
‘వెరిటాస్’కు ప్రభుత్వ అనుమతి
తిరుపతి కల్చరల్: తిరుపతిలో 22 ఏళ్లుగా బీఎస్సార్ విద్యాసంస్థల ద్వారా విద్యార్థులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తూ.. వారి ఉన్నతి, దేశ రక్షణకు అందిస్తున్న సేవలను గుర్తించి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సైనిక్ స్కూల్ అనుమతి పొందామని వెరిటాస్ సైనిక్ స్కూల్ చైర్మన్ డాక్టర్ శేషారెడ్డి తెలిపారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో శనివారం ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ గుర్తింపుతో దేశ భద్రత కోసం వెరిటాస్ సైనిక్ స్కూల్ ముందడుగేస్తోందని చెప్పారు. రానున్న రోజుల్లో ప్రభుత్వ సైనిక్ స్కూల్ అనుసంధానంతో కరికులమ్, యాక్టివిటీస్, కాంపిటీషన్స్ తదితరాలను నిబంధనలకు అనుగుణంగా నిర్వహించనున్నామని వివరించారు. ఆలిండియా సైనిక్ స్కూల్ ఎంట్రెన్స్ పరీక్షల ద్వారా కౌన్సెలింగ్‌ను నిర్వహించి సీట్లను కేటాయించనున్నామని వెల్లడించారు. స్కూల్ డైరెక్టర్లు శ్రీకర్‌రెడ్డి, సందీప్‌రెడ్డి పాల్గొన్నారు.