షుగర్ ఫ్యాక్టరీ స్థానంలో ఎంఎస్‌ఎంఈ పార్క్
● మంత్రి పొంగూరు నారాయణ
నెల్లూరు సిటీ: కోవూరు షుగర్ ఫ్యాక్టరీ స్థానంలో ఎంఎస్‌ఎంఈ పార్కు ఏర్పాటు కాబోతోందని, దీంతో వేలమందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు రూరల్ పరిధిలోని కనుపర్తిపాడులో ఉన్న వీపీఆర్ కన్వెన్షన్ హాల్లో శుక్రవారం టీడీపీ జిల్లా మహానాడు జరిగింది. నారాయణ మాట్లాడుతూ గత ప్రభుత్వం భారీగా అప్పు మిగిల్చి వెళ్లిందన్నారు. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం అమలు చేస్తామన్నారు. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ పాత, కొత్త నాయకులు కలిసి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్క కార్యకర్త క్రమశిక్షణ పాటించాలన్నారు. కార్యక్రమంలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.


