
పెద్దాస్పత్రిపై విజిలెన్స్
నెల్లూరు(అర్బన్): నగరంలోని సర్వజన ఆస్పత్రిలో పారిశుధ్య విభాగంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, కార్మికులను దోచుకుంటున్న తీరుపై విజిలెన్స్ అధికారులు శనివారం ఆరాతీశారని విశ్వసనీయ సమాచారం. ఆస్పత్రిలో పారిశుధ్య కార్మికులు, సెక్యూర్టీ సిబ్బందికి కార్మిక చట్టాన్ని వర్తింపజేయకపోవడం, జీతాల్లో కోత విధించడం, డబ్బులు తీసుకొని ఉద్యోగాలివ్వడం, కొన్ని నెలల పాటు జీతాలు చెల్లించని అంశాలపై సాక్షిలో కథనాలు ప్రచురితం కావడంతో ఇంటెలిజెన్స్ అధికారులు రహస్యంగా సమాచారం సేకరిస్తున్నారు. నివేదికలనూ సిద్ధం చేస్తున్నారు.
బాధను వెళ్లగక్కి..
తమను ఎలా ఇబ్బంది పెడుతున్నారనే అంశాలను వివరించేందుకు ఒక్కొక్కరూ ముందుకొచ్చారు. యు నైటెడ్ మెడికల్, హెల్త్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు నరమాల సతీష్‌ను కలిసి తమ బాధల ను చెప్పుకొన్నారు. తమను ఉద్యోగం నుంచి తీసేస్తార నే భయంతో ఇంతకాలం నోరు విప్పలేదని తెలిపారు.
రూ.35 వేల
లంచమిచ్చి పనిలో చేరా..
రెండేళ్ల క్రితం రూ.35 వేల లంచమిస్తే పనిలో పెట్టుకున్నారని పారిశుధ్య కార్మికురాలు రత్నకుమారి చెప్పారు. మేనేజర్ ముందు ఓ మహిళా సూపర్‌వైజర్ చేతికిచ్చానని, ఆపై నాలుగు నెలల పాటు ఉచితంగా పనిచేయించుకున్నారని తెలిపారు. జీతంపై ప్రశ్నిస్తే మెడికల్ కళాశాల నుంచి కష్టంగా ఉండే వార్డుకు మార్చారని వివరించారు. తర్వాత ఇస్తున్నా, అప్పుడప్పుడూ కొంత మినహాయిస్తున్నారని ఆరోపించారు. తాజాగా మార్చి, ఏప్రిల్‌కు కలిపి రూ.26 వేల వరకు జీతం రావాల్సి ఉండగా, రూ.19,800నే ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. అల్లూరు రోడ్డుకు చెందిన తన స్నేహితురాలు శైలను పనిలో తొమ్మిది నెలల క్రితం చేర్పించానని, ఆమె నుంచి సైతం రూ.35 వేల లంచాన్ని వసూలు చేశారని తెలిపారు. ఆమెకూ మొదటి మూడు నెలలు జీతమివ్వలేదన్నారు. యూనిఫారాన్ని ఏజెన్సీ ఇవ్వాల్సి ఉండగా, తమ వద్ద నుంచి రూ.రెండు వేల చొప్పున వసూలు చేశారని తెలిపారు.
కొద్ది రోజులకే
జీతాన్ని తగ్గించారు
బిడ్డకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో నారాయణ ఆస్పత్రిలో ఐసీయూలో వైద్యం చేయించుకుంటూ మార్చిలో ఆరు రోజులే పనిచేశా. ఆ నెల్లో చేసిన పనిదినాలకు గానూ రూ.1350 రావాల్సి ఉండగా, రూ.800నే ఖాతాలో జమ చేశారు. ఏప్రిల్‌లో 13 రోజులు పనిచేస్తే, రూ.5850 జీతానికి గానూ రూ.రెండు వేలనే ఇచ్చి నా కష్టాన్ని దోచుకున్నారు.
– కామేశ్వరమ్మ, పారిశుధ్య కార్మికురాలు
సెలవు పెట్టకపోయినా.. కోత విధించారు
ఏడాదికి ఒకటో.. రెండో సెలవులే పెడతా. పూర్తిగా పని చేసినా, మార్చిలో రూ.తొమ్మిది వేలు, ఏప్రిల్‌లో రూ.పది వేలనే జమ చేశారు. మిగిలిన మొత్తాన్ని ఏజెన్సీ మేనేజర్ మింగేశారు. ఇంత జరుగుతున్నా, పెద్దాస్పత్రి సూపరింటెండెంట్ పట్టించుకోవడంలేదు.
– లతమ్మ, కార్మికురాలు
ఏజెన్సీ మోసాలపై ఆరా
జీతాల్లో కోత విధిస్తున్నారంటూ ఫిర్యాదులు

పెద్దాస్పత్రిపై విజిలెన్స్

పెద్దాస్పత్రిపై విజిలెన్స్

పెద్దాస్పత్రిపై విజిలెన్స్