
దళిత విద్యార్థి జేమ్స్‌కు ఎమ్మెల్సీ పరామర్శ
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): నెల్లూరులోని షైన్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న దళిత విద్యార్థి జేమ్స్‌ను వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఆదివారం రాత్రి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ జేమ్స్‌పై దాడి ఘటన విషయాన్ని తెలుసుకున్న జగన్‌మోహన్‌రెడ్డి వెంటనే పరామర్శించి మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశించడంతో వైద్యులతో మాట్లాడినట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇలాంటి దాడులు విచ్చలవిడిగా జరుగుతున్నాయన్నారు. ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కూటమి ప్రభుత్వానికి ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు.