
చైన్ స్నాచర్ల అరెస్ట్
14 సవర్ల ఆభరణాల స్వాధీనం
నిందితులను తమదైన శైలిలో పోలీసులు విచారించగా, గూడూరు – 2 టౌన్‌లో నమోదైన ఓ కేసులో బంగారు చైన్, డాలర్.. మరో కేసులో బంగారు చైన్.. గూడూరు రూరల్‌లో నమోదైన కేసులో బంగారు చైన్, తాళిబొట్టు, ఒక కాసు, రెండు గుండ్లను చోరీ చేశారనే విషయం తేలింది. మొత్తం నాలుగు చోరీల్లో 14 సవర్ల బంగారు ఆభరణాలను వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించడంలో చొరవ చూపిన సీఐ, ఎస్సైతో పాటు ఏఎస్సై వెంకటేష్, సిబ్బంది మణి, ఖాజాహుస్సేన్, సురేష్, ముకేష్, మాధవరావు, రమేష్, శివకు రివార్డులను ప్రకటించారు.
మనుబోలు: చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన కేసులో నలుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక పోలీస్‌స్టేషన్లో శనివారం నిర్వహించిన సమావేశంలో నిందితుల వివరాలను ఎస్సై శివరాకేష్ వెల్లడించారు. గూడూరులోని నర్సింగరావుపేటకు చెందిన మంగాపురం హేమంత్, మాళవ్యనగర్‌కు చెందిన కంకి శ్రీహరి, జానకిరామ్‌పేటకు చెందిన దువ్వూరు మహేష్, సైదాపురం మండలం చాగణానికి చెందిన రాగిపాటి శివమణి చెడు వ్యసనాలకు బానిసలయ్యారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో దొంగతనాలకు తెరలేపారు. ఈ క్రమంలో బైక్‌పై ఈ నెల ఐదున వెళ్తూ, పిడూరు రోడ్డులో అంగడి నిర్వహిస్తున్న చెన్ను రమణమ్మ ఒంటరిగా ఉండటాన్ని గమనించారు. దగ్గరికి వెళ్లి థమ్సప్ కావాలని అడిగారు. దీన్ని ఇచ్చేందుకు ఫ్రిజ్‌ను ఆమె ఓపెన్ చేస్తుండగా మెడలోని బంగారు గొలుసు, పగడాల దండను లాక్కొని పరారయ్యారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం వెతకసాగారు. ఈ క్రమంలో వీరంపల్లి క్రాస్‌రోడ్డు వద్ద వీరిని చూసి నిందితులు పరారయ్యేందుకు యత్నిస్తుండగా, పొదలకూరు సీఐ శివరామకృష్ణారెడ్డి, ఎస్సై, సిబ్బందితో కలిసి పట్టుకొని అరెస్ట్ చేశారు.

చైన్ స్నాచర్ల అరెస్ట్