పునర్‌ వ్యవస్థీకరణ అంతా గందరగోళం | - | Sakshi
Sakshi News home page

పునర్‌ వ్యవస్థీకరణ అంతా గందరగోళం

May 17 2025 6:56 AM | Updated on May 17 2025 6:56 AM

పునర్‌ వ్యవస్థీకరణ అంతా గందరగోళం

పునర్‌ వ్యవస్థీకరణ అంతా గందరగోళం

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఇలా..

జిల్లాలో పాఠశాలల పునర్‌ వ్యవస్థీకరణ ప్రక్రియతో ఉపాధ్యాయ పోస్టులకు ఎసరు పెడుతున్నట్లు కనిపిస్తోంది. గతంలో ఉన్న పాఠశాలలు, విద్యార్థుల సంఖ్య ఆధారంగా జిల్లాలో 673 మంది ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేస్తున్నట్లు డీఎస్సీలో ఖాళీలు చూపించారు. తాజాగా పునర్‌ వ్యవస్థీకరణ ప్రక్రియ తర్వాత డీఎస్సీలో చూపించిన పోస్టులకు దాదాపు సమాన స్థాయిలో స్కూల్‌ అసిస్టెంట్ల సర్‌ ప్లస్‌ తేల్చారు. దీన్ని బట్టి ఎస్జీటీలకు పదోన్నతులు కల్పించే అవకాశం కూడా లేదని స్పష్టమవుతోంది.

ఆత్మకూరులోని వెస్ట్‌ ఎంపీపీఎస్‌లో 150 మంది విద్యార్థులు ఉన్నారు. హెడ్‌మాస్టర్‌తోపాటు ఐదుగురు ఎస్జీటీలు ఉండేవారు. ప్రస్తుతం ఆ స్కూల్‌ను మోడల్‌ ప్రైమరీ స్కూల్‌గా మార్పు చేయడంతో అక్కడ హెడ్‌మాస్టర్‌తోపాటు నలుగురు ఎస్జీటీలు, ఒక ఉర్దూ ఎస్జీటీని ఏర్పాటు చేశారు. అయితే ఆ నలుగురులో ఒకరిని సర్‌ప్లస్‌గా చూపించారు. ఈ స్కూల్‌లో ఉర్దూ మీడియం కానీ, సెక్షన్‌ కానీ, పోస్టు కానీ లేదు.

ముత్తుకూరులోని మెయిన్‌ ఎంపీపీ

ఎస్‌లో 64 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యార్థుల సంఖ్య ప్రకారం హెడ్‌మాస్టరుతోపాటు నలుగురు ఎస్జీటీలను నియమించాలి. అయితే పాఠశాలల పునర్‌ వ్యవస్థీకరణలో హెడ్‌మాస్టరు, ముగ్గురు ఎస్జీటీ పోస్టులు మిగిలాయి. వీరిలో తెలుగు ఇద్దరు, ఉర్దూ ఒకరు ఉన్నారు.

8 రకాలుగా పాఠశాలల

విభజన.. వివరాలు గోప్యత

ఏ స్కూల్లో ఏ పోస్టు ఉందో

తెలియని వైనం

600కు పైగా స్కూల్‌ అసిస్టెంట్లు

సర్‌ప్లస్‌

ఇక ఎస్జీటీలకు పదోన్నతులు

హుళక్కే.. సబ్జెక్ట్‌ టీచర్ల కొరత

డీఎస్సీలో 673 పోస్టులు

ఖాళీ చూపిన అధికారులు

నెల్లూరు (టౌన్‌): జిల్లాలో ఉండే పాఠశాలలను 8 రకాలు కూటమి ప్రభుత్వం విభజించింది. మొత్తం 3,221 పాఠశాలలుగా లెక్కలు తేల్చారు. శాటిలైట్‌ స్కూల్లో ఎల్‌కేజీ, యూకేజీ, 1, 2 తరగతులు, ఫౌండేషన్‌ స్కూల్లో 1, 2 తరగతులు, ఎన్‌రోల్‌మెంట్‌ 45 కంటే ఎక్కువ విద్యార్థులు ఉన్న పాఠశాలను బేసిక్‌ ప్రైమరీ స్కూల్‌గా మార్చి 1 నుంచి 5 తరగతులను ఏర్పాటు చేశారు. అప్పర్‌ ప్రైమరీలో 1–8 తరగతులు, హైస్కూల్స్‌ల్లో 1–10 వరకు, 6–10 తరగతులు, 1–5వ తరగతికి 45 లోపు పిల్లలు ఉన్న స్కూల్స్‌ను హైస్కూల్స్‌ బీపీఎస్‌లో 1–10 తరగతులు, 45 మంది పిల్లలు ఎక్కువగా ఉన్న హైస్కూల్‌ ఎంపీఎస్‌లో 1–10 తరగతులకు విద్యను అందించనున్నారు. ప్రస్తుతం హైస్కూల్‌ ప్లస్‌లను యథావిధిగా ఉంచారు.

