వినతులిచ్చి.. గోడు వినిపించి..
● కలెక్టరేట్‌లో
‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’
నెల్లూరు(దర్గామిట్ట): జిల్లా నలుమూలల ప్రజలు పెద్ద సంఖ్యలో విచ్చేసి అధికారులకు సమస్యలు చెప్పుకొన్నారు. సోమవారం నెల్లూరు కలెక్టరేట్‌లో ని తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కా రం వేదిక కార్యక్రమం జరిగింది. దీనికి జేసీ వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు అర్జీలు స్వీకరించారు.
క్వారీ బ్లాస్టింగ్‌తో ఇక్కట్లు
బుచ్చిరెడ్డిపాళెం మండలం రామచంద్రాపురం సమీపంలోని కంకర క్వారీ వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు వినతిపత్రం సమర్పించారు. వారు మాట్లాడుతూ క్వారీలో అధిక సైజులో బ్లాస్టింగ్ చేయడంతో కాలుష్యం పెరిగిపోతుందన్నారు. సమీపంలో బాలికల గురుకుల పాఠశాల ఉందని, క్వారీ అనుమతులు రద్దు చేయాలని తెలిపారు. వినతిపత్రం సమర్పించిన వారిలో బి.మల్లికార్జున, పి.సుమన్, రవి, గోపీ, కాలేషా ఉన్నారు.
వినతులిచ్చి.. గోడు వినిపించి..


