
రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభం
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి ఇండోర్ స్టేడియంలో యూనెక్స్ సన్‌రైజ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్యాడ్మింటన్ అండర్ – 15 పోటీలను శుక్రవారం ప్రారంభించారు. నారాయణ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ ఎండీ వేమిరెడ్డి భాస్కర్‌రెడ్డి, టీడీపీ నాయకుడు కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి, చౌదరి జ్యూవెలర్స్ ఎండీ రాజేష్ చౌదరి, 27వ డివిజన్ కార్పొరేటర్ మురహరి అతిథులుగా హాజరయ్యారు. రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు ముక్కాల ద్వారకానాథ్, జాయింట్ సెక్రటరీ డాక్టర్ పి.అంకమ్మ చౌదరి మాట్లాడుతూ 238 మంది క్రీడాకారులు పోటీ పడుతున్నారని తెలిపారు. ప్రతిభ చూపిన వారిని జాతీయ స్థాయికి ఎంపికవుతారన్నారు. కార్యక్రమంలో అసోసియేన్ జాయింట్ సెక్రటరీ మద్దిపాటి ప్రసాద్‌రావు, ట్రెజరర్ గాధంశెట్టి శ్రీకాంత్, కోచ్‌లు, అంపైర్లు పాల్గొన్నారు.