భక్తుల కొంగు బంగారం.. కామాక్షితాయి
బుచ్చిరెడ్డిపాళెం రూరల్: మండలంలోని జొన్నవాడలో ఉన్న మల్లికార్జున సమేత కామాక్షితాయి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 17 నుంచి 27వ తేదీ వరకు జరుగనున్నాయి. 17న శనివారం అంకురార్పణతో మొదలవుతాయి. 18న జరిగే ధ్వజారోహణ పూజల్లో సంతానప్రాప్తి కోసం మహిళలకు ప్రసాదం (కొడిముద్ద) అందజేస్తారు. సాయంత్రం వివిధ పూజలు, శేష వాహనసేవ, 20న పురుషామృగ వాహనసేవ, 21న సింహ వాహనసేవ, 22న హంస వాహనసేవ, 23న రావణసేవ, 24న వెండి నందిసేవ, 25న రథోత్సవం, సాయంత్రం పెనుబల్లి గ్రామంలో గజసింహవాహన సేవలు జరుగుతాయి. 26న ఉదయం కల్యాణోత్సవం, సాయంత్రం తెప్సోత్సవం, 27న ఉదయం ధ్వజావరోహణ, అలకలతోపు, రాత్రి 8 గంటలకు అశ్వవాహనసేవ, రాత్రి 10 గంటలకు ఏకాంతసేవ, పుష్పాలంకరణతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని ఈఓ అర్వభూమి వెంకట శ్రీనివాసులురెడ్డి తెలిపారు.
రేపట్నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు


