తైక్వాండో పోటీల్లో క్రీడాకారుల ప్రతిభ
కందుకూరు రూరల్: విజయవాడలోని మేరీస్ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో ఈనెల 27 నుంచి 29వ తేదీ వరకు నిర్వహించిన 40వ జాతీయ స్థాయి తైక్వాండో పోటీల్లో కందుకూరుకు చెందిన క్రీడాకారులు ప్రతిభ చాటారు. 10 రాష్ట్రాలకు చెందిన వారు పాల్గొనగా ఓవరాల్ చాంపియన్‌గా ఆంధ్రప్రదేశ్, రెండో స్థానంలో ఉత్తరప్రదేశ్, మూడో స్థానంలో పశ్చిమ బెంగాల్ నిలిచాయి. ఈ పోటీల్లో కందుకూరు నుంచి ఎనిమిది మంది క్రీడాకారులు పాల్గొనగా వారిలో ఐదుగురికి బంగారు పతకాలు, ఇద్దరికి రజతం, ఒకరికి కాంస్య పతకం దక్కాయని తైక్వాండో కోచ్ ఎండీ హఫీజ్ తెలిపారు. బంగారు పతకాలను ఎ.జగన్ అభిషేక్, షేక్ సమద్, ఎ.మౌనిక, డి.రామ్‌చరణ్ తేజ్, సూర్యతేజ్, రజత పతకాలను బి.మణిదీప్, రామ్‌శ్రీతేజ్, కాంస్య పతకాన్ని బి.నేహాల్ సాధించారని కోచ్ వివరించారు. ప్రతిభ చాటిన క్రీడాకారులను తైక్వాండో అసోసియేషన్ ప్రెసిడెంట్ బి.రమణయ్య, ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, డాక్టర్ ఎండీ జహంగీర్, పట్టణ ప్రముఖులు పిడికిటి వెంకటేశ్వర్లు, కోచ్ ఎండీ హఫీజ్ సోమవారం అభినందించారు.


