
ప్రయోగశాలకు గుర్తింపు
నెల్లూరు(పొగతోట): నెల్లూరు ఆర్డీఓ కార్యాలయం ఆవరణలో ఉన్న ఎరువులు, సేంద్రియ ఎరువుల నాణ్యత నిర్ధారణ ప్రయోగశాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. రైతులకు ఎరువుల నాణ్యత, నేల సారవంతంపై మెరుగైన సలహాలు, సూచనలు అందించినందుకు నేషనల్ బోర్డు ఫర్ అక్రిడిటేషన్ ఆఫ్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లాబొరేటరీస్ గుర్తింపు దక్కింది. రాష్ట్రంలోనే మొదటిసారిగా నెల్లూరు అగ్రికల్చర్ ల్యాబ్‌కు జాతీయ స్థాయి గుర్తింపు రావడంతో వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు, సిబ్బందికి జిల్లా కలెక్టర్ ఆనంద్ అభినందించారు.