కనుల పండువగా శ్రీవారి కల్యాణం
● భక్తులతో కిక్కిరిసిన పెంచలకోన
రాపూరు: మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పెంచలకోన శనివారం భక్తులతో కిక్కిరిసింది, బ్రహ్మోత్సవాల అనంతరం వచ్చే మొదటి శనివారం కావడంతో రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు పెనుశిల లక్ష్మీనరసింహాస్వామి, ఆదిలక్ష్మీదేవి, ఆంజనేయస్వామిని దర్శించుకుని మొక్కలు తీర్చుకున్నారు. ఉదయం 4 గంటలకు అభిషేకం, 5 గంటలకు సుప్రభాతం, 6 గంటల పూలంగి సేవ నిర్వహించారు. 10 గంటలకు స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను నిత్యకల్యాణ మండపంలో కొలువు దీర్చి వివిధ రకాల ఆభరణాలు, పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి వేద పండితుల మంత్రోచ్ఛరణలతో కల్యాణం శాస్త్రోక్తంగా చేపట్టారు. రాత్రి 7 గంటలకు ఊంజల్ సేవ నిర్వహించారు. స్వామి అమ్మవార్లను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
మైనింగ్ కేసులో
విచారణకు హాజరు
నెల్లూరు (క్రైమ్): రుస్తుం మైనింగ్ కేసులో విచారణ నిమిత్తం వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మందల వెంకటశేషయ్య, విరువూరు నేత బచ్చల సురేష్‌కుమార్‌రెడ్డి శనివారం నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో హాజరయ్యారు. డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు అందుబాటులో లేకపోవడంతో ఆయన వచ్చిన తర్వాత మరోమారు పిలుస్తామని కార్యాలయ సిబ్బంది వెంకట శేషయ్య, సురేష్‌కుమార్‌రెడ్డిలకు తెలియజేయడంతో వారు వెనుదిరిగారు.
ఉరుములు
మెరుపులతో వర్షం
ఉదయగిరి రూరల్: ఉదయగిరితోపాటు మండలంలోని పలు గ్రామాల్లో శనివారం సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రతకు ప్రజలు తల్లడిల్లిపోయారు. ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులు గాలులతో కూడిన వర్షం పడింది. దీంతో వాతావరణం చల్లబడింది. మేఘాలు ఉదయగిరి దుర్గాన్ని కమ్మేశాయి. ఆ దృశ్యాన్ని పలువు రు ఆస్వాదించారు. రోడ్లపై వర్షపు నీరు మురుగునీరు ఏకమై ప్రవహించడంతో వాహన చోదకులు, పాదచారులు ఇబ్బందులు పడ్డారు.
కూటమి ప్రభుత్వానికి
మా బాధలు పట్టవా?
నెల్లూరు (అర్బన్): ఇరవై రోజులుగా సమ్మె చేస్తూ తమ సమస్యలు తీర్చాలని వేడుకుంటున్నా.. కూటమి ప్రభుత్వం తమ బాధలు పట్టించుకోకపోవడం దారుణమని సీహెచ్‌ఓల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు భానుమహేష్ ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక డీఎంహెచ్‌ఓ కార్యాలయం వద్ద నిరసన దీక్షల్లో శనివారం ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఉద్యోగులను నెత్తిన పెట్టుకుంటామని మాట్లాడిన అధికార పార్టీ నాయకులు అధికారంలోకి వచ్చాక కనీసం తమ బాధలు చెప్పుకునేందుకు కూడా అవకాశం ఇవ్వడం లేదని ఆవేదన చెందారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి తమ న్యాయమైన డిమాండ్లు తీర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం కో ఆర్డినేటర్ ఆదిల్, కార్యదర్శి రుబికా, చంద్రకళ, స్వాతి, అనుపమ తదితరులు పాల్గొన్నారు.
కనుల పండువగా శ్రీవారి కల్యాణం


