛను వారికి కల్పించాలి. సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డికి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా పోలీసులు దౌర్జన్యంగా ఇంటిలోకి ప్రవేశించి తనిఖీలు చేయడం పత్రికకు సంకెళ్లు వేయడంగా భావించాలి. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పు ఒప్పులను ఎత్తి చూపే స్వేచ్ఛ జర్నలిస్టులకు ఉంటుంది. వార్తలు రాసిన జర్నలిస్టులపై దాడులకు పాల్పడటం మంచి పద్ధతి కాదు. – బసిరెడ్డి రఘురామిరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు, వైఎస్సార్‌టీఎఫ్ -
నృసింహుడి క్షేత్రోత్సవం
రాపూరు: ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోన క్షేత్రంలో శుక్రవారం రాత్రి పెనుశిల లక్ష్మీనరసింహస్వామి, ఆదిలక్ష్మీదేవి, చెంచులక్ష్మీదేవేరులతో కలిసి శేషవాహనంపై ఊరేగారు. శేషవాహనాన్ని వివిధ రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి అందులో స్వామి వారు, దేవేరుల ఉత్సవ విగ్రహాలను కొలువుదీర్చి పెంచలకోనలోని తిరు మాడవీధుల్లో క్షేత్రోత్సవం నిర్వహించారు. అంతకుముందు ఉదయం ధ్వజారోహణ కార్యక్రమాన్ని వేదపండితులు వేడుకగా నిర్వహించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తరలిరావాలంటూ గరుడి ద్వారా సకల దేవతలకు ఆహ్వానం పంపారు. వేదమంత్రాల నడుమ గరుత్మంతుడి చిత్రపటాన్ని ధ్వజస్తంభంపైకి ఎగురవేశారు. కార్యక్రమంలో డీసీ సాగర్‌బాబు, చెంగాళమ్మ దేవస్థానం ఏసీ వెంకటేశ్వర్లు, ఉప ప్రధానార్చకులు పెంచలయ్యస్వామి, సీతారామయ్యస్వామి, తిరుమల తిరుపతి దేవస్థాన పాంచరాత్ర ఆగమపండితులు రామానుజాచార్యులు పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. గరుత్మంతుడికి పూజలు అభిషేకాలకు ఉపయోగించిన ప్రసాదాలను స్వీకరిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందన్న విశ్వాసంతో మహిళలు పెద్ద సంఖ్యలో ప్రసాదం కోసం పోటీపడ్డారు. వేలాదిగా దర్శించుకున్న భక్తులు ఉత్సవాలకు సకల దేవతలకు ఆహ్వానం -
ప్రభుత్వ బడులను పరిరక్షించండి
కలెక్టరేట్ వద్ద ధర్నాలో ఉపాధ్యాయులు నెల్లూరు(అర్బన్): ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించాలని కోరుతూ ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో పలువురు ఉపాధ్యాయులు కలెక్టరేట్ వద్ద శుక్రవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిలు దశరథరాములు, హజరత్‌లు మాట్లాడారు. ప్రభుత్వం రోజుకో నిర్ణయంతో విద్యావిధానంలో గందరగోళ పరిస్థితులను కల్పిస్తోందని విమర్శించారు. ప్రతి ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5 తరగతులు కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించాలని, ఉన్నత పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంతో సమాంతరంగా తెలుగు మాధ్యమాన్ని కొనసాగించాలని కోరారు. నూతనంగా అప్‌గ్రేడ్ చేసిన ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా హెడ్మాస్టర్, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు మంజూరు చేయాలన్నారు. సీపీఎస్, జీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని(ఓపీఎస్) అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రాథమికోన్నత పాఠశాలల్లో 6, 7 తరగతులున్న చోట 4 స్కూల్ అసిస్టెంట్ పోస్టులను, 6,7,8 తరగతులున్న చోట 6 స్కూల్ అసిస్టెంట్ పోస్టులను కేటాయించాలి కోరారు. లేదంటే భవిష్యత్‌లో ఐక్య ఉద్యమాలు చేపడతామన్నారు. అనంతరం కలెక్టరేట్ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ ధర్నాలో ఆ సంఘం నాయకులు సురేఖ, రఘురామిరెడ్డి, శరత్‌బాబు, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. విద్యా విధానంలో సర్కారు తీరుపై నిరసన ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయుల ధర్నా -
పేదల గృహ నిర్మాణాల పూర్తికి చర్యలు
● కలెక్టర్ ఆనంద్ నెల్లూరు రూరల్: జిల్లాలో పేదల గృహ నిర్మాణాలను వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని గృహ నిర్మాణశాఖ అధికారులను కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. కలెక్టరేట్లోని వారి ఛాంబర్లో ఎన్టీఆర్ హౌసింగ్ పురోగతిపై శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇళ్ల నిర్మాణ దశలను పూర్తి చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. ఆప్షన్–3 కింద లబ్ధిదారులకు కాంట్రాక్టర్లు నిర్మిస్తున్న ఇళ్లను ఇంజినీరింగ్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. నల్లరేగడి నేలల్లో నిర్మిస్తున్న ఇళ్ల పునాదుల నాణ్యతను సంబంధిత అధికారులు పరిశీలించి సర్టిఫై చేయాలన్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటించని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో గృహ నిర్మాణశాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ వేణుగోపాల్, ఆర్అండ్బీ, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, విద్యుత్‌శాఖల ఏఈలు గంగాధర్, వెంకటరమణ, విజయన్, అశోక్ కుమార్, డీఈలు జహీరుద్దీన్, నారాయణరెడ్డి, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. -
నేరాల నియంత్రణకు డ్రోన్లతో నిఘా
బిట్రగుంట: నేరాల నియంత్రణకు జీఆర్పీ అధికారులు పటిష్ట చర్యలు చేపట్టారు. సిగ్నల్ ట్యాంపరింగ్‌తోపాటు రైళ్లలో తిరుగుతూ ప్రయాణికుల బ్యాగ్‌లు, వస్తువులు అపహరించే ముఠాల ఆటకట్టించేందుకు అత్యాధునిక కెమెరాలు, డ్రోన్లతో నిఘా ముమ్మరం చేశారు. మహారాష్ట్రకు చెందిన కొన్ని గ్యాంగ్‌లు వేసవిలో రైళ్లలో చోరీలకు పాల్పడుతుంటాయి. ఇటీవల అల్లూరు రోడ్డు, పడుగుపాడు, శ్రీవెంటేశ్వరపాళెం స్టేషన్ల పరిధిలో చోటుచేసుకున్న పలు ఘటన నేపథ్యంలో సీరియస్‌గా తీసుకున్న గుంతకల్ రైల్వే ఎస్పీ రాహుల్‌మీనా ప్రత్యేక చర్యలు చేపట్టారు. నిఘా కోసం డ్రోన్ల వినియోగానికి శ్రీకారం చుట్టారు. రైల్వే ఎస్పీ ఆదేశాల మేరకు నెల్లూరు జీఆర్పీ డీఎస్పీ మురళీధర్, సీఐ సుధాకర్‌లు కావలి, బిట్రగుంట, నెల్లూరు తదితర స్టేషన్లలో డ్రోన్లతో నిఘా ముమ్మరం చేశారు. రైల్వేలో నేరాల కట్టడికి డ్రోన్లను వినియోగించడం ఇదే ప్రథమం కావడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిమ్మ ధరలు (కిలో) పెద్దవి : రూ.80 సన్నవి : రూ.40 పండ్లు : రూ.25 -
భూ ఆక్రమణ.. సమష్టిగా అడ్డగింత
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: తెలుగు తమ్ముళ్ల భూ ఆక్రమణ యత్నాన్ని గ్రామస్తులు సమష్టిగా అడ్డుకున్నారు. వాస్తవానికి కలువాయి మండలం తెలుగురాయపురంలో 130 ఎకరాల ప్రభుత్వ భూములను ఆక్రమించేందుకు వీరు ముమ్మర యత్నాలు చేశారు. ఈ క్రమంలో ‘బాబోయ్.. భూచోళ్లు’ శీర్షికన సాక్షిలో కథనం గత నెల్లో ప్రచురితమైంది. దీన్ని చూసిన గ్రామస్తులు తమ భూములను రక్షించుకునేందుకు ఏకమయ్యారు. కుటిల యత్నానికి బ్రేకులు భూములను చదును చేసేందుకు గానూ యంత్రాలను కూటమి నేతలు రెండు రోజుల నుంచి రంగంలోకి దింపారు. దీంతో వీటిని గ్రామస్తులు అడ్డుకొని ఆందోళనకు దిగారు. సమస్యను మండల రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు వచ్చారు. ఫలితంగా టీడీపీ నేతల యత్నాలకు స్థానికులు బ్రేకులేశారు. చదును చేస్తున్న వాహనాలను అధికారులు సీజ్ చేసి, భూముల్లో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. జరిగిందిదీ.. కూటమి ప్రభుత్వం కొలువుదీరాక భూములు, ఇసుక, గ్రావెల్ మాఫియాలు అధికమయ్యాయి. ఖాళీగా భూములు కనిపిస్తే ఆక్రమించేందుకు యత్నాలు ముమ్మరమయ్యాయి. ఈ కోవలోనే తెలుగురాయపురంలో 130 ఎకరాల ప్రభుత్వ భూములను కాజేసేందుకు తెలుగు తమ్ముళ్లు, మరికొందరు తమ యత్నాలను ముమ్మరం చేశారు. విషయం పత్రికల్లో రావడంతో కంగుతిన్న వారు కొద్ది రోజులు మిన్నకుండిపోయారు. తదనంతరం ఎవరూ స్పందించడంలేదనే ఉద్దేశంతో ఆక్రమించేందుకు చదును చేయడాన్ని షురూ చేశారు. గమనించిన ప్రజలు తిరగబడ్డారు. మాయాజాలం గ్రామంలోని సర్వే నంబర్ 585 / 2, 586 / 1, 590 / 3, 593 / 1, 576, 577, 578 తదితర సర్వే నంబర్లలో 130 ఎకరాలున్నాయి. 2013లో ఇతర జిల్లాలు, పక్క మండలాలకు చెందిన వారికి పట్టాలను మంజూరు చేశారు. దీనికి సంబంధించి ప్రస్తుతం 187 / 5, 565 / 3, 597 / 2, 597 / 1 సర్వే నంబర్లలో 14 ఎకరాలను ఫ్రీ హోల్డ్‌లో పెట్టారు. మిగిలిన వాటి పట్టా పేర్ల మార్పునకు రంగం సిద్ధం చేశారు. 597 / 1లో సిద్ధిరాజుకు 2.67 ఎకరాలను ఫ్రీ హోల్డ్ చేశారు. 592 / 3లో అదే పేరుతో 2.3 ఎకరాలు డీ పట్టాగా ఉంది. ఇక్కడే రెవెన్యూ అధికారుల మాయాజాలం అర్థమవుతోంది. మరోవైపు ఫిబ్రవరి, 2014లో వెంకటసుబ్బరాజుతో పాటు 25 మంది లబ్ధిదారులు తమకు భూములు చూపించలేదంటూ కోర్టును ఆశ్రయించారు. గ్రామంలో పేద బడుగు, బలహీనవర్గాలకు చెందిన అనేక మంది ఉండగా, భూములను పక్క జిల్లాలు, వేరే మండలాలకు చెందిన వారికి కేటాయించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. గద్దల్లా వాలి.. తెలుగురాయపురం సమీపంలో నేషనల్ హైవే వస్తుందనే సమాచారంతో వీటిపై టీడీపీ నేతల కన్నుపడింది. ఎకరా దాదాపు రూ.15 లక్షలకుపైగా ఉందని సమాచారం. ఈ తరుణంలో సుమారు రూ.20 కోట్లు విలువజేసే భూమిని కాజేసేందుకు పచ్చ నేతలు తమ యత్నాలను ముమ్మరం చేస్తున్నారు. వీరి చేష్టలకు రెవెన్యూ అధికారులు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారు. కోర్టులో వివాదం ఉన్నా, పట్టాలు మార్పు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. తెలుగురాయపురంలో 130 ఎకరాల కబ్జాకు తెలుగు తమ్ముళ్ల యత్నం ఆందోళనకు దిగిన స్థానికులు చివరికి హెచ్చరిక బోర్డు ఏర్పాటు ఆక్రమిస్తే చర్యలు ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు చేపడతాం. తెలుగురాయపురంలో 130 ఎకరాలను పరిరక్షించేలా చూస్తాం. హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశాం. భూముల్లోకి ఎవరు దిగినా కేసులు నమోదు చేస్తాం. – శ్యామ్‌సుందర్, తహసీల్దార్, కలువాయి -
గొంతు నొక్కే యత్నం తగదు
ఉదయగిరి: పత్రికల గొంతు నొక్కే యత్నం ప్రభుత్వాలకు తగదని పలువురు జర్నలిస్టులు పేర్కొన్నారు. సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డి ఇంట్లోకి పోలీసులు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ప్రవేశించి సోదాలు జరపడం, కుటుంబసభ్యులను భ్రయభ్రాంతులకు గురిచేయడాన్ని నిరసిస్తూ వింజమూరులో జర్నలిస్ట్ సంఘ నేతలు నల్లబ్యాడ్జీలను ధరించి నిరసన తెలిపారు. అనంతరం ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డికి వినతిపత్రాన్ని అందజేశారు. పత్రికలపై దాడి ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అంటూ నినాదాలు చేశారు. జర్నలిస్టులు మేడగం భాస్కర్‌రెడ్డి, సాదం నరసింహలు, గువ్వల రవీంద్రరెడ్డి, అంకినపల్లి జయరామిరెడ్డి, మాధవ, చరణ్, లెక్కమనేని రాజేష్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
కలెక్టరేట్ ఎదుట నిరసన
సాక్షిపై అక్కసు కూటమి ప్రభుత్వ కక్షసాధింపు చర్యలు పరాకాష్టకు చేరాయి. పాలనలో వైఫల్యం.. సంక్షేమ పథకాల అమల్లో నిర్లిప్తత.. వెరసి ప్రజల్లో వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. ఈ అంశాలను ప్రశ్నిస్తున్న గొంతుకలపై ఉక్కుపాదం మోపుతోంది. పత్రిక స్వేచ్ఛకు సంకెళ్లు వేస్తూ.. రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ వికటాట్టహాసం చేస్తోంది. సర్కార్ వైఫల్యాలపై నిరంతరం కథనాలను ప్రచురిస్తున్న సాక్షిపై నిరంకుశ వైఖరికి తెరలేపింది. ఇందులో భాగంగా పత్రిక ఎడిటర్ ధనుంజయరెడ్డిపై తన అక్కసును ప్రదర్శించింది. సోదాల పేరుతో విజయవాడలోని ఆయన ఇంటికి పోలీసులను గురువారం పంపి కుటుంబసభ్యులను ఇబ్బంది పెట్టి పైశాచికానందాన్ని పొందింది. ప్రజాస్వామ్యానికే మాయని మచ్చగా చోటుచేసుకున్న ఈ పరిణామాలపై మేధావులు, విద్యావేత్తలు, పాత్రికేయులు భగ్గుమంటున్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. – సాక్షి నెట్వర్క్ నెల్లూరు రూరల్: జర్నలిస్టులపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతూ.. అక్రమ కేసులు బనాయించి భయాందోళనలకు గురిచేస్తోందని పాత్రికేయులు ఆరోపించారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎలాంటి నోటీసులివ్వకుండా సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డి ఇంట్లో పోలీసులు దౌర్జన్యంగా సోదాలు నిర్వహించడం దారుణమంటూ కలెక్టరేట్ ఎదుట జర్నలిస్ట్ ఐక్యవేదిక నేతలు నల్ల రిబ్బన్లతో గురువారం నిరసన తెలిపారు. అనంతరం డీఆర్వో ఉదయభాస్కర్‌కు వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. జర్నలిస్టుల గొంతు నొక్కేందుకే ఇలాంటి పోకడలకు తెరలేపారని మండిపడ్డారు. చట్టాన్ని అతిక్రమించి పోలీసులు ఈ విధంగా వ్యవహరించడం సిగ్గుచేటని విమర్శించారు. హజరత్తయ్య, కృష్ణారెడ్డి, సాంబశివరావు, హరి, సింగ్, యోగానందరెడ్డి, శ్రీనివాసులు, కమల్, విజయకృష్ణ, మాల్యాద్రి, వెంకట్రావు, ముజ్జు తదితరులు పాల్గొన్నారు. -
లీజు ముగిసిన గనుల స్వాధీనానికి వినతి
