
ఇప్పటికిప్పుడు ఖాళీ చేయమంటే ఎలా?
నెల్లూరు రూరల్: ‘నెల్లూరులోని పాత చెక్‌పోస్ట్, బర్మాషెల్ గుంట రైల్వే స్థలాల్లో నివాసం ఉన్నవారిని ఇప్పటికిప్పుడు ఖాళీ చేయమంటే ఎలా?, వారికి నెలరోజుల సమయం ఇచ్చి ఖాళీ చేయించాలి’ అని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి కోరారు. ఈ మేరకు సోమవారం ఆయన కలెక్టర్ ఆనంద్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ఆ స్థలాల్లో సుమారు 143 కుటుంబాలు నివాసం ఉంటున్నాయని తెలిపారు. ఆరో తేదీ సాయంత్రంలోగా వారిని ఖాళీ చేయాలని రైల్వే అధికారులు హెచ్చరించారని, లేకపోతే జేసీబీలతో ఇళ్లు కూల్చేస్తామని తెలిపారన్నారు. ప్రభుత్వ అధికారులు గతంలో వెంకటేశ్వరపురం, అల్లీపురంలో ఇచ్చిన ఇళ్లను తక్షణమే పూర్తి చేసి అప్పగించాలన్నారు. ఇప్పటికిప్పుడు వెళ్లమంటే వృద్ధులు, పిల్లలు చాలా ఇబ్బంది పడతారన్నారు. నెల సమయం ఇచ్చి కేటాయించిన ఇళ్లను శరవేగంగా పూర్తి చేసి బాధితులకు అప్పగించాలని కలెక్టర్ కోరారు.
నెలరోజుల సమయం ఇవ్వండి
ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి