జిల్లాలో తొలి ముఫ్తీ అబ్దుల్ వహాబ్ కన్నుమూత
నెల్లూరు రూరల్ / నెల్లూ రు (బృందావనం): నెల్లూ రు మదరసా జామియా నూరుల్ హుదా అరబిక్ కళాశాల వ్యవస్థాపక అధ్యాపకుడు, జిల్లాలో తొలి ముఫ్తీగా గుర్తింపు పొందిన మత పెద్ద హజ్రత్ మౌలానా ముఫ్తీ అబ్దుల్ వహబ్ సాహెబ్ ఖాసిమీ రషాది ఆదివారం కాలం చేశారు. బట్వాడిపాళెంలోని మదరసాలో ఆయన పార్థివదేహానికి మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కాంక్షించారు. వారి కుటుంబానికి మనోధైర్యం కల్పించాలని ప్రార్థించారు.
నేటి నుంచి
డయల్ యువర్ ఎస్‌ఈ
నెల్లూరు(వీఆర్సీసెంటర్): జిల్లాలోని విద్యుత్ వినియోగదారుల సమస్యలను తెలుసుకొని పరిష్కారమే లక్ష్యంగా డయల్ యువర్ ఎస్‌ఈ కార్యక్రమాన్ని ఇక ప్రతి సోమవారం నిర్వహించనున్నామని ఎస్పీడీసీఎల్ జిల్లా ఎస్‌ఈ రాఘవేంద్రం తెలిపారు. ఈ మేరకు నగరంలోని విద్యుత్ భవన్‌లో విలేకరులతో ఆదివారం ఆయన మాట్లాడారు. 0861 – 2320427 నంబర్‌కు ఉదయం 8.30 నుంచి 9.30లోపు ఫోన్ చేసి తమ సమస్యలను తెలియజేయాలని కోరారు.
ట్రాప్ కెమెరాల ఏర్పాటు
ఉదయగిరి: ఉదయగిరి – బండగానిపల్లి ఘాట్‌రోడ్డులో పెద్దపులి సంచరిస్తున్న నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో ట్రాప్ కెమెరాలను అటవీ అధికారులు ఏర్పాటు చేశారు. ఉదయగిరి అటవీ రేంజ్ పరిధిలోని కొత్తపల్లి, ఉదయగిరి వెస్ట్, నందిపాడు బీట్ ప్రాంతాల్లో వీటిని నెలకొల్పారు. దుత్తలూరు డీఆర్వో మురళి, ఎఫ్‌ఎస్‌ఓ చిన్న వెంకటయ్య, ఏబీఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
శ్రీవారి దర్శనానికి
12 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ ఆదివారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని 16 కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. స్వామివారిని 91,147 మంది శనివారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 29,400 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.31 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లు కలిగిన వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు. చలికి భక్తులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రూములు దొరక్క వెయిటింగ్ హాళ్లు, టీటీడీ ఏర్పాటు చేసిన షెడ్ల వద్ద నిరీక్షిస్తూ చలికి వణుకుతూ కనిపిస్తున్నారు.
జిల్లాలో తొలి ముఫ్తీ అబ్దుల్ వహాబ్ కన్నుమూత
జిల్లాలో తొలి ముఫ్తీ అబ్దుల్ వహాబ్ కన్నుమూత