సైదాపురం: మండలంలో లీజు ముగిసిన గనులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర నృత్య అకాడమీ మాజీ చైర్పర్సన్ పొట్టేళ్ల శిరీషాయాదవ్ కోరారు. ఈ మేరకు నెల్లూరు ఆర్డీఓ అనూషకు వినతిపత్రాన్ని గురువారం అందజేసిన అనంతరం ఆమె మాట్లాడారు. క్వార్ట్జ్ ఖనిజాన్ని మేజర్ మినరల్‌గా భారత గనుల మంత్రిత్వ శాఖ ప్రకటించిందన్నారు. ఈ క్రమంలో గనులు, ఖనిజాల అభివృద్ధి, నియంత్రణ చట్టం – 1957 మేరకు ఇక్కడ ఎలాంటి అక్రమ మైనింగ్ జరగకూడదని చెప్పారు. నెల్లూరు ఎంపీ తన అనుచరుడితో అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారని, ఈ క్రమంలో గనులను వెంటనే స్వాధీనం చేసుకోవాలని కోరారు. రైతులకు పరిహారాన్ని పెంచాలి ఆత్మకూరు: ఆత్మకూరు డివిజన్ పరిధిలో నూతనంగా నిర్మిస్తున్న నడికుడి – శ్రీకాళహస్తి రైల్వేలైన్‌కు సంబంధించిన భూసేకరణలో తమకు పరిహారాన్ని పెంచాలని రైతులు కోరారు. ఈ మేరకు ఆత్మకూరు ఆర్డీఓ పావనికి వినతిపత్రాన్ని గురువారం అందజేశారు. మండలంలోని అప్పారావుపాళెం, మురగళ్ల మీదుగా రైల్వేలైన్ నిర్మాణం జరుగుతున్న క్రమంలో భూసేకరణ కోసం రైతులతో ఆర్డీఓ, రైల్వే అధికారులు ఇటీవల సమావేశమయ్యారు. అప్పారావుపాళెంలో 48 ఎకరాలను సేకరించనుండగా, ఎకరాకు రూ.7.6 లక్షల నుంచి రూ.తొమ్మిది లక్షల పరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించింది. అయితే మార్కెట్ విలువ ఎకరా రూ.18 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఉందని, ఈ మేరకు క్షేత్రస్థాయిలో పరిశీలించి పెంచాలని కోరారు. మరోవైపు రైల్వేలైన్ నిర్మాణానికి 8.5 మీటర్ల ఎత్తుగా కట్టపోసి నిర్మించనున్నారని, దీంతో పెన్నాకు వరదలొచ్చిన సమయంలో అప్పారావుపాళెం, కొత్తపాళెం, బట్టేపాడు, నల్లపరెడ్డిపల్లి, మురగళ్ల గ్రామాల్లో సుమారు మూడు వేల ఎకరాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉఉందని ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాలి నెల్లూరు రూరల్: రెవెన్యూ సేవలను ప్రజలకు అందించే క్రమంలో జవాబుదారీతనంగా ఉండాలని జేసీ కార్తీక్ సూచించారు. రీసర్వే డిజిటలైజేషన్, నోషనల్ ఖాతాలు, నీటి తీరువా పన్నుల వసూలు, సిటిజన్ సర్వీసెస్ తదితర అంశాలపై నెల్లూరు డివిజన్ తహసీల్దార్లతో తిక్కన ప్రాంగణంలో గురువారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎలాంటి ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా రీసర్వేను పూర్తి చేయాలని కోరారు. రికార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియ సజావుగా సాగేలా ముందుగా రెవెన్యూ కార్యాలయాల్లో అందుబాటులో ఉన్న రికార్డుల జాబితాను రూపొందించాలని సూచించారు. రైతుల నుంచి నీటి తీరువా పన్నులను వసూలు చేయాలని కోరారు. డీఆర్వో ఉదయభాస్కర్‌రావు, ఆర్డీఓ అనూష, సర్వే ఏడీ నాగశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం నెల్లూరు (టౌన్): ఉపాధ్యాయులకు వచ్చే నెల ఐదు నుంచి 11 వరకు నిర్వహించనున్న శిక్షణ కార్యక్రమాల్లో రాష్ట్ర, జిల్లా, డివిజన్, మండల స్థాయిలో రిసోర్స్ పర్సన్లుగా పనిచేసేందుకు అనుభవజ్ఞులైన ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని డీఈఓ బాలాజీరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులను amonellore2819@ gmail.com లేదా వాట్సాప్ నంబర్ 94417 00940కు పంపాలని సూచించారు. పంచాయతీ సెక్రటరీ సస్పెన్షన్ నెల్లూరు (పొగతోట): వింజమూరు పంచాయతీ సెక్రటరీ శివకుమార్‌ను సస్పెండ్ చేస్తూ పంచాయతీరాజ్ సెక్రటరీ కమిషనర్ కృష్ణతేజ ఉత్తర్వులను గురువారం జారీ చేశారు. కోవూరు గ్రామ పంచాయతీ సెక్రటరీగా పనిచేసే సమయంలో రూ.1,16,66,878 మేర నిధుల దుర్వినియోగంతో పాటు ఇతర అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని రుజువు కావడంతో సస్పెన్షన్ వేటేశారు. -
జెడ్పీలో కారుణ్య నియామకాలు
నెల్లూరు(పొగతోట): జిల్లా పరిషత్‌లో కారుణ్య నియామకాల కింద పలువురికి ఉద్యోగావకాశాలు కల్పించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ గురువారం జిల్లా పరిషత్ కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు జిల్లా పరిషత్ యాజమాన్య పరిధిలో 76 మందికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగావకాశాలు కల్పించామన్నారు. 107 మందికి పదోన్నతులు కల్పించడం జరిగిందన్నారు. ఖాళీగా ఉన్న పోస్టులను త్వరగా భర్తీ చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ విద్యారమ, డిప్యూటీ సీఈఓ మోహన్‌రావు, 4వ తరగతి ఉద్యోగులు రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు కె.భీమ్‌రెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శి షేక్ మాబాషా, అధికారులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో ఎమర్జెన్సీ రోజులు పునరావృతం
● హామీలు నెరవేర్చకుండా అరాచకాలు ● ధ్వజమెత్తిన ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి నెల్లూరు (పొగతోట): ఎమర్జెన్సీ రోజులు ప్రస్తుత కూటమి పాలనలో రాష్ట్రంలో కనిపిస్తున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ధ్వజమెత్తారు. నగరంలోని తన క్యాంప్ కార్యాలయంలో విలేకరులతో గురువారం ఆయన మాట్లాడారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అరాచకాలకు కూటమి ప్రభుత్వం పాల్పడుతోందని, వీటి నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డి ఇంట్లో పోలీసులు సోదాలు జరిపారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌కు అండగా నిలవాల్సిన సమయంలో పత్రిక సంపాదకులపై కేసులు పెట్టడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ హయాంలో విద్యుత్‌ను కొనుగోలు చేస్తే తప్పన్న కూటమి నేతలు ఇప్పుడు అంతకంటే అధిక ధరకు కొనుగోలు చేస్తూ ప్రజలపై భారం మోపుతున్నారని మండిపడ్డారు. కుంభకోణాలతో కూటమి ప్రభుత్వం తలమునకలైందని విమర్శించారు. ఐపీఎస్ ఆంజనేయులును ఓ చిన్న కేసులో నెల రోజులుగా జైల్లో ఉంచడం దారుణమన్నారు. సీనియర్ ఐఏఎస్‌లు ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిపై కేసులు పెట్టడం దారుణమని తెలిపారు. కూటమి నేతలను నిలదీసే రోజు త్వరలోనే రానుందని స్పష్టం చేశారు. -
సాఫ్ట్‌బాల్ టోర్నమెంట్ విజేత వీఎస్‌యూ
వెంకటాచలం: మండలంలోని కాకుటూరులో ఉన్న విక్రమ సింహపురి యూనివర్సిటీలో ఐదురోజులపాటు జరిగిన జాతీయ స్థాయి పురుషుల సాఫ్ట్‌బాల్ టోర్నమెంట్ ముగిసింది. వీఎస్‌యూ జట్టు విజేతగా నిలిచింది. చివరి రోజైన గురువారం నాలుగు జట్ల మధ్య హోరాహోరీగా మ్యాచ్‌లు జరిగాయి. విక్రమ సింహపురి యూనివర్సిటీ అత్యుత్తమ ప్రతిభ చూపి మొదటి స్థానంలో నిలిచింది. మహారాజా సూరజ్మాల్ బ్రిజ్ యూనివర్సిటీ (జైపూర్) ద్వితీయ స్థానంలో, కాలికట్ యూనివర్సిటీ (కేరళ) తృతీయ స్థానంలో, సంత్ గాడ్గే బాబా అమరావతి యూనివర్సిటీ (మహారాష్ట్ర) నాలుగో స్థానంలో వచ్చాయి. వారికి వీసీ అల్లం శ్రీనివాసరావు, ఇన్చార్జి రిజిస్ట్రార్ డాక్టర్ కె.సునీత, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తదితరులు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ టోర్నమెంట్‌ను సమష్టి కృషితో విజయంతం చేశామన్నారు. భవిష్యత్‌లో మరిన్ని క్రీడా పోటీలు నిర్వహిస్తామన్నారు. -
అధికారులకు లంచం ఇస్తే చాలు
● గ్రావెల్ దందాను వెలుగులోకి తెచ్చిన ఫోన్ కాల్ రికార్డింగ్ ● తహసీల్దార్ రూ.30 వేలు అడిగారంటూ వ్యాఖ్యలుసోమశిల: అధికార పార్టీ అయితే సరిపోదు.. అధికారులను ప్రసన్నం చేసుకుంటే గ్రావెల్ దందాను కొనసాగించవచ్చనే విషయం అక్రమంగా గ్రావెల్ తోలుతున్న ఓ వ్యక్తి ఫోన్ కాల్ రికార్డింగ్ ద్వారా వెలుగులోకి వచ్చింది. గ్రావెల్ తోలాలంటే తహసీల్దార్‌కు లంచం ఇస్తే వదిలేస్తుందంటూ తన స్నేహితుడితో చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఈ వ్యవహారం గ్రావెల్ మాఫియా, అధికారుల మధ్య ఉన్న సంబంధాలను బయటపెట్టింది. అనంతసాగరం మండలంలోని మంచాలపల్లి చెరువు కట్ట సమీపంలో ఉన్న కొండ ప్రాంతం నుంచి కొందరు ఎలాంటి అనుమతి లేకుండా రాత్రి వేళ్లలో జేసీబీలతో గ్రావెల్ తవ్వి ట్రాక్టర్లలో తరలించి సొమ్ము చేసుకుంటున్నట్లు స్థానికులు చెబుతున్నారు. దీనిపై గురువారం వెలుగులోకి వచ్చిన ఓ ఫోన్ కాల్ రికార్డింగ్ వైరలైంది. గ్రావెల్ తరలిస్తున్న వ్యక్తి తన స్నేహితుడితో ఇలా మాట్లాడాడు. గతంలో ఎస్సైకు మామూళ్లు ఇచ్చి గ్రావెల్ తోలేవాడినని, ఇటీవల ఓ గ్రామ రెవెన్యూ అధికారి తనకు కొంత ఇవ్వాలని అడగడంతో ఇచ్చానన్నాడు. దందా విషయమై తహసీల్దార్‌కు సమాచారం అందడంతో ఆమె ఫోన్ చేసి లంచం ఇస్తావా లేదంటే కేసులు పెట్టాలా అని రూ.30 వేలు డిమాండ్ చేసినట్లు స్నేహితుడితో ఫోన్లో చెప్పాడు. తనకు ఏమీ మిగలకపోగా సొంత నిధులు ఖర్చవుతున్నాయంటూ అతను చెప్పిన మాటలు కలకలం రేపాయి. -
పొగాకు వేలం పరిశీలన
మర్రిపాడు: మండలంలోని డీసీపల్లి పొగాకు బోర్డు వేలం కేంద్రాన్ని గురువారం పొగాకు బోర్డు చైర్మన్ చిడిపోతు యశ్వంత్ కుమార్ సందర్శించారు. రైతుల సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పొగాకు సాగు వ్యయం బాగా పెరిగిందని, దానిని దృష్టిలో పెట్టుకుని ప్రతి గ్రేడ్‌కు గిట్టుబాటు ధర కల్పించాలని వ్యాపార ప్రతినిధులను కోరారు. ప్రపంచ వ్యాప్తంగా పొగాకు సాగు విపరీతంగా పెరిగిందని, అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌లో అనుమతి ఇచ్చిన దాని కన్నా చాలా ఎక్కువగా పండించారన్నారు. రైతులు బోర్డు అనుమతి ఇచ్చినంత వరకు పండించి మంచి ధరలు పొందాలని తెలిపారు. కార్యక్రమంలో వేలం నిర్వహణాధికారి జి.రాజశేఖర్, రైతు సంఘం నాయకులు గాలి నరసపనాయుడు, మూలి వెంగయ్య, పొగాకు రైతులు, బోర్డు సిబ్బంది పాల్గొన్నారు. -
కీలకాధికారి పాత్ర
కందుకూరు నియోజకవర్గంలో గ్రావెల్ మాఫియా చెలరేగిపోతోంది. అక్రమార్జనే ధ్యేయంగా సాగునీటి చెరువులను గుల్ల చేస్తున్నారు. అధికార పార్టీ అండదండలు, అధికారుల ఉదాసీనతతో వీరి ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. భారీ యంత్రాలతో మట్టిని తవ్వి వందల ట్రిప్పుల్లో తరలిస్తున్నారు. ఎలాంటి అనుమతుల్లేకుండా సాగుతున్న ఈ వ్యవహారంతో ఇరిగేషన్ శాఖ పరిధిలోని చెరువులు భారీ గుంతలతో దర్శనమిస్తున్నాయి. ఇరిగేషన్ చెరువులే లక్ష్యంగా భారీ దోపిడీ ● గుల్ల చేస్తున్న వైనం ● ప్రైవేట్ వెంచర్లు, రోడ్ల నిర్మాణం పేరిట తవ్వకాలు ● కన్నెత్తి చూడని ఇరిగేషన్ అధికారులుకందుకూరు: ఇరిగేషన్ చెరువుల్లో మట్టిని కొల్లగొట్టడంలో అధికార పార్టీ నేతలు తలమునకలై ఉన్నారు. వలేటివారిపాళెం, లింగసముద్రం, గుడ్లూరు, ఉలవపాడు మండలాల్లోని పలు చెరువుల్లో భారీగా తవ్వకాలను చేపట్టారు. రెండు, మూడు నెలలుగా యథేచ్ఛగా సాగుతున్నా, ఆ శాఖ అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడంలేదు. వలేటివారిపాళెం మండలంలోని నూతన జాతీయ రహదారి పక్కన ఉన్న కేజీబీవీ స్కూల్ సమీపంలో ప్రైవేట్ వ్యక్తులు ఇటీవల దాదాపు మూడెకరాల్లో వేసిన వెంచర్‌కు రామన్న చెరువు నుంచి రెండు వేల ట్రిప్పుల మట్టిని తోలారు. ఈ విషయం ఇరిగేషన్ శాఖ అధికారులకు తెలిసినా, పట్టించుకున్న దాఖలాల్లేవు. పూర్తిగా తోలాక అడ్డుకున్నామనే రీతిలో షో చేశారు. దౌర్జన్యంగా.. వలేటివారిపాళెం మండలంలో పెత్తనం చేసి ఓ యువ నేత లింగసముద్రం మండలంలోని మాలకొండరాయునిపాళెం చెరువు నుంచి భారీ ఎత్తున మట్టి తవ్వకాలు చేపట్టి రోడ్డు నిర్మాణానికి తరలించారు. వాస్తవానికి ఇక్కడ మట్టి తోలేందుకు ఎలాంటి అనుమతుల్లేవు. అయినా దౌర్జన్యంగా తమ పనిని కానిచ్చారు. ఫలితంగా చెరువు పూర్తిగా గుంతలమయమైందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెదపవని చెరువు నుంచి గ్రామానికి చెందిన ఇద్దరు టీడీపీ నేతలు పెద్ద ఎత్తున తవ్వి విక్రయించారు. మోచర్ల చెరువు గుల్ల గుడ్లూరు మండలంలోని మోచర్ల చెరువు నుంచి ఓ పెట్రోల్ బంక్ యజమానులు 1650 క్యూబిక్ మీటర్ల పరిధిలో తవ్వకాలు జరిపారు. ఇరిగేషన్ శాఖ నుంచి వీరికి ఎలాంటి అనుమతి లేదు. మండలంలోని పెద్ద చెరువుల నుంచి మూడు రోజులుగా ఓ ప్రైవేట్ వ్యక్తి భారీ ఎత్తున గుడ్లూరుకు తరలించి విక్రయిస్తున్నారు. ఇళ్ల లెవలింగ్‌కు రావూరు చెరువులో పెద్ద గుంతలు చేసి తవ్వకాలు జరిపారు. వెంచర్లకు తరలింపు ఉలవపాడు మండలంలోని రాజుపాళెం చెరువు నుంచి జాతీయ రహదారి పక్కన వేసిన ఓ వెంచర్‌కు భారీ ఎత్తున తరలించారు. భీమవరం చెరువు నుంచి దాదాపు 300 ట్రిప్పుల్లో వీటిని పంపారు. కందుకూరు మండలంలోని ఓగూరు వద్ద గణేష్‌కుంట నుంచి పొలాలకు మేరవ తోలే పేరుతో 500 ట్రిప్పుల మట్టిని ప్రైవేట్ వ్యక్తులు ఇటీవల తరలించారు. గ్రామస్తుల ధర్నా మట్టి తవ్వకాలను అడ్డుకోవాలంటూ మున్సిపాల్టీ పరిధిలోని వెంకటాద్రిపాళెం వాసులు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాను చేపట్టారంటే నియోజకవర్గంలో దందా ఏ స్థాయిలో జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు భారీ ఎత్తున గుంతలు చేసి మట్టిని తవ్వి విక్రయిస్తున్నారు. దీంతో సమీపంలోనే ఉన్న తమ పొలాలకు దారుల్లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు వీరి ధర్నాను సవాల్‌గా తీసుకున్న మాఫియా అదే రోజు రాత్రి పెద్ద ఎత్తున యంత్రాలను ఏర్పాటు చేసి మట్టి తవ్వకాలు చేపట్టడం గమనార్హం. భద్రతకు ముప్పు మట్టి తవ్వకాలతో చెరువుల భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. భారీ యంత్రాలను మాఫియా ఏర్పాటు చేసి ఇష్టారాజ్యంగా తవ్వకాలు సాగిస్తున్నారు. పలు చెరువుల్లో కట్ట వెంటా ఇదే వ్యవహారం సాగుతోంది. చెరువు కట్టలు బలహీనమై వర్షాలు కురిసి నిండితే తెగే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇరిగేషన్ చెరువుల్లో సాగుతున్న మట్టి మాఫియా వెనుక ఆ శాఖలో పనిచేస్తున్న ఓ కీలకాధికారి ప్రముఖ పాత్ర పోషిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వ్యవహారాన్ని వెనుక నుంచి నడిపిస్తూ.. ప్రతిఫలంగా భారీ ఎత్తున ముడుపులు పొందుతున్నారని ఆ శాఖ సిబ్బందే చర్చించుకుంటున్నారు. రామాయపట్నం వద్ద నిర్మిస్తున్న పునరావాస కాలనీకి మేరవ తోలేందుకు అవసరమైన మట్టిని సమీపంలోని చెరువుల్లో తవ్వుకునేందుకు సదరు అధికారి అనధికారికంగా ఇచ్చిన పర్మిషన్‌కు గానూ సంబంధిత కాంట్రాక్టర్ల నుంచి దాదాపు రూ.80 వేలు ముట్టాయని సమాచారం. వెంచర్లు, పెట్రోల్ బంకులకు తరలించిన మట్టికి లక్షల్లో ముడుపులు అందాయనే చర్చా లేకపోలేదు. -
నెల్లూరులో రియల్ అభివృద్ధి
నెల్లూరు(బారకాసు): రోడ్లు, విద్యుత్, రవాణా తదితర మౌలిక సదుపాయాలున్న ప్రాంతాలకే అభివృద్ధి విస్తరిస్తుంది. పరిశ్రమలు, నివాస, వాణిజ్య సముదాయాలతో కిక్కిరిసిపోతున్న నెల్లూరు అభివృద్ధి.. క్రమంగా చుట్టుపక్కల గ్రామాల మార్గంలో శరవేగంగా దూసు కెళ్తోంది. పుష్కలంగా భూముల లభ్యత, అందుబాటు ధర, మెరుగైన రవాణా, మౌలిక వసతులు ఉండటంతో నెల్లూరు రూరల్ పరిధిలో రియల్ మార్కెట్ అభివృద్ధి చెందే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. ప్రశాంత వాతావరణానికి నెల్లూరు పెట్టింది పేరు. నగరానికి చుట్టుపక్కల ఉన్న కోవూరు, ఇందుకూరుపేట, తోటప ల్లిగూడూరు, ముత్తుకూరు, జొన్నవాడ, వెంకటాచలం తదితర ప్రాంతాలు పాడిపంటలతో కళకళలాడుతాయి. నెల్లూరు తూర్పు ప్రాంతాలు కోనసీమను తలపిస్తాయి. అంతేకాకుండా సమీపంలో పెన్నా నది, బ్యారేజీ ఉండటంతో తాగునీటికి ఇబ్బంది లేదు. తీర ప్రాంతంలో కృష్ణపట్నం పోర్టు, ఏపీ జెన్కోతో పాటు పలు అయిల్, విద్యుత్ పరిశ్రమలు మెండుగా ఉన్నాయి. కృష్ణపట్నం పోర్టు నుంచి పది కిలోమీటర్ల సమీపంలో క్రిస్ సిటీని ఏర్పాటు చేస్తున్నారు. ఇందులోనూ అనేక పరిశ్రమలు రానున్నాయి. గూడూరు – వరగలి క్రాస్‌రోడ్డు నుంచి ఏర్పాటైన సాగరమాల హైవే ద్వారా చైన్నె, తిరుపతికి రెండు గంటలు.. బెంగళూరుకు ఐదు గంటల్లో చేరుకునే అవకాశం ఉంది. ఇలా అన్ని విధాలా ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్న తరుణంలో ప్రత్యక్షంగా వేలాది మంది, పరోక్షంగా లక్షలాది మంది ఉపాధి అవకాశాలు పొందుతున్నారు. ఓబులాపురం నుంచి కృష్ణపట్నం రైల్వే లైన్ వెంకటాచలం సమీపంలోనే వెళ్తోంది. పలు విద్యాసంస్థలతో పాటు ఇంజినీరింగ్ కళాశాలలు నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో ఉన్నాయి. దీంతో విద్య, ఉపాధి కోసం ఇతర ప్రాతాల నుంచి నెల్లూరుకు వలస వస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో నగర జనాభా పది లక్షలకు చేరింది. దీనిబట్టి చూస్తే నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో నివాసం ఉండేందుకు ప్రజలు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. విరివిగా వెంచర్లు రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్న నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో రియల్టర్లు ప్రజలకు అనుకూలంగా అన్ని మౌలిక వసతులను కల్పిస్తూ వెంచర్లు వేస్తున్నారు. ఈ విషయంలో అనేక మంది రియల్టర్లు పోటీపడుతున్నారు. నగరంలో పార్కులు, మాళ్లు, వాణిజ్య సముదాయాలు, దేవాలయాలున్నాయి. జనసాంద్రత, రద్దీ ప్రాంతాల బదులు ప్రశాంతత కోసం నగరానికి కొంచెం దూర ప్రాంతాలను ఎంచుకుంటారు. ఇదే సమయంలో రవాణా సౌకర్యం పెరగడంతో పాటు ఆయా మార్గాల్లో రియల్ ఎస్టేట్ అవకాశాలు ఏర్పడ్డాయి. కార్పొరేషన్ పరిధిలోని జాతీయ రహదారి, పొదలకూరు రోడ్డులోని కొత్తూరు సమీపంలో కావేరినగర్ వెనుకవైపు నుడా అప్రూవల్తో కూడిన పలు వెంచర్లు ఉన్నాయి. ఆయా వెంచర్లలో అన్ని మౌలిక వసతులను కల్పిస్తూ అందరికీ అందుబాటు ధరల్లో ప్లాట్లను విక్రయిస్తున్నారు. సొంతింటి కలను సాకారం చేసుకోవాలనే కోరికతో వీటిని ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. వీరికి ఇబ్బందుల్లేకుండా వారి కోరిక మేరకే తక్కువ ధరలకే ఆకర్షణీయమైన అధునాతన భవనాలను నిర్మించిస్తున్నారు. -
నీటిని పొదుపుగా వాడుకోండి
సోమశిల: సోమశిల జలాశయం నుంచి రెండో పంటకు విడుదల చేస్తున్న సాగునీటిని పొదుపుగా వాడు కునే మరింత అత్యధిక విస్తీర్ణంలో పంటలు పండించుకోవాలని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం రైతులు, అధికారులు, స్థానిక నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు, గంగమ్మ తల్లికి చీరసారే, జలహారతి సమర్పించి పెన్నాడెల్టాకు నీటిని విడుదల చేశారు. మంత్రి ఆనం మాట్లాడుతూ జిల్లాలో రెండో పంటకు సోమశిల జలాశయం కింద 3.60 లక్షల ఎకరాలకు 42 టీఎంసీలు, తెలుగు గంగ ప్రాజెక్ట్‌ల కింద ఉమ్మడి జిల్లాలోని 1.60 లక్షల ఎకరాలకు 16 టీఎంసీల నీటిని రైతుల అవసరాల మేరకు విడుదల చేస్తామని చెప్పారు. సోమశిలలో నిల్వ ఉన్న 52 టీఎంసీంల్లో తాగునీరు, ఇతర అవసరాలకు 12 టీఎంసీలను నిల్వ ఉంచి మిగిలిన 40 టీఎంసీలను రెండో పంటకు రైతాంగానికి అందించాలని నిర్ణయించినట్లు చెప్పారు. పెన్నా డెల్టా కింద 2 లక్షల ఎకరాలకు 22.219 టీఎంసీలు, కనుపూరు ప్రధాన కాలువ కింద 20 వేల ఎకరాలకు 2.223 టీఎంసీలు, నార్త్ ఫీడర్ చానల్ 35 వేల ఎకరాలకు 3.889 టీఎంసీలు మొత్తం 3.64 లక్షల ఎకరాలకు 40.442 టీఎంసీలు విడుదల చేస్తున్నట్లు మంత్రి వివరించారు. ప్రాజెక్ట్ చైర్మన్ వేలూరు కేశవచౌదరి, రాజగోపాల్, ఎస్ఈలు వెంకటరమణారెడ్డి, రాధాకృష్ణ, ఆర్డీఓ పావని, ఈఈలు, జెఈలు తదితరులు పాల్గొన్నారు. ఖరీఫ్‌కు 3.60 లక్షల ఎకరాలకు సాగునీరు సోమశిల జలాశయం నుంచి రెండో పంటకు నీటిని విడుదల చేసిన మంత్రి రెండో పంటకు సోమశిల జలాల విడుదల -
ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్‌గా రాజేశ్వరి
నెల్లూరు (అర్బన్): నెల్లూరు ప్రభుత్వ మెడికల్ కళాశాల నూతన ప్రిన్సిపల్‌గా డాక్టర్ జి.రాజేశ్వరి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆమె రాజమహేంద్రవరంలోని మెడికల్ కళాశాలలో బయో కెమిస్ట్రీ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తూ పదోన్నతిపై నెల్లూరు ప్రిన్సిపల్‌గా వచ్చారు. బాధ్యతలు చేపట్టిన ఆమెను ఇన్చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ గోవిందు, పెద్దాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నరేంద్ర, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ మస్తాన్‌బాషా, పెద్దాస్పత్రి అడ్మినిస్ట్రేటివ్ అధికారి డాక్టర్ కళారాణితోపాటు పలువురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లు బొకేలు అందజేసి అభినందించారు. వెబ్సైట్లో ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితా నెల్లూరు (టౌన్): జిల్లాలోని సెకండరీ గ్రేడ్, స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయుల సీనియార్టీ తుది జాబితాను జిల్లా విద్యాశాఖ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు డీఈఓ బాలాజీరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ జాబితాలో అభ్యంతరాలు ఉంటే ఈ నెల 9వ తేదీలోపు తగిన ధ్రువపత్రాలతో జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అందజేయాలన్నారు. ఎర్రచందనం దుంగల పట్టివేత ఆత్మకూరు: ఆత్మకూరు అటవీ శాఖ రేంజ్ పరిధిలోని సోమశిల ఉత్తరకాలువ సమీపంలో గుడిగుంట బీట్ వద్ద బుధవారం 11 ఎర్రచందనం దుంగలు అటవీ శాఖ సిబ్బంది స్వాధీ నం చేసుకున్నారు. వీటి బరువు సుమారు 300 కేజీలు ఉంటుందని తెలిపారు. ఉదయం 9.30 గంటల సమయంలో స్వాధీనం చేసుకున్న సిబ్బంది ఆటోలో వేసుకుని ఆత్మకూరుకు 11.30 గంటల సమయంలో చేరారు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. కొందరు ఆ దుంగలను ఫొటోలు తీయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అయితే సంబంధిత అధికారులు చెప్పకపోవడంతో జిల్లా అటవీ శాఖ అధికారి ఎస్కే మహబూబ్‌బాషాను సంప్రదించగా తనకు సమాచారం తెలియలేదని చెప్పడం గమనార్హం. -
అక్రమాలు, అపచారాలు
నిబంధనల మేరకే సేవాకమిటీ నియమించాం దేవదాయశాఖ నిబంధనల మేరకు బ్రహ్మోత్సవాలకు సంబంధించి సేవా కమిటీ నియమించుకునే వెసులుబాటు ఉంది. అందులో భాగంగానే సేవాకమిటీని నియమించాం. బ్రహ్మోత్సవాలు పూర్తయిన తర్వాత కమిటీ దానికదే రద్దవుతుంది. – అర్వభూమి వెంకటశ్రీనివాసులురెడ్డి, ఈఓ, జొన్నవాడ బుచ్చిరెడ్డిపాళెం రూరల్: అత్యంత పవిత్రమైన జొన్నవాడ కామాక్షితాయి ఆలయంలో అపచారాలు జరుగుతున్నాయి. అవినీతి, అక్రమాలు పెచ్చు మీరుతున్నాయి. ఆలయానికి జిల్లాలో వందల ఎకరాలు భూములు, రూ.కోట్ల ఆస్తులు ఉన్నాయి. వేలం ద్వారా రాబడి అధికంగా వస్తోంది. అయినా భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాల విషయంలో ఎవరూ పట్టించుకోవడం లేదు. అదనపు వసూళ్లకు పాల్పడుతూ అమ్మవారి దర్శనానికి రావాలంటేనే భయపడేలా చేస్తున్నారు. నిలువు దోపిడీ ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులను అడుగడుగునా నిలువు దోపిడీ చేస్తున్నారు. దేవదాయశాఖ నిర్దేశించిన టికెట్ ధరలకు సేవలు పొందాలంటే కుదరదు. ఆలయంలో ప్రవేశించనప్పటి నుంచి ప్రతి సేవకో రేటు ఫిక్స్ చేశారు. ఆపై అనధికారికంగా అదనపు వసూళ్లు చేస్తూ అక్రమంగా సంపాదిస్తున్నారు. చెప్పుల స్టాండ్ ఉచితంగా నిర్వహించాల్సి ఉన్నా సందర్భాన్ని బట్టి జతకు రూ.5, రూ.10 వసూలు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఎలాంటి రసీదు ఇవ్వరు. తలనీలాలు సమర్పించేందుకు రూ.40 టికెట్ ధర చెల్లించాలి. అయితే సదరు తలనీలాలు తీసే వ్యక్తికి అదనంగా మరో రూ.30 లేదా అంతకంటే ఎక్కువ సమర్పించుకోవాల్సిందే. ఎందుకు చెల్లించాలని అడిగితే అసహ్యంగా దుర్భాషలాడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఇటువంటి ఘటనే వెలుగుచూసింది కొందరు భక్తులు డబ్బులు లేవని చెప్పినా ఫోన్‌పే, గూగుల్‌పే చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. చేసేదేమీ లేక భక్తులు వారు అడిగినంత చెల్లిస్తున్నారు. ప్రత్యేక సందర్భాలు, పుట్టు వెంట్రుకలు, మొక్కులు అయితే సిబ్బంది పంట పండినట్లే వారు ఎంత డిమాండ్ చేస్తే అంత చెల్లించుకోవాల్సిందే. స్నానం చేయడానికి ఒక్కొక్కరికి రూ.10 చెల్లించాలి. గదుల్లో నీటి సౌకర్యం, డోర్లు మాత్రం సరిగా ఉండవు. ఒక గదిలో నీరు వస్తుంటే మరో గదిలో నీరు రాదు. పరిశుభ్రత దారుణంగా ఉంది. దీనికితోడు బిహార్‌కు చెందని ఓ వ్యక్తి అక్కడ భక్తుల నుంచి నగదు వసూలు చేస్తున్నాడు. అతనికి తెలుగురాదు. దీంతో భక్తులు అతనికి చెప్పేది అర్థంకాక అసహనం వ్యక్తం చేస్తున్నారు. శీఘ్రదర్శనం పేరిట రూ.50, ప్రత్యేక దర్శనం పేరిట రూ.25 వసూలు చేస్తున్నారు. ఇవికూడా భక్తులకు అదనపు భారంగా మారాయి. 80 గ్రాముల లడ్డూ రూ.15, 400 గ్రాముల లడ్డూ రూ.100కు విక్రయిస్తున్నారు. ఒక భక్తుడు అమ్మవారి దర్శనానికి వెళ్లి బయటకు రావాలంటే సుమారుగా రూ. 300 నుంచి రూ.400 ఖర్చు పెట్టాల్సిందే. కొత్తగా సేవా కమిటీ ఏర్పాటు దేవదాయశాఖ నిబంధనల మేరకు ఆ శాఖ పరిధిలో ఉన్న ఆలయాలకు ధర్మకర్తల మండలి ఉంటుంది. జొన్నవాడ ఆలయంలో కూడా ధర్మకర్తల మండలి ఉంది. మావులూరు శ్రీనివాసులురెడ్డి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ధర్మకర్తల మండలిని ఉద్దేశ పూర్వకంగానే నిర్వీర్యం చేశారు. ఈ నెల 17వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో సేవా కమిటీ పేరుతో 12 మంది సభ్యులను నియమించారు. ధర్మకర్తల మండలి ఉండగా కమిటీ ఎందుకు నియమించారో ఎవరికీ అంతుపట్టని. గతంలో ఇలాంటి సంప్రదాయం ఎప్పుడూ లేదు. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ఆదేశాల మేరకే కమిటీని నియమించినట్లు తెలుస్తోంది. ధర్మకర్తల మండలి ఉండగా సేవా కమిటీ పేరుతో టీడీపీకి చెందిన వ్యక్తులను కమిటీలో నియమించడం నిధులు మింగేందుకేనని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొరవడిన పర్యవేక్షణ ఆలయంలో ఏం జరుగుతుందో నిత్యం పర్యవేక్షించాల్సిన ఈఓ ఇవేవీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అదనపు వసూళ్లకు పాల్పడే సిబ్బందిని గుర్తించి వారిపై చర్యలు తీసుకోవడంలో తీవ్రంగా విఫలమయ్యారు. ఆలయానికి వచ్చే వీవీఐపీలు, వీఐపీల సేవలో నిమగ్నమై సామాన్యులను పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాత్రుళ్లు నిద్ర చేసేందుకు వచ్చే భక్తులకు సరైన సౌకర్యాలు, భద్రతా విషయాల గురించి అస్సలు పట్టించుకోవడం లేదు. దీంతో కొందరు స్థానికంగా కొందరు ఆకతాయిలు మహిళా భక్తులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆలయ నిర్వహణ ఏ మాత్రం బాగలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఘటనలు జిల్లాలోని పవిత్ర పినాకినీ తీరంలో బుచ్చిరెడ్డిపాళెం మండలంలో మల్లికార్జున సమేత జొన్నవాడ కామాక్షితాయి శక్తి పీఠానికి రాష్ట్రంలో ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడికి రాష్ట్రంలో ఇతర జిల్లాల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తుంటారు. నిత్యం భక్తులతో ఆలయం రద్దీగా ఉంటుంది. రూ.లక్షల్లో ఆదాయం వస్తోంది. అయితే నిర్వహణ అంతంత మాత్రంగా ఉంది. ప్రతి సేవకు దేవదాయశాఖ నిర్దేశించిన టికెట్ ధరలు చెల్లించినా.. అనధికారికంగా అదనపు వసూళ్లు చేస్తున్నారు. అక్రమాలు, అపచారాలతో ఆలయ ప్రతిష్టను దిగజార్చుతున్నారు. జొన్నవాడ కామాక్షితాయి ఆలయంలో రాబంధుల తిష్ట ప్రతీదానికో రేటు, అదనపు వసూళ్లు భక్తులను దోచుకుంటున్న సిబ్బంది కొత్తగా సేవా కమిటీ ఎందుకు? ఆలయ నిధులు మింగేందుకేనా! అత్యంత పవిత్రమైన క్షేత్రంలో నిద్ర చేసే భక్తులు తమ దుస్తులను ఉచికి ఏకంగా ఆలయ ఆవరణలోని క్యూలైన్లలో ఆరవేసిన ఘటన ఇటీవల వెలుగు చూసింది. కళ్ల ముందు ఇలాంటి అపచారాలు కనిపిస్తున్నా ఆలయ సిబ్బంది కానీ, అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంపై భక్తులు మండిపడ్డారు. అదే రోజు దర్శనానికి వచ్చిన భక్తులపై మతిస్థిమితం లేని వ్యక్తి దాడికి ప్రయత్నంచడంతో కలకలం రేగింది. ఆలయ పరిసరాల్లోనే మద్యపానంతోపాటు మాంసాహారం భుజించడం వంటివి కూడా జరుగుతున్నాయని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఆలయ ఈఓ అర్వభూమి వెంకట శ్రీనివాసులురెడ్డిని ప్రశ్నించగా తనకు తెలియదని, సిబ్బందిని అడిగి తెలుసుకుంటానని చెప్పడం చూస్తే.. ఈఓకు ఆలయంలో ఏం జరుగుతోందో కూడా తెలియడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. -
ఇంటర్ కళాశాలలకు పీడీ పోస్టుల భర్తీ లేనట్లేనా
కందుకూరులోని టీఆర్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల జూనియర్ కళాశాలలో ఫిజికల్ డైరెక్టర్ (పీడీ)గా పని చేస్తూ ఉద్యోగ విరమణ పొందితే ఆ కళాశాలలో ఇక పీడీ పోస్టుకు మంగళం పలకనున్నారు. ఆ పోస్టులను అదే కళాశాల లేదా, పక్క మండలాల్లోనే కళాశాలల్లో సబ్జెక్ట్ అధ్యాపకుడిగా కన్వర్షన్ చేసి పోస్టులను అక్కడ భర్తీ చేస్తున్నారు. కందుకూరు టీఆర్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పని చేస్తున్న పీడీ గత నెలలో ఉద్యోగ విరమణ పొందాడు. ఆ పోస్టును తాళ్లూరులో ని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు సబ్జెక్ట్ అధ్యాపకుడిగా కన్వర్ట్ చేశారు. దీంతో టీఆర్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పీడీ పోస్టుకు మంగళం పలికారు. విశాలమైన క్రీడా మైదానం ఉన్నప్పటికీ పీడీ పోస్టులను కన్వర్ట్ చేసి పోస్టులను తగ్గించుకునేందుకు కూట మి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో 15, ప్రకాశం జిల్లాలో 18 పీడీ పోస్టులు సబ్జెక్ట్ అధ్యాపకులుగా కన్వర్ట్ చేశారు. తిరిగి ఆయా కళాశాలలకు పీడీ పోస్టులు మంజూరు చేసే ఉద్దేశం కూటమి ప్రభుత్వానికి లేదని స్పష్టమవుతోంది. ఉన్న పోస్టుల ను పక్కదారి మళ్లించి జీతాల ఖర్చును తగ్గించుకునే పనిలో పడింది.దీంతో జూనియర్ కళాశాలల్లోని విద్యార్థులు వ్యాయామ విద్యకు మంగళం పలకనున్నారు. మధ్యలో ఇంటర్ల్లోనే.. ఉన్నత పాఠశాలల్లో పీఈటీ, పీడీ పోస్టులు ఉన్నాయి. పాఠశాల స్థాయిలో విద్యార్థులు క్రీడల్లో రాణిస్తున్నారు. తిరిగి డిగ్రీ కళాశాలల్లో కూడా పీడీ పోస్టులు ఉన్నాయి. కానీ మధ్యలో ఇంటర్ కళాశాలల్లో పీడీ పోస్టులు లేనందు వల్ల విద్యార్థులు క్రీడల్లో రాణించలేకపోతున్నారు. క్రీడా మైదానాలు ఉన్న జూనియర్ కళాశాలల్లోనే పీడీ పోస్టులు ఉండేవి. అవి కూడా ప్రస్తుతం లేకుండా చేస్తున్నారు. ఇంటర్ చదివే విద్యార్థులకు వ్యాయామ విద్య అందని ద్రాక్షాగా మారనుంది. పోస్టు కన్వర్షన్ ఇలా.. -
ప్యాకేజీ తీసుకో.. పసుపు కండువా కప్పుకో
కోవూరు: కోవూరు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నేతల కొనుగోళ్ల ప్రక్రియ ఎన్నికల నాటి నుంచి ఇప్పటి వరకు అప్రతిహతంగా కొనసాగుతోంది. తాజాగా విడవలూరుకు చెందిన ఆ పార్టీ సీనియర్ నేత ఒకరికి భారీగా ప్యాకేజీ ఇచ్చి పసుపు కండువా కప్పేందుకు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి సిద్ధమైనట్లు విశ్వసనీయ సమాచారం. అందులో భాగంగా ఈ నెల 9వ తేదీన కండువా కప్పుకునేందుకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్న కాలంలో మాజీమంత్రి, కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి విడవలూరుకు చెందిన ఓ సీనియర్ నేతకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. ఆయన్ను పార్టీలో జిల్లా స్థాయి పదవు లతోపాటు ఆయన భార్యకు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ డైరెక్టర్‌గా పదవిని కట్టబెట్టి ఆ కుటుంబానికి అగ్ర తాంబూలమిచ్చారు. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు అనేక విధాలుగా లబ్ధిపొందిన సదరు సీనియర్ నేత ప్యాకేజీలకు అమ్ముడుపోయి పార్టీకి వెన్నుపోటు పొడిచేందుకు సిద్ధపడటాన్ని స్థానిక నేతలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇటువంటి స్వార్థపూరిత నేత అని తెలియక వారి వెంట నడిచామని పార్టీ కేడర్ విచారం వ్యక్తం చేస్తోంది. ఇటువంటి నేతలు పార్టీని వీడినా పార్టీకి ఎటువంటి ఢాకాలేదని, ప్రజలే పార్టీకి బలమన్నారు. లక్షలకు లక్షలు ప్యాకేజీలు ఇచ్చుకుని పచ్చకండువాలు కప్పుతుండడం వెనుక మరో ఏడాదిలో జరగబోయే స్థానిక సంస్థల్లో గెలుపు కోసమేనని ప్రచారం జరుగుతుంది. దాదాపు 11 నెలల కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు పడుతున్న కష్టాలు, నష్టాలు, ఎదుర్కొంటున్న కొత్త అనుభవాలతో ప్రజలు ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా కూటమిని కూకటి వేళ్లతో సహా పెకళించేందుకు పల్లెల్లో ప్రజలు సిద్ధంగా ఉన్నారని వైఎస్సార్సీపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి వెళ్లి పబ్బం గడుపుకునే నేతలను పార్టీలో చేర్చుకున్నప్పటికీ రేపటి స్థానిక ఎన్నికల్లో ప్రజలు చూపించే ఓటు దెబ్బతో ఎమ్మెల్యేకు, టీడీపీకి త్వరలోనే జ్ఞానోదయం కలుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల నాటి నుంచి వైఎస్సార్సీపీ నేతల కొనుగోళ్లలో ప్రశాంతిరెడ్డి బిజీబిజీ తాజాగా విడవలూరు సీనియర్ నేతకు భారీ మొత్తం ప్యాకేజీ ఆఫర్ ఆయనకు, భార్యకు రాష్ట్ర స్థాయిలో పదవులు కట్టబెట్టిన ప్రసన్న అధికారం, పదవులు అనుభవించి.. ఇప్పుడు వెన్నుపోటు -
రాడార్ కేంద్రంలో మాక్‌డ్రిల్
పొదలకూరు : మండలంలోని నెల్లూరు మార్గంలో నిర్మాణంలో ఉన్న రాడార్ కేంద్రంలో బుధవారం పోలీస్, రెవెన్యూ, ఫైర్, ఆరోగ్యశాఖల అధికారులు, సిబ్బంది మాక్ డ్రిల్ నిర్వహించారు. భారత్ సైనికులు ఆపరేషన్ సింధూర పేరుతో పాక్ ఉగ్రవాద సంస్థలపై దాడులు నిర్వహించిన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా అప్రమత్తత ప్రకటించారు. ఈ నేపథ్యంలో పాక్ ప్రతీకార దాడులకు పాల్పడితే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మాక్ డ్రిల్ నిర్వహించారు. తహసీల్దార్ బి.శివకృష్ణయ్య, సీఐ ఎ.శివరామకృష్ణారెడ్డి, ఫైర్ అధికారి విజయవరకుమార్, వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అదానీ పోర్టులో కృష్ణపట్నం అదానీ పోర్టులో బుధవారం పోలీస్, ఫైర్, రెవెన్యూ, ఆరోగ్య, పొర్టు సెక్యూరిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక మాక్‌డ్రిల్ నిర్వహించారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో అలర్ట్ చేసేందుకు డ్రిల్ ఏర్పాటు చేశారు. పాక్ వైమానిక దాడులు నిర్వహిస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రజల అప్రమత్తతపై అవగాహన కల్పించారు. -
ఆపరేషన్ సిందూర్.. స్పందించిన నెల్లూరు మధుసూదన్ కుటుంబ సభ్యులు
సాక్షి, నెల్లూరు: పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ ప్రతీకార చర్యల నేపథ్యంలో పహల్గాం బాధిత మధుసూదన్ కుటుంబ సభ్యులు స్పందించారు. ఉగ్రవాదులు అనేవారు లేకుండా భారత్ మరింత గట్టిగా బుద్ధి చెప్పాలి అని వ్యాఖ్యానించారు. అలాగే, ఉగ్రవాదుల చేతిలో మరెవరో ప్రాణాలు కోల్పోకుండా భారత్ చర్యలు తీసుకోవాలని అన్నారు.భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌పై నెల్లూరుకు చెందిన మధుసూదన్ రావు కుటుంబ సభ్యులు స్పందించారు. ఈ సందర్భంగా మధుసూదన్ రావు తల్లి పద్మావతి మాట్లాడుతూ..‘ఎన్ని యుద్దాలు చేసినా.. నా కొడుకును తీసుకురాలేరు. నా కడుపు కోత ఏ తల్లి పడకుండా ఉగ్రవాదులను అంతం చేయాలి. నా కొడుకు అమాయకుడు, మా కుటుంబానికి ఉగ్రవాదులు తీరని ద్రోహం చేశారు. ఉగ్రవాదుల చేతిలో మరెవరో ప్రాణాలు కోల్పోకుండా భారత్ చర్యలు తీసుకోవాలి అని అన్నారు.మధుసూదన్ సోదరి విజయలక్ష్మి మాట్లాడుతూ..‘పాకిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత దాడులు చేయడం మా కుటుంబానికి ఊరట కలిగిస్తోంది. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న అన్నని కోల్పోవడం మా కుటుంబానికి తీరని లోటు. ఇప్పటికి కూడా ఆ షాక్ నుంచి మేము తేరుకోలేకపోతున్నాం అని ఆవేదన వ్యక్తం చేశారు.మధుసూదన్ మామ వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ..‘ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు భారత్ మరింత పటిష్ట చర్యలు తీసుకోవాలి. అమాయక టూరిస్టులను పొట్టనపెట్టుకున్న వారిని గట్టిగా శిక్షించాలి అని డిమాండ్ చేశారు. -
కేన్సర్ నివారణపై వర్క్‌షాప్
నెల్లూరు(అర్బన్): నగరంలోని నారాయణ మెడికల్ కళాశాలలో కేన్సర్ నివారణపై రెండు రోజుల వర్క్‌షాపు మంగళవారంతో ముగిసింది. నారాయణ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాసులురెడ్డి పాల్గొని మాట్లాడారు. కాలుష్యం లేని, కలుషితం కాని పోషకాహారం తీసుకోవడం ద్వారా పలు రకాల కేన్సర్లను నివారించవచ్చన్నారు. ఐసీఎంఆర్ నిధులు పొందిన నారాయణ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఆంధ్రప్రదేశ్‌లో రెండోది కావడం గర్వకారణమన్నారు. నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ వనజకుమారి, ఆర్గనైజింగ్ సెక్రటరీ తేజోవతి, మెడికల్ కళాశాల కో–ఆర్డినేటర్ బిజూ రవీంద్రన్, ఆపరేషన్స్ హెడ్ రామారావు, అంకాలజిస్ట్ ఉషారాణి పాల్గొన్నారు. -
రియల్టర్ దారుణ హత్య
నెల్లూరు(క్రైమ్): వ్యాపార లావాదేవీల్లో నెలకొన్న విభేదాలో.. పాతకక్షలో.. కారణమో తెలియదు గానీ రియల్టర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు అతి కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటన నెల్లూరు నగరంలోని వెంకటరెడ్డినగర్‌లో జరిగింది. ఘటనా స్థలంలో క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్లు పరిశీలించి ఆధారాలు సేకరించాయి. విభిన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మంగళవారం వారు వివరాలు వెల్లడించారు. ఉదయగిరి మండలం సర్వరాబాదు గ్రామానికి చెందిన గొల్లపల్లి చిన్నయ్య అలియాస్ చిన్నా అలియాస్ ఇస్సాక్ (40), వేళాంగిణి దంపతులకు సాత్విక్, కార్తీక్, శాలిని అనే సంతానం ఉన్నారు. ప్రైవేట్ వెటర్నరీ అసిస్టెంట్తోపాటుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వ్యాపార లావాదేవీల విషయంలో అదే మండలానికి చెందిన కొందరితో చిన్నయ్యకు విభేదాలున్నాయి. హైకోర్టులో కేసుల విచారణ సాగుతోంది. అదే క్రమంలో ఫైనాన్స్ వ్యాపార విషయంలోనూ పలువురితో గొడవలున్నాయి. నాలుగేళ్లుగా స్నేహతుడి ఇంట్లో.. చిన్నయ్యకు ఉదయగిరి మండలం వెంకటరావుపల్లికి చెందిన రిటైర్డ్ మెడికల్ ఆఫీసర్ ఎస్.ఓబుల్రాజు స్నేహితుడు. ఆయనకు నెల్లూరు నగరంలోని వెంకటరెడ్డినగర్ నాలుగో వీధిలో రెండు అంతస్తుల భవనం ఉంది. దీంతో చిన్నయ్య నాలుగేళ్లుగా ఆ ఇంట్లో రెండో అంతస్తులో ఉంటున్నాడు. మొదటి అంతస్తులో రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ కార్యాలయం ఏర్పాటు చేశాడు. స్నేహితుడితో కలిసి వ్యాపారం చేస్తున్నారు. ప్రతి శని, ఆదివారం ఉదయగిరిలోని గొల్లపాళెం వెళ్లి భార్య, పిల్లలతో గడిపి నెల్లూరుకు వచ్చేవాడు. రియల్ ఎస్టేట్ పనుల నిమిత్తం గత నెల 30వ తేదీ నుంచి చిన్నయ్య గొల్లపాళేనికి వెళ్లకుండా నెల్లూరులోనే ఉంటున్నాడు. ఇంట్లోనే అతికిరాతకంగా.. చిన్నయ్య స్నేహితుడు ఎస్.వెంకటేశ్వర్లు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. వెంకటేశ్వర్లు సోమవారం చిన్నయ్య వద్దకు వచ్చాడు. ఇద్దరూ రాత్రి టిఫిన్ చేశారు. వెంకటేశ్వర్లు పడకగదిలో, చిన్నయ్య హాల్లోని సోఫాలో నిద్రపోయారు. మంగళవారం ఉదయం ఆరు గంటల సమయంలో వెంకటేశ్వర్లు నిద్ర లేచి హాల్లోకి వచ్చిచూడగా ముఖంపై కత్తిపోట్లతో రక్తపు మడుగులో చిన్నయ్య మృతిచెంది ఉండటాన్ని గమనించి పరుగులు తీస్తూ కింద పోర్షన్లో ఉంటున్న వారి వద్దకు వెళ్లాడు. చిన్నయ్యను ఎవరో చంపేశారని భోరున విలపించాడు. వారు వేదాయపాళెం పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలోనే వెంకటేశ్వర్లు బాధిత కుటుంబ సభ్యులకు జరిగిన విషయాన్ని ఫోన్ ద్వారా తెలియజేశాడు. నగర డీఎస్పీ పి.సింధుప్రియ, ఇన్స్పెక్టర్లు రోశయ్య, టీవీ సుబ్బారావులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. వెంకటేశ్వర్లుతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం పరిశీలన ఘటనా స్థలంలో క్లూస్ టీం వేలిముద్రలను సేకరించింది. డాగ్ స్క్వాడ్ ఘటన జరిగిన ప్రాంతం నుంచి గాంధీనగర్ వైపుగా కొద్దిదూరం వరకు వెళ్లి తిరిగి వచ్చింది. చిన్నయ్య తండ్రి చిన్నబాల ఓబయ్యతోపాటు కుటుంబసభ్యులు, బంధువులు నెల్లూరుకు చేరుకున్నారు. చిన్నయ్య మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. మృతుడి సోదరుడు రాజు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు. పోలీసులు విభిన్న కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. మృతుడికి సొంత గ్రామంలో పలువురితో భూమికి సంబంధించిన విభేదాలున్నాయి. ఓ స్థలానికి సంబంధించి ఇతని ఫిర్యాదు వల్ల కొందరికి జైలుశిక్ష సైతం పడినట్లు సమాచారం. వ్యాపార లావాదేవీల్లోనూ పలువురితో విభేదాలున్నట్లు తెలుస్తోంది. వివాహేతర సంబంధం ఏమైనా ఉందా? ఇలా అన్ని కోణాల్లో పోలీసులు నెల్లూరు నగరంతోపాటు ఉదయగిరి మండలంలోనూ విచారిస్తున్నారు. సోమవారం అర్ధరాత్రి హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆరోజు రాత్రి సుమారు 11.40 గంటల ప్రాంతలో కొందరు ఆ వీధిలో నుంచి గాంధీనగర్ వైపు పరుగులు తీస్తూ వెళ్లినట్లు స్థానికులు పోలీసులకు తెలిపారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలంతో పాటు పరిసర ప్రాంతాల్లోనీ సీసీ టీవీ ఫుటేజ్‌లు, సాంకేతికత ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ● కాగా చిన్నయ్య తండ్రి చిన్నబాల ఓబయ్య మీడియాతో మాట్లాడుతూ భూ వివాదాల నేపథ్యంలో హత్య జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఉదయగిరిలో చర్చ ఉదయగిరి: చిన్నయ్య దారుణ హత్యకు గురికావడం ఉదయగిరి పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. మృతుడు 2008లో పశుసంవర్థక శాఖలో కాంట్రాక్ట్ పద్ధతిలో వరికుంటపాడు మండలం పెద్దిరెడ్డిపల్లి పశువైద్యశాలలో అటెండర్‌గా చేరాడు. అక్కడ నాలుగేళ్లపాటు పనిచేశాడు. ఈ క్రమంలో గ్రామస్తులతో కొన్ని విభేదాలు తలెత్తాయి. దీంతో సీతారామపురం మండలం బసినేనిపల్లి పశువైద్యశాలకు మార్పించుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అక్కడే అటెండర్‌గా ఉన్నాడు. ఉదయగిరి ఎస్సై ఇంద్రసేనారెడ్డి మృతుడి గ్రామానికి వెళ్లి విచారించారు. ఆరునెలల క్రితం సొంతూరు సర్వరాబాదు నుంచి ఉదయగిరి పట్టణంలో భార్య, బిడ్డలతో కాపురం పెట్టినట్లు చెబుతున్నారు. నెల్లూరులో దారుణం విభిన్న కోణాల్లో కేసు దర్యాప్తు -
సినిమాలపై మక్కువతో..
● డైరెక్టర్‌గా మారిన రాజుపాళెం కుర్రోడు మర్రిపాడు: మండలంలోని చుంచులూరు రాజుపాళెం గ్రామానికి చెందిన యల్లంరాజు మోహన్‌రాజు, ఉమారాణి దంపతుల కుమారుడు రాకేష్ వర్మ సినిమా డైరెక్టర్‌గా మారాడు. బ్లైండ్ స్పాట్ అనే సినిమాకు రచయితగా, దర్శకుడిగా వ్యవహరించాడు. ఇందులో నవీన్ చంద్ర, రాశీసింగ్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. రామకృష్ణ వీరపనేని నిర్మాణ సారథ్యంలో ఈ చిత్రం తీశారు. ఈనెల 9వ తేదీన విడుదల కానుంది. ఇంజినీరింగ్ పూర్తి చేసిన రాకేష్ వర్మకు సినిమాలంటే ఇష్టం. దీంతో హైదరాబాద్‌లో ప్రముఖ దర్శకుడు ఉమామహేశ్వరరావు సారథ్యంలో దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో డైరెక్టర్‌గా శిక్షణ పొందాడు. అనంతరం పలు షార్ట్ ఫిల్మ్‌లకు దర్శకత్వం వహించాడు. వాటిలో పానీపూరి అనే షార్ట్ ఫిల్మ్‌కు జాతీయ స్థాయి అవార్డు వచ్చింది. రాకేష్ వర్మ దర్శకత్వం వహించిన తొలి చిత్రం విడుదలవుతున్న నేపథ్యంలో రాజుపాళెం, చుంచులూరు, పడమటినాయుడుపల్లి తదితర గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
భూములు తిరిగివ్వండి
● లేదా ఉపాధి కల్పించండి నెల్లూరు రూరల్: ‘1979లో మాకు కొంత అటవీ భూమి కేటాయించారు. మేము సాగు చేసుకుంటుంటే 2017లో పరిశ్రమల కోసం సేకరించి ఇప్పటి వరకు పట్టించుకోలేదు. భూములు తిరిగివ్వండి. లేదా ఉపాధి కల్పించండి’ అని నెల్లూరు రూరల్ మండలం ఆమంచర్ల గ్రామానికి చెందిన ఎస్సీ రైతు కూలీలు కోరారు. మంగళవారం నెల్లూరులోని ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మాట్లాడుతూ 2017లో అప్పటి ఆర్డీఓ, తహసీల్దార్, వీఆర్వోలు కలిసి పరిశ్రమలు కట్టి ఇంటికో ఉద్యోగం కల్పిస్తామని చెప్పారన్నారు. కొంత నష్ట పరిహారం చెల్లించి భూమిని స్వాధీనం చేసుకున్నారన్నారు. ఏళ్లు గడిచినా ఇప్పటి వరకు ఎటువంటి నిర్మాణాలు చేపట్టలేదని, ఉపాధి కూడా కల్పించలేదన్నారు. తమ మా జీవనాధారం ఎలాగని ప్రశ్నించారు. గ్రీవెన్స్‌లో ఎన్నోసార్లు అర్జీలిచ్చినా పట్టించుకోలేదన్నారు. న్యాయం చేసి ఉపాఽధి కల్పించాలని, లేనిపక్షంలో భూమి తిరిగివ్వాలని కోరారు. -
ఏంటి.. బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయా?
ఉలవపాడు: ఏడాదికొకసారి జరిగే ఉలవపాడులోని రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలకు నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుంచి భక్తులు వస్తుంటారు. ఈ ఏడాది భక్తులకు కనీస సమాచారం లేదు. రథోత్సవం లేదని, ఆ స్థానంలో పూల రథోత్సవం నిర్వహిస్తామని ప్రకటించారు. అయి తే దేవస్థాన మైక్ ద్వారా, దండోరా ద్వారా కానీ తెలియచేయని దుస్థితి. ఈ ఏడాది అంతా రహస్యమే. బహిరంగ పోస్టర్లు లేవు. కర పత్రాలు ఎన్ని కొట్టించారో, ఎవరికి పంపిణీ చేశారో తెలియదు. ఇలా దేవదాయ శాఖ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఉత్సవాలు జరుగుతున్నాయని గుడి దగ్గర పందిరి చూస్తే తప్ప తెలియని పరిస్థితి నెలకొంది. నచ్చిన సమయంలో వచ్చి.. దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా సుమా రు ఆరునెలల క్రితం వెలగం శ్రీనివాస్‌ను నియమించారు. ఈయన ఒంగోలులో నివాసం ఉంటారు. తనకు నచ్చిన సమయంలో గుడి వద్దకొచ్చి సిబ్బందిని పిలిచి నిర్ణయాలు తీసుకుంటారని ప్రచారం ఉంది. ఆయన వచ్చే సమయం చెప్తారని, ఆ సమయంలోనే బ్రహ్మోత్సవాలు, సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించిన వారు వేచి ఉండాలని చెబుతున్నారు. మళ్లీ వచ్చినప్పుడే మిగిలిన నిర్ణయాలు జరుగుతాయి. రాజకీయ నాయకులకు చెప్తే చాలు, భక్తులకు అవసరం లేదనే విధంగా ఉన్నారని ఆరోపణలున్నాయి. నామమాత్రంగా.. గతంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా పోస్టర్లు అంటించేవారు. ఈ ఏడాది అలా జరగలేదు. ప్రజాప్రతినిధులను కూడా పట్టించుకోలేదు. గతంలో దాదాపు 8 సాంస్కృతిక కార్యక్రమాలు జరిపేవారు. ఈ ఏడాది ఐదుతో సరిపెట్టారు. నాడు బస్టాండ్ సెంటర్లో కూడా విద్యుత్ కటౌట్లు ఏర్పాటు చేశారు. ఈసారి అవి లేవు. ఉన్న కార్యక్రమాలు కూడా భక్తులకు తెలియని పరిస్థితి. కార్యక్రమాలిలా.. బుధవారం నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. 9 గంటలకు అంకురార్పణ, 8న ధ్వజారోహణ, చప్పరసేవ, 9న హంస వాహనం, 10న సింహ వాహనం, 11న హనుమంతసేవ, 12న గరుడసేవ, 13న ఏనుగుసేవ, 14న కల్యాణం, పూల రథోత్సవం, 15న దొంగలదోపు తదితర కార్యక్రమాలు 17 వరకు జరుగుతాయి. 11 ,12, 13, 14 తేదీల్లో సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. నేటి నుంచి వేణుగోపాలుడి బ్రహ్మోత్సవాలు పోస్టర్లు, కరపత్రాలెక్కడ? దేవదాయ శాఖ నిర్లక్ష్యం -
పొలంలో పనిచేస్తూ..
● వడదెబ్బకు రైతు మృతి కొడవలూరు: వడదెబ్బ కారణంగా రైతు మృతిచెందాడు. ఈ ఘటన మండలంలోని గండవరం దర్గా దళితవాడలో మంగళవారం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన గుర్రాల లింగయ్య (65) మంగళవారం పొలంలో పనిచేస్తూ ఎండ వల్ల సొమ్మసిల్లి పడిపోయాడు. ఈ విషయాన్ని సమీపంలోని వారు కాస్త ఆలస్యంగా గుర్తించారు. అప్పటికే లింగయ్య చనిపోయినట్లు బంధువులు తెలిపారు.యువకుడి ఆత్మహత్యమనుబోలు: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని కొలనకుదరు గ్రామంలో మంగళవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. కొలనకుదురు ఎస్టీ కాలనీకి చెందిన ఈగా చినరాయుడు (25) కుటుంబ కలహాలతో కలత చెంది ఎలుకల మందు తిని తీవ్ర అనారోగ్యానికి లోనయ్యాడు. కుటుంబ సభ్యులు అతడిని చికిత్స నిమిత్తం గూడూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం నెల్లూరుకు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. చినరాయుడికి భార్య, రెండు నెలల వయసున్న పాప ఉన్నారు. పోలీసుల కేసు నమోదు చేశారు. నేత్రదానం చినరాయుడి నేత్రాలను దానం చేసేందుకు అతడి భార్య ముందుకొచ్చింది. గ్రామానికి చెందిన కసిరెడ్డి సునీల్‌రెడ్డి గిరిజన కుటుంబానికి అవగాహన కల్పించడంతో వారు చినరాయుడు నేత్రాలను దానం చేసేందుకు అంగీకరించారు. ఐ బ్యాంక్ టెక్నీషియన్ సునీల్ నేత్రాలను సేకరించారు. అధికారుల హెచ్చరికలు పట్టించుకోకుండా.. ● ప్రభుత్వ భూమిలో మళ్లీ కలప నరికివేత దుత్తలూరు: మండలంలోని భైరవరం గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూమిలో అక్రమంగా కలప నరుకుతున్న విషయమై సోమవారం రెవెన్యూ అధికారులకు గ్రామస్తులు ఫిర్యాదు చేయగా వీఆర్వో వెళ్లి అడ్డుకున్నారు. అయితే అధికారుల హెచ్చరికలు మాకు లెక్కలేదంటూ మంగళవారం యథేచ్ఛగా కలపను నరికి ట్రాక్టర్ల ద్వారా తరలించారు. దీంతో గ్రామస్తులు ఈ విషయాన్ని రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా వారు స్పందించి వీఆర్వో, ఆర్ఐ కలప కొడుతున్న ప్రదేశానికి వెళ్లి అడ్డుకున్నారు. ఇప్పటికే రెండు రోజులపాటు కొట్టిన కలపను ట్రాక్టర్ల ద్వారా తరలించి సొమ్ము చేసుకున్నారు. దీంతో కొందరు అధికారులు కూడా అక్రమార్కులకు వంత పాడుతున్నారనే ప్రచారం ఉంది. తహసీల్దార్ యనమల నాగరాజును వివరణ కోరగా పంచాయతీరాజ్ అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. గ్రీవెన్స్‌లో ఫిర్యాదు వచ్చింది కాబట్టి తాము స్పందించామన్నారు. ఇకపై ఆ భూమిలో చెట్లు నరికితే కఠినంగా వ్యవహరిస్తామన్నారు. జొన్నవాడలో బంగారం, వెండి, నగదు చోరీ బుచ్చిరెడ్డిపాళెం రూరల్: మండలంలోని జొన్నవాడ గ్రామంలో భారీ చోరీ జరిగింది. పోలీసుల కథనం మేరకు.. గ్రామంలోని అల్లం సుప్రజ, ఆమె కుమారుడు సోమవారం రాత్రి ఇంటి బయట నిద్రించారు. మంగళవారం తెల్లవారుజామున లేచి ఇంట్లో చూసేసరికి బీరువాలో ఉన్న 20 సవర్ల బంగారం, అర కిలో వెండి, రూ.లక్ష నగదు కనిపించలేదు. చోరీ జరిగిందని గుర్తించిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలాన్ని ఎస్సై సంతోష్‌కుమార్‌రెడ్డి పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
ఇసుక నుంచి ప్రారంభం..
నెల్లూరు (పొగతోట): భారతదేశంలోనే అతిపెద్ద స్కాంకు కూటమి ప్రభుత్వం తెర తీసిందని, విద్యుత్ కొనుగోళ్లల్లో రూ.11 వేల కోట్ల భారీ కుంభకోణానికి రంగం సిద్ధం చేసిందని ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ నెల్లూరు సిటీ ఇన్చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కుంభకోణాల పాలన సాగుతుందని, 11 నెలల్లో అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మార్చేశారని ధ్వజమెత్తారు. రోజుకొక కుంభకోణం వెలుగుచూస్తుందన్నారు. మొన్న విశాఖపట్నంలో ఉర్సా భూకుంభకోణం బయటకు వస్తే.. నిన్న కుట్టుమెషిన్ల కుంభకోణం వెలుగుచూసిందన్నారు. తాజాగా రాష్ట్ర ప్రజలపై మరో పాతికేళ్లు విద్యుత్ చార్జీల భారం వేసే విధంగా రూ.11 వేల కోట్ల కుంభాకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. టీడీపీ నేతలు అధికారం చేపట్టిన నాటి నుంచి వరుస స్కామ్‌లతో దోచుకోవడం మొదలెట్టారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయమని వైఎస్సార్సీపీ నేతలు నిలదీస్తుంటే.. అవినీతిని ప్రశ్నిస్తుంటే కేసులతో గొంతు నొక్కేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కుటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ల్యాండ్, ఇసుక, లిక్కర్, సిలికాను అడ్డగోలుగా దోచుకుంటూ రూ.వేల కోట్ల అక్రమార్జనే ధ్యేయంగా చెలరేగిపోతున్నారని మండి పడ్డారు. ప్రజలపై పాతికేళ్ల పాటు బిల్లుల భారం విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి మే 2వ తేదీ ఏపీ విద్యుత్ శాఖ అధికారులు యాక్సిస్ కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందంతో ఈ అవినీతికి బీజమేసిందన్నారు. 25 ఏళ్ల పాటు రూ.4.60లకు విద్యుత్ కొనుగోలు చేసి విధంగా ఒప్పందం కుదుర్చుకుందన్నారు. ఈ ఒప్పందాన్ని విద్యుత్ సంస్థలు ఎక్కడ వ్యతిరేకిస్తాయోనని 108 సెక్షన్‌ను తీసుకువచ్చి కచ్చితంగా అమలు చేయాలని నిర్ణయించిందన్నారు. దీంతో రాబోయే రోజుల్లో విద్యుత్ చార్జీలు ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వాలని లక్ష్యంతో 7000 మెగావాట్ల విద్యుత్‌ను కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీ వద్ద రూ.2.49 పైసలు అతి తక్కువ ధరకు కొనుగోలు చేసి 25 ఏళ్లకు అగ్రిమెంట్ కుదుర్చుకుందని గుర్తు చేశారు. అయితే దీనిపై రూ.లక్ష కోట్ల కుంభకోణమంటూ టీడీపీ నేతలు విష ప్రచారం చేశారన్నారు. ప్రభుత్వంలోకి రాకముందు చంద్రబాబు విద్యుత్ చార్జీలు పెంచబోమని, అవసరమైతే తగ్గిస్తామని చెప్పి నేడు ప్రజల మీదే భారం మోపుతున్నారన్నారు. పేదలపై విద్యుత్ సర్‌చార్జీల పేరుతో ఇప్పటికే రూ.15 వేల కోట్ల వసులు చేస్తున్నారని మండి పడ్డారు. రూ.5 వేలు విద్యుత్ బిల్లు వచ్చే వారికి రూ.8 వేల బిల్లు వస్తుందన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో డిస్కంలు రూ.86 వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోగా, వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.29 వేల కోట్లకు తగ్గించిందన్నారు. విద్యుత్ డిస్కంలు నష్టాల్లో ఉంటే జగన్మోహన్రెడ్డి రూ.47,800 కోట్ల చెల్లించి వాటిని ఆదుకున్నారని గుర్తు చేశారు. టీడీపీ ప్రభుత్వం డిస్కమ్‌లకు కేవలం రూ.13,250 కోట్లు మాత్రమే చెల్లించిందన్నారు. రైతులకు సంబంధించి రూ.8,840 కోట్ల విద్యుత్ బకాయిలను సైతం టీడీపీ ప్రభుత్వం వదిలేస్తే వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెల్లించినట్లు వివరించారు. ఇది దేశంలోనే అతిపెద్ద స్కాం ఇసుకతో ప్రారంభమై.. కరెంట్ దాక.. 11 నెలల్లో అప్పుల ఆంధ్రప్రదేశ్ విచ్చలవిడిగా మద్యం అమ్మకాలతో శాంతిభద్రతలకు విఘాతం ఇవన్నీ ప్రశిస్తున్నారనే వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ నెల్లూరుసిటీ ఇన్చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 80 లక్షల టన్నుల ఇసుక స్టాక్ చేస్తే.. కూటమి ప్రభుత్వ నేతలు దాన్నంతా దోచుకు తిన్నారని మండిపడ్డారు. అమరావతిలో రాజధాని పేరిట 77 వేల ఎకరాలను సేకరించి రాజధానిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నారని ఆరోపించారు. రాజధాని నిర్మాణానికి రూ.15 వేల కోట్ల విడుదల చేస్తే 8 శాతం అంటే రూ.1200 కోట్ల కమీషన్ల రూపంలో కూటమి నేతలు దోచుకున్నారని ఆరోపించారు. ఇటీవల విశాఖపట్నంలో ఉర్సా భూ కుంభకోణం వెలుగుచూసిందన్నారు. కూటమి ప్రభుత్వం ఎకరా భూమిని, రూ.0. 99 పైసల చొప్పున 3 వేల ఎకరాలు అప్పనంగా కట్టబెట్టి రూ.వేల కోట్లు దోచుకున్నారని దుయ్యబట్టారు. ఎస్సీ ఎస్టీ, బీసీ, మైనార్టీల పథకాలను కూడా వదలకుండా రూ.170 కోట్లు దోచుకున్నారన్నారు. జిల్లాలో మద్యం మహమ్మారితో శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడిందన్నారు. రోజుకొక హత్య జరుగుతుందన్నారు.జిల్లాలో నాలుగైదు నెలల్లోనే 25 హత్యలు జరిగాయన్నారు. మరో పక్క మైనింగ్ మాఫియా కూడా రెచ్చిపోతుందన్నారు. ఇసుక లారీని పట్టుకుంటే లక్ష రూపాయలు బహుమతి ఇస్తానన్న మంత్రికి టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి 3 లారీలను పట్టుకున్న విషయం తెలియదా? అని ప్రశ్నించారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖలీల్ అహ్మద్, మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు హంజా హుస్సేని, రాష్ట్ర అధికార ప్రతినిధి మల్లి నిర్మల, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు, కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున, జంగం సెల్ రాష్ట్ర అధ్యక్షురాలు వావిలేటి ప్రసన్న, కార్పొరేటర్లు కరిముల్లా, నీలి రాఘవరావు, కామాక్షిదేవి, జయలక్ష్మి, మాజీ ఏఎంసీ చైర్మన్ పేర్నేటి కోటేశ్వరరెడ్డి, విద్యార్థి విభాగం అధ్యక్షుడు అశ్రిత్‌రెడ్డి, యువజన విభాగం నాయకులు కిషన్, 11 డివిజన్ ఇన్చార్జి మహేష్ యాదవ్, 5వ డివిజన్ ఇన్చార్జి సుబ్బారెడ్డి, మైనార్టీ నాయకులు అబ్దుల్ మస్తాన్, యస్దాని తదితరులు పాల్గొన్నారు. -
వడ్డీతో సహా చెల్లిస్తాం
కావలి (జలదంకి): కావలి నియోజకవర్గంలో ప్రజాపాలన గాలికి వదిలేసి, అక్రమార్జన కోసం గ్రావెల్, ఇసుక, రేషన్ బియ్యం మాఫియాలను నడిపిస్తున్న ఎమ్మెల్యే అరాచకపాలన మీద ప్రశ్నిస్తుంటే అక్రమ కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తున్నారని కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. మీరు పెట్టే అక్రమ కేసులకు భయపడేది లేదని, మీకు వడ్డీతో సహా చెల్లిస్తామని తెలిపారు. మంగళవారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో పార్టీ నేతలు పలువురు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బెంగళూరు నుంచి ప్రతాప్‌కుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశామని, మారణాయుధాలతో దాడులకు పాల్పడ్డామంటూ నాతోపాటు మా నాయకులపై, ఏ పాపం ఎరుగని మీడియా ప్రతినిధుల మీద అక్రమ కేసులు పెట్టి కావలి ఎమ్మెల్యే రాక్షసానందం పొందుతున్నాడన్నారు. కట్టు కథ సూపర్‌గా ఉందన్నారు. పోలీసులను ఇలా కూడా వాడుకోవచ్చని పదేళ్లు అధికారంలో ఉన్న మాకు చేతకాలేదన్నారు. ఇప్పుడు అవన్నీ మాకు బాగా నేర్పిస్తున్నారని, బాగా నేర్చుకుంటామని చెప్పారు. మా అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు.. ఒక చెంపపె కొట్టండి.. దాన్ని మేము తిరిగి ఇస్తామని చెప్పారు. కొట్టండి.. కేసులు పెట్టండి.. అక్రమ అరెస్ట్‌లు చేయించండి.. అవి కూడా చాలకపోతే ఇంకా నాలుగు కేసులు కూడా పెట్టుకోండి.. భయపడేది లేదన్నారు. కావలిలో ఇటువంటి సంస్కృతి ఇంత వరకు లేదన్నారు. గతంలో కావలి నియోజకవర్గంలో ఎంతో మంది ఎమ్మెల్యేలుగా గెలిచి సేవలు అందించారన్నారు. కలికి యానాదిరెడ్డి నుంచి మాగుంట పార్వతమ్మ, ఒంటేరు వేణుగోపాల్‌రెడ్డి, బీద మస్తాన్‌రావు, విష్ణువర్ధన్‌రెడ్డి, నాతో సహా అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా ఇటువంటి కక్షపూరితంగా కేసులు పెట్టి వేధించుకున్న చరిత్ర లేదన్నారు. జలదంకి మండల సంస్కృతిని కావలికి అప్పు తెచ్చుకుంటున్నామని, అవకాశం వచ్చినప్పుడు వాటిని అప్పును వడ్డీ సహా తప్పకుండా తీరుస్తామన్నారు. మా మీద కేసులు పెట్టినంత మాత్రాన భయపడేది లేదని, కేసులు పెట్టారు కాబ ట్టి ఎదుర్కొనేందుకు న్యాయపోరాటం చేస్తున్నామన్నారు. లేదంటే కచ్చితంగా అరెస్ట్ చేయాలంటే ఎస్పీ కానీ, డీఎస్పీ కానీ చెప్పండి చాలు. నేనే వచ్చి మీ ఎదుట లొంగిపోతానన్నారు. ప్రజలు అధికారం ఇచ్చింది అవినీతి, అక్రమాలు చేయమని కాదని, మంచి పరిపాలన అందించమని, అలా కాకుండా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతూ జలదంకి మండలంలో చేసిన విష సంస్కృతిని కావలిలో చేస్తే ఊరుకునేది లేదన్నారు. మీడియా ప్రతినిధులకు అండగా నిలబడింది తామేనని, ఇప్పుడు స్వార్థంతో కొందరు ఎమ్మెల్యే వద్దకు చేరి వారు గతంలో ఏం చేశారో అందరికీ తెలుసన్నారు. మీడియా అనేది నిష్పక్షపాతంగా ఉండాలని కోరారు. అక్రమ కేసులు పెడితే భయపడేది లేదు కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి -
సైదాపురం పోలీసుల అష్టదిగ్బంధం
సైదాపురం: సైదాపురంలో అక్రమంగా నిర్వహిస్తున్న మైనింగ్‌పై ఆరోపణలు గుప్పిస్తూ.. మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో పోరుబాటకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో పోలీసులు మంగళవారం సైదాపురాన్ని అష్టదిగ్బంధం చేశారు. శ్రీనివాస పద్మావతి గని వద్ద అనిల్‌కుమార్ యాదవ్ మంగళవారం నిరసన వ్యక్తం చేయనున్నట్టు సమాచారం అందడంతో ఆత్మకూరు డీఎస్పీ అలర్ట్ అయ్యారు. ఆయన పర్యవేక్షణలో సుమారు 100 మంది వరకు పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేశారు. దీంతో సైదాపురంలో ఉత్కంఠ నెలకొంది. సైదాపురం నుంచి శ్రీనివాస పద్మావతి గని వరకు అడుగడుగున పోలీసులు మోహరించారు. మహిళా సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఉత్కంఠ వాతావరణం ఏర్పడింది. తీరా మాజీమంత్రి రావడం లేదని సమాచారం అందడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. -
