
విద్యుత్ తీగలపై పడి నెమలికి గాయాలు
కందుకూరు రూరల్: మండలంలోని కొండికందుకూరు పంచాయతీలో రెండు నెమళ్లు పది రోజులుగా తిరుగుతున్నాయి. పంచాయతీలోని గౌతమ్‌నగర్‌లోకి వచ్చిన ఇవి అలా తిరుగుతూ బీసీ కాలనీలోకి వెళ్లాయి. ఇళ్లు, చెట్లపై తిరుగుతూ కిందికి దిగే క్రమంలో విద్యుత్ తీగలపై శనివారం పడింది దీంతో నెమలి గాయపడింది. గ్రామస్తులు ప్రాథమిక చికిత్స చేసి, గాయాలైన చోట పసుపు పూశారు. దీనిపై అటవీ శాఖ అధికారులకు సర్పంచ్ కుమ్మర బ్రహ్మయ్య సమాచారమిచ్చారు. కాగా మేము వదిలితే అడవిలోనే వదిలేస్తాం.. నెమళ్లను మీరూ వదిలేయండి.. వాటిపాటికి అవి వెళ్లిపోతాయని అటవీశాఖాధికారి సురేష్ సమాధానమిచ్చారు. వీటిని కాపాడాలని సర్పంచ్ కోరారు.