
వింజమూరులో రెండిళ్లలో చోరీ
● 30 సవర్ల బంగారం, నగదు అపహరణ
వింజమూరు(ఉదయగిరి): పట్టణంలోని గాయత్రినగర్‌లో రెండిళ్లలో చోరీ ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, బాధితుల వివరాల మేరకు.. గాయత్రినగర్‌కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు.. జొన్నవాడలో దైవదర్శనానికి వెళ్లి శనివారం ఉదయం ఇంటికొచ్చారు. ఈ క్రమంలో ఇంటి తలుపులను పగలగొట్టి ఉండటాన్ని గుర్తించారు. దేవుడి గదిలో దాచి ఉన్న 30 సవర్ల బంగారంతో పాటు బీరువాలోని రూ.13 వేలను అపహరించారనే అంశాన్ని గుర్తించారు. మద్దూరు చంద్రశేఖర్‌రెడ్డి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఇంటి పూజ గదిలో ఉన్న వెండి వస్తువులను చోరీ చేశారు. వీటి విలువ సుమారు రూ.పది వేలు ఉంటుందని బాధితుడు తెలిపారు. ఘటనలపై పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలాన్ని కలిగిరి సీఐ వెంకటనారాయణ పరిశీలించి బాధితుల నుంచి వివరాలను సేకరించారు. వేలిముద్రలను క్లూస్‌టీమ్ సేకరించింది.

వింజమూరులో రెండిళ్లలో చోరీ