బోలెడు | - | Sakshi
Sakshi News home page

బోలెడు

May 19 2025 11:52 PM | Updated on May 19 2025 11:52 PM

బోలెడ

బోలెడు

సమస్యలు
వినతులు

నెల్లూరులో

‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక

385 వినతుల అందజేత

హామీలు నెరవేర్చాలంటూ సీపీఐ ధర్నా

ఆదుకోవాలని కేబుల్‌ ఆపరేటర్ల వినతి

నెల్లూరు రూరల్‌: నెల్లూరులోని కలెక్టరేట్‌లో జరుగుతున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వినతులు వెల్లువలా వస్తున్నాయి. సోమవారం తిక్కన ప్రాంగణంలో కలెక్టర్‌ ఆనంద్‌, జేసీ కె.కార్తీక్‌, జిల్లా రెవెన్యూ అధికారి ఉదయభాస్కర్‌రావు, డీపీఓ శ్రీధర్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ విద్యారమ సమస్యలు తెలుసుకున్నారు. వారికి 385 వినతులందాయి. వాటిలో రెవెన్యూ శాఖవి 170, మున్సిపల్‌ శాఖవి 30, సర్వేవి 32, పంచాయతీరాజ్‌వి 23, పోలీస్‌ శాఖవి 49, సివిల్‌ సప్లయ్స్‌వి 17 తదితర శాఖలవి ఉన్నాయి. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వివిధ సమస్యలపై ప్రజలందించిన అర్జీల విషయంలో జాప్యం లేకుండా వెంటనే పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

భూ ఆక్రమణపై..

సీతారామపురం మండలం దేవిశెట్టిపల్లి గ్రామ సర్వే నంబర్‌ 86–3లో 2.86 ఎకరాలను నాగరాజుపల్లి, దేవిశెట్టిపల్లి గ్రామాలకు సంబంఽధించి పశువులు, గొర్రెలు మేపుకొనేందుకు వినియోగిస్తారని, అయితే మారంపల్లి గ్రామానికి చెందిన ఇర్ల నాగయ్య అనే వ్యక్తి ఆ భూమిని ఆక్రమించాడని దేవిశెట్టిపల్లి గ్రామ సర్పంచ్‌ రేనాటి మహేశ్వరి వినతిపత్రం సమర్పించారు. ఆమె మాట్లాడుతూ మండల అఽధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదని, అతను నకిలీ పాస్‌ పుస్తకాలు, ధ్రువీకరణపత్రాలతో అక్రమంగా కరెంట్‌ సర్వీస్‌ కూడా పొందినట్లు తెలిపారు. తాము హైకోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు. ఉన్నతాధికారులు స్పందించాలని కోరారు.

పంచాయతీ కార్యదర్శిపై ఫిర్యాదు

గ్రామ కార్యదర్శి మల్లికార్జున అగౌరవపరుస్తున్నాడని సంగం మండలం అన్నారెడ్డిపాళెం సర్పంచ్‌ మోడేగుంట శేషమ్మ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఆమె మాట్లాడుతూ తాను ఎస్సీనని, 8 నెలలుగా ఏ తీర్మానం చేయకుండా అడ్డుకుంటున్నాడని తెలిపారు. చేసిన పనులకు ఎం బుక్‌లిచ్చినా బిల్లుల చెల్లింపులు చేయడం లేదన్నారు. ఇంటి పన్ను వసూళ్లను తనకు తెలియకుండా చేస్తున్నాడన్నారు. పంచాయతీలో అక్రమాలకు పాల్పడుతున్నాడని అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

హామీలు నెరవేర్చాలని డిమాండ్‌

కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలు నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తూ కలెక్టరేట్‌ ఎదుట సీపీఐ నాయకులు ధర్నా నిర్వహించారు. ఆ పార్టీ నగర సహాయ కార్యదర్శి సయ్యద్‌ సిరాజ్‌, జిల్లా కార్యవర్గ సభ్యుడు షాన్‌వాజ్‌ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు, పట్టణ, నగరవాసులకు రెండు సెంట్లు ఇస్తామని, అదే విధంగా ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలిస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు అర్హులకు ఎక్కడా భూములిచ్చిన దాఖలాల్లేవన్నారు. నిబంధనలు పెట్టకుండా గత ప్రభుత్వం ఎలాగైతే రేషన్‌కార్డులు మంజూరు చేసిందో అదే విధంగా ఇప్పుడు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు ముక్తియార్‌, వి.రామరాజు, యామాల మధు, సుబ్బరాయుడు, శీరిష, లత పాల్గొన్నారు.

పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలి

పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని ఆంధ్రప్రదేశ్‌ కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. ఉద్యోగులపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలన్నారు. డీఏ బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. నాయకులు పఠాన్‌ బాజీ, కరిమి రాజేశ్వరరావు, చీర్ల కిరణ్‌కుమార్‌, హుస్సేన్‌, ధనరాజ్‌, పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.

కేబుల్‌ ఆపరేటర్లను ఆదుకోవాలంటూ..

ఫైబర్‌ నెట్‌ సంస్థ నిర్వహణ లోపం కారణంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ మల్టీ సర్వీసెస్‌ కేబుల్‌ ఆపరేటర్ల సంక్షేమ సంఘం నేతలు చెప్పారు. కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్రాధ్యక్షుడు వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ ఏడునెలల నుంచి సిగ్నల్స్‌ అంతరాయంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామన్నారు. వినియోగదారులు తగ్గడంతో ఆర్థికంగా నష్టపోయి తీవ్ర ఒత్తిడికి గురవుతున్నామని తెలిపారు. టెక్నికల్‌ సిబ్బందిని తొలగించడం, ఇతరులను నియమించకపోవడం కేబుల్‌ ఆపరేటర్ల మెడపై కత్తిని వేలాడదీసినట్లే భావించాల్సి ఉంటుందన్నారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారానికి చొరవ చూపలేదన్నారు.

బోలెడు1
1/3

బోలెడు

బోలెడు2
2/3

బోలెడు

బోలెడు3
3/3

బోలెడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement