లాహిరి.. లాహిరి.. లాహిరిలో
● నేత్రపర్వంగా
మూలస్థానేశ్వరుని తెప్పోత్సవం
నెల్లూరు(బృందావనం): ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని నగరంలోని భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వరస్వామి, గణపతి, గంగామాతకు తెప్పో త్సవాన్ని మూలాపేటలోని పుష్కరిణిలో మంగళవారం రాత్రి నిర్వహించారు. తొలుత దేవస్థానం నుంచి విశేషాలంకారంలో కొలువై పుష్కరిణి వద్దకు వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, బాణసంచా వెలుగుల నడుమ తరలివచ్చారు. ఈఓ అర్వభూమి వెంకటశ్రీనివాసులురెడ్డి పర్యవేక్షించారు.


