
పది అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షకు 454 మంది గైర్హాజ
నెల్లూరు(టౌన్): పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం తొలిరోజు ప్రశాంతంగా జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 38 సెంటర్లలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్ష జరిగింది. 1,343 మంది విద్యార్థులకు గానూ 889 మంది హాజరయ్యారు. 454 మంది గైర్హాజరయ్యారు. 23 కేంద్రాల్లో డీఈఓ బాలాజీరావు, ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు.
22న పెంచలకోనలో హనుమజ్జయంతి
రాపూరు: పెంచలకోనలో ఈనెల 22వ తేదీన హనుమజ్జయంతిని నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు సోమవారం తెలిపారు. ఉదయం 5 గంటలకు క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామికి అభిషేకం, పూలంగి సేవ, 10.30 గంటలకు ఆకుపూజ, సాయంత్రం తిరుచ్చిపై ఆంజనేయస్వామి ఊరేగింపు ఉంటుందని వెల్లడించారు.