రాడార్ కేంద్రంలో మాక్‌డ్రిల్
పొదలకూరు : మండలంలోని నెల్లూరు మార్గంలో నిర్మాణంలో ఉన్న రాడార్ కేంద్రంలో బుధవారం పోలీస్, రెవెన్యూ, ఫైర్, ఆరోగ్యశాఖల అధికారులు, సిబ్బంది మాక్ డ్రిల్ నిర్వహించారు. భారత్ సైనికులు ఆపరేషన్ సింధూర పేరుతో పాక్ ఉగ్రవాద సంస్థలపై దాడులు నిర్వహించిన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా అప్రమత్తత ప్రకటించారు. ఈ నేపథ్యంలో పాక్ ప్రతీకార దాడులకు పాల్పడితే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మాక్ డ్రిల్ నిర్వహించారు. తహసీల్దార్ బి.శివకృష్ణయ్య, సీఐ ఎ.శివరామకృష్ణారెడ్డి, ఫైర్ అధికారి విజయవరకుమార్, వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
అదానీ పోర్టులో
కృష్ణపట్నం అదానీ పోర్టులో బుధవారం పోలీస్, ఫైర్, రెవెన్యూ, ఆరోగ్య, పొర్టు సెక్యూరిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక మాక్‌డ్రిల్ నిర్వహించారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో అలర్ట్ చేసేందుకు డ్రిల్ ఏర్పాటు చేశారు. పాక్ వైమానిక దాడులు నిర్వహిస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రజల అప్రమత్తతపై అవగాహన కల్పించారు.