హాస్టళ్లల్లో మరమ్మతులు వేగంగా పూర్తి చేయాలి
నెల్లూరు రూరల్: జిల్లాలోని సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలో మరమ్మతు పనులు ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆనంద్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో జిల్లాలోని హాస్టల్ వెల్ఫేర్ అధికారులు, వార్డెన్లతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 64 హాస్టళ్లలో శ్లాబు, గోడల మరమ్మతులు, ఎలక్ట్రికల్, నీటి సరఫరా, కిటికిలు, తలుపులు తదితర అత్యవసర మరమ్మతులు చేపట్టేందుకు ప్రభుత్వం రూ.9.32 కోట్లు నిధులు మంజూరు చేసిందన్నారు. పంచాయతీరాజ్ శాఖకు 34, ఆర్అండ్బీ శాఖకు 30 హాస్టళ్లను కేటాయించి త్వరగా పనులు పూర్తి చేయాలని ఆదేశాలిచ్చినట్లు చెప్పారు. వేసవి సెలవుల అనంతరం విద్యార్థులందరూ హాస్టళ్లకు తిరిగి వచ్చేలోగా ఈ పనులన్ని పూర్తి కావాలని ఆదేశించారు. నూరుశాతం సీట్లు భర్తీ చేయండి అన్ని వసతులు కలిగి ఉన్న హాస్టళ్లలో నూరు శాతం అడ్మిషన్లు ఉండేలా ప్రత్యేక దృష్టి పెట్టాలని ఏఎస్‌డబ్ల్యూఓలకు సూచించారు. ఇందు కోసం ప్రత్యేక యాక్షన్ ప్లాన్‌తో పని చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను తల్లిదండ్రులకు వివరించి ఎక్కువ మంది విద్యార్థులు హాస్టళ్లలో చేరేలా చర్యలు చేపట్టాలన్నారు. సరైన వసతులు లేక తక్కువ విద్యార్థులున్న హాస్టళ్లను సమీపంలో మెరుగైన వసతులు కలిగి ఉన్న హాస్టళ్లను అనుసంధానించాలని సూచించారు. జిల్లాలోని సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లకు ప్రభుత్వం నిర్దేశించిన 5,900 విద్యార్థుల సంఖ్యకు తక్కువ కాకుండా పూర్తి స్థాయిలో భర్తీ అయ్యేలా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. 10వ తరగతి సప్లిమెంటరీలో మెరుగైన ఫలితాలు సాధించాలి జిల్లాలోని సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలో ఈ ఏడాది సాధించిన 10వ తరగతి ఫలితాలపై కలెక్టర్ ఆనంద్ సమీక్షించారు. కొన్ని హాస్టళ్లలో తక్కువ ఉత్తీర్ణత శాతం ఉండడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తరగతులు మొదలైన మొదటి నెల నుంచే విద్యార్థులపై పూర్తిస్థాయిలో పర్యవేక్షణ ఉంచాలని, విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలను అంచనా వేయాలన్నారు. సబ్జెక్ట్‌ల వారీగా వెనుకబడిన విద్యార్థులకు వారికి అర్థమయ్యేలా ముందు నుంచే మెరుగైన బోధన అందించడం ద్వారా సత్ఫలితాలు సాధించవచ్చున్నారు. ఫెయిలైన విద్యార్థులందరూ టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల్లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించేలా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఏఎస్‌డబ్ల్యూఓలకు సూచించారు. ట్యూషన్లు పెట్టి సబ్జెక్ట్‌ల వారీగా వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఈ సమావేశంలో సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ శోభారాణి, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ ఇంజినీరింగ్ అధికారులు జీ రామకృష్ణప్రసాద్, సుబ్బరాజు, హాస్టల్ సంక్షేమ అధికారులు, వార్డెన్లు తదితరులు పాల్గొన్నారు. నూరు శాతం సీట్లు భర్తీ చేయండి టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల్లో సంపూర్ణ ఉత్తీర్ణత సాధించాలి కలెక్టర్ ఆనంద్ -
డీసీపల్లిలో 460 పొగాకు బేళ్ల విక్రయం
మర్రిపాడు: మండలంలోని డీసీపల్లి వేలం కేంద్రంలో మంగళవారం 460 పొగాకు బేళ్లను విక్రయించినట్లు వేలం నిర్వహణాధికారి జీ రాజశేఖర్ తెలిపారు. వేలానికి 706 బేళ్లు రాగా 460 బేళ్లను విక్రయించామని, మిగిలిన బేళ్లను వివిధ కారణాలతో తిరస్కరించినట్లు తెలిపారు. వేలంలో 58431.5 కిలోల పొగాకును విక్రయించగా రూ.14903359.30 వ్యాపారం జరిగింది. కిలో కు గరిష్ట ధర రూ.280 కాగా కనిష్ట ధర రూ.210 లభించింది. సగటు ధర రూ.255.06 నమోదైంది. వేలంలో 13 కంపెనీల వ్యాపార ప్రతినిధులు పాల్గొన్నారు. పొదలకూరు పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్ నెల్లూరు (పొగతోట): కోర్టుకు సరైన సమాధానం ఇవ్వకుండా తప్పుదారి పట్టించే విధంగా సమాచారం ఇచ్చిన పొదలకూరు పంచాయతీ కార్యదర్శి వి.శీనయ్యను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఆదేశాల మేరకు డీపీఓ శ్రీధర్‌రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పొదలకూరు పంచాయతీలో భూముల విషయాలకు సంబంధించి కోర్టును తప్పుదోవ పట్టించే విధంగా విధుల్లో పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఈ విషయంపై ఫిర్యాదులు అందడంతో స్పందించిన కలెక్టర్ సస్పెండ్ చేయాలంటూ ఉత్తర్వులు జారీ చేశారు. చెక్ పవర్ రద్దు నెల్లూరు (పొగతోట): వింజమూరు మండలం కాటేపల్లి సర్పంచ్ విజయలక్ష్మమ్మ నిధుల దుర్వినియోగానికి సంబంధించి చెక్ పవర్‌ను తాత్కాలికంగా రద్దు చేసినట్లు డీపీఓ శ్రీధర్‌రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీలో నిధుల దుర్వినియోగంపై అందిన ఫిర్యాదు మేరకు రీజినల్ పంచాయతీ అధికారి విచారణ చేశారు. విచారణలో సాధారణ నిధులు రూ.2,49,311 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.2,29,519 మొత్తం రూ.4,78,830 దుర్వినియోగం అయినట్లు తేలింది. వీటితోపాటు రూ.13,58,583 నిధులు నిబంధనలకు విరుద్ధంగా డ్రా చేశారని, అవి కాకుండా రూ.14,87,482 నిధులు గ్రామ అభివృద్ధికి ఖర్చు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రభుత్వానికి సరెండర్ చేసుకోవాల్సిన పరిస్థితి సర్పంచ్ కల్పించారన్నారు. వీటన్నింటికి సర్పంచ్ బాధ్యులు కావడంతో చెక్ పవర్‌ను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు తెలిపారు. నేడు సోమశిల నుంచి నీటి విడుదలకు సన్నాహాలు సోమశిల: జిల్లాలో ఖరీఫ్ (రెండో పంట) సాగుకు అవసరమైన నీటి విడుదలపై ఇటీవల జరిగిన ఐఏబీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు బుధవారం నీరు విడుదల చేస్తామని జలాశయం అధికారులు మంగళవారం తెలిపారు. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ప్రాజెక్ట్ కమిటి చైర్మన్ వేలూరి కేశవ సోమశిల జలాశయం వద్ద సాగునీటిని విడుదల చేస్తారని, నీటిని వృథా చేయకుండా వాడుకోవాలని అధికారులు తెలిపారు. వాస్తవానికి సోమవారమే నీటిని విడుదల చేయాల్సి ఉంది. అయితే సోమశిల అధికారులకు నీటి విడుదలకు సంబంధించి ఇండెంట్ ఇవ్వకపోవడం, మంత్రి ఆనం అందుబాబులో లేకపోవడంతో రెండు రోజుల ఆలస్యంగా ఈ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. నల్ల మాస్క్‌లు ధరించి మౌన నిరసన నెల్లూరు (అర్బన్): తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లాలోని సీహెచ్‌ఓలు నగరంలోని జిల్లా వైద్యశాఖ కార్యాలయంలో చేస్తున్న సమ్మె మంగళవారానికి 9వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా సీహెచ్‌ఓలు ముఖానికి నల్ల మాస్క్‌లు ధరించి మౌనంగా నిరసన తెలిపారు. అనంతరం సీహెచ్‌ఓల అసోసియేషన్ భానుమహేష్ మాట్లాడుతూ తాము న్యాయమైన సమస్యలు తీర్చాలని అడిగితే ప్రభుత్వంలోని పెద్దలు మీరు బాండ్ రాసిచ్చారు. జాగ్రత్త అంటూ తమను హెచ్చరించడం న్యాయం కాదన్నారు. బాండ్ అంటే ఉద్యోగానికి కనీస భద్రత ఉండాలన్నారు. భయం కాదన్నా రు. తమ నోరు నొక్కుతూ ఇన్సెంటీవ్స్ కూడా ఇవ్వకపోవడం దారుణమన్నారు. పెండింగ్ బకాయిలు, విలేజ్ హెల్త్ క్లినిక్ అద్దెలు తక్షణమే విడు దల చేయాలని కోరారు. ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా 23 శాతం వేతనాలు పెంచాలని కోరారు. ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించి మాట్లాడకపోతే శాంతియుతంగా నిరాహార దీక్షలు చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో ఆర్డినేటర్ ఆదిల్ , కార్యదర్శి రెబకా, సౌమ్య , సుగుణ తదితరులు పాల్గొన్నారు. -
ఎంప్లాయీమెంట్ రిటర్న్స్ సమర్పించండి
నెల్లూరురూరల్: పబ్లిక్, ప్రైవేట్ ఎస్టాబ్లిష్మెంట్ ఎంప్లాయీమెంట్ రిటర్న్స్ www. employment. ap. gov. in employer login ద్వారా సమర్పించాలని జిల్లా ఉపాధి శాఖ అధికారి వినయ్‌కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి మూడు నెలలకోసారి తెలియజేయాల్సి ఉందన్నారు. ఏమైనా సందేహాలు ఉంటే సెల్ నంబరు 9642653931లో కాని, జిల్లా ఉపాధి శాఖ కార్యాలయాన్ని సంప్రదించవచ్చునని తెలిపారు. డీసీపల్లిలో 555 పొగాకు బేళ్ల విక్రయం మర్రిపాడు: మండలంలోని డీసీపల్లి పొగాకు బోర్డు వేలం కేంద్రంలో 555 పొగాకు బేళ్లను విక్రయించినట్లు వేలం నిర్వహణాధికారి రాజశేఖర్ తెలిపారు. వేలానికి 779 బేళ్లు రాగా 555 బేళ్లు విక్రయించామన్నారు. మిగిలిన బేళ్లను వివిధ కారణాలతో తిరస్కరించినట్లు తెలిపారు. వేలంలో 71,546.9 కిలోల పొగాకు విక్రయించగా రూ.1,79,61,586.20 వ్యాపా రం జరిగింది. కిలో గరిష్ట ధర రూ.280 కాగా, కనిష్ట ధర రూ.210 లభించింది. సగటు ధర రూ.251.05 నమోదైంది. వేలంలో 14 కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. ● కలిగిరి: కలిగిరి పొగాకు వేలం కేంద్రంలో సోమవారం కిలో పొగాకుకు గరిష్ట ధర రూ.280 లభించింది. జనరల్ క్లస్టర్ రైతులు 327 బేళ్లను అమ్మకానికి తీసుకు రాగా 282 పొగాకు బేళ్లను కొనుగోలు చేయగా వివిధ కారణాలతో 45 బేళ్లను కొనుగోలుకు తిరస్కరించారు. వేలం నిర్వహణాధికారి టి. ఇషాక్స్వర్ణదత్ మాట్లాడుతూ కనిష్ట ధర రూ.210 పలకగా, సగటు ధర రూ.254.39 లభించిందన్నారు. వేలంలో 15 కంపెనీలు పాల్గొన్నాయని తెలిపారు. నీటి విడుదల ప్రక్రియ వాయిదా సోమశిల: ఐఏబీ సమావేశంలో నిర్ణయించిన ప్రకారం సోమశిల జలాశయం ద్వారా సోమవారం నుంచి నీరు విడుదల చేయాల్సి ఉంది. అయితే సంబంధిత ఉన్నతాధికారుల నుంచి ఇండెంట్ రాకపోవడంతో నీటిని విడుదల చేయలేదని, బుధవారం డెల్టాకు నీటిని విడుదల చేస్తామని, ఉత్తర, దక్షిణ కాలువలకు మాత్రం ఇండెంట్ వచ్చినప్పుడు విడుదల చేస్తామని జలాశయం ఈఈ శ్రీనివాస్ తెలిపారు. జిల్లా జైల్లో ఖైదీ ఆత్మహత్యాయత్నం వైరల్ వెంకటాచలం: మండలంలోని చెముడుగుంట వద్ద ఉన్న జిల్లా జైల్లో ఓ ఖైదీ గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సోమవారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఖైదీలకు సంబంధించి ఇటీవల ప్రభుత్వం జీఓ నంబరు 58 బదులు జీఓ నంబరు 71 అమలు చేయడమే దీనికి కారణమని సమాచారమని విస్తృతంగా వైరల్ కావడంతో అధికార యంత్రాంగం ఉలికిపడింది. ఈ విషయమై జైలు అధికారులను సంప్రదించగా అలాంటి ఘటన జైల్లో జరగలేదని చెబుతున్నారు. సమ్మె ఆపే ప్రసక్తే లేదు నెల్లూరు (అర్బన్): తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించేంత వరకు సమ్మెను ఆపే ప్రసక్తే లేదని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు భానుమహేష్ తెలిపారు. పెండింగ్ బకాయిలు, ఇన్సెంటివ్స్ చెల్లించాలని, వేతన సవరణ అంశంలో న్యాయం చేయాలని కోరుతూ సీహెచ్‌ఓలు గత 9 రోజులుగా విలేజ్ హెల్త్ క్లినిక్‌లను మూసేసి జిల్లా వైద్యశాఖ కార్యాలయం వద్ద నిరసన చేస్తున్నారు. సోమవారం భానుమహేష్ మాట్లాడుతూ తాము ప్రభుత్వాన్ని గొంతెమ్మ కోర్కెలు కోరలేదన్నారు. ఆరేళ్లుగా జీతం పెంచలేదన్నారు. రెండు ఏళ్లుగా చెల్లించాల్సిన బకాయిలు, ఇన్సెంటివ్స్ ఇవ్వకుండా కొత్తగా ఇప్పుడు సీహెచ్‌ఓలు చేసే పని ఆధారంగానే ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రభుత్వం చెప్పడం అన్యాయమన్నారు. మా ఆవేదన ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే తాము సమ్మెలోకి వెళ్లామన్నారు. తమ సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు సీహెచ్‌ఓల పేరుతో కొత్త సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేసి తాము ఇతరులను దూషించినట్లు ప్రచారం చేస్తున్నారన్నారు. దీనిపై విచారణ చేపట్టాలని తాము సైబర్ క్రైమ్ కింద డీఎస్పీకి ఫిర్యాదు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు ఆదిల్, రెబకా పలువురు సీహెచ్‌ఓలు పాల్గొన్నారు. -
సమ్మె నోటీసు ఇచ్చిన ఆశాలు
నెల్లూరు (వీఆర్సీసెంటర్): ఆశా వర్కర్ల న్యాయమైన కోర్కెల సాధనకు, ఆశాలను కార్మికులుగా గుర్తించి కనీస వేతనం ఇవ్వాలన్న డిమాండ్లపై ఈ నెల 20వ తేదీ నుంచి సమ్మె చేపడుతున్నట్లు సోమవారం నోటీసును జిల్లా వైద్యాధికారిణి సుజాతకు ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు విజయలక్ష్మి, అన్నపూర్ణమ్మ అందజేశారు. వారు మాట్లాడుతూ ఆశా వర్కర్స్ న్యాయమైన కోర్కెల సాధన కోసం 20వ తేదీ నుంచి సమ్మె ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ప్రధానంగా ఆశా వర్కర్లను కార్మికులుగా గుర్తించి కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆశాలు 20 ఏళ్ల నుంచి పేద ప్రజలకు ఆరోగ్య సేవలందిస్తున్నారని, వీరిని ప్రభుత్వం వెంటనే రెగ్యులర్ చేయాలని, కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్‌ను ఆశాలుగా మార్చాలని డిమాండ్ చేశారు. ఆశాలకు రూ.10 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, ప్రభుత్వం అందించనున్న సంక్షేమ పథకాలు ఆశాలకు వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మధుసూదన, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే యుద్ధ ప్రకటనలు
నెల్లూరు (వీఆర్సీసెంటర్): దేఽశంలోని అన్ని రంగాల్లో బీజేపీ ప్రభుత్వం వైపల్యం చెందిందని, దానిని కప్పిపుచ్చుకునేందుకే ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాకిస్తాన్‌పై యుద్ధ ప్రకటనలు చేస్తున్నారని డీసీసీ అధ్యక్షుడు చేవూరు దేవకుమార్‌రెడ్డి విమర్శించారు. నగరంలోని ఇందిరాభవన్‌లో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నందున ప్రధాని యుద్ధ ప్రకటనలు చేస్తున్నారని, పహల్గాం ఘటన పూర్తిగా కేంద్ర ఇంటెలిజెన్స్ వైఫల్యం వల్లే జరిగిందని ఆరోపించారు. పహల్గాం ఉగ్రదాడిలో 26 మందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులను ఇప్పటికీ పట్టుకోలేకపోయారన్నారు. ప్రధాని రాష్ట్రంలో రాజధాని అమరావతికి శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చినా ఎలాంటి ప్రయెజనం ఉండదని, గతంలో కూడా చెంబుడునీళ్లు, మట్టి ఇచ్చి సరి పెట్టాడని పేర్కొన్నారు. కులగణన అంశాన్ని పార్లమెంట్లో మొట్టమొదటగా లేవనెత్తింది కాంగ్రెస్ పార్టీయేనని ఆ ఘనత రాహుల్‌గాంధీకే దక్కుతుందన్నారు. ఈ నెల 13వ తేదీన పీసీసీ అధ్యక్షురాలు షర్మిల జిల్లాలో పర్యటనకు రానున్నారని, అందుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ త్వరలో ప్రకటిస్తామన్నారు. అనంతరం డీసీసీ ఉపాధ్యక్షుడిగా తలారి బాలసుధాకర్ను తిరిగి రెండో సారి నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేశా రు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఉడతా వెంకట్రావ్యాదవ్, శ్రీనివాసులరెడ్డి, మోహన్‌రావు, ఫయాజ్, ఫజుల్లా తదితరులు పాల్గొన్నారు. పహల్గాం ఘటన ఇంటెలిజెన్స్ వైఫల్యం 13న నెల్లూరుకు పీసీసీ అధ్యక్షురాలు రాక -
కాకాణితో ప్రారంభమై..
