
చట్టాలపై అవగాహన కల్పించడమే లక్ష్యం
బుచ్చిరెడ్డిపాళెం రూరల్: గ్రామాల్లో న్యాయ విజ్ఞాన సదస్సులను నిర్వహించి చట్టాలపై అవగాహన కల్పిం చడమే లక్ష్యమని సీనియర్ సివిల్ జడ్జి వాణి పేర్కొన్నారు. మండలంలోని పంచేడులో శుక్రవారం నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన ఆమె మాట్లాడారు. న్యాయ సమస్యల పరిష్కారం కోసం 15100 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. మహిళల హక్కులు, బాల్య వివాహాలు, బాల కార్మికుల చట్టాలపై అవగాహన కల్పించారు. అనంతరం స్థానికుల నుంచి అర్జీలను స్వీకరించారు. సమస్యలను పరిష్కరించేలా సంబంధిత అధికారులను ఆదేశిస్తామని తెలిపారు. జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ సభ్యుడు సుబ్బారెడ్డి, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ శ్రీహరి, ఎస్సై సంతోష్‌రెడ్డి, ఏపీఎం శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.