
నేటి నుంచి రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్ పోటీలు
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): రాష్ట్ర ఫుట్‌బాల్ క్రీడా సంఘం ఆదేశాల ప్రకారం రాష్ట్రస్థాయి సీనియర్ మహిళా ఫుట్‌బాల్ టోర్నమెంట్‌ను శనివారం నుంచి రెండురోజులపాటు నిర్వహిస్తున్నట్లు జిల్లా అసోసియేషన్ కార్యదర్శి చంద్రశేఖర్ శుక్రవారం తెలిపారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఏసీ సుబ్బారెడ్డి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు. ప్రతిభ చూపిన వారిని జాతీయ స్థాయి జట్టుకు ఎంపిక చేస్తామన్నారు. శనివారం ఉదయం ప్రారంభోత్సవం, ఆదివారం సాయంత్రం బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా క్రీడాకారులతోపాటు అధికారులు, అంపైర్లు హాజరవుతారని తెలిపారు.
కావలిలో
చైన్నె వాసి మృతి
కావలి(జలదంకి): చైన్నెకు చెందిన కమలనాథన్ అనే వ్యక్తి కావలి మండలం మద్దూరుపాడులో చనిపోయాడు. కావలి రూరల్ పోలీసుల కథనం మేరకు.. కమలనాథన్‌కు మతిస్థిమితం లేదు. కొంతకాలంగా మద్దూరుపాడు సమీపంలో ఉంటున్నాడు. ఎవరైనా ఆహారం అందిస్తే తింటూ జీవిస్తున్నాడు. శుక్రవారం ఉదయం ఎన్‌హెచ్ – 16 పక్కన సర్వీసు రోడ్డులో పెట్రోల్ బంకు ముందు చనిపోయి ఉన్నాడు. మృతుడికి సుమారు 40 సంవత్సరాల వయసు ఉంటుందని భావిస్తున్నారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా వారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రైల్లోంచి పడి..
● గుర్తుతెలియని వ్యక్తి మృత్యువాత
కొడవలూరు: రైల్లోంచి పడి గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన ఘటన కొడవలూరు – పడుగుపాడు రైల్వేస్టేషన్ల మధ్య శుక్రవారం చోటుచేసుకుంది. రైల్వే ఎస్సై కె.వెంకటేశ్వరరావు కథనం మేరకు.. ఓ వ్యక్తి హౌరా నుంచి బెంగళూరు వెళ్తున్న రైల్లో నుంచి 184 – 3 – 5 పోస్టుల మధ్య ఎగువ లైన్ వద్ద ప్రమాదవశాత్తు జారి పడి చనిపోయాడని భావిస్తున్నారు. అతని వయసు 60 నుంచి 65 సంవత్సరాల మధ్య ఉంటుందని చెబుతున్నారు. ఎరుపు రంగు టీషర్టు, నలుపు, తెలుపు రంగుల డిజైన్ కలిగిన షార్ట్ ధరించి ఉన్నాడు.

నేటి నుంచి రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్ పోటీలు