
ప్రాథమిక దశలో గుర్తిస్తే..
ఆస్తమాను ప్రాథమిక దశలో గుర్తిస్తే నయం చేసుకోవచ్చు. ఆయాసం, వాతావరణం మార్పుల సమయంలో శ్వాస భారంగా తీసుకోవడం, పిల్లికూతలు లాంటి లక్షణాలు కనిపించినప్పుడు పల్మనరీ ఫంక్షనల్ టెస్ట్ (స్పిరోమెట్రీ) పరీక్షను చేయించుకుని ఊపిరితిత్తుల పనితీరు గురించి తెలుసుకోవాలి. వెంటనే తగిన చికిత్సలు తీసుకోవడం ద్వారా ఆస్తమాను అదుపులో ఉంచుకోవచ్చు. కాలుష్యానికి దూరంగా ఉండాలి. నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాపాయం జరిగే అవకాశం ఉంది. కరోనా సోకి కోలుకున్న వారిలో ఆస్తమా లక్షణాలు ఉంటున్నాయి. అలాంటి వారు తక్షణమే డాక్టర్‌ను సంప్రదించాలి.
– డాక్టర్ అరుణ, పల్మనాలజీ విభాగం హెచ్‌ఓడీ, పెద్దాస్పత్రి