భూమి కోసం తప్పని పోరాటం
మర్రిపాడు మండలంలో ఓ వ్యక్తి తన తాత, ముత్తాతల కాలం నుంచి వచ్చిన వారసత్వ భూముల్లో సేద్యం చేసుకుంటున్నారు. అయితే అందులో రెండెకరాలకు సంబంధించి వేరే వారిపై పట్టాలున్నాయనే అధికారిక లెక్కల్లో తేలాయి. అయినా పరిష్కరించకుండా తహసీల్దార్ నాన్చుతున్నారు.
ఆత్మకూరు మండలం నల్లపరెడ్డిపల్లెకు చెందిన కరవళ్ల రవికి చెందిన పట్టా భూముల్లో కొంత భాగాన్ని రీ సర్వేలో నిషేధిత జాబితాలో చేర్చారు. ఈ విషయం మొదట్లో ఆయనకు తెలియదు. ఆలస్యంగా గ్రహించిన ఆయన సమస్యను పరిష్కరించాలంటూ వీఆర్వోకు అర్జీని నాలుగు నెలల క్రితం దాఖలు చేశారు. దీన్ని తహసీల్దార్‌కు పంపాలని కోరినా, నేటికీ ఒక్క అడుగు ముందుకు పడలేదు.
బోగోలు మండలం చెన్నారెడ్డిపాళెంలో ఓ మహిళా రైతుకు చెందిన పట్టా పొలంలో 18 సెంట్లు ప్రభుత్వ భూమిగా రికార్డుల్లో ఉందని వీఆర్వో పేర్కొంటున్నాడు. వాస్తవానికి అది పట్టా భూమి. అయితే వేరే వ్యక్తితో కుమ్మకై ్క వీఆర్వో అలా చెప్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఆత్మకూరు మండలం రామస్వామిపల్లెలో ఓ వ్యక్తికి చెందిన పట్టా భూమిని రీ సర్వేలో నోషనల్ ఖాతాలో వేశారు. ఇలా పలు చోట్ల రైతులకు చెందిన పట్టా భూములను అధికారులు లంచం కోసమో.. మరేదో ఆశించో రికార్డుల్లో ఇష్టారాజ్యంగా మార్చేస్తున్నారు. దీంతో రైతులకు కష్టాలు, ఆవేదనే మిగులుతోంది. ఈ ఉదంతాలపై అధికారులు ఇప్పటికై నా స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన స్పందన కార్యక్రమానికి ప్రస్తుత సర్కార్ తూట్లు పొడుస్తోంది. ఆ సమయంలో ప్రజలు అందజేసిన అర్జీలను పక్కాగా పరిష్కరించి.. దాని స్థితిగతులను ఎప్పటికప్పుడూ తెలియజేస్తూ పారదర్శకంగా వ్యవహరించేవారు. అయితే ప్రస్తుతం ఇదో ప్రహసనంలా మారిపోయింది. వాస్తవానికి కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అర్జీదారులు భారీగా హాజరై తమ సమస్యలపై వినతిపత్రాలను అందజేస్తూ కొండంత ఆశతో ఉంటున్నారు. అయితే ఈ మాట అటుంచితే వారికి ప్రదక్షిణలు తప్పడంలేదు. గ్రామ, మండల స్థాయిలో సాల్వ్ కాని అంశాలకు ఇక్కడా అదే పరిస్థితి నెలకొంటోంది. చివరికి అర్జీదారులకు భంగపాటు తప్పడంలేదు.
ఇదీ లెక్క..
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో స్పందన పేరిట కార్యక్రమాన్ని నిర్వహించేవారు. ఆ సమయంలో వీటికి పరిష్కార మార్గం పక్కాగా లభించేది. ఈ తరుణంలో గతేడాదిలో నిర్వహించిన ఎన్నికల్లో విజయం సాధించి.. కొలువుదీరిన టీడీపీ సర్కార్ దీన్ని ప్రజా సమస్యల పరిష్కార వేదికగా మార్చింది. అధికారుల లెక్కల మేరకు గతేడాది జూన్ నుంచి ఇప్పటి వరకు 24,719 అర్జీలను ప్రజలు అందజేశారు. వీటిలో 22,393 పరిష్కారమయ్యాయనే లెక్కను అధికారులు చూపి ఫైళ్లను క్లోజ్ చేశారు. అయితే వీరిలో 1764 మంది తమ సమస్యలకు పరిష్కారం లభించలేదంటూ అర్జీలను పదేపదే దాఖలు చేస్తున్నారు. మరోవైపు తమకు తెలియకుండానే సాల్వ్ చేశారంటూ ఆన్‌లైన్లో తప్పులతడకగా నమోదు చేశారంటూ ఇటీవల 121 మంది ఆరోపించారు. ఆఫ్‌లైన్లో సమర్పించిన మరో మూడు వేల అర్జీల పరిస్థితి ఏమిటో పెరుమాళ్లకే ఎరుక.
తీరు మారని అధికారులు
పీజీఆర్‌ఎస్‌కు వచ్చిన అర్జీలను సకాలంలో పరిష్కరించాలనే లక్ష్యంతో తనిఖీల నిమిత్తం ఒక గ్రామానికి నెల్లో నాలుగు సార్లు అధికారులు వెళ్లాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఇటీవల పేర్కొన్నారు. అయితే ఇదీ సత్ఫలితాలను ఇవ్వడంలేదు. మామూళ్లకు అలవాటు పడిన ఆఫీసర్లు తమ తీరును ఏ మాత్రం మార్చుకోవడంలేదు. పెత్తందారులు, రాజకీయ పలుకుబడి ఉన్న వారికి అండగా నిలుస్తూ.. బాధితులకు అన్యాయం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
సింహభాగం రెవెన్యూకు సంబంధించినవే..