● అదుపు తప్పిన శాంతిభద్రతలు జిల్లాలో శాంతిభద్రతలు అదుపు తప్పాయి. హత్యలు, హత్యాయత్నాలతో జిల్లా అట్టుడికిపోతోంది. కావలిలో బృందావనం కాలనీలో జరిగిన భారీ చోరీలో ఇప్పటి వరకు నిందితులను పట్టుకోలేకపోయారు. కావలి సమీపంలో ఒక మహిళ హత్య కేసులో ఇంత వరకు చిన్న క్లూ కూడా కనిపెట్టలేకపోయారు. కానీ అసమర్థ పాలకుల చేతిలో కొందరు ఖాకీలు.. కీలుబొమ్మలా మారి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే మీడియా ప్రతినిధులపై అక్రమ కేసులు కట్టి పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు వేసి ప్రజాస్వామ్య హననానికి పాల్పడ్డారు. మరో వైపు ప్రభుత్వ వైఫల్యాలు, అసమర్థతను ప్రశ్నించే వైఎస్సార్సీపీ నేతలపై కేసులు నమోదు చేసి గొంతుకలు నొక్కే ప్రయత్నం చేస్తున్న ఖాకీ.. సిగ్గుపడు. ● కట్టడి చేయలేని కొందరు పోలీసులు ● పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు వేసి ప్రజాస్వామ్యం హననం ● రెడ్‌బుక్ రాజ్యాంగానికి గులాంగిరి ● ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే మీడియా ప్రతినిధులపై అక్రమ కేసులా ● ప్రభుత్వం మారితే మీ పరిస్థితి ఏమిటి? సాక్షి ప్రతినిధి నెల్లూరు: జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేల నుంచి మంత్రులు, ఎంపీ దాకా మట్టి నుంచి ఇసుక, గ్రావెల్, క్వార్ట్ ్జ, మైకా వరకు సహజ వనరులను విచ్చలవిడిగా దోచుకుంటున్నారు. పార్టీ క్యాడర్ ఊరూరా మద్యం బెల్టు షాపులు పెట్టి బరితెగించి విక్రయాలు సాగిస్తున్నారు. మరో వైపు రేషన్ బియ్యం, కోళ్ల వ్యర్థాలు, పశువుల అక్రమ రవాణా దందా సాగిస్తూ రూ.కోట్ల వ్యాపారం చేస్తున్నారు. ఇంకో వైపు హత్యలు, హత్యాయత్నాలు, దోపిడీలు, దొంగతనాలు, మహిళలపై లైంగిక దాడులు వంటి దారుణాలు జరుగుతున్నాయి. వీటిని కట్టడి చేయలేని జిల్లాలో కొందరు పోలీసులు అసమర్థ పాలకుల చేతిలో కీలుబొమ్మల్లా మారి రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని మాత్రం కచ్చితంగా అమలు చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలు, అసమర్థతను ప్రశ్నించే మీడియా కావచ్చు.. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, సోషల్ యాక్టివిస్టులైనా సరే వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. వాట్సాప్ గ్రూపుల్లో వచ్చిన మెసేజ్‌లు ఫార్వార్డ్ చేయడాన్ని కూడా నేరంగా భావించి కేసులు నమోదు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. పసుపు చొక్కా తొడగని సామాన్యుడి నుంచి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలపై కేసులు నమోదు చేస్తున్నారు. తాజాగా కావలిలో సాక్షి జర్నలిస్టుతో సహా నలుగురు జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపించారు. పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు వేసి ప్రజాస్వామ్యాన్ని నడిబజారులో అసమర్థ పాలకులకు తాకట్టు పెట్టారు. ● తాజాగా కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డిపై ఐదేళ్ల కిందట అమృత్ స్కీమ్ పైలాన్ ధ్వంసం చేశారంటూ మూసేసిన పాత కేసును తిరిగి తెరిచి హత్యాయత్నం కేసు జోడించి నమోదు చేశారు. కావలిలో 2020లో అమృత్ పథకం పైలాన్ ధ్వంసం చేసిన కేసును తిరగతోడి మీడియా ప్రతినిధులు సహా మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేతలు 12 మందిని నిందితులుగా చేర్చి అక్రమ కేసు బనాయించారు. ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డిని టార్గెట్‌గా చేసుకుని స్థానిక ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి అవినీతి, అక్రమాలపై కథనాలు రాసిన పాత్రికేయుల నుంచి ఎన్నికల సమయంలో వ్యతిరేక పోస్టింగ్‌లు పెట్టినందరిని ఈ కేసులో నిందితులుగా చేర్చారు. సామాన్య జర్నలిస్టులు పలుగు, పార పట్టుకుని పైలాన్ ధ్వంసం చేయడంతోపాటు అడ్డుచెప్పబోయిన టీడీపీ కార్యకర్తలను తరిమి కొట్టి హత్యాయత్నం చేశారని రిమాండ్ రిపోర్టులో చూపించడంపై పోలీస్ శాఖ చూపించిన అత్యుత్సాహం నివ్వెరపోయేలా ఉంది. మాజీ మంత్రి అనిల్‌ను టార్గెట్ చేసి రేపోమాపో మాజీ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌పై అక్రమ కేసులు నమోదు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఎమ్మెల్సీ బీద రవిచంద్ర మీడియా ముందు బాహాటంగా చెప్పడం చూస్తుంటే జిల్లాలో రెడ్‌బుక్ రాజ్యాంగం పతాక స్థాయి చేరిందని చెప్పొచ్చు. సైదాపురంలో మైనింగ్ మాఫియా దోపిడీపై రెండు రోజుల క్రితం ప్రెస్‌మీట్ పెట్టిన మాజీమంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌ను టార్గెట్ చేసి అక్రమ కేసులు బనాయించేందుకు సిద్ధమవుతున్నట్లు, త్వరలోనే అరెస్ట్ అవుతున్నాడని ఎమ్మెల్సీ బీద సోమవారం ప్రెస్‌మీట్ ద్వారా చెప్పకనే చెప్పాడు. ఇరిగేషన్ శాఖలో అక్రమాలు జరిగాయని, అక్రమ మైనింగ్‌లో అతని ప్రమేయం ఉందని ఆ రెండు వ్యవహారాల్లో కేసులు నమోదుకు తుది దశకు చేరుకుందని చెప్పడం చూస్తుంటే మాజీమంత్రిని టార్గెట్‌చేసి జైలుకు పంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఇట్టే తెలిసిపోతుంది. ప్రస్తుతం సైదాపురంలో అక్రమ మైనింగ్ జరుగుతోంది. ఎంపీ వేమిరెడ్డి కనుసన్నల్లో జరిగే మైనింగ్‌ను వెలుగులోకి రానివ్వకుండా ఉండేందుకు అక్రమ కేసులు బూచి చూపిస్తున్నారని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ నేతల ప్రాపకం కోసం వైఎస్సార్సీపీ కీలక నేతలందరిపై కేసుల పరంపర కొనసాగించే రెడ్‌బుక్ రాజ్యాంగానికి కొందరు పోలీసులు తెరతీశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల వ్యవధిలోనే మాజీమంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై ఏడు కేసులు నమోదు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ వైఫల్యాలతోపాటు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమెహన్‌రెడ్డి అవినీతి అక్రమాలపై నిత్యం ఎండగట్టుతుండడంతో ప్రభుత్వ పెద్దలకు ఇబ్బందిగా మారింది. కాకాణిని టార్గెట్ చేసి ఏడు నెలలు వ్యవధిలోనే ఏడు కేసులు నమోదు చేయించారు. వాట్సాప్ గ్రూపుల్లో పేపర్ కటింగ్‌లు ఫార్వార్డ్ చేశాడనే కారణం నుంచి అక్రమ మైనింగ్ అంటూ అట్రాసిటీ కేసులు అంటూ ఏడు కేసులు పెట్టి ఆయన్ను ముప్పతిప్పలు పెడుతున్నారు. ఆ కుటుంబానికి నరకం చూపిస్తున్నారు. -
అక్రమ కేసును ఎత్తివేయాలి
● ఎస్పీకి జర్నలిస్టు సంఘాల ఐక్యవేదిక వినతి నెల్లూరు (క్రైమ్): కావలి రెండో పట్టణ పోలీసులు జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసును ఎత్తివేయాలని జర్నలిస్టు సంఘాల ఐక్యవేదిక నాయకులు ఎస్పీ జి.కృష్ణకాంత్‌ను కోరారు. ఈ మేరకు ఐక్యవేదిక నాయకులు, పలువురు జర్నలిస్టులు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీని కలిసి వినతిపత్రం అందజేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ వెల్లడించారు. అనంతరం ఐక్యవేదిక నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రశ్నించే గొంతుకులను బెదిరించే ధోరణితో ఉద్దేశ పూర్వకంగా జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయిస్తోందన్నారు. అందుకు కావలి ఘటనే నిదర్శనమన్నారు. కావలి పట్టణంలో అమృత్ పథకం పైలాన్‌ను 2020 ఏప్రిల్ 10వ తేదీన గుర్తుతెలియని వ్యక్తులు కూల్చివేశారన్నారు. అప్పటి మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు మేరకు కావలి రెండో పట్టణ పోలీసులు మరుసటి రోజు కేసు నమోదు చేసినా సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా కేసును మూసివేశారన్నారు. ఈ క్రమంలో కూటమి అధికారంలోకి రావడంతో ఆ పార్టీ నేతల వైఫల్యాలను, అక్రమాలను ఎత్తి చూపుతున్నారన్న అక్కసుతో ఐదేళ్ల అనంతరం ఆ కేసును రీ ఓపన్ చేయించి పైలాన్ ధ్వంసం ఘటనతో ఎలాంటి సంబంధం లేని కావలి ‘సాక్షి’ ఆర్సీ ఇన్చార్జి కె. శ్రీనివాసరావు (కేఎస్), కె.మాలకొండయ్య, బి. వెంకటలక్ష్మీనారాయణ, వి. ప్రసాద్‌తోపాటు మరికొందరు జర్నలిస్టులను నిందితులుగా చేర్పించి 307 ఐపీసీ తదితర నాన్‌బెయిల్‌బుల్ సెక్షన్లు నమోదు చేయించారన్నారు. ఆదివారం పోలీసులు హుటాహుటిన నలుగురు జర్నలిస్టులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారన్నారు. సమాజ హితం కోసం అహరహం పనిచేసే జర్నలిస్టులు హత్యాయత్నంకు పాల్పడినట్లు పేర్కొంటూ నాన్‌బెయిల్‌బుల్ సెక్షన్లు పెట్టడం దారుణమన్నారు. పైలాన్ ధ్వంసం సమయంలో మీడియాలోలేని ప్రసాద్‌ను సైతం కేసులో నిందితుడిగా చేర్చడం అక్రమ కేసుకు తార్కాణంగా నిలుస్తోందన్నారు. ఇప్పటికై నా పోలీసు అధికారులు స్పందించి పూర్వాపరాలను విచారించి అక్రమ కేసును ఎత్తివేయాలన్నారు. భవిష్యత్‌లో ఇలాంటివి పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జర్నలిస్టు సంఘాల ఐక్యవేదిక నాయకులు ఎ. జయప్రకాష్, సీహెచ్ మస్తాన్‌రెడ్డి, పి.బాలకృష్ణ, మునీంద్ర, పలువురు జర్నలిస్టులు తదితరులు ఉన్నారు. -
బీదా.. అక్రమ మైనింగ్ కనపడదా?
నెల్లూరు (పొగతోట): సైదాపురంలో అక్రమ మైనింగ్‌పై మాజీ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్ ఆధారాలతోసహా వెల్లడిస్తే.. టీడీపీ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర ఎందుకు ఉలికి పడుతున్నాడో అర్థం కావడం లేదని జెడ్పీ మాజీ వైస్ చైర్పర్సన్, రాష్ట్ర సంగీత, నృత్య కళా అకాడమీ మాజీ చైర్పర్సన్ పొట్టేళ్ల శీరిషా ప్రశ్నించారు. జిల్లాలో అక్రమ మైనింగ్‌పై కేసులు నమోదు చేయాల్సి వస్తే.. ముందు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డితోపాటు అనేక మంది టీడీపీ నేతలపై చేసి అరెస్ట్ చేయాల్సి ఉంటుందన్నారు. సోమవారం వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. మాజీమంత్రి అనిల్‌కుమార్‌యాదవ్ మీడియా సమావేశానికి కౌంటర్‌గా ఎమ్మెల్సీ బీద రవిచంద్ర ప్రెస్‌మీట్ పెట్టి అక్రమ మైనింగ్ జరగడం లేదని చెప్పడం సిగ్గు చేటన్నారు. సైదాపురం వస్తే నీకు నిజాలు తెలుస్తాయని అంటూ బీదకు సూచించారు. ఎంపీ వేమిరెడ్డి సైదాపురంలో ఫ్యాక్టరీ నిర్మిస్తున్నారంటూ చెబుతున్నారని, ఎవరిని ఉద్దరించడానికి అని నిలదీశారు. ప్రజలను ఉద్దరించడానికే అయితే శంకుస్థాపన కూడా చేయని ఫ్యాక్టరీ కోసం పది నెలలుగా అన్ని మైన్లు ఎందుకు మూసివేశారని ప్రశ్నించారు. మైనింగ్ పనులపై ఆధారపడిన వారిని వేలాది కుటుంబాలను రోడ్డుపాల్జేయడం నిజం కాదా అని నిగ్గదీశారు. కళ్లు తెరిచి చూడయ్యా.. సైదాపురంలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై ఎమ్మెల్సీ బీదకు అవగాహన లేనట్టుందన్నారు. ఎమ్మెల్సీ అపాయింట్మెంట్ ఇస్తే ఆధారాలు చూపిస్తానని, లేదా అధికారులెవరైనా వచ్చినా మైనింగ్ జరుగుతున్న ప్రాంతాలను చూపిస్తానన్నారు. ఇక్కడ వేమిరెడ్డికి సంబంధించి లక్ష్మీ క్వార్ట్ ్జ ప్రైవేట్ లిమిటెడ్, ఫినీ కంపెనీల ద్వారా క్వార్ట్ ్జను ఆయన మనుషులు విచ్చలవిడిగా అక్రమ మైనింగ్ చేసి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారన్నారు. అనుమతులున్న మైనింగ్ కంపెనీలను మూసివేసి, అనుమతుల్లేని కంపెనీల ద్వారా వీపీఆర్ మైనింగ్ చేస్తున్నారన్నారు. అనుమతులున్న కంపెనీలు మైనింగ్ చేయాలంటే క్వార్ట్ ్జను నాకే విక్రయించాలని వీపీఆర్ కండీషన్ పెట్టారని, ఇది ఎంత వరకు సమంజసమని బీద రవిచంద్రను ఆమె ప్రశ్నించారు. ఈ విషయాలు తెలియకపోతే వచ్చి కళ్లు తెరిచి చూడాలని శీరిషా చెప్పారు. అక్రమ మైనింగ్ ఆపాలని నాలుగు నెలలుగా కలెక్టర్, మైనింగ్ డీడీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ అధికారులను కలిసి వినతి పత్రం కూడా ఇచ్చామన్నారు. అనుమతి లేని మైనింగ్ గనుల్లో జిలెటెన్ స్టిక్స్ వాడుతున్నారని డీఎస్పీకి, ఎస్సైకి ఫిర్యాదు చేసినా చర్యలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. చైనాలోనా.. సైదాపురంలోనా? వీపీఆర్ ఫ్యాక్టరీ పెడుతున్నారంటూ బీద చెబుతున్నారని, అయితే లక్ష్మీ క్వార్ట్ ్జ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ద్వారా చైనాకు 10 వేల టన్నుల క్వార్ట్ ్జను ఎగుమతి చేశారని, దీన్ని పరిశీలిస్తే కంపెనీ చైనాలో పెడుతున్నారా? అని పొట్టేళ్ల శీరిషా ప్రశ్నించారు. పద్మావతి మైనింగ్, సిద్ధి వినాయక మైనింగ్ కంపెనీలకు కూటమి ప్రభుత్వంలోనే డీఎంజీ అనుమతులు రిజెక్ట్ చేసిందన్నారు. ఈ రెండు మైన్లు 50 ఏళ్లు పూర్తయినవని, గడువు పూర్తయిన మైన్లలో వీపీఆర్ మనుషులు అక్రమ మైనింగ్ చేస్తున్నారన్నారు. ఇది అక్రమ మైనింగా? సక్రమ మైనింగా అని బీద రవిచంద్ర చెప్పాలని ప్రశ్నించారు. వేమిరెడ్డి అక్రమ మైనింగ్ వల్ల వేల కుటుంబాలు పనులు లేక రోడ్డున పడ్డాయన్నారు. పేదల ఉసురు ప్రభాకర్‌రెడ్డికి తగులుతుందన్నారు. ఈ విలేకరుల సమావేశంలో రాష్ట్ర జంగం కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ ప్రసన్న, కార్పొరేటర్లు గుంజి జయలక్ష్మి, కామాక్షిదేవి, ఆర్.జెస్సీ, ప్రమీల, సరిత తదితరులు పాల్గొన్నారు. గద్వాల్ రౌడీ మూకలతో కాపలా తెలంగాణలోని గద్వాల్ రౌడీ మూకలతో అక్రమ మైనింగ్ ప్రాంతంలో కాపలా పెట్టారని పొట్టేళ్ల శీరిషా చెప్పారు. సాయి అనే వ్యక్తి నాది తెలంగాణ, నేను నాలుగు హత్యలు చేశానని చెప్పుకుంటూ నంబర్ ప్లేటు లేని కారులో తిరుగుతూ మైనింగ్ జరిగే ప్రాంతానికి ప్రజలను, మీడియాను కూడా వెళ్లనివ్వకుండా అడ్డుకుంటున్నారన్నారు. బీద మాటమీద నమ్మకంతో మేము అక్రమ మైనింగ్ జరిగే ప్రాంతానికి వెళ్తున్నామన్నారు. అక్కడ మాకు ఏం జరిగినా ఆయనదే పూచీ అని ఎస్పీకి మీడియా ముఖంగా విన్నవిస్తున్నామన్నారు. రాజకీయ స్వార్థంతో పార్టీలు మారుతూ తెల్ల రాయిని వ్యాపారంగా మార్చుకుని రూ.కోట్లు సంపాదిస్తున్న వేమిరెడ్డి అండ్ కో నిందలు మాత్రం మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌పై వేయడం సమంజసం కాదని తెలిపారు. ఫ్యాక్టరీని చైనాలోనా, సైదాపురంలో నిర్మిస్తారా? పనుల్లేక వేల కుటుంబాలు రోడ్డు పాలు స్వార్థం కోసం పార్టీ మారి రూ.కోట్లు సంపాదిస్తున్న ఎంపీ వేమిరెడ్డి జెడ్పీ మాజీ వైస్ చైర్పర్సన్ పొట్టేళ్ల శీరిషా -
దోషులు ఎంతటివారైనా వదలొద్దు
● మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి బుచ్చిరెడ్డిపాళెం రూరల్: మండలంలోని ఇస్కపాళెం గ్రామ పంచాయతీ పరిధిలో పోలినాయుడుచెరువు ముస్లిం కాలనీకి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త షేక్ రఫీని దారుణంగా హత్య చేసిన నిందితులు ఎంతటివారైనా వదలొద్దని మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులకు రఫీ హత్యలో ప్రమేయం ఉందని అక్కడి వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారన్నారు. వారిని కూడా అరెస్ట్ చేసి విచారణ చేయాలని డిమాండ్ చేశారు. హత్యకు కారకులైన రంతుల్లా, ఖాదర్‌బాషా, ఆరిఫ్, పఠాన్ ఖాదర్‌బాషా, యాసిన్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారన్నారు. వారు ఇక్కడ స్థిరపడి హత్యలు చేయడం దారుణమన్నారు. జిల్లాలో జరిగిన హత్యలను పరిశీలిస్తే శాంతిభద్రతలు ఏ విధంగా ఉన్నాయో అర్థమవుతోందన్నారు. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఈ ఘటనపై స్పందించి నిష్పాక్షిక విచారణ జరిపించాలన్నారు. ఈ విషయాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పార్టీ పరంగా ఇంటి పెద్దను కోల్పోయిన కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. -
మీరైనా దయ చూపండి సారూ..
నెల్లూరు(క్రైమ్): ‘క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారం కావడం లేదు. మీరైనా దయ చూపండి సారూ’ అంటూ పలువురు ఎస్పీ జి.కృష్ణకాంత్‌ను కోరారు. సోమవారం నెల్లూరులోని ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి 101 మంది విచ్చేసి తమ సమస్యలను వినతుల రూపంలో ఎస్పీకి అందజేశారు. వాటిని పరిశీలించిన ఆయన చట్టపరిధిలోని వాటిని సత్వరమే పరిష్కరించాలని ఆయా ప్రాంతాల పోలీసు అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్బీ, మహిళా పోలీస్‌స్టేషన్ డీఎస్పీలు ఎ.శ్రీనివాసరావు, చెంచు రామారావు, లీగల్ అడ్వైజర్ శ్రీనివాసులురెడ్డి, ఎస్బీ – 2 ఇన్స్పెక్టర్ బి.శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫిర్యాదుల్లో కొన్ని.. ● నా తండ్రిని 2020లో శ్రీనివాసులు, మరికొందరు హత్య చేశారు. ఆ కేసు ప్రస్తుతం కోర్టులో ఉంది. నిందితులు, వారి కుటుంబ సభ్యులు రాజీపడాలని, లేకుంటే అంతు చూస్తామని బెదిరిస్తున్నారు. రక్షణ కల్పించాలని ఇందుకూరుపేటకు చెందిన ఓ వ్యక్తి కోరాడు. ● బెంగళూరుకు చెందిన ఐజాక్, నిశాంత్‌లు సోలార్ ప్రాజెక్ట్‌లను ఏర్పాటు చేస్తామని నమ్మబలికారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో నాకు తెలిసిన వారి నుంచి రూ.60 లక్షలు వసూలు చేసిచ్చాను. వారు ప్రాజెక్ట్ ఏర్పాటు చేయడం లేదు. నగదు ఇవ్వడం లేదని నెల్లూరు నగరానికి చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ● నా కుమారుడు గతనెల 12వ తేదీన అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. దీనిపై లోతైన విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నగరానికి చెందిన ఓ వ్యక్తి వినతిపత్రం ఇచ్చాడు. ● నేను, భానుప్రకాష్ ప్రేమ వివాహం చేసుకున్నాం. కులాలు వేరుకావడంతో నా కుటుంబ సభ్యులు ఇబ్బందులు పెడుతున్నారు. మాకు రక్షణ కల్పించాలని ఇందుకూరుపేట మండలానికి చెందిన ఓ యువతి కోరింది. ఎస్పీకి వినతుల అందజేత -
ఇప్పటికిప్పుడు ఖాళీ చేయమంటే ఎలా?
నెల్లూరు రూరల్: ‘నెల్లూరులోని పాత చెక్‌పోస్ట్, బర్మాషెల్ గుంట రైల్వే స్థలాల్లో నివాసం ఉన్నవారిని ఇప్పటికిప్పుడు ఖాళీ చేయమంటే ఎలా?, వారికి నెలరోజుల సమయం ఇచ్చి ఖాళీ చేయించాలి’ అని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి కోరారు. ఈ మేరకు సోమవారం ఆయన కలెక్టర్ ఆనంద్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ఆ స్థలాల్లో సుమారు 143 కుటుంబాలు నివాసం ఉంటున్నాయని తెలిపారు. ఆరో తేదీ సాయంత్రంలోగా వారిని ఖాళీ చేయాలని రైల్వే అధికారులు హెచ్చరించారని, లేకపోతే జేసీబీలతో ఇళ్లు కూల్చేస్తామని తెలిపారన్నారు. ప్రభుత్వ అధికారులు గతంలో వెంకటేశ్వరపురం, అల్లీపురంలో ఇచ్చిన ఇళ్లను తక్షణమే పూర్తి చేసి అప్పగించాలన్నారు. ఇప్పటికిప్పుడు వెళ్లమంటే వృద్ధులు, పిల్లలు చాలా ఇబ్బంది పడతారన్నారు. నెల సమయం ఇచ్చి కేటాయించిన ఇళ్లను శరవేగంగా పూర్తి చేసి బాధితులకు అప్పగించాలని కలెక్టర్ కోరారు. నెలరోజుల సమయం ఇవ్వండి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి -
ప్రభుత్వ భూమిలో కలప నరికివేత
దుత్తలూరు: మండల పరిధిలోని భైరవరం గ్రామంలో ప్రభుత్వ భూమిలో రెండు రోజులుగా అక్రమంగా కలప నరికి అమ్ముకుంటున్నారు. గ్రామస్తులు అధికారులకు తెలియజేసినా పట్టించుకోకపోవడంతో సోమవారం తహసీల్దార్ యనమల నాగరాజుకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీడీపీ నాయకుల అండతో ఓ వ్యక్తి సర్వే నంబర్ 168 – 1ఏలో కలపను నరికించి ఇతరులకు అమ్ముతున్నట్లు ఆరోపించారు. దీనిని అడ్డుకోవాలని కోరారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. వీఆర్వో మాల్యాద్రిని వివరణ కోరగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కలప నరికివేతను ఆపేస్తామని, రికార్డులు పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
జొన్నవాడ ఆలయంలో వ్యక్తి మృతి
● ఆలయం మూత బుచ్చిరెడ్డిపాళెం రూరల్: జొన్నవాడలోని మల్లికార్జున సమేత కామాక్షితాయి ఆలయంలో ఇందుకూరుపేట గంగపట్నం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి సోమవారం మృతిచెందాడు. దీంతో ఆలయాన్ని ఉదయం 11.30 గంటలకు వేద పండితులు మూసివేశారు. సాయంత్రం శుద్ధి చేసి, కొలువుల అనంతరం తెరిచారు. భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిచ్చారు. మృతుడి వయసు 45 నుంచి 50 సంవత్సరాల మధ్యలో ఉంటుందని, అనారోగ్యంతో చనిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. కూల్‌డ్రింక్ కావాలని అడిగి..● మహిళ మెడలో బంగారు గొలుసు చోరీ మనుబోలు: పట్టపగలు ఇద్దరు యువకులు ఓ మహిళ మెడలో బంగారు గొలుసు చోరీ చేసిన ఘటన మనుబోలు మండల కేంద్రంలోని పిడూరురోడ్డులో సోమవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. చెన్ను బాలకృష్ణారెడ్డి, రమణమ్మ దంపతులు పిడూరురోడ్డులోని ఇంటి ముందు చిన్న అంగడి పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. సాయంత్రం బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకులు కూల్‌డ్రింక్ కావాలని అడగడంతో రమణమ్మ అటు తిరిగి ఇచ్చే ప్రయత్నంలో ఉంది. అంతలో బైక్‌పై వెనుక కూర్చొన్న యువకుడు ఆమె మెడలోని బంగారు గొలుసును బలంగా లాగాడు. బాధితురాలు తేరుకునేలోపు వారు వేగంగా వెళ్లిపోయారు. నాలుగు సవర్ల బంగారు గొలుసు విలువ సుమారు రూ.3.50 లక్షలు ఉంటుందని బాధితురాలు తెలిపారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కండలేరులో 45.057 టీఎంసీలురాపూరు: కండలేరు జలాశయంలో సోమవారం నాటికి 45.057 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ విజయకుమార్‌రెడ్డి తెలిపారు. సత్యసాయిగంగ కాలువకు 60, పిన్నేరు కాలువకు 150, లోలెవల్ కాలువకు 50, హైలెవల్ కాలువకు 30, మొదటి బ్రాంచ్ కాలువకు 5 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.కారు డ్రైవర్ మృతిపై కేసు నమోదునెల్లూరు(క్రైమ్): కారుడ్రైవర్ మృతిచెందిన ఘటనపై నెల్లూరు వేదాయపాళెం పోలీసులు కేసు నమోదు చేశారు. వారి కథనం మేరకు.. జ్యోతినగర్‌కు చెందిన పి.మునాఫ్ (35), సర్తాజ్ దంపతులకు నాలుగేళ్ల కుమార్తె ఉంది. అతను ఎకై ్సజ్ శాఖలో ప్రైవేట్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. దంపతుల నడుమ విభేదాల నేపథ్యంలో సర్తాజ్ తన కుమార్తెతో పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి మునాఫ్ తన తమ్ముళ్ల వద్ద ఉంటున్నాడు. ఇటీవల అతను మద్యానికి బానిసయ్యాడు. ఆదివారం ఉదయం తాగాడు. మధ్యాహ్నం ఇంటికొచ్చి భోజనం చేసి మళ్లీ బయటికి వెళ్లి తాగాడు. సాయంత్రం ఏడుగంటల ప్రాంతంలో ఆటోనగర్ ఫేజ్–1లోని ఓ టింకరింగ్ షాపునకు సమీపంలో ఆటోలో మునాఫ్ పడి ఉండటాన్ని సందానీ అనే వ్యక్తి చూశాడు. వెంటనే మునాఫ్ సోదరుడు ఇమ్రాన్‌కు తెలియజేశాడు. అతను తన బంధువు ఇలియాజ్తో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని తన అన్నను చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కు తరలించాడు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందాడని నిర్ధారించారు. సోమవారం ఫిర్యాదు అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు. మునాఫ్ ఫూటుగా మద్యం తాగి ఊపిరాడక? లేదా ఇతర కారణంతో మరణించాడా? అనే వివరాలు పోస్టుమార్టంలో తెలియాల్సి ఉంది.● దగ్గు, ఆయాసం, పిల్లికూతలతో ఇబ్బంది ● జిల్లాలో 3 లక్షల మందికి పైగా రోగులు ● నేడు ప్రపంచ ఆస్తమా నివారణా దినోత్సవం -
కనీస వేతనం నిర్ణయించాలంటూ..
పెరిగిన నిత్యావసర ధరలను పరిగణనలోకి తీసుకుని కార్మికులకు కనీస వేతనం నెలకు రూ.35 వేలుగా నిర్ణయించాలని ఏఐటీయూసీ నేతలు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అధికారులకు వినతిపత్రం సమర్పించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి దామా అంకయ్య మాట్లాడుతూ కార్మికులకు కనీస వేతనాల బోర్డును ఏర్పాటు చేయాలన్నారు. కార్మిక సంఘాలతో సంప్రదింపులు జరిపి కనీస వేతనాలను తక్షణమే ప్రకటించాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో 12 నెలలకు పైగా వేతనాలు బకాయి పెట్టారని, వెంటనే విడుదల చేయాలని కోరారు. కార్మికులకు ప్రతినెలా ఒకటో తేదీన జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. పలువురు నేతలు పాల్గొన్నారు. -
సమస్యలు పరిష్కరించాలంటూ..
నెల్లూరు రూరల్: సమస్యలు పరిష్కరించాలని జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన జనం అధికారులను కోరారు. సోమవారం నెల్లూరులోని కలెక్టరేట్లో ఉన్న తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. కలెక్టర్ ఆనంద్, డీఆర్వో ఉదయభాస్కర్‌రావు, డీపీఓ శ్రీధర్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ విద్యారమ, డ్వామా పీడీ గంగా భవాని ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. మొత్తం 345 అర్జీలు అందాయి. అధికంగా రెవెన్యూ శాఖకు సంబంధించి 133, పోలీస్ శాఖవి 16, మున్సిపల్ శాఖవి 35, సర్వేవి 44, పంచాయతీరాజ్ శాఖవి 40 తదితరులున్నాయి. మామిడి చెట్లను నరికేశారు కొందరు అక్రమంగా మామిడి చెట్లను నరికివేసి దౌర్జన్యం చేసి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని రాపూరు మండలానికి చెందిన వృద్ధురాలు మాతంగి పెంచలమ్మ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. దీనిపై రెవెన్యూ అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని వాపోయారు.ప్రైవేట్ కళాశాలలపై చర్యలకు డిమాండ్ సెలవు రోజుల్లోనూ తరగతులు నిర్వహిస్తున్న కార్పొరేట్, ప్రైవేట్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలంటూ ఏఐఎస్ఎఫ్ నేతలు కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. వారు మాట్లాడుతూ ఇప్పుడే మొదటి సంవత్సరం తరగతులు నిర్వహిస్తున్నారని తెలిపారు. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. నేతలు పవన్ కిశోర్, మస్తాన్ షరీఫ్, మౌళి, సిద్ధూ, సుధీర్ తదితరులు పాల్గొన్నారు.న్యాయం చేయండి పొలంలో బోరు వేసేందుకు ఉపాఽధి హామీ ఫీల్డ్ ఆఫీసర్ గుండోలు శీనయ్య అడ్డుకుంటున్నాడని ఆత్మకూరు మండలం మహిమలూరు తూర్పు దళితవాడకు చెందిన బోయల చెన్నయ్య తెలిపారు. గత సంవత్సరం బోరు వేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. వైఎస్సార్సీపీకి ఓటు వేశారంటూ బోరు వేయకుండా అడ్డుకుంటున్నారని వాపోయారు. నీరు లేక పంట పొలాలు ఎండిపోతున్నాయని, న్యాయం చేయాలని కోరారు. కలెక్టరేట్లో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ 345 వినతుల అందజేత -
ప్రాథమిక దశలో గుర్తిస్తే..
ఆస్తమాను ప్రాథమిక దశలో గుర్తిస్తే నయం చేసుకోవచ్చు. ఆయాసం, వాతావరణం మార్పుల సమయంలో శ్వాస భారంగా తీసుకోవడం, పిల్లికూతలు లాంటి లక్షణాలు కనిపించినప్పుడు పల్మనరీ ఫంక్షనల్ టెస్ట్ (స్పిరోమెట్రీ) పరీక్షను చేయించుకుని ఊపిరితిత్తుల పనితీరు గురించి తెలుసుకోవాలి. వెంటనే తగిన చికిత్సలు తీసుకోవడం ద్వారా ఆస్తమాను అదుపులో ఉంచుకోవచ్చు. కాలుష్యానికి దూరంగా ఉండాలి. నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాపాయం జరిగే అవకాశం ఉంది. కరోనా సోకి కోలుకున్న వారిలో ఆస్తమా లక్షణాలు ఉంటున్నాయి. అలాంటి వారు తక్షణమే డాక్టర్‌ను సంప్రదించాలి. – డాక్టర్ అరుణ, పల్మనాలజీ విభాగం హెచ్ఓడీ, పెద్దాస్పత్రి