సీపీఎం నేతల నిరసన
నెల్లూరు(వీఆర్సీసెంటర్): రాచర్లపాడులో నిర్వహించిన గ్రామసభలో పాల్గొనకుండా సీపీఎం నేతలను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ నగరంలోని అపోలో ఆస్పత్రి సెంటర్ వద్ద రాస్తారోకోను పార్టీ రూరల్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టారు. ఈ సందర్భంగా నేతలు ప్రసాద్, పెంచలనరస య్య మాట్లాడారు. ఇఫ్కో పరిశ్రమను ఏర్పాటు చేస్తామంటూ సేకరించిన భూముల్లో ఇథనాల్ ఫ్యాక్టరీలను ఏ ర్పాటు చేయడాన్ని ప్రజలు, రైతులు, వామపక్ష పార్టీ లు, ప్రజాసంఘాలు వ్యతిరేకిస్తున్నాయని చెప్పారు. ఇందులో పాల్గొనకుండా తమ పార్టీ నేతలను అరెస్ట్ చేయడం దారుణమన్నారు. పరిశ్రమల ఏర్పాటు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సతీష్, పెంచలయ్య, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


