
నాణ్యమైన వైద్యమందేలా కృషి
నెల్లూరు(అర్బన్): నగరంలోని ప్రభుత్వ పెద్దాస్పత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్యాన్ని అందించేందుకు డాక్టర్లు, సిబ్బంది కృషి చేయాలని, దీనికి తన వంతు సహాయ, సహకారాలను అందిస్తానని కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. ఆస్పత్రి నిధులతో పాటు దాతల సహకారంతో పెద్దాస్పత్రిలో ఆధునికీకరించిన ఫిజియోథెరపీ విభాగాన్ని శనివారం ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. దాతల సహకారం మరువలేనిదన్నారు. ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సభ్యులను కలుపుకొని రోగులకు మంచి వసతులను కల్పించాలని సూచించారు. రోగుల కోసం దాత లు దువ్వూరి సాయికృష్ణ, గైనకాలజీ హెచ్‌ఓడీ గీతాదేవి, డాక్టర్ హాజిలియాన్, జేవీఆర్ షాపింగ్ మా ల్ నుంచి మురళి, డాక్టర్ అశోక్, ల్యాబ్ టెక్నీషియన్ సాయితేజ, నోవా బ్లడ్‌బ్యాంక్ నుంచి అనిల్‌కుమార్, బయోమెడికల్ ఇంజినీర్ సునీల్‌కుమార్‌రెడ్డి, డాక్టర్ దువ్వూరు నారాయణరెడ్డి తదితరులు తమ వంతుగా ఫిజియోథెరపీ యంత్రాలను అందజేశారు.
వార్డుల్లో తనిఖీ
ఆస్పత్రిలోని ప్రసూతి వార్డు, చిన్నపిల్లల విభాగం, ఏఆర్టీ సెంటర్ తదితర వార్డులను కలెక్టర్ తనిఖీ చేశారు. వైద్యసేవలపై రోగులతో మాట్లాడారు. ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం పొందిన రోగులతో పాటు, ఓపీ వివరాలను పరిశీలించారు. పేయింగ్ రూమ్స్‌ను వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. గైనకాలజీ విభాగం వద్ద మొక్కలు నాటారు. డిప్యూటీ కలెక్టర్ మహేశ్వరరెడ్డి, పెద్దాస్పత్రి సూపరింటెండెంట్ నరేంద్ర, డిప్యూటీ సూపరింటెండెంట్ మస్తాన్‌బాషా, ఏఓ కళారాణి, హెచ్‌డీఎస్ కమిటీ కో ఆర్డినేటర్ మడపర్తి శ్రీనివాసులు, సభ్యులు బ్రహ్మానందరెడ్డి, మొగరాల సురేష్, మల్లికార్జున, అబీదా సుల్తానా తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ఆనంద్
పెద్దాస్పత్రిలో ఫిజియోథెరపీ
విభాగ ప్రారంభం