
మధుసూదన్ కుటుంబసభ్యులకు కేంద్ర మంత్రి పరామర్శ
కావలి (జలదంకి): పహల్గాం ఉగ్ర దాడిలో మృతి చెందిన కావలికి చెందిన మధుసూదన్‌రావు కుటుంబసభ్యులను కేంద్ర భారీ ఉక్కు పరిశ్రమల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్‌వర్మ శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మధుసూదన్‌రావు భార్య కామాక్షి ప్రసన్న, పిల్లలతో మాట్లాడి వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రభుత్వం వారి కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కావలి బీజేపీ నేతలు పాల్గొన్నారు.
రుణాల రికవరీలు
వందశాతం సాధించాలి
● డీఆర్‌డీఏ పీడీ నాగరాజకుమారి
నెల్లూరు (పొగతోట): బ్యాంకు లింకేజీ రుణాలు, సీ్త్ర నిధి రుణాలకు సంబంధించి వంద శాతం రికవరీలు సాధించాలని డీఆర్‌డీఏ పీడీ నాగరాజకుమారి డీపీఎం, ఏసీలు, ఏపీఎంలను ఆదేశించారు. డీఆర్‌డీఏ సమావేశ మందిరంలో డీపీఎంలు, ఏసీలు, ఏపీఎంలతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి యాన్యువల్ క్రెడిట్ లైవ్‌లీహుడ్ ప్లాన్ నుంచి మైక్రో క్రెడిట్ ప్లాన్‌ను సిద్ధం చేయాలని సూచించారు. దీనికి సంబంధించి బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి, ఉన్నతి, సీఐఎఫ్ తదితర విభాగాల నుంచి స్వయం సహాయక మహిళలకు ఆర్థిక సహకారం అందించి వారిని వ్యాపారవేత్తలుగా తయారు చేయాలన్నారు. జూన్ 8వ తేదీ లోపు వెయ్యి మంది మహిళలను గుర్తించి వారికి ఉపాధి కల్పించాలన్నారు. వందశాతం మొబైల్ బుక్ కీపింగ్ చేయాలన్నారు. సీఐఎఫ్ నిధులను సక్రమంగా ఉపయోగపడేలా చర్యలు చేపట్టాలన్నారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.177 కోట్లు సీ్త్ర నిధి రుణాలు మంజూరుచేసి వంద శాతం లక్ష్యాన్ని సాధించడం జరిగిందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.300 కోట్ల రుణాలు అందించేలా చర్యలు చేపట్టాలన్నారు. పీఎం సూర్యఘర్ పథకానికి సంబంధించి సోలార్ పలకలను మండలాలకు కేటాయించి ఏపీఎంలు లక్ష్యాలను చేరుకోవాలన్నారు. ఈ సమావేశంలో డీపీఎంలు, ఏసీలు, ఏపీఎంలు, ఐటీడీఏ ఏపీఓ, బ్యాంకు అధికారులు సీ్త్ర నిధి ఏజీఎం కామాక్షయ్య పాల్గొన్నారు.

మధుసూదన్ కుటుంబసభ్యులకు కేంద్ర మంత్రి పరామర్శ