
పోలీసుల పిల్లలకు కార్పొరేట్ విద్య
నెల్లూరు(క్రైమ్): పదో తరగతిలో ఉతీర్ణులైన పోలీసుల పిల్లలకు ఉచిత, రాయితీతో కూడిన కార్పొరేట్ విద్యను అందించేందుకు కళాశాలల యాజమాన్యాలు సహకరించాలని ఎస్పీ కృష్ణకాంత్ కోరారు. నగరంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో గల మినీ కాన్ఫరెన్స్ హాల్లో కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలతో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో మాదిరిగానే పోలీసుల పిల్లలకు వీలైనంత ఉచిత, రాయితీ సీట్లను కేటాయించాలని కోరారు. దీనికి అంగీకరించిన 11 కళాశాలల యాజమాన్యాలకు కృతజ్ఞతలను తెలియజేశారు. కళాశాలల్లో విద్యార్థులకు విద్యను బోధించడమే కాకుండా ఈవ్‌టీజింగ్, మత్తుపదార్ధాల వినియోగంతో సంభవించే దుష్పరిణామాలు, చట్టాలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. ఏఎస్పీ సౌజన్య, ఎస్బీ – 1 ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వరరావు, వెల్ఫేర్ ఆర్‌ఐ రాజారావు, పోలీస్ అధికారుల సంఘ జిల్లా అధ్యక్షుడు మద్దిపాటి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.