
గొంతు నొక్కే యత్నం తగదు
ఉదయగిరి: పత్రికల గొంతు నొక్కే యత్నం ప్రభుత్వాలకు తగదని పలువురు జర్నలిస్టులు పేర్కొన్నారు. సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డి ఇంట్లోకి పోలీసులు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ప్రవేశించి సోదాలు జరపడం, కుటుంబసభ్యులను భ్రయభ్రాంతులకు గురిచేయడాన్ని నిరసిస్తూ వింజమూరులో జర్నలిస్ట్ సంఘ నేతలు నల్లబ్యాడ్జీలను ధరించి నిరసన తెలిపారు. అనంతరం ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డికి వినతిపత్రాన్ని అందజేశారు. పత్రికలపై దాడి ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అంటూ నినాదాలు చేశారు. జర్నలిస్టులు మేడగం భాస్కర్‌రెడ్డి, సాదం నరసింహలు, గువ్వల రవీంద్రరెడ్డి, అంకినపల్లి జయరామిరెడ్డి, మాధవ, చరణ్, లెక్కమనేని రాజేష్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.