
కొడవలూరు: బైక్‌పై వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురై ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని నార్తురాజుపాళెం దిన్నె రోడ్డులో సోమ వారం అర్ధరాత్రి జరిగింది. పోలీసుల సమాచారం మేరకు.. నార్తురాజుపాళానికి చెందిన గుండపనేని వంశీకృష్ణ (27) రామాపురం ఎన్టీఆర్ కాలనీలోని స్నేహితుడి వద్దకు సోమవారం సాయంత్రం బైక్‌పై వెళ్లారు. అక్కడ స్నేహితుడి వద్ద బాగా పొద్దుపోయే వరకు ఉండి అర్ధరాత్రి దాటాక బైక్‌పై తిరిగి ఇంటికి బయలు దేరారు. నార్తురాజుపాళెం ఫ్లై ఓవర్ వంతెన దాటుకొని కొంత దూరం వచ్చాక బైక్‌తో సహా రోడ్డుపై పడి ఉండడా న్ని స్థానికులు గుర్తించి 108 సిబ్బందికి సమా చారం ఇచ్చారు. అందులో చికిత్స నిమి త్తం నెల్లూరుకు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందారు. వంశీకృష్ణ బైక్ ముందు భాగం బాగా దెబ్బతిని ఉండడంతో ముందు వెళ్తున్న ఏదైనా గుర్తు తెలియని వాహనాన్ని ఢీకొని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. వంశీకృష్ణ అవివాహితుడు. ఎస్సై సీహెచ్ కోటిరెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.