తగ్గనున్న పోస్టులు

కూటమి ప్రభుత్వం చేపట్టిన పాఠశాలల పునర్‌ వ్యవస్థీకరణ వల్ల జిల్లాలో ఉపాధ్యాయ పోస్టులకు గండి పడనుంది. మోడల్‌ ప్రైమరీ స్కూల్స్‌ల్లో విద్యా చట్టం ప్రకారం 1ః20 నిష్పత్తిలో ఉపాధ్యాయులు ఉండాలి. అయితే కూటమి ప్రభుత్వం ఈ నిబంధనలను పక్కన పెట్టి ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తోంది. అయితే 30 మంది పిల్లలకు ఒక టీచరు పోస్టును కూడా కేటాయించడం లేదని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రక్రియతో ఎస్జీటీ పోస్టులు కూడా భారీగా తగ్గే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

సర్‌ప్లస్‌గా ఎస్‌ఏలు

జిల్లాలో 600కు పైగా స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు సర్‌ప్లస్‌గా ఉన్నట్లు జిల్లా విద్యాశాఖాధికారులు లెక్కలు తేల్చారు. కూటమి ప్రభుత్వం 117 జీఓను రద్దు చేస్తున్నామని చెప్పి 3 నుంచి 5 తరగతలు విద్యార్థులను మళ్లీ ప్రాథమిక పాఠశాలల్లోకి విలీనం చేయడం ద్వారా భారీగా స్కూల్‌ అసిస్టెంట్లు మిగులు తేలారు. దీంతో ఎస్జీటీ పోస్టులు కూడా భారీగా తగ్గనున్నట్లు తెలుస్తోంది. అయితే కూటమి ప్రభుత్వం డీఎస్సీలో జిల్లాలో 673 పోస్టులు ఖాళీలు ఉన్నట్లు లెక్కలు తేల్చారు. పాఠశాలల పునర్‌ వ్యవస్ధీకరణలో ఉపాధ్యాయులు మిగులు తేలడంతో డీఎస్సీల్లో అన్ని ఖాళీ పోస్టులు ఏ విధంగా ఉంటాయని పలువురు ప్రశ్నిస్తున్నారు.

కేఎన్నార్‌ మున్సిపల్‌ పాఠశాల

కూటమి ప్రభుత్వంలో ఇలా..

పాఠశాలల పునర్‌ వ్యవస్థీకరణ ప్రక్రియ ఉపాధ్యాయులను ఆందోళనకు గురి చేస్తోంది. ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులతో సంబంధం లేకుండా విద్యాశాఖ ఇష్టారాజ్యంగా ఈ ప్రక్రియ చేపట్టడంతో అంతా గందరగోళంగా తయారైంది. ఏ పాఠశాలను ఏ విధంగా విభజించారో, ఆ పాఠశాలలో క్యాడర్‌, పోస్టుల వివరాలను విద్యాశాఖ గోప్యంగా ఉంచింది. పోస్టులను భారీగా తగ్గించే ప్రక్రియలో భాగంగానే పాఠశాలల పునర్‌ వ్యవస్ధీకరణ ప్రక్రియ చేపట్టారనే ఆందోళన ఉపాధ్యాయుల్లో నెలకొంది.

జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం జీఓ 117 పేరిట పాఠశాలల విలీన ప్రక్రియ చేపట్టింది. ప్రాథమిక పాఠశాలలో 3 నుంచి 5వ తరగతి వరకు ఉన్న విద్యార్థులను సమీపంలోని హైస్కూల్లోకి విలీనం చేశారు. 3వ తరగతి నుంచే సబ్జెక్ట్‌ టీచరు బోధించే విధంగా చర్యలు చేపట్టారు. విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలు పెంచేందుకు ఈ విలీన ప్రక్రియ ఎంతో మేలు చేస్తుందని మేధావులు అభినందించారు. అయితే పాఠశాలల విలీన ప్రక్రియపై అప్పట్లో కూటమి నేతలు ఉపాధ్యాయులను రెచ్చగొట్టి, వారిలో భయాందోళనలు రేకెత్తించి ఈ విధానంపై తీవ్ర వ్యతిరేకతను సృష్టించారు. ఇప్పుడు అదే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పునర్‌ వ్యవస్థీకరణ పేరుతో పాఠశాలల విలీన ప్రక్రియను చేపడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement