ఇసుక నుంచి ప్రారంభం.. | - | Sakshi
Sakshi News home page

ఇసుక నుంచి ప్రారంభం..

May 7 2025 12:06 AM | Updated on May 7 2025 12:06 AM

ఇసుక

ఇసుక నుంచి ప్రారంభం..

నెల్లూరు (పొగతోట): భారతదేశంలోనే అతిపెద్ద స్కాంకు కూటమి ప్రభుత్వం తెర తీసిందని, విద్యుత్‌ కొనుగోళ్లల్లో రూ.11 వేల కోట్ల భారీ కుంభకోణానికి రంగం సిద్ధం చేసిందని ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ నెల్లూరు సిటీ ఇన్‌చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కుంభకోణాల పాలన సాగుతుందని, 11 నెలల్లో అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మార్చేశారని ధ్వజమెత్తారు. రోజుకొక కుంభకోణం వెలుగుచూస్తుందన్నారు. మొన్న విశాఖపట్నంలో ఉర్సా భూకుంభకోణం బయటకు వస్తే.. నిన్న కుట్టుమెషిన్ల కుంభకోణం వెలుగుచూసిందన్నారు. తాజాగా రాష్ట్ర ప్రజలపై మరో పాతికేళ్లు విద్యుత్‌ చార్జీల భారం వేసే విధంగా రూ.11 వేల కోట్ల కుంభాకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. టీడీపీ నేతలు అధికారం చేపట్టిన నాటి నుంచి వరుస స్కామ్‌లతో దోచుకోవడం మొదలెట్టారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయమని వైఎస్సార్‌సీపీ నేతలు నిలదీస్తుంటే.. అవినీతిని ప్రశ్నిస్తుంటే కేసులతో గొంతు నొక్కేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కుటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ల్యాండ్‌, ఇసుక, లిక్కర్‌, సిలికాను అడ్డగోలుగా దోచుకుంటూ రూ.వేల కోట్ల అక్రమార్జనే ధ్యేయంగా చెలరేగిపోతున్నారని మండి పడ్డారు.

ప్రజలపై పాతికేళ్ల పాటు బిల్లుల భారం

విద్యుత్‌ కొనుగోళ్లకు సంబంధించి మే 2వ తేదీ ఏపీ విద్యుత్‌ శాఖ అధికారులు యాక్సిస్‌ కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందంతో ఈ అవినీతికి బీజమేసిందన్నారు. 25 ఏళ్ల పాటు రూ.4.60లకు విద్యుత్‌ కొనుగోలు చేసి విధంగా ఒప్పందం కుదుర్చుకుందన్నారు. ఈ ఒప్పందాన్ని విద్యుత్‌ సంస్థలు ఎక్కడ వ్యతిరేకిస్తాయోనని 108 సెక్షన్‌ను తీసుకువచ్చి కచ్చితంగా అమలు చేయాలని నిర్ణయించిందన్నారు. దీంతో రాబోయే రోజుల్లో విద్యుత్‌ చార్జీలు ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్‌ ఇవ్వాలని లక్ష్యంతో 7000 మెగావాట్ల విద్యుత్‌ను కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీ వద్ద రూ.2.49 పైసలు అతి తక్కువ ధరకు కొనుగోలు చేసి 25 ఏళ్లకు అగ్రిమెంట్‌ కుదుర్చుకుందని గుర్తు చేశారు. అయితే దీనిపై రూ.లక్ష కోట్ల కుంభకోణమంటూ టీడీపీ నేతలు విష ప్రచారం చేశారన్నారు. ప్రభుత్వంలోకి రాకముందు చంద్రబాబు విద్యుత్‌ చార్జీలు పెంచబోమని, అవసరమైతే తగ్గిస్తామని చెప్పి నేడు ప్రజల మీదే భారం మోపుతున్నారన్నారు. పేదలపై విద్యుత్‌ సర్‌చార్జీల పేరుతో ఇప్పటికే రూ.15 వేల కోట్ల వసులు చేస్తున్నారని మండి పడ్డారు. రూ.5 వేలు విద్యుత్‌ బిల్లు వచ్చే వారికి రూ.8 వేల బిల్లు వస్తుందన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో డిస్కంలు రూ.86 వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోగా, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.29 వేల కోట్లకు తగ్గించిందన్నారు. విద్యుత్‌ డిస్కంలు నష్టాల్లో ఉంటే జగన్‌మోహన్‌రెడ్డి రూ.47,800 కోట్ల చెల్లించి వాటిని ఆదుకున్నారని గుర్తు చేశారు. టీడీపీ ప్రభుత్వం డిస్కమ్‌లకు కేవలం రూ.13,250 కోట్లు మాత్రమే చెల్లించిందన్నారు. రైతులకు సంబంధించి రూ.8,840 కోట్ల విద్యుత్‌ బకాయిలను సైతం టీడీపీ ప్రభుత్వం వదిలేస్తే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెల్లించినట్లు వివరించారు.

ఇది దేశంలోనే అతిపెద్ద స్కాం

ఇసుకతో ప్రారంభమై.. కరెంట్‌ దాక..

11 నెలల్లో అప్పుల ఆంధ్రప్రదేశ్‌

విచ్చలవిడిగా మద్యం అమ్మకాలతో శాంతిభద్రతలకు విఘాతం

ఇవన్నీ ప్రశిస్తున్నారనే వైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమ కేసులు

ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ నెల్లూరుసిటీ ఇన్‌చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో 80 లక్షల టన్నుల ఇసుక స్టాక్‌ చేస్తే.. కూటమి ప్రభుత్వ నేతలు దాన్నంతా దోచుకు తిన్నారని మండిపడ్డారు. అమరావతిలో రాజధాని పేరిట 77 వేల ఎకరాలను సేకరించి రాజధానిలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసుకుంటున్నారని ఆరోపించారు. రాజధాని నిర్మాణానికి రూ.15 వేల కోట్ల విడుదల చేస్తే 8 శాతం అంటే రూ.1200 కోట్ల కమీషన్ల రూపంలో కూటమి నేతలు దోచుకున్నారని ఆరోపించారు. ఇటీవల విశాఖపట్నంలో ఉర్సా భూ కుంభకోణం వెలుగుచూసిందన్నారు. కూటమి ప్రభుత్వం ఎకరా భూమిని, రూ.0. 99 పైసల చొప్పున 3 వేల ఎకరాలు అప్పనంగా కట్టబెట్టి రూ.వేల కోట్లు దోచుకున్నారని దుయ్యబట్టారు. ఎస్సీ ఎస్టీ, బీసీ, మైనార్టీల పథకాలను కూడా వదలకుండా రూ.170 కోట్లు దోచుకున్నారన్నారు. జిల్లాలో మద్యం మహమ్మారితో శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడిందన్నారు. రోజుకొక హత్య జరుగుతుందన్నారు.జిల్లాలో నాలుగైదు నెలల్లోనే 25 హత్యలు జరిగాయన్నారు. మరో పక్క మైనింగ్‌ మాఫియా కూడా రెచ్చిపోతుందన్నారు. ఇసుక లారీని పట్టుకుంటే లక్ష రూపాయలు బహుమతి ఇస్తానన్న మంత్రికి టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి 3 లారీలను పట్టుకున్న విషయం తెలియదా? అని ప్రశ్నించారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ మైనార్టీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖలీల్‌ అహ్మద్‌, మైనార్టీ సెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు హంజా హుస్సేని, రాష్ట్ర అధికార ప్రతినిధి మల్లి నిర్మల, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు, కార్పొరేటర్‌ ఊటుకూరు నాగార్జున, జంగం సెల్‌ రాష్ట్ర అధ్యక్షురాలు వావిలేటి ప్రసన్న, కార్పొరేటర్లు కరిముల్లా, నీలి రాఘవరావు, కామాక్షిదేవి, జయలక్ష్మి, మాజీ ఏఎంసీ చైర్మన్‌ పేర్నేటి కోటేశ్వరరెడ్డి, విద్యార్థి విభాగం అధ్యక్షుడు అశ్రిత్‌రెడ్డి, యువజన విభాగం నాయకులు కిషన్‌, 11 డివిజన్‌ ఇన్‌చార్జి మహేష్‌ యాదవ్‌, 5వ డివిజన్‌ ఇన్‌చార్జి సుబ్బారెడ్డి, మైనార్టీ నాయకులు అబ్దుల్‌ మస్తాన్‌, యస్దాని తదితరులు పాల్గొన్నారు.

ఇసుక నుంచి ప్రారంభం.. 
1
1/1

ఇసుక నుంచి ప్రారంభం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement