
కారు బోల్తా పడి వ్యక్తి మృతి
వలేటివారిపాళెం: కారు అదుపు తప్పి బోల్తా పడి ఒక వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని చుండి సమీపంలోని కరెంటాఫీస్ దగ్గర శనివారం అర్ధరాత్రి 2.30 గంటలకు జరిగింది. స్థానికుల సమాచారం మేరకు.. అనంతపురానికి చెందిన షేక్ నిషార్ (60) కారులో విజయవాడకు వెళ్తున్నాడు. చుండి సమీపంలోని కరెంటాఫీస్ వద్దకు వచ్చే సరికి కారు అదుపు తప్పి బోల్తా పడడంతో నిషార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. కారులో ఉన్న మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు 108కు సమాచారం అందించడంతో సిబ్బంది ఘటన స్థలాన్ని చేరుకుని క్షతగాత్రులను కందుకూరు ఏరియా వైద్యశాలకు తరలించారు. అస్పత్రిలో నిషార్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు సమాచారం అందుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కారు ఢీకొని ఒకరి దుర్మరణం
కందుకూరు రూరల్: కారు ఢీకొనడంతో ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన కందుకూరు సమీపంలోని మహదేవపురం అడ్డరోడ్డు వద్ద ఆదివారం జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. కందుకూరు పట్టణం బృందావనానికి చెందిన బీ శ్రీనివాసులు (41) బైక్‌పై మహదేవపురం వెళ్లి తిరిగి వస్తున్నాడు. అడ్డురోడ్డు వద్దకు రాగానే సింగరాయకొండ నుంచి వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో శ్రీనివాసులు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు కందుకూరులోని కోటారెడ్డి ఆస్పత్రిలో ఆరోగ్యమిత్రగా పని చేస్తున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేంద్రనాయక్ తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
రైల్వేస్టేషన్లు, బస్టాండ్‌ల్లో
విస్తృత తనిఖీలు
● అనుమానాస్పద వ్యక్తుల
కదలికలపై నిఘా
నెల్లూరు(క్రైమ్): ప్రజల భదత్ర, నేర నియంత్రణకు జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్ట చర్యలు చేపడుతోంది. ఆదివారం జిల్లాలోని రైల్వేస్టేషన్లు, ఆర్టీసీ బస్టాండ్‌లు, బస్సులు, జన రద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లో పోలీసు అధికారులు బాంబ్, డాగ్‌స్వ్కాడ్‌లతో జల్లెడ పట్టారు. చొరబాటు దారులను నిరోధించడం, మత్తు మాదకద్రవ్యాల అక్రమ రవాణాను నియంత్రించడం, పేలుడు పదార్థాల అక్రమ రవాణాను అడ్డుకోవడం, శాంతిభద్రతలకు ముప్పుగా మారే అసాంఘిక శక్తులను గుర్తించడమే లక్ష్యంగా తనిఖీలు కొనసాగాయి. రైల్వేస్టేషన్లు, బస్టాండ్‌ల్లోని ప్రతి ప్రయాణికుడిని వారి వ్యక్తిగత వివరాలతోపాటు ప్రయాణ ఉద్దేశాన్ని అడిగి తెలుసుకున్నారు. గుర్తింపు కార్డులను పరిశీలించారు. వారి బ్యాగ్‌లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎస్పీ కృష్ణకాంత్ మాట్లాడుతూ ప్రజల భద్రత, నేరనియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. అనుమానాస్పదంగా ఉన్న బ్యాగ్‌లు, ప్యాకెట్లు, పరికరాలను తాకవద్దని, వెంటనే పోలీసులకు లేదా బాంబ్ స్క్వాడ్‌కు సమాచారం ఇవ్వాలన్నారు. జిల్లాలోని ముఖ్యమైన ప్రదేశాల్లో డ్రోన్స్‌తో నిఘా పెట్టామన్నారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, నేర నియంత్రణకు తాము తీసుకుంటున్న చర్యలకు సహకరించాలని కోరారు. అనుమానితులను గుర్తిస్తే డయల్ 112 లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని ఎస్పీ కోరారు. ఈ తనిఖీల్లో జిల్లాలోని పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కండలేరులో
44.425 టీఎంసీల నీరు
రాపూరు: కండలేరు జలాశయంలో ఆదివారం నాటికి 44.425 టీఎంసీ నీరు నిల్వ ఉన్నట్లు జలాశయం ఈఈ విజయకుమార్‌రెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 850, పిన్నేరు కాలువకు 20, లోలెవల్ కాలువకు 60, హైలెవల్ కాలువకు 110, మొదటి బ్రాంచ్ కాలువకు 70 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

కారు బోల్తా పడి వ్యక్తి మృతి

కారు బోల్తా పడి వ్యక్తి మృతి

కారు బోల్తా పడి వ్యక్తి మృతి