
స్పందించకుంటే ఉద్యమం తీవ్రతరం
నెల్లూరు (అర్బన్): తమ సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని సీహెచ్‌ఓల అసోసియేషన్ జిల్లా నాయకురాలు చంద్రకళ అన్నారు. విలేజ్ హెల్త్ క్లినిక్‌లను మూసేసి డీఎంహెచ్‌ఓ కార్యాలయం వద్ద సీహెచ్‌ఓలు 19 రోజులుగా నిరహారదీక్షలు చేస్తున్నారు. ఈ సందర్భంగా చంద్రకళ మాట్లాడుతూ మహిళలుగా తాము ఇన్ని రోజులుగా ఎర్రటి ఎండలో కూర్చుని నిరసన తెలుపుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. తమ సమస్యలను తీర్చాలని ఎన్నో దఫాలుగా అధికారులకు, ప్రజాప్రతినిధులకు అర్జీలిచ్చామన్నారు. ప్రభుత్వం స్పందించకపోవడం వల్లనే తాము రోడ్డెక్కామన్నారు. ఇప్పటి వరకు తాము శాంతియుతంగా నిరసన తెలిపామన్నారు. అయినా తమ బాధలు ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రశాంతి, రుబికా, ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు భానుమహేష్, జిల్లా కో ఆర్డినేటర్ ఆదిల్ పాల్గొన్నారు.
పిల్లల దత్తతకు
దరఖాస్తు చేసుకోండి
నెల్లూరు(పొగతోట): పిల్లల్ని దత్తత తీసుకునేందుకు ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోవాలని ఐసీడీఎస్ పీడీ సువర్ణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చైల్డ్ కేర్ ఇన్‌స్టిట్యూట్ 6 నుంచి 18 ఏళ్లలోపు పిల్లలను దత్తత ఇస్తామన్నారు. అయితే పూర్తి వివరాలతో ఐసీడీఎస్ కార్యాల యంలోని బాలల సంరక్షణాధికారిని సంప్రదించాలన్నారు. పూర్తి వివరాలకు 79015 97318, 94408 14522 నంబర్లను ఫోన్ చేయాలని తెలియజేశారు.