కలెక్టరేట్, తహసీల్దార్, ఆర్డీఓ కార్యాలయాలకు వచ్చే అర్జీల్లో 60 శాతానికిపైగా రెవెన్యూ సంబంధిత సమస్యలే ఉంటున్నాయి. భూ కబ్జాల మొదలుకొని.. అధికారులు చేసిన రీ సర్వే తప్పులు, నిషేధిత జాబితాలోకి పట్టా భూములు.. నోషనల్ ఖాతాల్లో చేర్చడం ఇలా ఎన్నో ఉంటున్నాయి. ఆఫీసర్లు చేసిన తప్పులే ప్రజల పాలిట శాపంగా పరిణమిస్తున్నాయి.
అర్జీలను స్వీకరిస్తున్న కలెక్టర్ తదితరులు (ఫైల్)
కొన్ని ఉదాహరణలు..
అర్జీదారులకు అంతులేని ఆవేదన
సమస్యలపై మండల స్థాయిలో అర్జీలిచ్చి.. పరిష్కారం లభించక ప్రజలు విసిగివేసారిపోతున్నారు. చివరికి కలెక్టరేట్లో ఇస్తేనైనా ఆ చిక్కుముడులు వీడతాయనే ఉద్దేశం ఎంతో మందిలో నెలకొంది. కలెక్టర్, జేసీ, డీఆర్వో.. ఇలా పెద్ద సార్లు ఉంటారు.. వినతిపత్రాలను ఇస్తే సమస్యలకు చెక్ పడతాయనే భావనతో ఎన్నో వ్యయప్రయాసలకోర్చి జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో సోమవారం వస్తుంటారు. అయితే ఇక్కడే అసలు ఇక్కట్లు మొదలవుతున్నాయి. నిర్ణీత వ్యవధిలోపు వీటికి పరిష్కార మార్గాన్ని చూపాల్సి ఉండగా, ఆఫీసర్లు అలా వ్యవహరించకుండా.. బాధితులకు తెలియకుండానే అవి సాల్వ్ అయిపోయాయనే రీతిలో ఆన్‌లైన్లో నమోదు చేసి చేతులు దులుపుకొంటున్నారు. చివరికి ఏమి చేయాలో పాలుపోక కలెక్టర్ కార్యాలయం చుట్టూ ప్రజలు ప్రదక్షిణలు చేస్తూ ఒకే సమస్యపై పదేపదే విజ్ఞప్తులను సమర్పించాల్సిన దుస్థితి నెలకొంటోంది.
వెతలు పరిష్కారమవుతాయనే కొండంత ఆశతో కలెక్టరేట్‌కు ఎంతో మంది
అక్కడా తప్పని భంగపాటు
పీజీఆర్‌ఎస్‌లో అడుగడుగునా నిర్లక్ష్యమే
పట్టించుకోని అధికారులు
సాల్వ్ చేయకుండానే..
ఫైళ్లను క్లోజ్ చేస్తూ..
నెల్లూరు రూరల్ మండలం అప్పయ్యకండ్రిగకు చెందిన రామారా వు పూర్వీకులకు 781 ఎకరాల ఇనాం భూమి ఉంది. దీనికి సంబంధించి 1824లో పట్టాను మంజూరు చేశారు. అయితే 1976లో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ద్వారా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఆపై ఇందులో 235 ఎకరాలను వారికే ఇవ్వాలంటూ ఉత్తర్వులను సర్కార్ జారీ చేసింది. దీంతో పాటు చెరువులు, కుంటలకు సంబంధించి ఎందుకూ పనికిరాని భూమిని ఇచ్చింది. ఉపయోగపడేది ఇవ్వాలంటూ 2006 నుంచి అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అప్పటి తహసీల్దార్ భక్తవత్సలరెడ్డి ప్రభుత్వ ఉత్తర్వులు, రికార్డులను పరిశీలించి వీటిని ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసినా, నేటికీ అమలు కాలేదు. అధికారుల చుట్టూ ఇప్పటికీ ఆయన కాళ్లరిగేలా తిరుగుతూనే ఉన్నారు.
పరిష్కారమేదీ..?
తన భూమిని మరొకరు ఆక్రమించారంటూ పొదలకూరు మండలం మహ్మదాపురానికి చెందిన వెంకటశేషయ్య.. రెవెన్యూ అధికారుల చుట్టూ ఎంతో కాలంగా తిరుగుతున్నారు. తాతలు, తండ్రి నుంచి సంక్రమించిన గ్రామంలోని సర్వే నంబర్ 149 – 3లో వెంకటశేషయ్యకు చెందిన 15 సెంట్ల భూమిను వేరే గ్రామానికి చెందిన వ్యక్తులు ఆక్రమించారంటూ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా విజ్ఞప్తుల పరిష్కార వేదికలో వినతిపత్రాన్ని ఈ ఏడాది ఫిబ్రవరి ఐదున అందజేశారు. 1.64 ఎకరాలు కాగా, పొలం కొనుగోలు చేసిన వ్యక్తులు.. తనకు చెందిన 15 సెంట్లను ఆక్రమించారని అందులో పేర్కొన్నారు. అయినా నేటికీ ఎలాంటి పరిష్కారం లభించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
భూమి కోసం తప్పని పోరాటం
భూమి కోసం తప్పని పోరాటం


